You are here
Home > రాజకీయం > టీడీపీకి రేవంత్ రెడ్డి రాంరాం.. ఇక తాడో పేడో తేల్చుకునేందుకు సిద్దం.

టీడీపీకి రేవంత్ రెడ్డి రాంరాం.. ఇక తాడో పేడో తేల్చుకునేందుకు సిద్దం.

ఊహించిందే జ‌రిగింది. టీటీడీపీ నేత‌లు మొత్తుకున్న‌దే నిజ‌మైంది. టీడీపీ పార్టీ అద్య‌క్ష‌డు వ‌చ్చేంత వ‌ర‌కు వేచి చూసి ఆ త‌రువాత త‌న నిర్ణ‌యం ఏంటో చెపుతా అని చెప్పిన రేవంత్ చెప్పిన‌ట్టుగానే బాంబ్ పేల్చారు. కాంగ్రెస్ లోకి వెళ్ల‌డం ఖాయం అని ముందు నుంచే చ‌ర్చ‌లు జ‌రుగుతున్న నేప‌థ్యంలో రేవంత్ ప‌క్కా చేతిలో చేరిపోయార‌ని తేలిపోయింది. ఆల‌స్యం చేస్తే రాజ‌కీయంగా ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని గ్ర‌హించిన రేవంత్ రెడ్డి చంద్ర‌బాబు పారెన్ టూర్ నుండి తిరిగి రావ‌డ‌మే ఆల‌స్యం బాంబ్ పేల్చారు. అద్య‌క్షుడి స‌మ‌క్షంలోనే తెలుగుదేశం పార్టీకి గుడ్‌బై చెప్పారు. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో భేటీ అనంతరం ఆయన పదవులతో పాటు టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి సైతం రాజీనామా చేశారు. రేవంత్‌ రెడ్డి శనివారం తన రాజీనామా లేఖను చంద్రబాబుకు అందచేశారు. గత కొంతకాలంగా పార్టీలో జరుగుతున్న పరిణామాలు తనను ఎంతగానో బాధించాయని, అయితే టీడీపీతో పాటు అద్యక్షుడిపైనా తనకు ఎంతో గౌరవం ఉందని అన్నారు. అయితే కాంగ్రెస్ లోకి వెళుతున్నాన‌ని మాత్రం చెప్ప‌లేదు. ఎంత చెప్ప‌క‌పోయినా కాంగ్రెస్ గూటికి వెళ్ల‌డం ప‌క్కా అని అమ‌ర‌వ‌తి సాక్షిగా తేలిపోయింది. ఇన్నాళ్లు టీటీడీపీ ఫైర్ బ్రాండ్ గా ఉన్న రేవంత్ రెడ్డి పార్టీ వీడ‌టంతో టీడీపీ తెలంగాణ‌లో జెండా ఎత్తేయ‌డం ప‌క్కా అని తెలుస్తుంది. ఇప్ప‌టికే పెట్టా బేడా స‌ర్ధుకుని అమ‌ర‌వ‌తి చెక్కేసిన అదినేతతో పాటుగానే పార్టీ కూడా అమ‌ర‌వ‌తికే ఫ‌రిమితం కావడం ప‌క్కా అంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. చూడాలి రేవంత్ రెడ్డి పార్టీ వీడ‌డం ప‌సుపు ద‌ళాన్ని ఎంత ముంచుతుందో. రేపు రేవంత్ భ‌విష్యత్ ఎలా ఉండ‌బోతుందో.. రేవంత్ రెడ్డితో ఇన్నేళ్లు క‌లిసి న‌డిచిన ప‌సుపు ద‌ళం పార్టీలోనే కొన‌సాగుతారా లేక పార్టీని వీడి రేవంత్ తో న‌డుస్తార తెలియాల్సి ఉంది. టీడీపీకి రేవంత్ రాంరాంతో కాంగ్రెస్ మాత్రం లోలోనా సంతోష ప‌డుతుంద‌ని స‌మాచారం.

Facebook Comments
Top
error: Content is protected !!