
ఓ మాజీ అమరజవాన్ కూతురు చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియా ఓ ఊపు ఊపుతున్నాయి. ఎక్కడ చూసినా గురు మెహర్ వ్యాఖ్యలే కనిపిస్తున్నాయి. నిన్న ఆ అమ్మాయి కామెంట్ల పై ఘాటుగా సమాధానం ఇచ్చిన క్రికెటర్ వీరేంధ్ర సెవాగ్ వరుసలో మరి కొందరు ప్రముఖులు వచ్చి చేరుతున్నారు. మా నాన్నని పాకిస్తాన్ చంపలేదు. యుద్ధం బలితీసుకుంది అంటూ ఓ మాజీ అమర వీరుడి కూతురు గురు మెహర్ కౌర్ చేసిన వ్యాఖ్యలు పెద్ద సంచలనంగా మారాయి. అసలు ఓ కార్గిల్ వీరుడి కూతురు ఇలాంటి ఘాటైన వ్యాఖ్యాలు ఎందుకు చేసింది. ఇప్పుడు ఆ అమ్మాయిని టార్గెట్ చేస్తున్న వారి సంఖ్య రోజు రోజుకు ఎందుకు పెరుగుతుంది…?
ఆ మధ్య ఢిల్లీలోని జేఎన్ యూలో జాతి వ్యతిరేక నినాదాలు, సభలు, సమావేశాలు నిర్వహించిన ఉమర్ ఖలీద్ గుర్తున్నాడా..? కన్నయ్యాతో పాటు దేశ ద్రోహ కేసు ఎదుర్కొన్న ఆయన పార్లమెంట్ పై దాడిలో దోషిగా తేలిన అఫ్జల్ గురుకు వీరాభిమాని. అతడిని ఢిల్లీలోని వామపక్ష విద్యార్థి సంఘాల ఆధిపత్యం ఉన్న మరో కాలేజీకి ఆహ్వానించారు. అక్కడ స్పీచ్ ఇవ్వమని కోరారు. ఇది తెలుసుకున్న ఏబీవీపి సహజంగానే రంగంలోకి దిగి అసలు దేశద్రోహ ముద్ర పడ్డ ఉమర్ ఖలీద్ లాంటి వాళ్లని ఎలా ఆహ్వనిస్తారంటు గొడవకు దిగింది. అతనికి ఇంకా నిర్దోషి అని కోర్టులు క్లీన్ చిట్ ఇవ్వలేదంటూ గుర్తు చేసింది. ఇదిగో ఇక్కడే అగ్గి రాజుకుంది ఇక ఇక్కడ మొదలైన రచ్చ దేశ వ్యాప్తంగా పెద్ద సంచలనాలకి తెర లేపి ఆన్ లైన్లో రచ్చై కూర్చుంది.
ఈ గొడవను తన తరహాలో చెప్పాలనుకున్న కార్గిల్ అమరుడి కూతురు గురు మెహర్ ఆలోచించకుండా తప్పుడు సంకేతాలు పంపేలా ఫ్లెక్సీతో ఆన్ లైన్ లో దర్శనం ఇచ్చింది. మా నాన్నను పాకిస్తాన్ చంపలేదు.. యుద్దం చంపింది అంటూ ఫోస్ట్ చేసింది. ఇగ ఇక్కడితో అసలు రచ్చ స్టార్ట్. ఇదీ తనని తాను అమర సైనికుడి కూతురుగా ప్రకటించుకున్న ఇరవై ఏళ్ల గుర్ మెహర్ కౌర్ ఇంటర్నెట్ లో చేసిన వ్యాఖ్య. అసలు కార్గిల్ యుద్ధంలో పాకీస్తాన్ చేతిలో చనిపోయిన ఒక అమరుడి కూతురు మాట్లాడాల్సిన మాటలేనా అవి.. అంటూ సోషల్ మీడియాలోని ఓ వర్గం దుమ్మెత్తి పోస్తోంది. కార్గిల్ అమర వీరులకు ఇచ్చే నివాళి ఇదా అంటూ దేశ భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాకిస్తాన్ కాకుంటే ఎవరు చంపినట్టు..? యుద్ధం పాకిస్తాన్ తో కాక భారత్ తో భారత్ కే జరిగిందా.. అసలు బుద్దుండే అలాంటి కామెంట్ చేసిందా అంటూ ఫైర్ అవుతున్నారు. ఇక ఈ సీన్ లోకి వీరేంద్రుడు వీర ఆవేశంతో ఎంట్రీ ఇచ్చి రచ్చ ను అమాంతం పెంచేశాడు. ఆన్ లైన్లో గుర్ మెహర్ కౌర్ ని ఘాటుగా విమర్శిస్తూ… ” నేను ట్రిపుల్ సెంచరీ చేయలేదు. నా బ్యాట్ చేసింది ” అంటూ సెవ్వాగ్ వెటకారంగా కామెంట్ చేశాడు. ఇది కాస్త గురు మెహర్ ను సమర్థిస్తున్న వాళ్లకి నచ్చ లేదు. అయితే ఇది చిలికి చిలికి గాలి వాన నుండి పెను తుఫాన్ గా మారక ముందే ఆపేద్దామనకున్నా.. ఇప్పుడా రచ్చ దేశాలను ఇందులోకి లాగేసింది. తాజాగా సెహ్వాగ్ బాటలోనే రెజ్లర్ యోగేశ్వర్ కూడా మెహర్ కౌర్ పై ఘాటుగానే ఫైర్ అయ్యాడు.
అవును నిజమే మీ నాన్ననే కాదు ఇక్కడ వీళ్లను కూడా ఈ ఫోటో ఉన్న వారేవరు చంపలేదంటూ ట్విట్ చేశాడు. ఆ ట్విట్ లు ఇలా ఉన్నాయి.. హిట్లర్ ఫోటోపై ‘యూదులను నేను చంపలేదు…గ్యాస్ చంపింది’ అనే క్యాప్షన్ ఉంది. చరిత్రలో నరహంతకుడిగా ముద్రపడిన హిట్లర్ ఉత్తర్వులు ఆధారంగా 1939 సెప్టెంబర్ 1న 90 వేల మందిని గ్యాస్ ఛాంబర్స్‌లో పెట్టి చంపారు. ఇక నరహంతకుడు బిన్ లాడెన్ ఫోటోపై ‘ప్రజలను నేను చంపలేదు, బాంబులు చంపాయి’ అనే క్యాప్షన్ ఉండగా, నోరులోని మూగజీవి కృష్ణజింక సైతం ‘భాయ్ (సల్మాన్ భాయ్) నన్ను చంపలేదు, బుల్లెట్లు చంపాయి’ అని వాపోయినట్టు ఆ ఫోటో మీద క్యాప్షన్ చెబుతోంది. ఇది యోగేశ్వర్ యాంగీల్ అయితే సెహ్వాగ్ కి సపోర్ట్ గా నిలిచిన బాలీవుడ్ హీరో రణదీప్ హూడా ఆ అమ్మాయికి నెగటీవ్ గా ఎంత ప్రాచుర్యం తేవాల అంతా తెచ్చిపెట్టాడు. అయితే ఇప్పుడు ఈ రచ్చ కాస్త దేశాల మధ్య చిచ్చు పెట్టే స్థాయికి చేరిందనేది ఆఫ్ ది రికార్డ్. అయితే ఇక్కడే మన మీడియా బుద్ది గురించి చెప్పుకోవాలి. ఉమర్ ఖలీద్ ను మాట్లాడనివ్వకపోటంతో గుర్ మెహర్ కౌర్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ ప్రెషన్ అంటూ పేల్చిన బాంబును ఎన్డీటీవీ లాంటి నేషనల్ మీడియా గురు కౌర్ ను ఓవర్ నైట్ సెలబ్రిటీని చేసింది. ఇరవై ఏళ్ల ఆమె తెలిసో తెలియకో వివాదంలో కాలుపెడితే దాన్ని భూతద్దంలో చూపటమే కాకుండా… పదే పదే అమర సైనికుడి కూతురంటూ కలరింగ్ ఇచ్చేంది. ఇక సో కాల్డ్ జర్నలిస్టులు ఎంత పని చేసి పెట్టాలో అంతా చేసిపెట్టారు. ఆమె మాట్లాడిన ట్రాష్ కన్నా ఆమె జవాను కూతురన్న విషయమే హైలైట్ చేసింది. మంచిదే.. మరీ అమరుడి కూతురు ఇలా పాకిస్తాన్ ను సఫోర్ట్ చేస్తూ కామెంట్లు చేయడం ఎంత వరకు సమంజసమో సో కాల్డ్ జర్నలిస్టులే చెప్పాలి. ఈ సమస్యను మరింత పెంచేలా ఇంకా రచ్చ చేయడం ఏంటో కూడా వ్యతిరేక, అనుకూల వర్గాలు కూడా తేల్చాలి. ఏది ఏమైన భావప్రకటనా స్వేచ్చ వర్ధిల్లుగాక.
























