You are here
Home > రాజకీయం > సోషల్ మీడియా ద్వారా ఆర్మీని ప్రశ్నించిన రాయ్ మ్యాథ్యూ అనుమానస్పద మృతి.. అతనిది హత్యా..?? ఆత్మహత్యా..?

సోషల్ మీడియా ద్వారా ఆర్మీని ప్రశ్నించిన రాయ్ మ్యాథ్యూ అనుమానస్పద మృతి.. అతనిది హత్యా..?? ఆత్మహత్యా..?

గత నెల 25న సోషల్ మీడియాలో హల్ చల్ చేసిన సైనికుడు రాయ్ మ్యాథ్యూ గుర్తున్నాడా. ఆర్మీ సహయక్ స్టింగ్ ఆఫరేషన్ పై సోషల్ మీడియా లో ఫోస్ట్ చేసి అధికారుల చేతిలో పిచ్చోడిగా ముద్ర పడ్డ రాయ్ ఇక లేడు. కుళ్లిన దేహంతో అనుమానస్పద స్థితిలో శవమై కనిపించాడు. ఓ చీకటి గదిలో ఆయన ఉరి వేసుకుని చనిపోయినట్టు అధికారులు గుర్తించారు. అయితే రాయ్ ది ముమ్మాటికి హత్యే అని ఆయన కుటుంబం ఆరోపిస్తుంది. ఆత్మహత్య చేసుకునేంత పిరికి వాడు కాదని.. ధైర్యంగా ఎంతటి కష్టాన్నైనా ఎదురుకునే బలమైన సైనికుడని చెపుతున్నారు. ఇంతకి రాయ్ ది హత్య..ఆత్మహత్య..?

ఆర్మీలో సైనికుల దుస్థితిపై గొంతువిప్పిన రాయ్ మాథ్యూ అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. గురువారం మహారాష్ట్రలోని దియోలాలి కంటోన్మెంట్‌లో ఓ పాడుబడ్డ గదిలో కుళ్లిన స్థితిలో అతని శవం లభ్యం అయింది. రాయ్ చనిపోయి మూడు రోజుల దాటిందని..  రాయ్‌ ఉరి వేసుకున్నట్లు తెలుస్తోందని పోలీసులు ప్రాథమిక దర్యాప్తు లో తెలిపారు.  అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. మూడు రోజులుగా కనిపించకుండా పోయినా అధికారులు ఎవరు పట్టించుకోక పోవడం.. వాడని చీకటి గదిలో అతని శవం లభించడం పలు అనుమానాలకు తావిస్తోంది.  రాయ్ మాథ్యూ ది హత్యే అన్న కోణం బలపడుతోంది. అయితే పోలీసులు మాత్రం రాయ్ ది ఆత్మహత్యా..? లేక హత్యా..? అన్నది ఇంకా ఒక అంచనాకు రాలేదు. కాగా, గత నెల 25న స్టింగ్‌ ఆపరేషన్‌ వీడియో ఆన్‌లైన్‌లో పోస్ట్‌ చేసిన రాయ్‌ ఆరోజే అదృశ్యమయ్యాడు. రాయ్‌ పోస్ట్‌ చేసిన వీడియోలో అతనితో పాటు మరికొందరు సైనికులు పై అధికారుల పిల్లలను పాఠశాలకు తీసుకెళ్లడం, వారి కుక్కల బాగోగులు చూడటం, ఇంటి పనులు చేయటం కనిపించింది. 13ఏళ్ల క్రితం ఆర్మీలో చేరిన రాయ్‌ గత ఏడాది నుంచి నాసిక్‌లోని 214 రాకెట్‌ రెజిమెంట్‌లో గన్నర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు.
సోషల్ మీడయాలో రాయ్ వీడియో వైరల్ గా మారడం.. అధికారుల ఒత్తిడిల కారణంగానే ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు చెపుతున్నారు.

అయితే రాయ్‌ కుటుంబం మాత్రం రాయ్ మ్యాథ్యూ ది ముమ్మాటికి హత్యే అని చెపుతున్నారు. ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని, ఫోన్‌ చేసి తనకు ప్రాణభయం ఉందని చాలా సార్లు చెప్పాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.అయితే రాయ్ మరణం మాత్రం ఇప్పటికి ఓ మిస్టరీగానే ఉంది.

Facebook Comments

Leave a Reply

Top
error: Content is protected !!