You are here
Home > మన ఊరు > మునగ… 300 వ్యాధులకు సింపుల్ మెడిసిన్.

మునగ… 300 వ్యాధులకు సింపుల్ మెడిసిన్.

మునగ చెట్టులో బలం ఉండదని చెపుతారు. చెట్టు కొమ్మలు చిన్న గాలికే విరిగిపోతుంటాయి. కానీ ఆ బలహీనమైన కొమ్మల్లోనే 300 రకాల వ్యాదులను నయం చేసే శక్తి దాగుందని మీకు తెలుసా.. మునగ కాయలకంటే వాటి ఆకులే మన శరీరానికి వంద రెట్లు ప్రయోజనకరం అని మీకు తెలుసా. 300 వ్యాధులకు సింపుల్ మెడిసిన్ లా పని చేసే మునగ ఆకుల పై ప్రత్యేక కథనం.

☘ సాంబార్లో యమ టేస్టీగా తినే మునక్కాయ మన ఒంటికి ఎన్నో లాభాలను చేకూరుస్తుంది. అయితే మునక్కాయల కంటే ఎక్కువ ప్రయోజనాలు మునగ ఆకుల్లో ఉన్నాయని పరిశోదనల్లో  వెల్లడైంది. ఇప్పటి పరిశోదనల కంటే 4, 5వేల ఏళ్ల నుంచే మన పూర్వీకులు మునగాకును మెడిసిన్ తయారీలో వినియోగిస్తున్నారంటే ఆ ఆకు గొప్పతనం ఇట్టే అర్థమవుతుంది.

☘ ఆయుర్వేదంలో 300 లకుపైగా వ్యాధులను నయం చేయడానికి ఈ మునగాకును ఉపయోగిస్తారు. అందుకే దీనిని సాంప్రదాయకమైన మందుగా చెబుతుంటారు ఆయుర్వేద నిపుణులు.

మునగాకులో ఉన్న అద్భుతమైన అద్భుతమైన ఔషద గుణాలు.

☘ మునగాకుల్లో విటమిన్స్, ఎమినో యాసిడ్స్, మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి.

☘ క్యారెట్లు తింటే మాత్రమే వచ్చే విటమిన్ Aని పదిరెట్లు అధికంగా మునగాకు ద్వారా పొందొచ్చు.

☘ కళ్ల వ్యాధులకు సంబంధించిన మెడిసిన్ లో మునగాకును వాడతారు.

☘ పాల నుంచి లభించే క్యాల్షియం 17రెట్లు అధికంగా మునగాకు నుంచి వస్తుంది.

☘ పెరుగు నుంచి పొందే ప్రోటీన్లను 8రెట్లు అధికంగా మునగాకు నుంచి పొందవచ్చు.

☘ అరటిపండ్ల నుంచి పొందే పొటాషియం 15రెట్లు అధికంగా ఎండిన మునగాకు నుంచి పొందవచ్చు.

☘ మహిళలు రోజుకి 7గ్రాముల మునగాకు పొడిని 3 నెలల పాటు రెగ్యులర్ గా తీసుకుంటే 13.5శాతం బ్లడ్ షుగర్ లెవల్స్ తగ్గాయని పరిశోధనల్లో తేలింది.

☘ ఐదు రకాల క్యాన్సర్లకు అద్భుత ఔషదం మునగాకు. లంగ్, లివర్, ఒవేరియన్, మెలానోమా వంటి క్యాన్సర్లను నిరోధించే సత్తా ఉందని తాజా పరిశోధనల్లో తేలింది.

☘ యాంటీ ట్యూమర్ గానూ మునగఆకు వ్యవహరిస్తుంది.  థైరాయిడ్ ను రెగ్యులేట్ చేసే న్యాచురల్ మెడిసిన్ మునగాకు.

☘ మునగాకులో ఉండే క్లోరోజెనిక్ యాసిడ్ ద్వారా బ్లడ్ లో షుగర్ లెవల్స్ ని కంట్రోల్ చేస్తుంది.

☘ మునగాకులో ఎ, సి విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి.

☘ కాల్షియం, పాస్పరస్, ఐరన్ కూడా మునగాకులో పుష్కలంగా వుంటాయి.

☘ వందగ్రాముల మునగాకులో వుండే పోషక పదార్థాలు ☘

☘ నీరు – 75.9 శాతం.

☘ పిండి పదార్థాలు – 13.4 గ్రాములు.

☘ ఫ్యాట్స్ – 17 గ్రాములు.

☘ మాంసకృత్తులు – 6.7 గ్రాములు

☘ కాల్షియం – 440 మిల్లీ గ్రాములు.

☘ పాస్పరస్ – 70 మిల్లీ గ్రాములు.

☘ ఐరన్ – 7 మిల్లీ గ్రాములు.

☘ ‘సి’ విటమిన్ – 200 మిల్లీ గ్రాములు.

☘ ఖనిజ లవణాలు – 2.3 శాతం.

☘ పీచు పదార్థం – 0.9 మిల్లీ గ్రాములు.

☘ ఎనర్జీ – 97 కేలరీలు.

☘ ప్రారంభ దశలో ఉన్న కీళ్ళ నొప్పులకు మునగాకు దివ్య ఔషధం. మునగాకును నూరి కట్టుకడితే తగ్గిపోతాయి.

☘ మునగాకును నూరి లేపనంగా రాయడం, కట్టు కట్టడం ద్వారా చర్మరోగాలు, వ్రణాలు నివారణ అవుతాయి.

☘ మునగాకు రసాన్ని సేవించడం ద్వారా దృష్టి మాంద్యము, రేచీకటి తొలగిపోతాయి.

☘ మునగ ఆకులలో అమినో ఆమ్లాలు వుంటాయి. అందువల్ల మాంసకృత్తుల లోపాల వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలను అధిగమించవచ్చు. గర్భిణులకు, బాలింతలకు మునగాకు రసం అమృతంతో సమానం.

☘ మునగాకు రసాన్ని దోసకాయ రసంతో కలిసి ప్రతిరోజూ సేవిస్తే గుండె, కాలయం, మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలు క్రమంగా తొలగిపోతాయి.

☘ మునగాకుల రసాన్ని పాలలో కలసి పిల్లలకు అందిస్తే వారి ఎముకలు బలంగా తయారవుతాయి. గర్భిణులు, బాలింతలకు ఇస్తే వారికి అవసరం అయిన కాల్షియం, ఐరన్, విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. తల్లులతోపాటు, పాలు తాగే పిల్లలు కూడా ఆరోగ్యంగా వుంటారు.

☘ పాలిచ్చే తల్లులకు మునగాకును కూరగా వండి పెడితే పాలు పెరుగుతాయి.

☘ మునగ రసం రక్తహీనతను నివారిస్తుంది.

☘ గుప్పెడు మునగాకులను వంద మిల్లీలీటర్ల నీటిలో వేసి ఐదు నిమిషాలు ఆ నీటిని కాచి చల్లారనివ్వాలి. ఆ నీటిలో కొంచెం ఉప్పు, మిరియాలపొడి, నిమ్మరసం కలిపి తాగితే ఆస్థమా, టీబీ, దగ్గు తగ్గుతాయి.

☘ మునగాకు రసం ఒక చెమ్చా తీసుకుని దాన్ని గ్లాసు కొబ్బరినీళ్ళలో కలిపి, కాస్తంత తేనె కలిపి ఇస్తే విరోచనాలు తగ్గిపోతాయి.

☘ మునగాకు రసానికి నిమ్మరసాన్ని కలిపి ముఖానికి రాస్తే మొటిమలు, బ్లాక్ హెడ్స్ పోతాయి. ముఖ్యంగా కాల్షియం లోపాన్ని ఎదుర్కొనే మహిళలకు మునగాకు వరప్రదాయిని. అలాంటివారు విరివిగా మునగాకును ఏదో ఒక రూపంగా ఉపయోగిస్తూ వుంటే వారిలోని కాల్షియం పెరుగుతుంది. 

Related Posts
కరోనా ఎఫెక్ట్.. స్కూళ్లు కాలేజీలు బంద్ చేయాలని సీఎం ఆదేశం..!!
ప్రస్తుతం ప్రపంచ దేశాలను గడ గడ వనికిస్తున్నది ఎవరంటే.. కరోనా వైరస్ వ్యాధి.మన దేశం లోకీ చొచ్చుకొచ్చిన ఈ మహమ్మారి వైరస్ వల్ల ఇప్పటికే రెండు మరణాలు సైతం సంభవించాయి.పలు రాష్ట్రాలలో వేగం గ విస్తరిస్తున్న ఈ మహమ్మారి వైరస్ ను ...
READ MORE
నువ్వు నువ్వేనా.? అసలు నీవెవరు.??  మనసుకు హత్తుకునే కథ
సైదులు చిన్నతనం లో పెద్దగా చదువుకోకపోయినప్పటికీ తాత సంపాదించిన ఆస్తి పాస్తులు బాగానే ఉండడంతో అసలు సైదులుకు చదువు అవసరమే రాలేదు, ఏ అవసరమొచ్చినా చేయించుకోవడానికి పాలేర్లు పనివారు. సైదులు తండ్రి రంగారావు కూడా ఎప్పుడూ.. వాడికి చదువెందుకే వాడికేం ...
READ MORE
మందుబాబులకు షాకింగ్ న్యూస్.!!
అక్కడక్కడ మంచినీల్లు ఆఖరికి వాడుకునే నీరు కూడా దొరకదేమో కానీ మందు(ఆల్కహాల్) దొరకని ప్రాంతం ఉండదంటే అతిశయోక్తి కాదు. మన తెలంగాణ లో అయితే మరీ ఎక్కువ. కిరాణ దుకాణమైనా ఉదయం రద్దీ కాదేమో కానీ మందు షాప్ అయితే తెరవకముందే ...
READ MORE
బడుగు జీవుల దీన స్థితిగతులపై యువత ప్రత్యేక సర్వే..
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ లో భాగమైన SFD(స్టూడెంట్  ఫర్ డెవలప్మెంట్) ఆద్వర్యంలో ఈ నెల 20 నుండి 26 వరకు తెలంగాణ జిల్లాల్లోని మారుమూల పల్లె వాసుల జీవన స్థితిగతులూ.. రైతులు  అడ్డా కూలీల సాదకబాదలను వారి కుటుంబ పరిస్థితులను ...
READ MORE
సిద్దిపేట్ జిల్లా లో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహానికి అవమానం.!!
సిద్దిపేట్ జిల్లా మిర్దొడ్డి మండలం పెద్ద చెప్యాల లో గుర్తు తెలియని దుండగులు బరితెగించారు. అంబేద్కర్ యొక్క నిలువెత్తు విగ్రహం పై దాడి చేసి, ద్వంసం చేసారు. దీంతో ఒక్కసారిగా మండలంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రశాంతమైన పరిస్థితుల మధ్య ఇలాంటి ...
READ MORE
చీర్యాల నరసింహ స్వామి ని దర్శించుకున్న  జిల్లా కలెక్టర్.!!
తెలంగాణ ప్రముఖ ఆలయం చీర్యాల శ్రీశ్రీశ్రీ లక్ష్మి నృసింహ స్వామి దేవాలయంలో ఈ నెల 09 తేదీన మొదలైన బ్రహ్మోత్సవాలకు నేడు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ ఎంవి రెడ్డి విచ్చేసి శ్రీశ్రీశ్రీ లక్ష్మి నృసింహ స్వామి ని దర్శించుకున్నారు. తర్వాత ...
READ MORE
ఆరోగ్యానికి ఏ నెంబ‌ర్ పండు మంచిది…? ప‌ండుపై నెంబ‌ర్ చెబుతున్న ర‌హ‌స్యం మేంటి.?
పండేంటి నెంబ‌ర్ ఏంట‌ని ఆశ్చ‌ర్య‌పోకండి. ఇప్ప‌టికే ఈ విష‌యం మాకు తెలుస‌ని పెద‌వి కూడా విర‌వ‌కండి. మ‌రొక్క‌సారి మీ దృష్టికి తీసుకు రావ‌డంలో త‌ప్పు లేద‌ని.. తెలియ‌ని వారికి మ‌రింత చెప్పేందుకే ఈ పండు సంఖ్య‌లో ఉన్న మ‌ర్మాన్ని మీకోసం ఇలా ...
READ MORE
అధికారులు అర్థం చేసుకోరు, పాలకులు పట్టించుకోరు.! రోడ్డు పై వెల్లాలంటే నరకం చూస్తున్న ప్రజలు.!!
గ్రేటర్ హైద్రాబాద్ పరిధి కూకట్ పల్లి నియోజకవర్గం హస్మత్ పేట్ ప్రజలకు, అధికారులు మరియు పాలకుల పుణ్యమాని రోజూ ప్రత్యక్ష నరకం చవిచూస్తున్నారు. హస్మత్ పేట్ లోని సూర్య ఎన్ క్లేవ్ వెనకవైపు ఉన్న ప్రాంతం లో డ్రైనేజ్ లైన్ కోసం ...
READ MORE
ధన ప్రవాహానికి సిద్దమవుతున్న పంచాయతి సమరం.!!
తెలంగాణ లో అసెంబ్లీ ఎన్నికల సమరం ముగిసింది ఇక ఇప్పుడు మరో సమరానికి సిద్దం అవుతోంది రాష్ట్రం. ఈసారి పంచాయతి ఎన్నికల రూపంలో ఆ సమరం ఉంటుంది. ఇక ఈ ఎన్నికల్లోనూ ధన ప్రవాహం గట్టిగా జరగే ప్రమాదం ఉందని రాజకీయ ...
READ MORE
రోజుకు 7 వేల మంది భక్తులకే ఏడుకొండలవాడి దర్శనం..!!
కలియుగ ప్రత్యక్ష దైవం ఏడుకొండల వాడు తిరుమల ఎంకన్న సామి దర్శనం మరి కొంత కాలం దొరకడం కష్టం గానే అనిపిస్తోంది. ప్రస్తుతం దర్శనాలు పూర్తిగా ఆపి వేయడం జరిగినా.. ఇకపై దర్శనాల విషయంలో కొంత సడలింపు కు ఆలోచన చేస్తోంది ...
READ MORE
కరోనా ఎఫెక్ట్.. స్కూళ్లు కాలేజీలు బంద్ చేయాలని సీఎం ఆదేశం..!!
నువ్వు నువ్వేనా.? అసలు నీవెవరు.?? మనసుకు హత్తుకునే కథ
మందుబాబులకు షాకింగ్ న్యూస్.!!
బడుగు జీవుల దీన స్థితిగతులపై యువత ప్రత్యేక సర్వే..
సిద్దిపేట్ జిల్లా లో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహానికి అవమానం.!!
చీర్యాల నరసింహ స్వామి ని దర్శించుకున్న జిల్లా కలెక్టర్.!!
ఆరోగ్యానికి ఏ నెంబ‌ర్ పండు మంచిది…? ప‌ండుపై నెంబ‌ర్ చెబుతున్న
అధికారులు అర్థం చేసుకోరు, పాలకులు పట్టించుకోరు.! రోడ్డు పై వెల్లాలంటే
ధన ప్రవాహానికి సిద్దమవుతున్న పంచాయతి సమరం.!!
రోజుకు 7 వేల మంది భక్తులకే ఏడుకొండలవాడి దర్శనం..!!
Facebook Comments

Leave a Reply

Top
error: Content is protected !!