You are here
Home > రాజకీయం > ఇనుప సంకెళ్ల తెలంగాణా..? 3 ఏళ్లలో జాడలేని అభివృద్ది..?

ఇనుప సంకెళ్ల తెలంగాణా..? 3 ఏళ్లలో జాడలేని అభివృద్ది..?

ఈ మాట అనడానికే గుండెంతా బరువెక్కుతోంది. కానీ మనమున్న తెలంగాణా ప్రస్తుతం ఇదే పరిస్థితిలో ఉంది. ప్రజా కాంక్షను, నిరసనను దేనినీ పట్టించుకోని నేటి నిజాం సర్కార్ పోలీసులను ప్రయోగిస్తోంది. 60 ఏళ్లలో సమైఖ్య పాలకులు చేయని దుర్మార్గం పోలీసులతో చేయిస్తుంటే ఇనుప సంకెళ్ల తెలంగాణా అని కాక మరెలా పిలవాలి.

తెలంగాణా ఉద్యమ ట్యాగ్ లైనే నీళ్లు, నిధులు, నియామకాలు, స్వయం పాలన. దీని కోసమే వేలాది మంది ఆత్మ బలిదానాలు చేశారు. కోట్లాది మంది ప్రజలు ఉద్యమించారు. సబ్బండ వర్గాలు కదం తోక్కాయి. ఫలితంగా తెలంగాణా రాష్ట్రం సిద్దించింది. ఇక మా రాష్ట్రం, మా పాలన అంటూ తెలంగాణా యావత్తు మురిసింది. వేలాది మంది త్యాగాలకు ఫలితం లభించిందని సంబరపడ్డది.

కానీ.. ఈ మురెపం మూనాళ్ల ముచ్చటే అయ్యింది. తెలంగాణా ఉద్యమ ట్యాగ్ లైన్ నీళ్లు, నిధులు, నియామకాలు పక్కకు పోయింది. చివరికి స్వయం పాలన కూడా నిజాంను తలపిస్తోంటే.. దీనీ కోసమా పోరాడిందన్న అసహ్యం కలుగుతోంది. మూడేళ్ల పాలనలో ఒక్క ప్రాజెక్ట్ పూర్తి కాలేదు. గోదావరి జలాల పేరుతో ప్రభుత్వమే అతిపెద్ద రాజకీయం చేస్తోంది. ప్రతిపక్షాలపై నింద మోపి సమస్య నుండి తప్పించుకునే దిక్కుమాలిన అలోచన చేస్తోంది.

ముంపు బాధితులను సమస్యను మనవతా దృక్పథంతో అలోచించడం లేదు. కని పెంచిన ఊరు మునిగిపోతుంటే.. ధైర్యంగా బతికిన ఊరిని వదిలి పరాయి ఊళ్లో బతకాలంటే ఎంతటి మనీషికైనా గుండెముక్కలవుతుంది. అలాంటి సందర్భంలో మనస్సుతోనే వారిని ఒప్పించాలి. అంతే తప్ప పోలీసులను ప్రయోగిస్తే. ఎమవతుందో మల్లన్న సాగర్ చూపించింది. చిన్న గ్రామాలే నిప్పు కనికలై మండాయి. దాదాపు సంవత్సరం నుండి వేములఘాట్ ప్రజలు నిర్విరామ పోరాటం చేస్తున్నారు. నిర్వాసితులతో వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే ప్రాజెక్ట్ లు కట్టాలన్న ఉద్దేశం ప్రభుత్వానికి ఉన్నట్లు కనిపించడం లేదు. దాని మీద రాజకీయం చేయడమే ప్రదానమన్నట్లు ఉంది.

ఇక నిధులు విషయానికోస్తే తమకు లాభముండే పనులకు తప్ప ఏ పనికి నిధులివ్వడం లేదు. ఒకవేళ ఇచ్చినా పేపర్ ప్రకటనకు మాత్రమే పరిమితం. గ్రామ పంచాయతీలకు ఈ మూడేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయీ ఇవ్వకపోవడంమే దీనికి నిదర్శనం. పైగా కేంద్రం ఇస్తున్న నిధులను సైతం కాజేస్తోంది.

ఇక నియామకాల ఊసే లేదు. వేలాది మంది నిరుద్యోగులు చిక్కడ్ పల్లి, విద్యా నగర్, రాంనగర్ వీధుల్లో కాలం గడుపుతున్నారు. నోటిపికేషన్లు ఎప్పుడు వస్తాయో తెలియక, వేరే పని చేయలేక పస్తులతో కాలం వెళ్లదీస్తున్నారు. ఉద్యోగాల భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ జెఎసి ఆధ్వర్యంలో ర్యాలీ చేపడితే రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు అత్యంత దారుణం. ఇంటి తలుపులు బద్దలుకోట్టి మరీ టి.జెఎసి ఛైర్మన్ కోదండరాంను అరెస్ట్ చేశారు. స్వతంత్ర్య భారతావనిలో ఎక్కడా ఇంత దారుణం జరుగలేదేమో. నిజాంను మించిన దుశ్చర్య.

తెలంగాణా ఉద్యమానికి ఊపిరిలూదిన ఓయూ పరిస్థితి మరీ దారుణం. ఉద్యమం మందగించిన ప్రతిసారి ఓయూ విద్యార్థులు తమ ప్రాణం తీసుకుని ఉద్యమానికి ఊపిరిపోశారు. లాఠీలతో కుళ్లబోడిచినా.. బాష్పవాయు గోళాలతో మంటపెట్టినా. విద్యార్థినిలను చెరబట్టాలని చూసినా.. ప్రాణాలు పోతున్న ఎత్తిన పిడికిలి దించలేదు. అనాటి దృశ్యాలు చూస్తుంటే.. వందల మంది చేగువేరాలు, వందల మంది అజాద్, భగత్ సింగ్ లు కనిపించారు. అంతగోప్ప ఓయూపై సిఎం కెసిఆర్ పగబట్టారు. అందుకే ఓయూను నిర్వీర్యం చేస్తున్నారు.
ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కుంటుంది. కానీ తెలంగాణాలో అదీ లేదు. ఇందిరాపార్కు వద్ద ధర్నా చౌక్ ను తోలగించడమే దీనికి నిదర్శనం.

మూడేళ్ల తెలంగాణాలో ఎం సాధించామంటే… నిర్వాసితులను కుళ్లబోడిచాం.. అయ్యా.. మద్దతు ధర అని అడిగిన రైతులకు బేడీలేశాం.. ఉద్యోగాలివ్వాలని అడిగిన కోదండరాం ఇంటి తలుపులు బద్దలు కోట్టాం. ఎదురు ప్రశ్నిస్తే చాలు జైళ్లలో వేస్తామన్న భయం కల్పించాం.‌. జనానికి మాటలు చెప్పి పబ్బం గడుపుతున్నాం. ఇంతకంటే ఏం చేస్తాం.. బంగారు తెలంగాణా వచ్చినట్లే. కాకపోతే తెలంగాణా సమాజానికా..? ఒక కుటుంబానికా..? అన్నదే ప్రశ్న.

అందోల్ క్రిష్ణ,
సర్పంచుల ఐక్య వేదిక అధ్యక్షులు 

Related Posts
బరి తెగించిన బ్యాంకులు.. లిమిట్స్ దాటితో దాచుకున్న సొమ్ము గోవింద.
బ్యాంకులు బరితెగిస్తున్నాయి. అందినకాడికి దోచుకునే అవకాశం కోసం మాటు వేసి ఎదురు చూస్తున్నాయి. చెమట చుక్కల కష్టంతో సంపాదించుకుని భద్రంగా బ్యాంక్ లో దాచుకుంటే.. ఆ దాచుకున్న సొమ్మును చూసుకోవడానికి కూడా డబ్బు చెల్లించాలంటు కొర్రిలు పెడుతున్నాయి. డిమానిటైజేషన్ దెబ్బతో దేశ ...
READ MORE
పీకే ఆవేశపూరిత మాటలకు, కౌంటర్ ఇచ్చిన కేటిఆర్.!!
జనసేన అధినేత సినీ నటుడు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ప్రచారంలో భాగంగ తెలంగాణ లో భీమవరంలో మాట్లాడుతూ.. ఆంధ్రా వాల్లను తెలంగాణ లో కొడుతున్నారు ఆస్తులు లాక్కుంటున్నారంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయగా అందుకు ట్విట్టర్ వేదికగా తెలంగాణ ...
READ MORE
అమ్మాయిలను వేధించిన కేసులో “షీ”టీంకు చిక్కిన TRS కార్పోరేటర్ కొడుకు
రోజు రోజుకు అధికార తెరాస పార్టీ నాయకులు మరియు కార్పోరేటర్ల కొడుకులు అనుచరుల ఆగడాలు హద్దులు మీరిపోతున్నై.. పార్టీ అధిష్టానానికి కొత్త కొత్త తలనొప్పులు తెస్తున్నై.. మొన్నటికి మొన్న మంత్రి పద్మారావు కుమారుడు సికింద్రాబాద్ మోండా మార్కెట్ లో ఓ వ్యక్తి ...
READ MORE
బ్రేకింగ్- రేపటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బైక్ ర్యాలీ రద్దు..!!
తెలంగాణ రాష్ట్ర బీజేపీ కి నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ మొదటిసారి తెలంగాణ లో అడుగు పెడుతున్న సందర్భంగ బేగం పెట్ ఎయిర్ పోర్ట్ నుండి పార్టీ కార్యాలయం వరకు బైక్ ర్యాలీ ఏర్పాటు ...
READ MORE
Big Breaking- తెలంగాణ బీజేపీ పగ్గాలు బండి సంజయ్ కే అప్పజెప్పిన అధిష్టానం.!!
చాలా తర్జన భర్జనల తర్వాత చాలా మంది నేతల పోటీ మధ్య ఎట్టకేలకు ఒక నిర్ణయం తీసుకుంది అధిష్టానం. దేశం లో అన్ని రాష్ట్రాలకు అధ్యక్షులను నియమిస్తున్నా.. తెలంగాణ కు మాత్రం పెండిగ్ లో పెట్టడం తో నిన్నటి వరకు కూడా ...
READ MORE
అరె యోగి… ఉత్తరప్రదేశ్ లో అధికారులకు చుక్కలు చూపిస్తున్న సీఎం..
ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌ ప్రభుత్వంలో సీఎంగా బాధ్యత లు చేపట్టడమే ఆలస్యం తన పాలన సత్తా ఏంటో చూపిస్తున్నారు యోగి. సరికొత్త పద్దతులకు శ్రీకారం చుడుతు అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. ఆకస్మిక తనిఖీలతో అధికారులకు చుక్కలు చూపిస్తున్నారు యూపి సీఎం యోగి ఆదిత్యనాథ్.   ...
READ MORE
తన నాలుక తనే కోసుకోనున్న తలసాని.??
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ కు సంబంధించిన ప్రైవేట్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో రెండు వేరు వేరు సంధర్భాల్లో ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగ కనిపిస్తాయి. మొదటి వీడియోలో మంత్రి తలసాని కేసిఆర్ కుటుంబం ...
READ MORE
ఆల్ ఫ్రీ సీఎం కేజ్రీవాల్ ఇచ్చిన మరో ఫ్రీ గిఫ్టే అల్లర్లు.!!
నీళ్ళు ఫ్రీ కరెంట్ ఫ్రీ చదువు ఫ్రీ వైద్యం ఫ్రీ మెట్రో ఎక్కితే టిక్కెట్ ఫ్రీ ఇలా అన్ని ఫ్రీ అని చెప్పి ఎన్నికల్లో జనాల ఓట్లు వేయించుకుని ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన అరవింద్ కేజ్రీవాల్, అడగకుండానే అల్లర్లు గొడవలను కూడా ...
READ MORE
రక్షకులమంటూ ప్రాణాలు తీస్తున్నారు..
అక్క చుట్టమైతే లెక్క చుట్టం కాదన్నది సామెత. కానీ వీళ్లు మాత్రం ఇష్టం ఉన్నట్టుగా రెచ్చిపోతున్నారు. యుగయుగాల చరిత్రకి రక్తపు మరకలంటిస్తున్నారు. అహింస బాటలో సాగిన ఆనాటి రక్షణను.. హింసే పరమో ధర్మం అంటూ సాగుతున్నారు. గోరక్షకుల పేరుతో కిరాతానికి ఒడిగడుతున్న వారి ...
READ MORE
నేను వాజ్ పేయ్ హయాంలోనే బీజేపీలో చేరాల్సిందీ కానీ.. – మాజీ ముఖ్యమంత్రి
ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్రం మాజీ ముఖ్యమంత్రి భాజపా నాయకులు నాదేండ్ల భాస్కర్ రావు మీడియా తో మాట్లాడారు. ఈ సంధర్భంగ వాజ్ పేయ్ ప్రధాన మంత్రి గ ఉన్న సమయంలోనే తాను బీజేపీలో చేరాల్సి ఉందని కాకపోతే తన కుమారుడు నాదేండ్ల ...
READ MORE
కొడంగల్ ను గెలిచేదెవరు.. హరీష్ రావా.. రేవంత్ రెడ్డా..??
కొడంగల్ ఎంఎల్ఏ రేవంత్ రెడ్డి రాజీనామా ఇంకా పెండింగ్ లోనే ఉంది కానీ అప్పుడే.. కొడంగల్ లో ఎన్నికల హీట్ మొదలైంది. అధికార పార్టీ టీఆర్ఎస్ ఓ వైపు రేవంత్ రెడ్డి ఓ వైపు వ్యూహాలకు పదును పెడుతున్నారు. రేవంత్ రెడ్డి ...
READ MORE
చేతులు జోడించి.. సారీ చెప్పిన జేసీ దివాకర్ రెడ్డి. ఈ ఇష్యూని ఇక్కడితో వదిలేయడంటూ వేడుకోలు.
అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి ఎట్టకేలకు తన పంతం వీడారు. గురువారం విశాఖపట్నం విమానాశ్ర‌యంలో జ‌రిగిన ఘ‌ట‌నకు క్షమాపణ చెపుతూ వేడుకున్నారు. చేతులు జోడించి ఇక ఈ ఇష్యూని ఇక్కడితో వదిలేయండి నాదే తప్పే క్షమించడంటూ విజ్ఞప్తి చేశారు. గురువారం ...
READ MORE
వాట్సాప్ రూమర్ ఏడుగురిని బలి తీసుకుంది.
సోషల్ మీడియాలో నిజమేదో అబద్దమేదో తెలుసుకోవడం చాలా కష్టం. ఈ మధ్య ఏ వార్త అయినా క్షణాల్లో వైరల్ అవుతుంది ఎంతలా అంటే మతలా మధ్య చిచ్చు పెట్టి ఊర్లకు ఊర్లను పరుగులు పెట్టించేంత.. పలువురి ప్రాణాలను నిర్దాక్షిణ్యంగా బలి తీసుకునే ...
READ MORE
నంద్యాల లో ఒక ఓటు ధర ఎంతో తెలుసా.?
తెలుగు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అసలు బతికే ఉందా.? నంద్యాల ఉప ఎన్నికలో ఒకో పార్టీ వారు తక్కువలో తక్కువగ 5 వేలు పంచుతున్నటు విపరీతమైన చర్చ నడుస్తోంది.. ఇప్పటికే వందల కోట్లని ప్రధాన రాజకీయ పార్టీలు ఖర్చు చేసినట్లు వార్తలొస్తున్నై.. ఇంకా ...
READ MORE
శవరాజకీయాల తమిళనాడు…
శవరాజకీయం ఈ మాట రాజకీయాల్లో తరుచుగా వాడుతుంటారు. కానీ తమిళనాడు రాజకీయ నాయకులు మాత్రం చేసి చూపించారు. మా రాజకీయాలంటే ఏమనుకున్నారు అమ్మ శవాన్ని పెట్టుకునే సీటు దక్కించున్న వాళ్లం.  ఇప్పుడు అమ్మ శవపేటికను పెట్డుకుని విజయం సాదించలేమా అంటున్నారు. ఇక ...
READ MORE
తెల్లటి వస్త్రాల్లో మెరిసిపోయే సేవ దేవతలు.. ఎంత చేసినా ఛీత్కారాలు చీదరింపులే సత్కారాలు.
నర్స్.. ఈ పేరు వినగానే ఏదో తెలియని వింత బావన. ఆస్పత్రుల్లో అత్యవసర సేవల్లో వారి మెరుపు వేగం ఆ చేతుల సేవ ఎంత గొప్పగా చెప్పినా తక్కువే.. మలినాలను శరీరం నుంచి తీసేస్తూ.. మలినమైన మనసును చల్లని చిరు నవ్వుతో ...
READ MORE
కోటి కాంతుల విద్యాజ్యోతి ఉస్మానియా యూనివర్సిటీ.
శతాబ్దాల భాగ్యనగరం ఎంత విస్తరిస్తున్నా అందులో వందేళ్ల భాగ్యం మాత్రం ఉస్మానియా యూనివర్సిటీ దే. ప్రతీ హైద్రాబాదీ గర్వంగ చెప్పే మాట హమారా హైద్రాబాద్.. హమారా ఉస్మానియా యూనివర్సిటీ.. తెలంగాణ షాన్ మా ఉస్మానియా యూనివర్సిటీనే అని. ఓయూ లేనిదే హైద్రబాద్ చరిత్ర లేదు ...
READ MORE
భారత్ లో  రాముడెంతో.. ఇస్లాంలో తలాక్ అంతే.. చరిత్రతో వ్యవహారానికి ముడి.
తలాక్.. తలాక్.. తలాక్..  ఇప్పుడీ వ్యవహారం ముస్లిం యువతులను తీవ్ర గందరగోళంలో పడేస్తోంది. మూడు సార్లు చెప్పే తలాక్ తో జన్మ జన్మల బంధం మూడు క్షణాల్లో తెగిపోతోంది. అయితే ఈ విదానం తప్పని కోర్టుకు ఎక్కింది ఓ వర్గం. కానీ ...
READ MORE
ట్విట్టర్ వార్… తెలంగాణ పోలీసులపై డిగ్గీ రాజా కారుకూతలు..
తెలంగాణ పోలీసులు ఐఎస్ఐఎస్‌కు సంబంధించిన ఫేక్ వెబ్‌‌సైట్‌‌ను రూపొందించారు.. దీని ద్వారా ఉగ్రవాదుల్లో చేరేందుకు ముస్లిం యువతను ప్రొత్సహిస్తున్నారు. ఆ సైట్ ద్వారా సేకరించిన సమాచారం ఆధారంగానే.. తెలంగాణ పోలీసులు ఇచ్చిన సమాచారంతో ఉత్తరప్రదేశ్‌లోని ఐఎస్ఐఎస్ ఉగ్రవాది సైఫుల్లాఖాన్ ఎన్‌‌కౌంటర్ జరిగింది. ...
READ MORE
బాబు మైండ్ గేమ్ ..నంద్యాల ఎన్నిక వాయిదా పడే అవకాశం..?
రాజకీయాల్లో గాలి మాటలకు కొదవ ఉండదు. ఇక ఈ మధ్య కాలంలో గాలి వార్తలకు కూడా పదును పెట్టారు చంద్రబాబు. ఒక్క ఎమ్మెల్యే సీటు ఓడిపోతే ప్రభుత్వమే తలకిందులు అవుతుందన్నంతగా బయపడిపోతున్నారు. సామ , దాన , దండోపాయాలు ప్రయోగించినా ఓటమి భయం ...
READ MORE
భాజపా లో చేరిన ప్రముఖ నటి మాజీ ఎంపీ జయప్రద.!!
మాజీ ఎంపీ సీనియర్ సినీ సమాజ్ వాది నేత నటి జయప్రద తాజాగా భారతీయ జనతా పార్టీ లో చేరారు. తద్వారా ఆమే నరేంద్ర మోడి నాయకత్వాన్ని బలపరుస్తున్నటు పేర్కొన్నారు. నరేంద్ర మోడి నాయకత్వం లో పనిచేయడం గౌరవంగ భావిస్తున్నటు కూడా ...
READ MORE
జయహో ఇస్రో.. దేశం మీసం తిప్పబోతున్న శ్రీహరి కోట.
ఫిబ్ర‌వ‌రి 14 యువ‌తంతా ఆ రోజు కోసం ఎదురు చూస్తోంది. కానీ తెల్లారితే ఏం జ‌రుగుతుందో అని ప్ర‌పంచ మేదావులంతా భార‌తదేశం వైపు చూస్తున్నారు. భార‌త ఇస్రో సాధించే ఆ అపూర్వ ఘట్టం కోసం వేయి క‌ళ్ల‌తో ఎదురు చూస్తుంది ప్ర‌పంచం. ఒక‌టి ...
READ MORE
నెటిజన్ల దెబ్బకు దిగొచ్చిన సర్కార్..? తప్పున్నా ఎందుకు వదిలేసినట్టు..?
ఏది నిజం.. బాజప్తా తప్పు జరిగిందని కళ్లారా కనిపిస్తూనే ఉంది. తెర వెనుక ఎవరున్నారన్నది తేలిపోయింది. అమాయకుడే అయినా తప్పు తప్పే నెటిజన్లలోని ఓ వర్గం గర్జించింది లేదు లేదు అందులొప ఏం తప్పుంది నిజాన్నే కాస్త వెటకారంగా చూపించాడంతే అని ...
READ MORE
త్యాగాల తెలంగాణ.. పల్లె పల్లెకు పాట… పార్లమెంట్ కు బాట.
ఓటు వద్దన్న వాడే ఓటు హక్కు మన జన్మ హక్కు అని నినదించేందుకు సిద్దమవుతున్నాడు. తూటాలతోనే రాజ్యం.. అడవుల్లో యుద్దంతోనే భారత స్వరాజ్యం అన్న ప్రజా నౌక తన దారి మార్చుకుంటోంది. నుదుటున బొట్టుకు ఆస్కారం లేని పాట..కాలంతో పాటు తనలో ...
READ MORE
అడుగడుగునా అరెస్ట్ ల పర్వం.. రిజర్వేషన్ జాన్తానై అంటున్న బీజేపి.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముస్లిం లకు 12% రిజర్వేషన్  ఎట్టి పరిస్తితిల్లో చేసి తీరుతామని చెప్పడంతో బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజ్యాంగానికి విరుద్దంగా రిజర్వేషన్లు కుదరవని సుప్రీం కోర్టు చెపుతున్నా వినకుండా కేసీఆర్ సర్కార్ మొండి వైఖరి ...
READ MORE
బరి తెగించిన బ్యాంకులు.. లిమిట్స్ దాటితో దాచుకున్న సొమ్ము గోవింద.
పీకే ఆవేశపూరిత మాటలకు, కౌంటర్ ఇచ్చిన కేటిఆర్.!!
అమ్మాయిలను వేధించిన కేసులో “షీ”టీంకు చిక్కిన TRS కార్పోరేటర్ కొడుకు
బ్రేకింగ్- రేపటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బైక్
Big Breaking- తెలంగాణ బీజేపీ పగ్గాలు బండి సంజయ్ కే
అరె యోగి… ఉత్తరప్రదేశ్ లో అధికారులకు చుక్కలు చూపిస్తున్న సీఎం..
తన నాలుక తనే కోసుకోనున్న తలసాని.??
ఆల్ ఫ్రీ సీఎం కేజ్రీవాల్ ఇచ్చిన మరో ఫ్రీ గిఫ్టే
రక్షకులమంటూ ప్రాణాలు తీస్తున్నారు..
నేను వాజ్ పేయ్ హయాంలోనే బీజేపీలో చేరాల్సిందీ కానీ.. –
కొడంగల్ ను గెలిచేదెవరు.. హరీష్ రావా.. రేవంత్ రెడ్డా..??
చేతులు జోడించి.. సారీ చెప్పిన జేసీ దివాకర్ రెడ్డి. ఈ
వాట్సాప్ రూమర్ ఏడుగురిని బలి తీసుకుంది.
నంద్యాల లో ఒక ఓటు ధర ఎంతో తెలుసా.?
శవరాజకీయాల తమిళనాడు…
తెల్లటి వస్త్రాల్లో మెరిసిపోయే సేవ దేవతలు.. ఎంత చేసినా ఛీత్కారాలు
కోటి కాంతుల విద్యాజ్యోతి ఉస్మానియా యూనివర్సిటీ.
భారత్ లో రాముడెంతో.. ఇస్లాంలో తలాక్ అంతే.. చరిత్రతో
ట్విట్టర్ వార్… తెలంగాణ పోలీసులపై డిగ్గీ రాజా కారుకూతలు..
బాబు మైండ్ గేమ్ ..నంద్యాల ఎన్నిక వాయిదా పడే అవకాశం..?
భాజపా లో చేరిన ప్రముఖ నటి మాజీ ఎంపీ జయప్రద.!!
జయహో ఇస్రో.. దేశం మీసం తిప్పబోతున్న శ్రీహరి కోట.
నెటిజన్ల దెబ్బకు దిగొచ్చిన సర్కార్..? తప్పున్నా ఎందుకు వదిలేసినట్టు..?
త్యాగాల తెలంగాణ.. పల్లె పల్లెకు పాట… పార్లమెంట్ కు బాట.
అడుగడుగునా అరెస్ట్ ల పర్వం.. రిజర్వేషన్ జాన్తానై అంటున్న బీజేపి.
Facebook Comments
Top
error: Content is protected !!