You are here
Home > అంతరంగం > అర్థ శతాబ్ధం గడిచినా ‘చే’ అజేయంగా ఎదుగుతూనే ఉన్నాడు..

అర్థ శతాబ్ధం గడిచినా ‘చే’ అజేయంగా ఎదుగుతూనే ఉన్నాడు..

చే గువేరా అంటే ఓ ఉత్తేజం, ఓ ఆవేశం, నిరంతరం పడిలేస్తూ, చస్తూ బ్రతుకుతున్న అభాగ్య జీవులకు వెలుగునిచ్చే కాంతిపుంజం. ఒకటి తరువాత మరొకటిగా లాటిన్‌ అమెరికాతోపాటు మిగతా ఖండాలను కొల్లగొట్టాలనుకున్న అమెరికా సామ్రాజ్య వాదుల గుండెల్లో మృత్యు భయం. చే ఓ చైతన్యం, చే ఓ ప్రభంజనం. తలపైకెత్తి చూస్తున్న చురుకైన కళ్ళు, నిర్లక్ష్యంగా వదిలేసిన జుట్టు, సన్నగా పెరిగిన గడ్డం, నలిగిన దుస్తులు, పెదాలపై సిగార్‌, తలపై క్యాప్‌తో విప్లవ స్ఫూర్తిని నింపే రూపం, సడలని ఆత్మ విశ్వాసం, చెరగని వ్యక్తిత్వంతో అలుపెరగకుండా చేసిన పయనం చే జీవితం. మేధావిగా, వైద్యుడిగా, గెరిల్లా వ్యూహకర్తగా, విప్లవకారునిగా, ఓ స్నేహితునిగా, ఓ తండ్రిగా, ఓ మంచి కొడుకుగా ఎటువైపు చూసినా ఆయన జీవితం స్ఫూర్తిదాయకం, ఆదర్శప్రాయం. ఆయన ఫొటో చూసిన వారందరికీ అయన పేరు తెలియకపోవచ్చు, పేరు తెలిసినవారికి ఆ వ్యక్తి ఏ ప్రాంతం వాడో తెలియకపోవచ్చు, కానీ ఆయనో గొప్ప విప్లవకారుడుగా, తిరుగుబాటుదారుడుగా మాత్రం తెలుసు. ఎందుకు ఆయనకు అంత గుర్తింపు వచ్చింది, ప్రపంచంలో వీరులే లేరా, నాయకులే లేరా అని ప్రశ్నించుకుంటే ఉన్నారు. కానీ వారిలో చాలావరకు తమ జాతి కోసమో లేదా తమ ప్రాంతం కోసమో లేదా తమ హక్కుల కోసమో, కాకుంటే తమ దేశం కోసమో పోరాడిన వారు. కానీ చే జీవితంలో భౌగోళిక హద్దులు లేవు. తన పోరాటం అణచివేత మీద, ఆక్రమణల మీద, దౌర్జన్యం మీద, ముఖ్యంగా సామ్రాజ్యవాదం మీద. అది అంతర్జాతీయమని, దానికై ఆ స్థాయిలోనే పోరాటం చేయాలని భావించాడు. అందుకే అర్జెంటినాలో పుట్టినా క్యూబా, గ్వాటెమాల, మెక్సికో, క్యూబా, కాంగో, బొలివీయా లోని ప్రజా వ్యతిరేక నియంతల పాలనపై తిరుగుబాటు చేసిన ప్రజలకు మద్దతుగా విప్లవ ఉద్యమాలలో పాల్గొన్నాడు. అంతేకాక ఇండొనేషియా, వియత్నాం లాంటి ఆసియా దేశాలలో అమెరికా సామ్రాజ్యవాద వ్యతిరేక శక్తులపై పోరాడుతున్న ఉద్యమకారులకు తన మద్దతు ప్రకటించాడు.
1928 జూన్‌ 14న అర్జెంటీనాలోని రొజారియాలో ఎర్నెస్టో గువేరా లించ్‌, సెలియా డెలాసెర్నా దంపతులకు జన్మించిన చే అసలు పేరు ఎర్నెస్టో గువేరా సెలాసెర్నా. రెండు సంవత్సరాల పసి వయస్సులోనే ఆయనకు ఉపశమనం తప్ప శాశ్వత చికిత్సలేని ఆస్తమా వ్యాధి ఉందని తెలిసింది. చే ఆరోగ్యరీత్యా ప్రస్తుతం ఉంటున్న చల్లని ప్రాంతం నుంచి ఐదేళ్ళలోనే ఐదు ప్రదేశాలు మారి చివరకు అల్టాగ్రానియాలో స్థిరపడ్డారు. చే తల్లిదండ్రులు సాహిత్య ప్రియులు, రాజకీయ విప్లవవాదులు. వారింట్లో ఆడంబ రాలు, ఖరీదైన ఫర్నీచర్లాంటి వాటికి చోటులేదు. ఇంటినిండా స్పానిష్‌, ఐరిష్‌, ఫ్రెంచ్‌ మరియు ఇతర దేశాలకు చెందిన సిగ్మండ్‌ ఫ్రాయిడ్‌, బెర్ట్రాండ్‌ రస్సెల్‌, గాంధీ, మార్క్స్‌, ఎంగెల్స్‌, లెనిన్‌, సాంత్రా లాంటి రచయితల చరిత్ర, తత్వశాస్త్రం, కథలు, కవితలకు సంబంధించిన దాదాపు 3,000 పుస్తకాలు ఉండేవి. మిత్రుడైన డాక్టర్‌ అల్బర్టో గ్రనడో అనే స్నేహితునితో కలిసి 1951 డిసెంబరు 29న మోటార్‌ సైకిల్‌పై యాత్ర మొదలైంది. 1952 ఫిబ్రవరి 18న చిలీలో ప్రవేశించిన తరువాత డియోరియో ఆస్ట్రాల్‌ అనే పత్రిక వీరి యాత్ర గురించి ప్రచురించింది. అక్కడ గని కార్మికుల కాలనీలలో తిరిగిన వారిద్దరూ అక్కడి జీవితాలను చూశారు. దుర్భరమైన జీవితాలకు కారణం తక్కువ జీతాలు, నిరుద్యోగం. గనులు జాతీయం చేయాలని కార్మికులు ఉద్యమాలు జరుపుతున్నా ఎటువంటి స్పందనా లేదు. అక్కడి నుంచి పెరూ చేరుకున్నారు. మోటారు సైకిల్‌ను ఓ చోట పెట్టి గుర్రాలు, గాడిదల మీద ప్రయాణం చేస్తూ స్థానిక తెగలవారి దుర్భర జీవితాలను చూశారు. తరువాత కొలంబియా అక్కడి నుంచి వెనిజులా చేరుకున్నారు. కారకాస్‌ పట్టణంలోని ఒక కుష్ఠు వ్యాధి కేంద్రంలో చే మిత్రుడైన డాక్టర్‌ గ్రనడోకు ఉద్యోగం దొరికింది. దాంతో అతనక్కడే ఉండిపోవాలనుకున్నాడు. కానీ చే కు స్వదేశానికి వెళ్ళాలని ఉంది. అదే సమయంలో ఆరోగ్యం దెబ్బతింది, మరోవైపు చేతిలో డబ్బులేదు. ఆ పరిస్థితిలో కారకాస్‌ పట్టణంలోనే ఓ గుర్రాల వ్యాపారి తనకు బంధువని తెలిసి వెళ్ళి కలిసి వివరాలు చెప్పాడు. అతను గుర్రాలను విమానంలో తను ఉంటున్న ప్రాంతానికి ఎగుమతి చేస్తానని చెప్పడంతో ఆ గుర్రాలను పంపే విమానంలోనే ఎక్కాడు. కానీ అది దారిలోనే మియామి పట్టణం వద్ద చెడిపోయింది. అప్పటికే ”చే” డబ్బులు లేని పరిస్థితిలో ఓ హోటల్‌ యజమాని దగ్గరకు వెళ్ళి పరిస్థితి చెప్పి ఉండటానికి గది, భోజన సదుపాయం పొందాడు. 20 రోజులు అలాగే గడిపి 1952 ఆగష్టులో ఇంటికి చేరాడు. ఎనిమిది నెలల మోటారు సైకిల్‌ యాత్రను డైరీలో రాసుకున్నాడు.
కన్నబిడ్డల్ని కాపాడుకోలేని దైన్యం, ఆకలితో, అనారోగ్యంతో బ్రతుకు ఈడుస్తున్న ప్రజల ఆక్రందనలు, వారిని దగా చేస్తున్న దళారీ వ్యవస్థ, దోపిడీ దారులు దీని కారకులు. పరిష్కారం కోసం తీవ్రంగా ఆలోచించాడు. అదే సమయంలో లాటిన్‌ అమెరికా దేశాలలో సైనిక నియంతల చేతులలోనే రాజ్యాధికారం ఉందని, అమెరికా, బ్రిటన్‌లు ఆ దేశాలను ఆగ్రహించిన మరుక్షణం వారు కూడా పదవుల్లో కొనసాగలేరని గ్రహించాడు. 1953 జూన్‌ 12న అంటే సరిగ్గా 25 సంవత్సరాల వయస్సులో చే డాక్టర్‌ పట్టా పొందాడు. అయితే వైద్యం ద్వారా తగ్గించ వలసిన మనుషుల రోగాల కంటే వ్యవస్థకు పట్టిన రోగం ముఖ్యమైనదని, దానిని తొలగించడం తన బాధ్యతగా భావించాడు. లాటిన్‌ అమెరికా దేశాల పరిస్థితులే ఆ నిర్ణయానికి కారణమయ్యాయి. దానికోసం మరోసారి ఆ దేశాలన్నీ పర్యటించి అవగాహన పెంచుకోవడం అవసరంగా భావించాడు. ఈ ఆశయంలో చే ఎంచుకున్న తొలి యుద్ధ క్షేత్రం ”బొలీవియా”. 1956లో క్యూబాపై గెరిల్లా దాడికి వ్యూహం రూపొందించారు. కాస్ట్రోకు కుడి భుజంగా, వ్యూహకర్తగా, సేనానిగా గెరిల్లా పోరాటానికి నాయకత్వం వహించి క్యూబాను విముక్తి చేశాడు. పరిశ్రమల మంత్రిగా కొంతకాలం పనిచేసి ప్రభుత్వం నుంచి వైదొలగి, గెరిల్లా సైన్యంతో మిగతా లాటిన్‌ అమెరికా దేశాలను విముక్తి చేసే లక్ష్యంతో 1965లో కాంగోకు వెళ్లాడు. బొలీవియాలో గెరిల్లా కార్యకలాపాలు సాగిస్తున్న దశలో అమెరికా వేట ముమ్మరం చేసింది. సిఐఎ సహకారంతో ‘చే’ సైన్యాన్ని చుట్టుముట్టి అనేక చిత్రహింసలు పెడుతుంటే… శాశ్వతమైనది విప్లవమొకటే.. సోషలిజం అంతిమ లక్ష్యం అంటూ గంభీర స్వరం ధిక్కరించింది. గెలిచినా.. ఓడినా పోరాటం తప్పదు. 1967 అక్టోబర్‌ 8న ‘చే’ను కాల్చి చంపేశారు. అర్థ శతాబ్ధం గడిచినా ‘చే’ అంతం కాలేదు. అజేయంగా ఎదుగుతూనే ఉన్నాడు 

Related Posts
డెత్ టైమ్ చెప్తామంటున్న శాస్త్రవేత్తలు.
పుట్టుక నిజం చావు నిజం. ఆ మధ్యనున్న బ్రతుకంతా అబద్దం అన్నాడు ఓ కవి. పుట్టుక ఎప్పుడు ఎంత సమయానికి జరుగుతుందో వైద్యులు ఇప్పటికే తేల్చేశారు. అమ్మ కడుపునుండి తిథి, వర్జం, రావుకాలం చూసుకుని మరీ పుడుతున్నారు. మరీ చావో.. దీనికే ...
READ MORE
అనూహ్య నిర్ణయాలతో దుమ్ము రేపుతున్న నరేంద్ర మోడి, అయోమయంలో ప్రతిపక్షాలు.!!
నరేంద్ర మోడి ప్రపంచానికి పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. 2014 ముందు గుజరాత్ ముఖ్యమంత్రి గ దేశ ప్రజలను ఆకర్షించిన నరేంద్ర మోడి ఆ తర్వాత ప్రధానమంత్రి పదవి చేపట్టి యావత్ ప్రపంచ దేశాలను కూడా ఆకర్షించి ఐక్యరాజ్యసమితి స్థాయి ...
READ MORE
హిందూ బ్రాహ్మిన్ అమ్మాయైతే 5లక్షలు, సిక్కు అమ్మాయైతే 7లక్షలు..??
*అవును హిందూ అమ్మాయైతే 5లక్షలు, *హిందూ క్షత్రియ అమ్మాయైతే 4.5 లక్షలు, *హిందూ ఎస్సీ ఎస్టీ ఓబీసీ అమ్మాయైతే 2 లక్షలు, *జైన్ మతానికి చెందిన అమ్మాయైతే 3 లక్షలు, *గుజరాతీ బ్రాహ్మిన్ అమ్మాయైతే 6 లక్షలు, *గుజరాతీ కుట్చీ అమ్మాయైతే 3 లక్షలు, *సిక్క్ ...
READ MORE
60 ఏండ్లు పాలించిన నెహ్రూ కుటుంబం.. నేడు దేశంలో అభివృద్ధి లేదనడం సిగ్గుచేటు కాదా.??
దేశంలో గత 2014లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో భాజపా సర్కార్ వచ్చింది. గుజరాత్ రాష్ట్రానికి సక్సెస్ఫుల్ ముఖ్యమంత్రి గ పేరుగడించిన నరేంద్రమోడీకి జనాలంతా జై కొట్టారు. మోడీ ప్రధానమంత్రి పదవి చేపట్టి ఐదేండ్లు కావస్తుంది.అయితే..అంతకముందూ గతంలోనూ ఆ మాటకొస్తే స్వాతంత్ర్యం ...
READ MORE
కమల్ హాసన్ కి చిన్న పొలిటికల్ ఝలక్ ఇచ్చిన రజినీకాంత్
ఇప్పుడు జాతీయ స్థాయిలో రోజూ ఏదో ఒక సంచలనంతో వార్తల్లో నిలుస్తోంది తమిళ రాజకీయం. కారణం త్వరలోనే సూపర్ స్టార్ రజినీకాంత్ మరియు విలక్షణ నటుడు కమల్ హాసన్ లు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తుండడం.. వీరిద్దరూ ఒకే రాష్ట్రానికి చెందిన వారు ...
READ MORE
గీ రోడ్లపై వెల్తే.. చేరేది ఇంటికా నరకానికా.??
పొద్దున లేస్తే హైద్రాబాద్ ని సింగపూర్ చేస్తా కరీంనగర్ ని మలేషియ చేస్తా వరంగల్ ని ఇస్తాంబుల్ చేస్తా అనుడే గానీ అసలు ఈ హైద్రాబాద్ రోడ్ల పరిస్థితి ఈ తెలంగాణ సర్కార్ కల్లకు కనిపిస్తుందా..?? ఒక్కసారి ఇంటి నుండి బయటికెల్తే.. ఏ ...
READ MORE
మొన్న భూటాన్ ను కాపాడి.. నేడు భూటాన్ బుల్లి యువరాజును ఆడించె.!
భూటాన్ దేశ భూభాగాన్ని ఆక్రమించాలని ప్రయత్నించిన చైనా కుటిల కుయుక్తుల నుండి భూటాన్ ని కాపాడింది మన భారత ప్రధాని నరేంద్ర మోడి చాణక్య నీతి. చైనా ఎన్ని ఎత్తులు వేసినా మన దేశం లో కొన్ని మీడియా సంస్థలు, కొందరు ...
READ MORE
కనకదుర్గ కాపురం కూలిపోవడానికి కారణం ఎవరు..??
కమ్యునిజం రాజకీయానికి తక్కువ ప్రచారానికి ఎక్కువగ మారిందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. కమ్యునిజం భావజాలమంటూ అమాయక మహిళలకు నూరిపోసి వారి బుర్రలను వాష్ చేసి, హిందువులుగ ఉన్న వారినే హిందూ ధర్మానికి వ్యతిరేకంగ తయారుచేస్తూ హిందూ దేవుల్లపై యుద్దం చేయాలంటూ ...
READ MORE
తాజ్ మహలా.? తేజో మహాలయనా.?? ఏది నిజం.!!
భారత దేశం ఆగ్రాలో నిర్మించిన తాజ్ మహల్ అంటే తెలియని వారుండరు. భారత్ అంటే తాజ్.. తాజ్ అంటే భారత్ అనేంతగా ముడిపడిపోయింది తాజ్ మహల్. అంతేకాదు ప్రపంచ ఏడు వింతల్లో తాజ్ ఒమహల్ కూడా ఒకటి. యునెస్కో గుర్తించిన ప్రపంచ ...
READ MORE
కోమటోల్లలో ఐక్యత లోపించిందా.? లేక ఇదే వారి జీవన విధానమా.??
కోమటోల్లు సామాజిక స్మగ్లర్లు కాదు.! సామాజిక బలహీనులు.!! అవును ఈ వాదనే ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వినిపిస్తోంది. ఒక స్వయం ప్రకటిత మేధావి ఏకంగ ఓ సామాజిక వర్గాన్నే ఒక కులం మొత్తాన్ని కలిపేసి దుర్మార్గమైన ఆలోచనతో స్మగ్లర్లంటూ, దోపిడీదారులంటూ నోటికొచ్చినట్టు కించపరిస్తే.. ...
READ MORE
సమాజ శ్రేయస్సే కుటుంబ శ్రేయస్సుగా భావించే ఆదర్శనీయుడికి జన్మధిన శుభాకాంక్షలు.
ప్రముఖ విద్యావేత్త జర్నలిజం పవర్ ఛానెల్ ఛైర్మన్ డా. గిరిధరాచార్యులకు యావత్ జర్నలిస్ట్ లోకం జన్మధిన శుభాకాంక్షలు తెలియజేస్తోంది. సమాజంలో నెలకొని ఉన్న అసమానతలను రూపు మాపే లక్ష్యంతో ప్రతి వ్యక్తి లోని గొప్ప కోణాలను వెలికి తీసి యువతలో దేశ భక్తి, ...
READ MORE
“జబర్థస్త్” షో ప్రేక్షకులకోసమా.. మెగా ఫ్యామిలీకి చెక్క భజన చేయడానికా.?
ఈటీవీ తెలుగు ఛానెల్ లో ప్రతి గురువారం శుక్రవారం ప్రసారమయ్యే "జబర్థస్త్ కామెడీ షో" కు ముందునుండి జడ్జిలుగా రోజా తో పాటు మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు నాగబాబు కూడా జడ్జిగ వ్యవహరిస్తున్నారు. దాంతో సహజంగానే రోజా ను మరియు నాగబాబు ...
READ MORE
నరేంద్ర మోడి క్యాబినేట్ లో తెలంగాణ నుండి ఎవరికి అవకాశం..?
తెలంగాణ భాజపా కార్యకర్తల్లో ఫుల్ జోష్ కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఏమాత్రం ప్రభావం చూపించని కమలదళం పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం మోడీ గాలి ఒక రేంజ్ లో వీచింది.ఇదే అదనుగ ఏకంగ అధికార పార్టీ తెరాస తోనే ఢీ అంటే ఢీ ...
READ MORE
ఒకేదారిలో భిన్న దృవాలు.. సొంత పార్టీకే అర్థం కాని ఎత్తులతో రాజకీయం
మతతత్వ పార్టీ అని ముద్ర వేసుకున్నది ఒకటయితే.. కుల రాజకీయాలతో మరో సారి పీఠం ఎక్కాలని కొత్త ఎత్తులు వేస్తున్న పార్టీ మరొకటి. ఉద్యమమే ఊపిరిగా నడిచిన పార్టీ ఒకటయితే.. ఆ ఊపిరికే తిరిగి ఊపిరి పోస్తున్న పార్టీ మరొకటి. ఒకటి ...
READ MORE
బాహుబలి2 కి పవర్ స్టార్ పవన్ కళ్యాన్ స్పూర్తి..
రికార్డ్ ల మీద రికార్డ్ లు క్రియేట్ చేస్తున్న బాహుబలి 2.. ది కన్ క్లూజన్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి సంబంధ ఏంటి..? ఈ సైట్ వాళ్లకు ఎక్కడ పనిలేదా.. ప్రతి దాన్ని లింకులు పెడుతారని అనుకుంటున్నారా..? ...
READ MORE
కన్న తల్లి బంధానికి అర్థాన్ని మార్చేసిన దుర్మార్గురాలు.!!
రోజు రోజుకు మానవ సంబంధాలు మొత్తం కలుషితం అవుతున్నాయనడానికి ఈ ఘటన ఉదాహరణ. యావత్ సభ్య సమాజం ఛీ కొట్టేలా.. మనిషి అనేవాడు అసహ్యించుకునేలా.. జంతువులు కూడా సిగ్గుపడేలా చేసింది ఓ మహిళ. అమెరికా ఓక్లహామా లో పాట్రిక స్పాన్(44) అనే అనే ...
READ MORE
నవ భారత్ సాధనలో బీజేపీ…
దేశ రాజకీయాల్లో విభిన్న పార్టీగా ఆవిర్భవించిన భారతీయ జనతా పార్టీ 37 ఏళ్లు ఘనంగా పూర్తి చేసుకుంది.. 1980 ఏప్రిల్ 6వ తేదీన పుట్టిన బీజేపీపిని బురదలో పుట్టిన కమలం అని ఈసడించికున్నారు ప్రత్యర్ధులు.. అయితే అనతి కాలంలోనే రాజకీయాలనే బురదలో ...
READ MORE
జగమంత కుటుంబం నాది.. మానవత్వ జీవితమే నాది..
ఖాకీ చొక్కా  గొప్ప తనం గురించి చాలానే కథనాలు రాశాం.. మంచిని చెప్పాం.. చెడును చీల్చి చెండడాం.. కానీ ఈ గొప్ప వ్యక్తి గురించి చెప్పాలంటే మాత్రం పదాలు చాలడం లేదు. ఎంత గొప్పగా చెపుదామని ప్రారంభించినా ఇంకా ఏదో వెలితి ...
READ MORE
మేడ్చల్ టీఆర్ఎస్ టిక్కెట్ కన్ఫం చేసిన కేసిఆర్..? ఎవరో తెలుసా..??
ముందస్తు ఎన్నికలకు జిందాబాద్ కొట్టి తొమ్మిదినెలలు ముందే అదృష్టాన్ని పరిక్షించుకుంటున్న గులాబి బాస్ కేసిఆర్.. ఆ దిశలో అందరికంటే ముందుగానే ఏకంగ 105 మంది అభ్యర్థులను ఒకేసారి ప్రకటించి కేవలం 14 అసెంబ్లీ స్థానాలను మాత్రమే పెండింగ్ లో పెట్టడం జరిగింది. ఇలా ...
READ MORE
సర్వ్ నీడ్.. దేశానికి కావాల్సిన.. దేశం కోరుకుంటున్న ఓ యువకుని స్వచ్చమైన సేవ..
దేశానికి కావాల్సిన.. దేశం కోరుకుంటున్న ఓ యువకుని స్వచ్చమైన సేవను మా వంతుగా జనానికి చెప్పే అవకాశం  దక్కింది. నిజానికి ఈ ఆర్టికల్  కాపి కొట్టకూడదని అనుకున్నా.. కానీ మాకంటే ముందే ఈ ఆర్టికల్ ను గొప్పగా రాసిన ఛాయ్ బిస్కెట్ ...
READ MORE
హిందువుల ఓట్లకోసమా..హిందుత్వంలోకి మారడం కోసమా.. మతం మారనున్న జగన్.?
వైఎస్ జగన్మోహన్ రెడ్డి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయుడిగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నేతగా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడిగా అందరికీ పరిచయం.. తండ్రి చనిపోయినప్పుడే తదుపరి ముఖ్యమంత్రిగా జగన్ కావాలని కొందరు నాటి ఉమ్మడి ఆంద్రప్రదేశ్ లో ...
READ MORE
చిన్నారి మృత్యుపయనం..
నేను బోరు బావిలో బిగించబడిన మోటరాను.. సూర్యుడు అస్తమించే సమయాన చిన్నారి మీనా అనే పాప 40 అడుగుల ఎత్తు నుండి నా మీద బలంగా పడింది... పసిపాప తల నా దృఢమైన దేహాన్ని బలంగా తాకింది. తల పగిలి రక్తం నా ...
READ MORE
అయ్యప్ప గుడిలోకి వెల్లినంతమాత్రాన మహిళా సాధికారత సాధ్యమా..? ఇదేనా మత సామరస్యం.??
అయ్యప్ప స్వామి శబరిమళ అంటే.. కలియుగ ప్రత్యక్ష దైవం అనాది కాలం నుండి అత్యంత పవిత్రంగ కొనసాగుతున్న ఆచార సాంప్రదాయాలకు నిలయం, భక్తులు మండలి అనగా 41 రోజులు ఎంత కఠినంగ దీక్ష చేస్తారో ఆ స్వామి కి అంత ...
READ MORE
శ్యాంప్రసాద్ ముఖర్జీ.. ఆయన ఇచ్చిన పోరాట స్పూర్తి మనకు ఆదర్శం కావాలి..
జిన్నా భారత దేశాన్ని విభజించి పాకిస్తాన్ ఏర్పాటు చేశాడు.. కానీ పాకిస్తాన్ ఏర్పడక ముందే దాన్ని చీల్చాడో నాయకుడు.. ఈనాడు పశ్చిమ బెంగాల్, పంజాబ్ (తూర్పు) రాష్ట్రాలు భారత దేశంలో భాగంగా ఉన్నాయంటే అది ఆ మహా నాయకుని పుణ్యమే.. భారత ...
READ MORE
డెత్ టైమ్ చెప్తామంటున్న శాస్త్రవేత్తలు.
అనూహ్య నిర్ణయాలతో దుమ్ము రేపుతున్న నరేంద్ర మోడి, అయోమయంలో ప్రతిపక్షాలు.!!
హిందూ బ్రాహ్మిన్ అమ్మాయైతే 5లక్షలు, సిక్కు అమ్మాయైతే 7లక్షలు..??
60 ఏండ్లు పాలించిన నెహ్రూ కుటుంబం.. నేడు దేశంలో అభివృద్ధి
కమల్ హాసన్ కి చిన్న పొలిటికల్ ఝలక్ ఇచ్చిన రజినీకాంత్
గీ రోడ్లపై వెల్తే.. చేరేది ఇంటికా నరకానికా.??
మొన్న భూటాన్ ను కాపాడి.. నేడు భూటాన్ బుల్లి యువరాజును
కనకదుర్గ కాపురం కూలిపోవడానికి కారణం ఎవరు..??
తాజ్ మహలా.? తేజో మహాలయనా.?? ఏది నిజం.!!
కోమటోల్లలో ఐక్యత లోపించిందా.? లేక ఇదే వారి జీవన విధానమా.??
సమాజ శ్రేయస్సే కుటుంబ శ్రేయస్సుగా భావించే ఆదర్శనీయుడికి జన్మధిన శుభాకాంక్షలు.
“జబర్థస్త్” షో ప్రేక్షకులకోసమా.. మెగా ఫ్యామిలీకి చెక్క భజన చేయడానికా.?
నరేంద్ర మోడి క్యాబినేట్ లో తెలంగాణ నుండి ఎవరికి అవకాశం..?
ఒకేదారిలో భిన్న దృవాలు.. సొంత పార్టీకే అర్థం కాని ఎత్తులతో
బాహుబలి2 కి పవర్ స్టార్ పవన్ కళ్యాన్ స్పూర్తి..
కన్న తల్లి బంధానికి అర్థాన్ని మార్చేసిన దుర్మార్గురాలు.!!
నవ భారత్ సాధనలో బీజేపీ…
జగమంత కుటుంబం నాది.. మానవత్వ జీవితమే నాది..
మేడ్చల్ టీఆర్ఎస్ టిక్కెట్ కన్ఫం చేసిన కేసిఆర్..? ఎవరో తెలుసా..??
సర్వ్ నీడ్.. దేశానికి కావాల్సిన.. దేశం కోరుకుంటున్న ఓ యువకుని
హిందువుల ఓట్లకోసమా..హిందుత్వంలోకి మారడం కోసమా.. మతం మారనున్న జగన్.?
చిన్నారి మృత్యుపయనం..
అయ్యప్ప గుడిలోకి వెల్లినంతమాత్రాన మహిళా సాధికారత సాధ్యమా..? ఇదేనా మత
శ్యాంప్రసాద్ ముఖర్జీ.. ఆయన ఇచ్చిన పోరాట స్పూర్తి మనకు ఆదర్శం
Facebook Comments
Top
error: Content is protected !!