You are here
Home > అంతరంగం > సర్వ్ నీడ్.. దేశానికి కావాల్సిన.. దేశం కోరుకుంటున్న ఓ యువకుని స్వచ్చమైన సేవ..

సర్వ్ నీడ్.. దేశానికి కావాల్సిన.. దేశం కోరుకుంటున్న ఓ యువకుని స్వచ్చమైన సేవ..

దేశానికి కావాల్సిన.. దేశం కోరుకుంటున్న ఓ యువకుని స్వచ్చమైన సేవను మా వంతుగా జనానికి చెప్పే అవకాశం  దక్కింది. నిజానికి ఈ ఆర్టికల్  కాపి కొట్టకూడదని అనుకున్నా.. కానీ మాకంటే ముందే ఈ ఆర్టికల్ ను గొప్పగా రాసిన ఛాయ్ బిస్కెట్ వాళ్లను అనుసరించడం తప్ప అంతకంటే గొప్పగా మేం రాసిన కాపినే అవుతుందని నమ్మి వాళ్ల అక్షరాలను మా పవర్ లో చూపిస్తున్నాం. కాపి చేయడం తప్పైతే మన్నిస్తారని. సర్వ్ నీడ్… సాయం కోసం సాయం.. మనిషిలో మనిషిని చూడమంటున్న ఓ యువకుని స్పూర్తిని తప్పక చదువుతారని.. పది మందికి చెపుతారని ఆశీస్తూ…


గౌతమ్ లక్ష్యం ఏంటి అంటే ఒక్కటే.. ఈ దేశంలోనే కాదు యావత్ ప్రపంచంలోనే ఏ ప్రాణి ఆకలితో చనిపోకూడదు, ఏ ఒక్కరూ అనాధగా బ్రతకకూడదు, అలాగే చావకూడదు కూడ.. అంతవరకు తన ప్రయాణం కొనసాగుతుంది.. అప్పటి వరకు దాతల ప్రేమను పేదలకు అందించడానికి అతని చేయి ఎప్పుడు నిజాయితీతో సిద్ధంగా ఉంటుంది. మానవత్వాన్ని యువ సత్తాలో చూపిస్తున్న దేశం మెచ్చిన.. దేశానికి కావాల్సిన యువకుడతను.

కొన్ని సంవత్సరాల క్రితం గౌతమ్ ఇంకా అతని టీం సభ్యులు ఒక కాలనీకి వెళుతుండగా ఒక చెత్తకుండి పక్కన ఒక వ్యక్తి పడుకుని ఉండడం గమనించారు. అతని దగ్గరికి వెళ్తుంటే 50ఫీట్ల దూరం నుండే విపరీతమైన వాసన వస్తుంది. బహుశా టాయిలెట్ చేసుకున్నాడేమో అని అతని దగ్గరికి అతికష్టం మీద వెళ్ళారు. నిండా దుప్పటి కప్పుకుని ఎముకలు స్పష్టంగా కనిపించే అతని శరీరాన్ని పరీశీలిస్తే అక్కడ ఒక భయంకరమైన దృశ్యం కనిపించింది. చనిపోయిన తర్వాత శరీరాన్ని తినే పురుగులు బ్రతికుండగానే అతనిని తింటున్నాయి. గౌతమ్ కి ఏడుపు కూడా రాలేదు.. ఈ ప్రపంచంలో ఉన్న జాలి, బాధ, వాత్సల్యం, ప్రేమ ఒక్కసారిగా అతని హృదయంలో నిండిపోయింది. దగ్గరికి రావడానికే భయపడే సంధర్భంలో ఉన్న ఆ ముసలి వ్యక్తిని గర్భగుడిలో ఉన్న దైవాన్ని శుభ్రపరిచినట్లు అతని శరీరాన్ని కడిగాడు. 5రోజులు కష్టపడి డాక్టర్ సహాయంతో ఆ పురుగులను తీసివేశాడు.. ఇంకో వారంలో చనిపోయే వ్యక్తిని లక్షా యాబైవేల రూపాయల(దాతల సాయం) తో ట్రీట్మెంట్ అందించి బ్రతికించాడు. అలా ఒక్కరిని కాదు దిక్కుమొక్కులేని 90ప్రాణాలను కాపాడిన మనిషి దేవుడు గౌతమ్(9550335994).


గౌతమ్ తండ్రి దేశ సరిహద్దులో ఉంటు దేశ ప్రజలకు రక్షణ ఇచ్చే సైనికుడు. ఆర్ధిక పరిస్థితుల మూలంగా గౌతమ్ 10వ తరగతి వరకే చదువుకున్నాడు. ఇక అప్పటినుండి కుటుంబం కోసం ఉద్యోగం చేస్తూ ఓపెన్ యూనివర్సిటీలో ఎం.సి.ఏ వరకు చదివాడు. మాటలతో వర్ణించలేని అత్యంత బాధాకర సంఘటనలను చూసి చలించిపోయి ఒక సంస్థను ప్రారంభించాలనుకున్నాడు.. మనం మారితే ప్రపంచమే మారుతుంది, ఐతే మనం మారడంతో పాటు మనుషులను కూడా మనలాగే మార్చితే ఈ ప్రపంచం వేగంగా మారుతుంది అని గౌతమ్ బలంగా నమ్ముతాడు. గౌతమ్ మొదట Serve Needy(NGO) సంస్థను ప్రారంభించినప్పుడు అందరూ ఎగతాళి చేశారు.. ఫొటోలకు ఫోజులివ్వడానికే ఈ నటనంతా అని గేలి చేశారు, అది విని గౌతమ్ మనసు చాలా బాధపడింది. కాని ఎన్నిరకాల విమర్శలు రానీ.. మనం చేసే సేవలో ప్రేమ, నిజాయితీ ఉంటే ఎక్కడైన, ఏ రకంగానైన మనల్ని ఎవ్వరూ ఆపలేరు అని గౌతమ్ తన సేవలను కొనసాగించాడు. విమర్శించిన వారే ఇప్పుడు ఆత్మీయంగా ఈ సంస్థకు విరాళాలు అందిస్తున్నారు ఇంతకంటే వారిపైన నిజమైన గెలుపు ఉంటుందా..

మనలో చాలామందికి పేదవారికి సహాయం చేయాలని ఉంటుంది కాని టైం లేకపోవడం వల్లనో, లేదంటే మరే ఇతర కారణం వల్లనో చేయలేకపోతుంటాం.. ఇలాంటి వారికి Serve Needy ఒక వారధిగా పనిచేస్తుంది. పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు, రెస్టారెంట్లు మొదలైన అన్ని ప్రదేశాలలో కలిపి మన హైదరాబాద్ లో రోజుకు 2టన్నుల ఆహారం వృధా అవుతుంది, 2 టన్నులు అంటే 5లక్షలమంది ఆకలి తీర్చవచ్చు. ఆహారం ఇంకొకరిని కాపాడడానికి ఉపయోగించాలి ఇలా వృధా కాకూడదని ఫంక్షన్ హాల్, రెస్టారెంట్లను ప్రత్యేకంగా కలిసి “మిగిలిపోయిన ఆహారాన్ని మేము పేదలకు అందజేస్తాం, రోజుకు ఎంతోమంది పేదలు ఆకలితో పస్తులుంటున్నారని” వివరించి ఆహార భద్రత ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు.

ఇలా ప్రతిరోజు హైదరాబాద్ లో 200 నుండి 500మంది వరకు ఆకలి తీరుస్తున్నారు, ఒక్కోసారి 5,000మంది ఆకలి తీర్చిన రోజులు కూడా ఉన్నాయి. ఇప్పుడు సిటీలో ఎక్కడా ఆహారం మిగిలిపోయినా ముందు Serve Needyకే ఫోన్ కాల్(9550335994) వస్తుంది, అది వారిపై ఉన్న నమ్మకం.


25మంది పిల్లలను Serve Needy పోషిస్తుంది. వీరి చదువులు, ఆరోగ్యం మిగిలిన బాధ్యతలన్ని Serve Needy చూసుకుంటుంది. హైదరాబాద్ ఖార్కానాలో ఉంటున్న వీరిని కలవడానికి వెళ్ళి “పెద్దయ్యాక మీరు ఏం అవుతారంటే ఏ ఇంజనీర్ అనో, డాక్టర్, పోలీస్ అని కాదు గౌతమ్ అన్నలా ఈ సమాజానికి సేవ చేస్తా అంటారు”. అవును.. ఇదే వారి జీవిత లక్ష్యం, నేను మాత్రమే కాదు నాలాంటి వారు మరింతమంది ఈ దేశానికి అవసరం అంటూ మరో 25మంది పిల్లలను చిన్నతనం నుండే సేవాభావాలతో పోషిస్తున్నాడు. ఈ పిల్లలు ఇప్పటినుండే సేవ చేయడం మొదలు పెట్టారు. వారు ఎంతబాగా చదువుతారో అంతే బాగా వంట చేస్తారు.. వారు ఎంత క్రమశిక్షణతో ఉంటారే అంతే ప్రేమ సమాజం పట్ల ఉంటారు. ఏదైనా ఒకరోజు స్కూల్ కి సెలవు వస్తే ఏ సినిమాకో, ఏ టూరిస్ట్ ప్లేస్ కో కాదు “అన్నా.. సెలవు దొరికింది పేదవారికి అన్నం పెడదాం పదా అన్నా” అంటారు వాళ్ళు. ఇంత చిన్న వయసులో ఆ పిల్లలు చేసే సేవకు తోటి పిల్లలు మాత్రమే కాదు పెద్దలు కూడా స్పూర్తి పొందుతున్నారు.


Serve Needy ఒడిలో 25మంది వృద్ధులు ఉన్నారు, వీరి అన్ని రకాల భాద్యతలను ఒక కన్న కొడుకులా గౌతమ్ చూసుకుంటాడు.. అది కాక ఇప్పటికి 100కి పైగా అనాధల అంత్యక్రియలను ఈ Serve Needy జరిపించింది. అంత్యక్రియలు అంటే కేవలం ఏదోరకంగా ఆ ఒక్కరోజు వరకు మాత్రమే అని కాకుండా వారి మత సాంప్రదాయాలకు అనుగూనంగా దహనసంస్కారాలు చేయిస్తారు. వారి బుడిదను పవిత్రమైన నదిలో కలిపి వారి ఆత్మకు శాంతి కలిగేలా పూజలు నిర్వహిస్తారు. బ్రతికున్నంత వరకు మాత్రమే కాదు చనిపోయాక ఆత్మగా కూడా ఆ వ్యకి అనాధ కాదు, ఈ భూమి మీద వారి కోసం మేము ఉన్నాము అని తెలియజేయడమే ఇక్కడ వారి ఉద్దేశం, ఇది మానవత్వానికి మించిన స్థాయి.

ప్రస్తుతం Serve Needy 14రకాల సేవా కార్యక్రమాలు చేస్తుంది. వాడని టాబ్లెట్స్ ను ఉపయోగించుకోవడానికి మెడికల్ బ్యాంక్, పేదలకు బట్టల బ్యాంక్, పిల్లలకు టాయ్స్ బ్యాంక్, క్యాన్సర్, ఏయిడ్స్ లాంటి ప్రాణాంతకమైన పేషెంట్స్ కోసం షెల్టర్, ఆహారం, వైద్యం, వారి తీరని కోరికలను నెరవేర్చడం మొదలైనవి చేస్తుంటారు. ఇలాంటి గొప్ప పనులు చేయడానికి దాతల సహాయం చాలా అవసరం Serve Needy ద్వారా సహాయం చేసే ప్రతిఒక్కరికి వారి డబ్బు, వస్తువులను ఎలా పేదలకు అందజేశారో ఫొటో, వీడియోల ద్వారా చూపిస్తారు.

దాతల సహాయం ద్వారా పేదలు ఎలా ఆనందం పొందుతున్నారో అని చూస్తూ దాతలు ఎంతో ఆనందం పొంది, సేవలో ఇంత ఆనందం ఉంటుందా అని మరింత సేవచేయడానికి ముందుకొస్తుంటారు.

 

Related Posts
దేశ వ్యాప్తంగా పల్స్ పోలియో చుక్కల కార్యక్రమం..చురుగ్గ పాల్గొన్న పౌరులు.!!
ఈరోజు దేశ వ్యాప్తంగా ఐదు సంవత్సరాల లోపు వయసు పిల్లలకు పల్స్ పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమం విజయవంతంగ జరిగింది. ఈ కార్యక్రమం లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడి నుండి పంచాయతి వార్డ్ మెంబర్ వరకు మరియు అందరు అంగన్ ...
READ MORE
ఏబీవీపీ నగర కార్యదర్శిగ పగిడిపల్లి శ్రీహరి
ABVP గ్రేటర్ హైదరాబాద్ మహా సభలను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.ఈ మహా సభలలో గ్రేటర్ హైదరాబాద్ కార్యవర్గాన్ని ఎన్నుకోవటం జరిగింది. గ్రేటర్ హైదరాబాద్ మహా నగర అద్యక్షులు గా ఆచార్య శంకర్ (ఓయూ అధ్యాపకులు ) గ్రేటర్ హైదరాబాద్ మహా ...
READ MORE
సర్జికల్ స్ట్రైక్ 2 ఎఫెక్ట్.. ABVP ఆధ్వర్యంలో ఘనంగ విజయోత్సవాలు.!!
పుల్వామా ఉగ్ర దాడికి ప్రతీకారంగ నేడు పాకిస్తాన్ పై భారత్ జరిపిన వైమానిక దాడి విజయవంతం కావడంతో.. దాదాపు 400 మంది పాకిస్తాన్ ఉగ్రవాదులు హతం కావడంతో దేశ వ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి.ఈ క్రమంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ...
READ MORE
ఔదార్యం చాటుకున్న మంత్రి జగదీశ్వర్ రెడ్డి..
విజయవాడ హైదారాబాద్ జాతీయ రహాదారి మీద  రోడ్ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. అదే సమయంలో అటు నుండి వెళుతున్న తెలంగాణ రాష్ట్ర మంత్రి జగదీశ్వర్ రెడ్డి తన ...
READ MORE
కాళ్లు మొక్కినా.. చివరకు పెట్రోల్ పోసి అంటించినా మారని రెవెన్యూ లంచగొండులు.!!
ప్రభుత్వ కార్యాలయం అంటేనే సామాన్యుడు భయపడతాడు. కారణం.. అక్కడ ఏ పని కావాలన్నా ముడుపులు సమర్పించుకోవాల్సిందే, లేదంటే అనుకున్న పని జరగడం జరగదు.ఈ అభిప్రాయం దాదాపు జనాల్లో ఉంది. ఇక రెవెన్యూ డిపార్ట్మెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.లంచాలు తీసుకోవడం ...
READ MORE
అభావిప జాతీయ నాయకులు రచ్చ శ్రీనివాస్ కి జన్మధిన శుభాకాంక్షలు.!!
ప్రముఖ జాతీయవాది అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ జాతీయ కార్యాలయ ఇంఛార్జ్ ముంబై కేంద్రం రచ్చ శ్రీనివాస్ జన్మదినం సంధర్భంగ ఆయనకి అందరి నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నై. రచ్చ శ్రీనివాస్ క్రింది స్థాయి నుండి ఎదిగిన నేత. పాలమూరు జిల్లా కు ...
READ MORE
కన్నీళ్లు తుడిచిన ఖాకీలు.. దగ్గరుండి ఆడబిడ్డ పెళ్లి చేసిన కరీంనగర్ పోలీసులు.
ఖాకీలంటే కర్కశత్వం కాదు మానవత్వం అని నిరూపించారు కరీంనగర్ పోలీసులు. మాలో కూడా మనసున్న మారాజులున్నారు అని తెలిసేలా ఓ తండ్రిలేని ఆడబిడ్డకు అన్ని తామై దగ్గర ఘనంగా పెళ్లి చేశారు. అందరి చేత శబాష్ పోలీస్ అనిపించుకుంటున్నారు. కరీంనగర్ జిల్లా రామడుగు ...
READ MORE
పేదలంటే ఈ సృష్టికి చులకనే: దాయి.శ్రీశైలం
పేదలంటే పెద్దలకేకాదు ఈ భూతల్లికి.. ఆ ఆకాశానికి.. నడిమనే నడిచే సమాజానికి అందరికి లోకువనే. రోజు రోజుకు పెరిగిపోతున్న పేదరికాన్ని అడ్డుకునే సాహసం చేసినా విజయం కూడా పేదరికం వైపే నిలబడుతుంద ని సర్వేలు చెపుతున్న నిజాలు. ఆకలి కూడా పేదరికాన్ని ...
READ MORE
కరోనా వ్యాప్తి కి తమవంతు కృషి చేస్తున్న రాజకీయ నేతలు..!!
తెలుగు రాష్ట్రాలలో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. రోజు రోజుకు వేళల్లో కేసులు నమోదు అవుతున్నాయి.. రోజు కు ఎన్ని పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి.. ఎంత మంది బాధితులు మరణిస్తున్నారు అనే లెక్కలు వేసుకునే పరిస్తితి కూడా దాటి ...
READ MORE
మదరసాల్లో గాయత్రీ మంత్రం.. దేవ భూమి విలువ చాటుతున్న ఏక‌త్వంలో భిన్న‌త్వం..
మ‌ద‌ర్సా ఈ పేరు విన‌గానే మ‌తం మాత్ర‌మే గుర్తుకు రావ‌డంలో త‌ప్పులేదు. అక్క‌డి బోధ‌న అలా ఉంటుంద‌ని అనుకోవ‌డం లో కూడా త‌ప్పు లేదు. కానీ నిజానికి మ‌ద‌ర్సా అంటే అది కాద‌ని చెపుతున్నాయి నిజ‌మైన మ‌ద‌రసాలు. అస‌లు మ‌ద‌ర‌సా అంటే ...
READ MORE
తలదించుకునేలా బూతు సైట్లు… అంతకుమించి అంటున్న ప్రముఖ ఛానళ్లు.
ఓ ప్రముఖ ఛానల్ హస్యం అంటూ అడ్డ మైన బూతులతో ఓ ప్రోగ్రాం ను ప్రారంభించింది.. యావత్ ప్రపంచం ఇదే ప్రోగ్రాం ని గుడ్లప్పగించుకుని చూస్తోంది. న భూతే న భవిష్యత్ అంటూ దూసుకుపోతున్న ఈ ప్రోగ్రాం అమ్మనాన్న అక్క చెల్లి ...
READ MORE
కేరళ వరద బాధితులకు ఆపన్న హస్తం అందిస్తున్న ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు.!!
దేవ భూమిగ పేరుగడించిన కేరళ రాష్ట్రాన్ని వరుణుడు గజ గజ వణికించేస్తున్నాడు. ఏమాత్రం కనికరం చూపకుండ వరదలతో రాష్ట్రాన్ని మొత్తం అతలాకుతలం చేస్తున్నాడు. ఆఖరికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిగ్గు విడిచి చేసేదేం లేక మమ్మల్ని ఆదుకోండని ఇతర రాష్ట్రాలను వేడుకునేంత వరకొచ్చిందంటే ...
READ MORE
వాణిజ్య విభాగంలో రాజేంద్రప్రసాద్ కు డాక్టరేట్.!!
తెలంగాణ ఉద్యమకారుడు ఏబీవీపీ నాయకుడు రాజేంద్రప్రసాద్ కు వాణిజ్య విభాగంలో పరిశోధనలకు గాను ఉస్మానియా యూనివర్శిటీ అధికారికంగ డాక్టరేట్ ప్రకటించడం జరిగింది. జాతీయవాద సంస్థ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ లో మంచి విద్యార్థి నాయకుడిగా పేరు తెచ్చుకున్న రాజేంద్రప్రసాద్ తెలంగాణ సాధన ...
READ MORE
ఆద‌ర్శ రైతుకు అరుదైన‌ అవార్డ్.. సీఎం కేసీఆర్ కు వ్యవసాయ నాయకత్వ అవార్డు.
ఉద్య‌మ నాయ‌కుడు స్వ‌యంగా రైతుగా విజ‌యాలు అందుకున్న తెలంగాన ముఖ్య‌మంత్రికి మ‌రో అరుదైన గౌర‌వం ద‌క్కింది. భారత ఆహార, వ్యవసాయ మండలి ఆయనను ప్రతిష్టాత్మకమైన అగ్రికల్చర్ లీడర్ షిప్-2017 అవార్డుకు ఎంపిక చేసింది. కేసీఆర్ అంటే ఫాం హౌజ్, ఫాం హౌజ్ ...
READ MORE
సుప్రీంకోర్టు ఎవరికోసమైతే తీర్పు చెప్పిందో.. వారే తీర్పును వ్యతిరేకిస్తున్నారు.!!
తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన శబరిమల ఆలయంలోకి ఏ వయసు మహిళ అయినా ప్రవేశించొచ్చనే తీర్పు దేేసవ్యాప్తంగ తీవ్ర దుమారం రేపుతోంది. ఈ తీర్పుతో మహిళ కు సమాన హక్కు లభించిందని వ్యాఖ్యానించింది సుప్రీంకోర్టు. అయితే.. శతాబ్దాల కాలం నుండే ఆలయంలో నియమ ...
READ MORE
పాకిస్తాన్ లో హిందూ బాలికలకు రక్షణ కరువు, మరో బాలికపై అఘాయిత్యం.!!
పాకిస్తాన్ లో ఇప్పటికే హిందూ బాలికలను బలవంతంగ మతాలను మార్చి అఘాయిత్యాలకు పాల్పడుతున్న ఘటనలు చాలా చూసాం. తాజాగా ఇలాంటి ఘటన మరొకటి వెలుగు చూసింది.13 సంవత్సరాల బాలిక పై ఇద్దరు దుర్మార్గులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. పాకిస్తాన్ లో ని సింధ్ ...
READ MORE
తెలంగాణ అభివృద్దిలో మేముసగం..
తెలంగాణ అభివృద్దిలో మహిళా సాదిరతే ధ్యేయంగా పాలన సాగుతుంది. ఇందులో భాగంగానే ప్రతి విభాగం నుండి మహిళా మణులు తమ సత్తాను చాటుకుంటున్నారు. గ్రామీణ స్థాయి నుండి రాష్ట్ర రాజదాని వరకు.. సర్పంచ్ ల నుండి  కార్పొరేటర్ ల వరకు తమ ...
READ MORE
మాయవుతున్న బుగ్గ కార్ల కథ.. అంతా సమానమే అందరు విఐపిలే.
ప్రజలు, నాయకులు, పాలకులు అందరు సమానమే. ప్రజాస్వామ్య వ్యవస్థలో అందరు వీఐపిలే అందుకే వీఐపిలంతా తమతమ స్టేటస్ చూపించుకునేలా కార్లపై ఉండే బుగ్గలను తొలగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో అధికార దర్పాన్ని ప్రదర్శించడానికి ఏ చిన్న అవకాశం వచ్చినా వదులుకోవడానికి ...
READ MORE
అంబేద్కర్ చూపిన మార్గం ఇదేనా…?
"డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భౌతికంగా దూరమై ఏడు దశాబ్దాలు గడచినా, ఆయన రగిలించిన స్పూర్తి ఇంకా కొనసాగుతోంది. బడుగు బలహీన వర్గాలు తమకు న్యాయంగా దక్కాల్సిన హక్కుల కోసం పోరాడి సాధించుకుంటున్నాయి. కానీ ఎక్కడో లోపం జరుగుతోంది. ఈ రోజున బాబాసాహెబ్ ...
READ MORE
అష్టమ వ్యసనం.. స్మార్ట్‌ ఫోన్‌. ఈ వ్యసనం భారీన పడ్డారో ఇక అంతే.
‘‘టెక్నాలజీలు పెరిగి చేతుల్లోకి ఫోన్లొచ్చాక మనుషుల మధ్య దూరం తగ్గాలిగానీ.. ఇలా పెరిగిపోతోందేమిట్రా’’ ఓ ప్రశ్న.. సమాదానం ‘‘తప్పు టెక్నాలజీలో లేదు బాబాయ్‌. దాన్ని వాడే మనుషుల్లోనే ఉంది’’ నిజమే.. తప్పు మనలోనే ఉంది. దాన్ని సరిదిద్దుకోగలిగే తెలివీ మనలోనే ఉంది. ...
READ MORE
ఇదేమి భారతం.. “నీట్” పేరుతో ఇంత నీచపు పనులా..?
నీట్ పరీక్ష.. ఇదేం పరీక్ష. ఇంతకన్న విషమ పరీక్ష మరొకటి ఉంటుందా. ఇంటి బిడ్డలను ఇంత నీచంగా చూసే పరీక్ష నా.. ఇది నీతి గల్ల నీట్ పరీక్షనా.. ఇప్పుడు సోషల్ మీడియా లో నీట్ పరీక్ష నిర్వహణపై యావత్ భారతం ...
READ MORE
దేశం కంటే కూడా తెలంగాణ లో మూడు రెట్లు అధికంగా కరోనా కేసులు నమోదు.
కరోనా వైరస్ పై దేశ వ్యాప్తంగా విడుదలైన వివరాలను చూస్తే, తెలంగాణ ప్రజలు ఎంత ప్రమాదంలో ఉన్నారో బహిర్గతం అవుతున్నది. దేశవ్యాప్తంగా నమోదు అవుతున్న కరోనా కేసుల కంటే తెలంగాణలో నమోదవుతున్న కేసుల సంఖ్య మూడు రెట్లు అధికంగా ఉండడం సంచలనంగా ...
READ MORE
వందే భారత్ ట్రైన్ పై కుట్రలెందుకు.. దేశం అభివృద్ధి చెందకూడదా.??
భారత ప్రధాని నరేంద్ర మోడి కలల ప్రాజెక్ట్ ఎంతో ప్రతిష్టాత్మకంగ పూర్తిగ దేశీయ టెక్నాలజీ తో నిర్మితమైన గంటకు 180km వేగంతో దూసుకెల్లే వందే భారత్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ పూర్తైన సంధర్భంగ దేశంలో కొందరు దేశ ద్రోహులకు కడుపు మంట ...
READ MORE
మళ్లీ మొదటికొచ్చిన పంచాయితీ.. గ్రూప్ 2 విషయంలో మౌనంవహిస్తున్న టీఎస్పీఎస్సీ.
ఎంసెట్.. సింగరేణి అసిస్టెంట్ పోస్టులు.. పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు.. తాజాగా గ్రూప్ 2. ఉద్యోగం ఏదైనా ప్రభుత్వ మీద నింద మాత్రం పడకుండా పోవడం లేదు. నిష్పక్షపాతంగా నిర్వహించామని డబ్బా కొట్టుకుంటున్న టీఎస్పిఎస్సీ గ్రూప్ 2 విషయంలో అవకతవకలు జరిగాయని వాదిస్తున్నా ...
READ MORE
లాక్ డౌన్ నేపథ్యం లో అన్నార్తులకు అన్నం పెట్టిన డా.లక్ష్మన్.!!
రాబోయే 15వ తేదీ వరకు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన నేపథ్యం లో ఎటువంటి ఆసరా లేని అభాగ్యులకు ఫడ్ ప్యాకెట్లు పంచి వారి ఆకలిని తీర్చారు తెలంగాణ బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు ముషీరాబాద్ మాజీ ఎమ్మెల్యే డా.లక్ష్మన్.ఇక ...
READ MORE
దేశ వ్యాప్తంగా పల్స్ పోలియో చుక్కల కార్యక్రమం..చురుగ్గ పాల్గొన్న పౌరులు.!!
ఏబీవీపీ నగర కార్యదర్శిగ పగిడిపల్లి శ్రీహరి
సర్జికల్ స్ట్రైక్ 2 ఎఫెక్ట్.. ABVP ఆధ్వర్యంలో ఘనంగ విజయోత్సవాలు.!!
ఔదార్యం చాటుకున్న మంత్రి జగదీశ్వర్ రెడ్డి..
కాళ్లు మొక్కినా.. చివరకు పెట్రోల్ పోసి అంటించినా మారని రెవెన్యూ
అభావిప జాతీయ నాయకులు రచ్చ శ్రీనివాస్ కి జన్మధిన శుభాకాంక్షలు.!!
కన్నీళ్లు తుడిచిన ఖాకీలు.. దగ్గరుండి ఆడబిడ్డ పెళ్లి చేసిన కరీంనగర్
పేదలంటే ఈ సృష్టికి చులకనే: దాయి.శ్రీశైలం
కరోనా వ్యాప్తి కి తమవంతు కృషి చేస్తున్న రాజకీయ నేతలు..!!
మదరసాల్లో గాయత్రీ మంత్రం.. దేవ భూమి విలువ చాటుతున్న ఏక‌త్వంలో
తలదించుకునేలా బూతు సైట్లు… అంతకుమించి అంటున్న ప్రముఖ ఛానళ్లు.
కేరళ వరద బాధితులకు ఆపన్న హస్తం అందిస్తున్న ఆర్ఎస్ఎస్ స్వయం
వాణిజ్య విభాగంలో రాజేంద్రప్రసాద్ కు డాక్టరేట్.!!
ఆద‌ర్శ రైతుకు అరుదైన‌ అవార్డ్.. సీఎం కేసీఆర్ కు వ్యవసాయ
సుప్రీంకోర్టు ఎవరికోసమైతే తీర్పు చెప్పిందో.. వారే తీర్పును వ్యతిరేకిస్తున్నారు.!!
పాకిస్తాన్ లో హిందూ బాలికలకు రక్షణ కరువు, మరో బాలికపై
తెలంగాణ అభివృద్దిలో మేముసగం..
మాయవుతున్న బుగ్గ కార్ల కథ.. అంతా సమానమే అందరు విఐపిలే.
అంబేద్కర్ చూపిన మార్గం ఇదేనా…?
అష్టమ వ్యసనం.. స్మార్ట్‌ ఫోన్‌. ఈ వ్యసనం భారీన పడ్డారో
ఇదేమి భారతం.. “నీట్” పేరుతో ఇంత నీచపు పనులా..?
దేశం కంటే కూడా తెలంగాణ లో మూడు రెట్లు అధికంగా
వందే భారత్ ట్రైన్ పై కుట్రలెందుకు.. దేశం అభివృద్ధి చెందకూడదా.??
మళ్లీ మొదటికొచ్చిన పంచాయితీ.. గ్రూప్ 2 విషయంలో మౌనంవహిస్తున్న టీఎస్పీఎస్సీ.
లాక్ డౌన్ నేపథ్యం లో అన్నార్తులకు అన్నం పెట్టిన డా.లక్ష్మన్.!!
Facebook Comments

Leave a Reply

Top
error: Content is protected !!