You are here
Home > రాజకీయం > రచ్చ గెలిచింది చాలు ఇక ఇంటగెలుద్దాం అంటున్న నేతలు..

రచ్చ గెలిచింది చాలు ఇక ఇంటగెలుద్దాం అంటున్న నేతలు..

తెలంగాణ రాష్ట్రం నుండి ఎంపిలుగా పార్లమెంట్ లో అడుగు పెట్టిన నేతలు ఇక ఇంటి బాట పట్టేందుకు రెడీ అవుతున్నారు. 2014 లో ఎంపిలుగా ఎన్నికై రచ్చ గెలిచిన నేతలు ఇక ఇంట గెలిచేందుకు పక్కా ప్రణాళికలు రచించుకుంటున్నారు. ఎన్నాళ్లుగానో తమ తమ మనసుల్లో ఉన్న కోరికలను నిజం చేసుకునేందుకు రెండేళ్ల ముందు నుండే స్కెచ్ లు రెడీ చేసుకుంటున్నట్టు సమాచారం. ఇంతకీ ఆ నేతలెవరు ఇంట గెలవాలన్న వారి ఆశల వెనుకున్న కథేంటి చదివేస్తే పోలా.

సల్ల కొచ్చి ముంత దాయడం ఎందుకు డైరక్ట్ గా పాయింట్ లోకే వెళ్దాం. సెంట్రల్ పోస్టే అయినా స్టేట్ లో తమకు అంతగా ప్రాదాన్యం ఉండటం లేదని ఇటు పార్టీలో అటు ప్రజల్లో పూర్తి స్థాయిలో పట్టులేదనే బావనలో ఉన్నారంటా తెలంగాణ సర్కార్ ఎంపీలు. లోకల్ లో ఎమ్మెల్యేలకు ఉన్నంత పలుకుబడి తమకు ఉండటం లేదని ఒకింత నిరుత్సాహంగా ఉన్నట్టు కూడా సమాచారం. నిజానికి ఎంపీలంటే కేంద్రంలో సత్తా చాటి రాష్ట్రానికి నిధుల ప్రవాహాన్ని తీసుకు వచ్చే దూతలు కానీ తెలంగాణలో ఇప్పుడున్న ఎంపీలకు ఢిల్లీ కంటే గల్లీలో రాజకీయమే రంజుగా ఉంటుందని పిక్స్ అవుతున్నారంట. సార్ దగ్గర ఎంపీల కంటే ఎమ్మెల్యేలకు పట్టు ఎక్కువ పెరుగుతుండటం అటు అదికారులు సైతం తమ పార్లమెంట్ పరిదిలోని నియోజక వర్గాల ఎమ్మెల్యేలకు దక్కే గౌరవం కూడా దక్కడం లేదని నిరాశలో ఉన్నారంట. ఇక ఇలా అయితే కుదరదని బావించిన సదరు ఎంపీలు రానున్న 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యే లుగా పోటీ చేసి నేను లోకల్ అని కాలర్ ఎగరవేయాలని పిక్స్ అయినట్టు తెలుస్తోంది. అందుకు గాను ఇప్పటి నుండే రూట్స్ క్లియర్ చేసుకుంటున్నారంటా. ఇక వారేవరో కూడా ఓ లుక్కేద్దాం పదండి.

తమ పరిధిలో ఉండే ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాకుండా కొందరు ఎంపీలు తమకు దూరంగా ఉన్న అసెంబ్లీ సీట్లపై కూడా గురి పెట్టారంట. తమకు అనుకూలమైన అసెంబ్లీ సెగ్మెంట్లపై ఇప్పటి నుంచే టార్గెట్‌ పెట్టారని కీలక సమాచారం. ఆ లిస్ట్ లో యువ ఎంపీ ముందు వరుసలో ఉన్నారంట. ఇక ఇప్పటి నుండే ఆయా స్థానాలని తమ ఆదీనంలోకి తెచ్చుకునేందుకు పావులు కదుపుతున్నారని టాక్. ఎంపీ కోటా నిధులలో ఎక్కువ మొత్తాన్ని ఈ సెగ్మెంట్లకు కేటాయించి తమ లోగుట్టును బయటపెడుతున్నారంట. ఎమ్మెల్యేలుగా గెలిచేందుకు కొందరు.. ఏకంగా రాష్ట్రంలో మంత్రి కావాలనే బిగ్‌ టాస్క్‌తో మరికొందరు ఎంపీలు ఇప్పటికే పావులు కదిపుతునట్లు కనిపిస్తోంది. మరోవైపు ఎంపీల పక్క చూపులు అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఆగ్రహాన్ని తెప్పిస్తోందంట. దీంతో రెండేళ్ల ముందే తెలంగాణ రాజకీయం రసవత్తంగా మారుతోందని రాజకీయ విశ్లేషకులు చెపుతున్నారు.

ఇక అసలు విషయంలోకి వస్తే… తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి నాయకుడిగా కీలకంగా పని చేసిన బాల్కసుమన్‌ 2014 ఎన్నికల్లో పెద్దపల్లి లోక్‌ససభ స్థానం నుంచి గెలుపొందారు. విద్యార్థి నాయకుడి నుంచి ఎంపీగా ఎన్నికైనా ఆయన లక్ష్యం మాత్రం మొదటి నుంచి అసెంబ్లీ వైపే అని సమాచారం. రానున్న 2019 ఎన్నికల్లో ఎలాగైనా అసెంబ్లీలో అడుగుపెట్టాలనే ఆలోచనతో ఉన్నారంట ఈ యువ నేత. అందుకోసం కరీంనగర్‌ జిల్లాలోని చొప్పదండి స్థానంలో అవకాశం కోసం వేచిచూస్తున్నారని తెలుస్తోంది. ఇక్కడ కుదరకుంటే, ప్రస్తుతం ఎంపీగా ఉన్న పెద్దపల్లి సెగ్మెంట్‌లోని ఏదైనా ఓ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే గా గెలిచి రాష్ట్రంలో ఓ మంత్రి పదవిని అందుకోవాలనే అలోచనలో ఉన్నారంట యువ ఎంపీ బాల్కం. ఇక మరో ఎంపీ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ పోస్టుకు రాజీనామా చేసి 2014 ఎన్నికల్లో మహబూబాబాద్‌ ఎంపీగా గెలిచిన అజ్మీరా సీతారాంనాయక్‌కు ఎమ్మెల్యే పదవిపైనే మక్కువ ఎక్కువ ఉందంట. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి కావాలనే ఉద్దేశంతో ఈయన కూడా ఉన్నట్టు సమాచారం. సొంత అసెంబ్లీ సెగ్మెంట్‌ ములుగులోగానీ , మహబూబాబాద్‌ అసెంబ్లీ సెగ్మెంట్‌లోగానీ ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు అవకాశం వస్తుందని భావిస్తున్నారంట సీతారాం. ఇటీవల మహబూబాబాద్‌లో ప్రజాప్రతినిధి, ఉన్నతాధికారుల మధ్య జరిగిన వ్యవహారం తనకు అవకాశం వచ్చేలా చేస్తుందని భావిస్తున్నారు.

మరో సీనియర్ నాయకుడు కరీంనగర్‌ లోక్‌సభ సభ్యుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇటీవల జరిగిన బొగ్గు గని కార్మిక సంఘం ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అనుబంధ సంఘానికి భూపాలపల్లిలో ఓటమి ఎదురైంది. గతంలో వినోద్‌కుమార్‌ హన్మకొండ ఎంపీగా ఉన్నప్పుడు ఈ సెగ్మెంట్‌ ఆయన పరిధిలో ఉండేది. ఇదే కారణంతో 2014 ఎన్నికల్లో వినోద్‌కుమార్‌ ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. సింగరేణి ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఈ సెగ్మెంట్‌లో టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధిపై వ్యతిరేకత ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో పార్టీ అధిష్టానం వినోద్‌కుమార్‌ను ఇక్కడికి పంపే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు వినోద్‌కుమార్‌ హుస్నాబాద్‌ అసెంబ్లీ నుంచి పోటీ చేస్తారనే ప్రచారం సైతం జరుగుతోంది. ఈ సెగ్మెంట్‌ ప్రస్తుతం వినోద్‌కుమార్‌ ఎంపీగా ఉన్న కరీంనగర్‌ లోక్‌సభ సెగ్మెంట్‌లోనే ఉంది.

గత ఎన్నికల్లో వైస్సాఆర్‌సీపీ తరుపున ఖమ్మం ఎంపీగా గెలిచి టీఆర్‌ఎస్‌లో చేరిన పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చూపు సైతం రాష్ట్ర అసెంబ్లీవైపే ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి కావాలనేది శ్రీనివాస్‌రెడ్డి అంతరంగంగా ఆయన సన్నిహితులలో చర్చ జరుగుతోంది. అయితే ఖమ్మం జిల్లాల్లో రిజర్వుడు స్థానాలే ఎక్కువగా ఉండడం శ్రీనివాస్‌రెడ్డి లక్ష్యానికి అడ్డంకిగా మారుతోంది. అయినా టీఆర్‌ఎస్‌ అధిష్టానం వద్ద తన మనసులోని మాటను బయటపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.

నల్లగొండ లోక్‌సభ సభ్యుడు గుత్తా సుఖేందర్‌రెడ్డి రాజకీయ ప్రయాణంలో ఎమ్మెల్యే పదవి అందకుండానే పోతోంది. ఎమ్మెల్యేగా ఎన్నికవ్వాలనే లక్ష్యంతో ఆయన ఏళ్లుగా ప్రయత్నిస్తున్నారు. టీడీపీలో, కాంగ్రెస్‌లో ఈ లక్ష్యం నెరవేరలేదు. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరుపున నల్లగొండ లోక్‌సభకు ఎన్నికయ్యారు. రాష్ట్రంలో మంత్రి కావాలనే లక్ష్యంతో టీఆర్‌ఎస్‌ చేరినట్లు ప్రచారంలో ఉంది. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తాజాగా ఏర్పాటు చేస్తున్న రైతు సమన్వయ సమితి ప్రక్రియ అంతా సుఖేందర్‌రెడ్డి చుట్టే జరుగుతున్నట్లు ప్రచారం జరిగింది. నల్లగొండ లోక్‌సభకు సుఖేందర్‌రెడ్డి రాజీనామా చేస్తే… మళ్లీ ఇక్కడ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఎవరనే చర్చ కొనసాగుతోంది. టీఆర్‌ఎస్‌ అధిష్టానం ఉప ఎన్నికలో మరొకరికి అవకాశం కల్పిస్తే సుఖేందర్‌రెడ్డి వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రి కావాలనే లక్ష్యంతో ఉంటారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. సుఖేందర్‌రెడ్డి మిర్యాలగూడలో పోటీ చేస్తారా? మరేదైనా అసెంబ్లీ సెగ్మెంట్‌ను ఎంచుకుంటారనేది ఆసక్తికరంగా ఉండనుంది. ఇలా ఎంపీలంతా ఎమ్మెల్యేలుగా మారి మంత్రులవ్వాలనే ఆశలో ఊగిసలాడుతుండటంతో ప్రస్తుతం ఉన్న సిట్డింగ్ ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఇక 2019 సంగ్రామంలో కొందరు ఎమ్మెల్యేలకు ఉద్వాసన తప్పదనే ప్రచారం నేపథ్యంలో ఎంపీల ఆశలకు ఆసరా లభించినట్టే. చూడాలి ఢిల్లీ వదిలి గల్లీకి రావాలనుకుంటున్న నేతల భవిష్యత్ ఎలా ఉండబోతుందో..?

Related Posts
జవాన్లని అవమానిస్తే కాల్చిపారదొబ్బాలి..
జవాన్ల విషయంలో కశ్మీరి యువకులు ప్రవర్తించిన తీరుపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. కొందరు సమర్థిస్తుంటే మరికొందరు విమర్శిస్తున్నారు. జవాన్ల కు అండంగా నిలిచే వారి సంఖ్య మాత్రం రోజు రోజుకు పెరుగుతోంది. తాజాగా రెజ్లర్, ఒలంఫిక్స్ పతక విజేత యోగీశ్వర్ దత్ ...
READ MORE
ఆయేషా హత్య కేసు.. సత్యం నిర్దోషి..! మరి దోషులెవరు..?
న్యాయం గెలిచింది. ఎన్నాళ్లకు గెలిచిందనే దానికంటే ఎట్టకేలకు గెలిచింది అని చెప్పడమే ఉత్తమం. తొమ్మిదేళ్ల సుదీర్ఘ పోరాటంలో కఠిన శిక్షను అనుభవించి చేయని తప్పుకు శిక్ష పడి కాళ్లు చేతులు చచ్చుబడిపోయి చివరికి ప్రాణాలతోనే సత్యం న్యాయాన్ని గెలిచాడు. మరీ ఇక్కడ ...
READ MORE
డ్రగ్స్ రాకెట్ గుట్టులో నమ్మలేని నిజాలు.. మత్తుకోసం నగ్న చిత్రాలు పంపిన యువతులు, తారలు. 
మత్తు జగత్తులో టాలీవుడ్ జోగుతుందని తెలుగు మీడియా మూడు రోజులుగా ఊగిపోతోంది. ఆ మీడియా ఈ మీడియా అన్న తేడా లేకుండా ఫ్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ ఇలా అన్ని మీడీయాల మంత్రం ఒకటే మత్తు మంత్రం. సినీ జగత్తును శివలెత్తిస్తున్న ఈ ...
READ MORE
తెలంగాణలో మిత్రపక్షాన్ని ఖాళీ చేయిస్తున్న బీజేపీ.. కమలం గూటికి టీటీడీపీ ఎమ్ఎల్ఏ బీసీ నేత ఆర్ క్రిష్ణయ్య.
బీసీ సంఘం జాతీయ అద్యక్షుడు తెలంగాణ టీడీపీ ఎమ్ఎల్ఏ ఆర్ క్రిష్ణయ్య బీజేపీలోకి చేరుతున్నాడా..? తెలంగాణలో మిత్రపక్షానికే గాలంవేసి ఖాళీ చేసే దిశలో బీజేపీ సాగుతుందా అంటే అవుననే సమాదానాలు వినిపిస్తున్నాయి. నిన్న మొన్నటి దాక రేవంత్ రెడ్డి చేరిక తప్పదని ...
READ MORE
ముగిసిన ఢిల్లీ ఎన్నికల పోలింగ్, ఆప్ బీజేపీ ల మధ్యే పోటీ, తుస్సుమన్న కాంగ్రెస్.!!
దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాయి. ఎన్నికల్లో ప్రధానంగా అధికార ఆప్ మరియు బీజేపీ కాంగ్రెస్ పార్టీ లు పోటీ పడ్డప్పటికి, ఆప్ బీజేపీ ల మధ్యే హోరా హోరీ పోటీ జరిగినట్టు రాజకీయ విశ్లేషకుల అంచనా.అంతే కాదు ఈసారి ...
READ MORE
కంప్లీట్ “హిందూ” ఎజెండా తీసుకున్న కమలం పార్టీ.!!
దేశంలో ఏ రాజకీయ పార్టీని తీసుకున్నా మైనారిటీ ఓట్ల కోసం ముస్లింలకు క్రైస్తవులకు వంత పాడడం పరిపాటిగ మారింది. ఆఖరికి హిందూత్వం పునాదులపై పుట్టిన శివసేన లాంటి పార్టీలు కూడా సెక్యులర్ నినాదం చేస్తుంటే.. మరి నూటికి ఎనభై శాతం ఉన్న ...
READ MORE
తొలి ప్రసారంతోనే బాంబ్ పేల్చిన అర్నబ్ రిపబ్లిక్.
జర్నలిజం యుద్దంలాగే ఉంటుంది.. యుద్దంలోనూ ఉంటుంది మధ్యలో ఆపలేం, వెనక్కి తిరిగి వెళ్లలేం. ఇది అర్నబ్ గోస్వామి లాంటి నిజాయితి గల జర్నలిస్ట్ లు నమ్మిన సిద్దాంతం. సునామిలాంటి దాడితో ఏకే 47 ల ఫేలే  అర్నబ్ మళ్లీ తిరిగొచ్చారు. విరామం ...
READ MORE
ప్ర‌భుత్వానికి ఎదురు దెబ్బ‌… సింగ‌రేణి ఉద్యోగాల‌ను ర‌ద్దు చేసిన హైకోర్టు.
సింగరేణి వారసత్వ ఉద్యోగాలపై తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది.  ఇన్నాళ్లు ఆశ‌లు పెట్టుకున్న సింగ‌రేణి వార‌సుల ఆశ‌ల‌పై హైకోర్టు నీళ్లు చ‌ల్లింది. ఎన్నో ఆశ‌ల‌తో త‌న వార‌సుడికి ఉద్యోగం క‌ట్ట‌బెట్టాల‌ని చూసిన సింగ‌రేణి కార్మికుడికి నిరాశే మిగిలింది. హైకోర్టు ...
READ MORE
ప్ర‌తి పాఠ‌శాల‌లో జ‌న‌గ‌ణ‌మ‌న త‌ప్ప‌నిస‌రి..!
ఏంటి ప్ర‌తి పాఠ‌శాల‌లో జ‌న‌గ‌ణ‌మ‌న పాడట్లేదా అని అనుమానం రావ‌డం క‌రెక్టే. కొన్నిమ‌త‌ప‌ర‌మైన‌ పాఠ‌శాల‌ల్లో ఇప్ప‌టికి జాతీయ‌గీతాన్ని ఆల‌పించ‌డం లేద‌న్న‌ది జ‌గ‌మెరిగిన స‌త్యం. ఇక మీద‌ట అలాంటివి చెల్ల‌కుండా ఉండేందుకు దేశ‌వ్యాప్తంగా ఉన్న అన్ని స్కూళ్ల‌లో జాతీయ‌గీతాలాప‌న త‌ప్ప‌నిస‌రి చేసేలా ఆదేశాలు ...
READ MORE
గురువుకు శఠగోపం.. శిష్యుని ఎత్తులను అద్వానీ ముందే ఊహించారా..?
అద్వానీ అంతా ఊహించినట్టే జరిగింది.. కాబోయే భారత రాష్ట్రపతి అని చెప్పుకొచ్చిన ఎన్డీఏ వర్గం మాటకి ప్రధాని మోడీ పెద్ద శఠగోపమే పెట్టినట్టుగా కనిపిస్తోంది. గురువుకు గురు దక్షిణగా రాష్ట్రపతి పదవి ఇస్తారని భావించిన బీజేపీ, ఆర్ ఎస్ ఎస్ వర్గీయులకు ...
READ MORE
అడుగడుగునా అరెస్ట్ ల పర్వం.. రిజర్వేషన్ జాన్తానై అంటున్న బీజేపి.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముస్లిం లకు 12% రిజర్వేషన్  ఎట్టి పరిస్తితిల్లో చేసి తీరుతామని చెప్పడంతో బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజ్యాంగానికి విరుద్దంగా రిజర్వేషన్లు కుదరవని సుప్రీం కోర్టు చెపుతున్నా వినకుండా కేసీఆర్ సర్కార్ మొండి వైఖరి ...
READ MORE
స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో కలిసి పోటీ చేయనున్న బీజేపీ జనసేన.!!
బీజేపీ తో కలిసి పని చేస్తామని ఒప్పందానికి వచ్చిన జనసెన అధినేత పవన్ కళ్యాన్ తాజాగా బీజేపీ పెద్దలను కలిసేందుకు పలువురు ముఖ్య నేతలతో కలిసి ఢిల్లీ వెళ్లారు.బీజేపీ అధ్యక్షులు జేపీ నడ్డా తో మరియు అమిత్ షా తో భేటీ ...
READ MORE
మల్లేపల్లి డివిజన్ లో బ్రాహ్మణులంతా బీజేపీ కి అండగా ఉండాలి.. డా.గిరిధరచార్యులు
మల్లేపల్లి డివిజన్ లో పర్యటించిన ప్రముఖ విద్యావేత్త బీజేపీ దివ్యాంగ్ సెల్ రాష్ట్ర జాయింట్ కన్వీనర్ డా.గిరిధరాచార్యులు గ్రేటర్ ఎన్నికల్లో మల్లేపల్లి డివిజన్ లో బ్రాహ్మణ సామాజిక వర్గం అంతా బీజేపీ కి అండగా ఉండాలని, బీజేపీ అభ్యర్థి ఉషా పవన్ ...
READ MORE
కేసిఆర్ కు ఎందుకు వేయాలి ఓటు.? ప్రశ్నిస్తున్న దళిత సమాజం.!!
ఓ వైపు ముందస్తు ఎన్నికలకు సై అంటూ మరోసారి గెలుపు కోసం వ్యూహాలు రచిస్తూ భారీ జన సమీకరణ అంటూ సభలంటూ హల్ చల్ చేస్తూ మరోసారి గెలిపిస్తే బంగారు తెలంగాణ చేసేస్తా అని జనాల ఓట్లను పొందేందుకు కష్టపడుతున్నారు గులాబీ ...
READ MORE
వ‌రంగ‌ల్ లో రాహుల్ గాంధీ ప‌ర్య‌ట‌న‌..
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన ఖరారైంది. ఈ నెల 19న వరంగల్‌కు రాహుల్ గాంధీ వస్తారని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. ఇదే రోజు భారీ బ‌హిరంగ స‌భ ఉంటుంద‌ని తెలిపారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ...
READ MORE
దుబ్బాక దెబ్బకు ఖాళీ ఐతున్న కాంగ్రెస్ పార్టీ.!!
అనుకున్నట్టు గానే దుబ్బాక లో స్టన్నింగ్ విక్టరీ నమోదు చేసిన బీజేపీ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో దూసుకుపోతున్నది. ఇప్పటికే కాంగ్రెస్ నుండి టీఆరెఎస్ నుండి చోట మోటా నాయకులను భారీగా చేర్చుకున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నుండి బడా నేతలను కూడా ఆహ్వానిస్తూ ...
READ MORE
తెలంగాణ కాషాయాన్ని ఉరకలెత్తిస్తున్న కమళ దళపతి డా.కే.లక్ష్మన్.!!
ఎన్నికల సమయం రాకుండానే ముందస్తుతో ఎన్నికల సమరానికి తెరలేపిండు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. అంతే కాదు ఒకేసారి 105 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. వంద స్థానాలు గెలుస్తామని ధీమా కూడా వ్యక్తం చేసారు. ఇదంతా ఇలా ...
READ MORE
పోలీసులను అడ్డం పెట్టుకుని బీజేపీ నేతల పై కేసులు పెట్టడం దాడులు చేయడం అప్రజాస్వామ్యం.
తెలంగాణ లో బీజేపీ వర్సెస్ అధికార పార్టీ తెరాస అనేలా రాజకీయం నడుస్తోంది. గడిచిన పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ లో తన సత్తా చాటిన కమలదళం తద్వారా ఎంపీ గ గెలిచిన బండి సంజయ్ కు రాష్ట్ర పగ్గాలు అప్పజెప్పింది డిల్లీ అధిష్టానం. ...
READ MORE
మంత్రి పద్మరావు చేతుల మీదుగా “కళ్లకద్దుకునె చరితరా” పాట విడుదల
ఉస్మానియా వందేళ్ల గొప్పతనాన్ని పాట రూపంలో తీసుకు వచ్చింది జర్నలిజంపవర్.కాం వెబ్సైట్. ఈ పాటను తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు పద్మరావు గౌడ్ గారు క్యాంప్ ఆఫీస్ లో ఈ రోజు లాంచనంగా ప్రారంభించారు. ఉస్మానియా శతాబ్ది ఉత్సవాలను పురష్కరించుకుని ...
READ MORE
తెలంగాణ విమోచనం అధికారికంగ జరపాల్సిందే – జాట్ నేత బాలస్వామి.
అరవై ఏండ్లు కొట్లాడీ వేలాది మంది ఉద్యమకారులు ప్రాణాలర్పిస్తే వచ్చింది తెలంగాణ రాష్ట్రం. ఆంధ్రా పాలకుల కంటే ముందే నైజాం పాలనలో చిక్కుకున్న తెలంగాణ ప్రాంతం నాడు ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ చాకచక్యం వల్ల భారత సైన్యం పోరాటం ...
READ MORE
అకున్ సబర్వాల్ సెలవు పై ఎన్నో అనుమానాలు.. నిజాలను వెలికితీస్తే ఇంతేనా..?
డ్రగ్ మత్తు తెలంగాణ ను ఓ ఊపు ఊపేస్తోంది. స్కూళ్లు, కాలేజీలు, టాలీవుడ్ ఇలా మత్తులో జోగుతున్న ప్రతి వ్యవస్థలోనూ ఈ మత్తు చిత్తు చేస్తోందని దీని వెనుక పెద్దల హస్తం ఉందని తేలిపోయింది. మత్తు తేనేతెట్టను కుదుపిని సిన్సియర్ ఆపీసర్ ...
READ MORE
కాషాయ దళంలోకి రేవంత్ రెడ్డి..? తెలంగాణలో టీడీపీ క్లోజ్..
ఇప్పుడు ఎక్కడ చూసినా ఇవే మాటలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియా అయితే కోడై కూస్తోంది. టీడీపీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ త్వరలోనే బీజేపీ తీర్థమ పుచ్చుకుంటారని వార్తలు గుప్పుమంటున్నాయి.. అందుకు ఆధారాలు కూడా లేకపోలేదు. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్నది ...
READ MORE
టార్గెట్ 2019.. విజయవంతమైన  సభ్యత్వం నమోదు.
తెలంగాణ రాష్ట్ర సమితి.. 2019 టార్గెట్ గా దూసుకెళుతోంది. ప్రతి జిల్లా ప్రతి పల్లెను గులాభీ మయం చేసేందుకు సిద్దమైంది. పార్టీ సంస్థాగత బలోపేతంపై దృష్టి సారించిన టీఆర్ ఎస్ సభ్యత్వ నమోదు ప్రక్రియలో విజయవంతం అయింది. రెండేళ్ల కోసారి చేపట్టే ...
READ MORE
ప్రశ్నించే గొంతు పై కత్తి.! రఘునందన్ రావు కి మద్దతుగ నిలుస్తున్న యువత.!!
రెండు తెలుగు రాష్ట్రాలలో బీజేపీ రఘునందన్ రావు అంటే తెలియని వారు ఉండరు.ఎలాంటి ప్రజా సమస్య అయినా ప్రభుత్వ అవకతవకలైనా మొదటగా తనదైన శైలిలో పాలకుల పై తన పదునైన ప్రశ్నలతో ప్రజల వాణి ని వినిపిస్తారు రఘునందన్ రావు. స్వతహాగా ...
READ MORE
ఉపరాష్ట్రపతి గా వెంకయ్య.! జర్నలిజం పవర్ ఊహ నిజం కానున్నదా.?
నిన్న మొన్నటి వరకు కూడా దాదాపు అన్ని పత్రికలు అన్ని మీడియా సంస్థ లు కరింనగర్ వాసి ప్రస్తుత మహారాష్ట గవర్నర్ విద్యాసాగర్ రావు కే ఉపరాష్ట్రపతి పదవి దక్కే అవకాశం అంటూ వార్తలు వేసినప్పటికీ కేవలం ఒక్క జర్నలిజం పవర్ ...
READ MORE
జవాన్లని అవమానిస్తే కాల్చిపారదొబ్బాలి..
ఆయేషా హత్య కేసు.. సత్యం నిర్దోషి..! మరి దోషులెవరు..?
డ్రగ్స్ రాకెట్ గుట్టులో నమ్మలేని నిజాలు.. మత్తుకోసం నగ్న చిత్రాలు
తెలంగాణలో మిత్రపక్షాన్ని ఖాళీ చేయిస్తున్న బీజేపీ.. కమలం గూటికి టీటీడీపీ
ముగిసిన ఢిల్లీ ఎన్నికల పోలింగ్, ఆప్ బీజేపీ ల మధ్యే
కంప్లీట్ “హిందూ” ఎజెండా తీసుకున్న కమలం పార్టీ.!!
తొలి ప్రసారంతోనే బాంబ్ పేల్చిన అర్నబ్ రిపబ్లిక్.
ప్ర‌భుత్వానికి ఎదురు దెబ్బ‌… సింగ‌రేణి ఉద్యోగాల‌ను ర‌ద్దు చేసిన హైకోర్టు.
ప్ర‌తి పాఠ‌శాల‌లో జ‌న‌గ‌ణ‌మ‌న త‌ప్ప‌నిస‌రి..!
గురువుకు శఠగోపం.. శిష్యుని ఎత్తులను అద్వానీ ముందే ఊహించారా..?
అడుగడుగునా అరెస్ట్ ల పర్వం.. రిజర్వేషన్ జాన్తానై అంటున్న బీజేపి.
స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో కలిసి పోటీ చేయనున్న బీజేపీ
మల్లేపల్లి డివిజన్ లో బ్రాహ్మణులంతా బీజేపీ కి అండగా ఉండాలి..
కేసిఆర్ కు ఎందుకు వేయాలి ఓటు.? ప్రశ్నిస్తున్న దళిత సమాజం.!!
వ‌రంగ‌ల్ లో రాహుల్ గాంధీ ప‌ర్య‌ట‌న‌..
దుబ్బాక దెబ్బకు ఖాళీ ఐతున్న కాంగ్రెస్ పార్టీ.!!
తెలంగాణ కాషాయాన్ని ఉరకలెత్తిస్తున్న కమళ దళపతి డా.కే.లక్ష్మన్.!!
పోలీసులను అడ్డం పెట్టుకుని బీజేపీ నేతల పై కేసులు పెట్టడం
మంత్రి పద్మరావు చేతుల మీదుగా “కళ్లకద్దుకునె చరితరా” పాట విడుదల
తెలంగాణ విమోచనం అధికారికంగ జరపాల్సిందే – జాట్ నేత బాలస్వామి.
అకున్ సబర్వాల్ సెలవు పై ఎన్నో అనుమానాలు.. నిజాలను వెలికితీస్తే
కాషాయ దళంలోకి రేవంత్ రెడ్డి..? తెలంగాణలో టీడీపీ క్లోజ్..
టార్గెట్ 2019.. విజయవంతమైన  సభ్యత్వం నమోదు.
ప్రశ్నించే గొంతు పై కత్తి.! రఘునందన్ రావు కి మద్దతుగ
ఉపరాష్ట్రపతి గా వెంకయ్య.! జర్నలిజం పవర్ ఊహ నిజం కానున్నదా.?
Facebook Comments
Top
error: Content is protected !!