
ఆంద్రప్రదేశ్ లో ఇప్పుడు నంద్యాల ఉప ఎన్నిక హాట్ టాపిక్ అయింది. అధికార తెలుగు దేశం పార్టీ ప్రతిపక్ష వైఎస్ఆర్సపీ లు హోరా హోరీగ తలపడుతున్నాయి. కాంగ్రెస్ లాంటి ఇతర పార్టీలున్నా అవి డమ్మీలుగానే మిగలనున్నాయి.
2014 లో భూమా నాగిరెడ్డి జగన్ పార్టీ వైఎస్ఆర్సీపీ టిక్కెట్ పైన గెలుపొందారు.
తర్వాత ఆయన తూతురు ఆళ్లగడ్డ శాసనసభ్యులు భూమా అఖిల ప్రియ తో కలిసి అధికార టీడీపీలో చేరడం జరిగింది.
ఆళ్లగడ్డ అసెంబ్లీ లో తల్లి శోభా నాగిరెడ్డి గెలిచాక మరణించడంతో ఆ స్థానంలో కూతురు అఖిల ప్రియ ఏకగ్రీవంగా ఎన్నికైంది.
అలాగే తండ్రి భూమా నాగిరెడ్డి కూడా మరణించడంతో నంద్యాల నియోజకవర్గం లోనూ ఎన్నికలు అనివార్యం అయిన విషయం అందరికీ విదితమే..
ఈ స్థానంలో టీడీపీ అభ్యర్థి గ భూమా నాగిరెడ్డి కొడుకు భూమా బ్రంహ్మానందరెడ్డి బరిలో ఉండగా.. వైసీపీ నుండీ శిల్పా మోహన్ రెడ్డి పోటీలో ఉన్నాడు.
నంద్యాలను ఏకగ్రీవం చేయడం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు చేసినప్పటికీ కుదరక ఎన్నికలు అనివార్యం అయ్యాయి.
ఇక ఎన్నికల ప్రచారం క్లైమాక్స్ దశలో ఉండగా.. అక్కడ పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన కు కూడా ఓట్లున్నై అని గుర్తించిన ఇరు ప్రధాన పార్టీలు పవన్ కళ్యాణ్ ను మచ్చిక చేసుకునే ప్రయత్నంలో ఉన్నాయి.
ఈ క్రమంలో రెండు రోజుల క్రితం ఉద్దానం కిడ్నీ బాధితుల విషయం మాట్లాడానికి సీఎం చంద్రబాబు ను కలిసారు పవన్ కళ్యాణ్.
చంద్రబాబు నాయుడు కూడా నంద్యాల ఉప ఎన్నికలో మద్దతు కోరినట్టు సమాచారం కానీ పవన్ కళ్యాణ్ మాత్రం బయటకొచ్చాక ఏ విషయం అనేది రెండు రోజుల్లో ప్రకటిస్తా అని చెప్పడంతో.. ఇరు పార్టీల్లో నేతల్లో సస్పెన్స్ కనిపిస్తోంది.
ఈ మద్యనే నంద్యాలలోనూ జనసేన నాయకులు భారిగా పార్టీ సభ్యత్వాలు కూడా చేపట్టడం జరిగింది.
పవన్ కళ్యాణ్ అభిమానులూ బాగానే ఉన్నటు తెలుస్తోంది ఈ క్రమంలో వారంతా పవన్ కళ్యాణ్ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు.
మరో పక్క పవన్ కళ్యాణ్ ఏ పార్టీ అభ్యర్థి కి మద్దతిస్తే ఆ అభ్యర్థి కే విజయవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.
అక్కడి ఓటింగ్ జనసేన ఎఫెక్ట్ ఖచ్చితంగ ఉంటుందంటున్నారు.
అయితే టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానంద రెడ్డి సోదరి రాష్ట్ర మంత్రి భూమా అఖిల ప్రియ మాత్రం పవన్ కళ్యాణ్ మ
ద్దతు మాకే ఉంటది.. 2014 లోనూ నాడు టీడీపీ భాజపా తో కలిసే పొత్తుతోనే ఆయన కూడా ప్రచారం చేసారనీ మా కుటుంబంతోనూ పవన్ కళ్యాణ్ కు మంచి సత్సంబంధాలు ఉన్నై కాబట్టి ఆయన మాకే మద్దతు ఇస్తారని వ్యాఖ్యానించారు.
మరోవైపు పవన్ కళ్యాణ్ టీడీపీ కి మద్దతునిస్తే ఎక్కడ నష్టం వస్తుందో అనే విశ్లేషణలో వైసీపీ నాయకులు ఉన్నటు తెలుస్తోంది.
అంతేకాదు జనసేన నాయకులను మచ్చిక చేసుకునే ప్రయత్నంలో వైసీపీ నాయకులు ఉన్నటు సమాచారం.





