You are here
Home > తాజా వార్త‌లు > నిరుద్యోగ తెలంగాణగా మారుస్తున్నదెవరు..? కోర్టు మెట్లెక్కుతున్న కేసులా..? ప్రభుత్వ రాతలా..?

నిరుద్యోగ తెలంగాణగా మారుస్తున్నదెవరు..? కోర్టు మెట్లెక్కుతున్న కేసులా..? ప్రభుత్వ రాతలా..?

జర్నలిజం ఎప్పుడో గాడి తప్పిందని సీనియర్ మేదావులు డంకా బజాయించి చెపుతునే ఉన్నారు. అయినా మార్పు అటు వైపే.. రాను రాను రాజు గుర్రం గాడిదల మారిపోతునే ఉంది. ఇక్కడ ఈ మాటను నచ్చని వాళ్లు తప్పు పట్టవచ్చు.. ఇక్కడ ఈ మాటకు తెలంగాణ నిర్మాణంలో మూడేళ్ల పాలనలో నిరుద్యోగుల్లో వ్యక్తమవుతున్న వ్యతిరేకతకు సంబంధం ఏంటనే కదా..? పెట్టిన టైటిల్ కి చెపుతున్నదానికి పూర్తి క్లారిటి రావలంటే ఆర్టికల్ దయచేసి పూర్తిగా చదవండి.

కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కొట్లాడిన ఉద్యమ కారులు ఇంకా ఉద్యమం చేస్తునే ఉన్నారు. ఉద్యమాలకు అడ్డు పడ్డ వారు మాత్రం నాయకులుగా అదే ఉద్యమ నాయకుల పక్కన పదవుల్లో నిలుచుంటున్నారు. కానీ ఉద్యమాల్లో ఉక్కు సంకెళ్లను తెంచుకున్న విద్యార్థులు మాత్రం నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. కాకీ లెక్కలు అనవసరం.. వీళ్లు అడ్డు పడ్డారు వారడ్డుపడ్డరన్న డొంక తిరుగుడు సమాదానాలు సైతం అనవసరం. నిజమైన తెలంగాణ ముద్దు బిడ్డలుగా ఒక్క సారి గుండెల మీద చేతులేసుకుని చెప్పండి అసలు మీరు చేస్తున్న పాలన ఎవరికోసం.. చేస్తున్న మంచి భూతద్దంలో చూడాల్సి వస్తుంటే.. చేస్తున్న చెడు వేల కిలోమీటర్ల మేర నుంచి చూసిన భూతద్దం అవసరం లేకుండానే పెద్దగా కనిపిస్తోంది. ఇది నిజం కాదా..? అయితే ఈ కింది ఆర్టికల్ లోకి ఓ సారి తొంగి చూడండి. జర్నలిజం రాతాలకి.. తెలంగాణ నిరుద్యోగానికి ఎక్కడ లింకుందో.. అబద్దపు రాతలేవో మీకే తెలుస్తది.

2014 జూన్ రెండో తేదీన తెలంగాణ ఆవిర్భావం.. రాష్ట్ర సాధనకు ఉద్యమించిన టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తొలి సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తరుణం ఎన్నో ఆశల నడుమ తెలంగాణ నిరుద్యోగులు కళ్లల్లో వెలుగులు నిండిన సమయం..


అధికారంలోకి రాగానే ఉమ్మడిగా విద్యాసంస్థల్లో అడ్మిషన్ల పేరిట ఏపీ ఆధిపత్యానికి తెర దించడానికి దిగ్విజయంగా ప్రయత్నాలు ఫలించాయి. ఇష్టారాజ్యంగా నీళ్ల మళ్లింపునకు తెర దించింది. ఇక అత్యంత కీలకమైన నియామకాల ప్రక్రియ పూర్తి చేయడానికి ప్రారంభంలో రెండు రాష్ట్రాల ఉద్యోగుల విభజన అడ్డం అన్న అభిప్రాయం స్పష్టంగా కనిపించింది. తెలంగాణ ఏర్పాటైన తర్వాత కాల క్రమంలో అప్పుడే మూడేళ్లు గడిచిపోయాయి. కానీ ఉద్యోగాల ఊసేది..? నిరుద్యోగుల్లో కమ్ముకుంటున్న చీకట్లకు భరోషా ఏది.

అసెంబ్లీ సాక్షిగా సీఎం చంద్రశేఖర్ రావు లక్షా ఏడు వేల ఉద్యోగాలు కల్పిస్తామని నిరుద్యోగ యువతలో ఆశల ఆకాంక్షలు రేకెత్తించారు. ఆచరణలో మాత్రం ఏడు నుంచి ఎనిమిది వేల మందికి మాత్రమే ఉద్యోగాలు లభించాయి. మరో ఏడెనిమిది వేల ఉద్యోగ నియామకాలకు ఇంటర్వ్యూలు పూర్తయ్యాయి గానీ నియామక ప్రక్రియ జరుగలేదు.  తాజాగా మరో 18 వేల కానిస్టేబుల్ ఉద్యోగాలంటూ మరో ప్రకటనతో ఆశలు రేపుతోంది. మంచిదే మరి పాత లెక్కల సంగతేంటి. కొత్త భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రభుత్వం ముందే ఇచ్చిన పది వేల మంది పోలీసు అభ్యర్థుల శిక్షణ మాటేమిటి చెప్పటం లేదు..?

ఇక డీఎస్సీ.. ఈ నోటిఫికేషన్ గురించి ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిదేమో.. మూడొచ్చినప్పుడల్లా ముద్దు ముద్దు మాటలన్నట్టు ఈ మూడేళ్లలో డీఎస్సీ త్వరలో అన్న ప్రకటనలు వందకు పైనే వినిపించాయి. ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి, ఐటీ శాఖ మంత్రి చివరికి అటవీ శాఖ మంత్రి కూడా డీఎస్సీ ప్రకటనలు చేశారు. కానీ ఇప్పటికి డీఎస్సీ మోక్షం లేదు. తెలంగాణలో అక్షరాస్యత రోజు రోజుకు పడిపోతోందని గణాంకాలు చెపుతున్నాయి. ప్రభుత్వ పాఠశాళను మూసేసి విద్యార్థులను నడి రోడ్డు పాలు చేస్తున్నరన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీన్ని ఎదుర్కోనేందుకు గురుకులాలను తెరపైకి తెచ్చారన్న వాదనలు వినిపిస్తున్నాయి. గురుకుల రాక మంచిదే కానీ ప్రభుత్వ పాఠశాలల పరిస్థితేంటి..? డీఎస్సీ కోసమే ఎదురు చూస్తున్న తెలుగు మీడియం నిరుద్యోగ టీచర్ల మాటేంటి.

పోలీస్ శాఖ ను మరింత బలోపేతిం చేసేందుకు ఆగమేఘాల మీద నోటిఫికేషన్ లు ఇస్తున్న ప్రభుత్వానికి నోటిఫికేషన్లో తప్పులు లేకుండా చూడలన్నా ఆలోచన లేదా.. ఇంతకుముందు చేపట్టిన పది వేల మంది కానిస్టేబుళ్ల ఎంపిక తీరుపై కొందరు హైకోర్టు మెట్లెక్కారు. ఈ మాట కొస్తే తెలంగాణ సర్కార్ విడుదల చేసిన ఏ నోటిఫికేషన్ కూడా కోట్లు మెట్లెక్కకుండా దిగ్విజయంగా ముందుకు వెళ్లిన పరిస్థితి లేదు. కానిస్టేబుళ్ల శిక్షణ విషయంలో అనుమతి ఇచ్చిన న్యాయస్థానం తమ తుది ఆదేశాలకు లోబడి వ్యవహరించాల్సి ఉంటుందని పేర్కొన్నది. ఇక గ్రూప్ – 2 ఉద్యోగ నియామకాలకు నిర్వహించిన పరీక్షలో 15 ప్రశ్నలు రద్దు చేయాల్సి వచ్చింది. ఈ నోటిఫికేషన్ సైతం హైకోర్టు మెట్లెక్కి గ్రూప్స్ లో విజేతలుగా నిలిచిన నిరుద్యోగులని సందిగ్దం లో పడేసింది. ఇక కోర్టులు మెట్లుక్కుతున్న విషయాన్ని ఇంటి పత్రిక రాసిన విదానం అభ్యతరకరమే. ఈ విషయంలో పత్రిక ప్రజలు,  నిరుద్యోగుల వైపు నుంచి కాక ప్రభుత్వ వైపు నుంచి ప్రభుత్వాన్ని కాపాడే వైపుగా అక్షరాలకే బాధ కల్పించేలా రాతలు రాసింది.

ఇక నియమకాల విషయంలో కోర్టు మెట్లు ఎందుకు ఎక్కుతున్నారో అన్న విషయంలో ఇంటి పత్రిక విమర్శలు గుప్పించిన తీరు ఇప్పుడు మన అనుకున్న పత్రికను దూరం పెట్టేలా చేసింది. ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ ఇవ్వడం ఆలస్యం.. ఆ వెంటనే కొందరు కోర్టుల్లో పిటిషన్లతో ప్రత్యక్షమవ్వడం.. ఉద్యోగ నియామక పరీక్ష ఫలితాలు వచ్చిన గంటల్లో సాకులు వెతికి మరీ హైకోర్టులో కొర్రీలు పెట్టడం మీద వారిలో అసహనం పెల్లుబుకుతున్నదని ఇంటి పత్రిక విమర్శలు గుప్పించింది. కేవలం తెలంగాణలోని ఉద్యోగాల భర్తీ మీద మాత్రమే ఇలాంటి పిటిషన్లు దాఖలవుతున్నాయని, పక్క రాష్ట్రంలో ఉద్యోగాలిచ్చినా ఇవ్వకున్నా పట్టించుకున్నవారే లేరని ఆ పత్రిక వార్తాకథనం సారాంశం. ఉద్యోగాలు కావాలని ఒక వైపు ఉస్మానియా యూనివర్శిటీలో ర్యాలీలు తీసేవారే..మరోవైపు నోటిఫికేషన్లు రాగానే కోర్టుల్లో కొర్రీలు పెడుతున్నారని దుయ్యబడుతున్నారని ఇంటి పార్టీ పత్రిక రాతాల్లోని వ్యాఖ్యాంశం.

ఇక గురుకుల నోటిఫికేషన్లో లింగ వివక్ష అన్న విషయంలో కోర్టు మెట్లెక్కిన కారణాన్ని తప్పుపడతం వివరణ ఇచ్చిన తీరు ఎంత విడ్డూరంగా ఉందో తెలిసిందే. లోతుల్లోకి వెళ్లడం లేదు సుప్రీంకోర్టు సబర్డినేట్ తీర్పుల విషయం చర్చిండం లేదు. విద్యుత్ శాఖలో 24 వేల మందిని క్రమబద్ధీకరణకు చర్యలు తీసుకుంటున్నదే తప్ప.. ఆచరణలో పూర్తిగా క్రమబద్ధీకరణ జరుగకున్నా జరిగిందని చెప్పడం కూడా ఆ పత్రిక విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఇంతగా ప్రభుత్వం వైపు ఆలోచించిన ఆ సదరు పత్రిక ఒక్క సారి ఒకే ఒక్క సారి నిరుద్యోగుల వైపు నుంచి ఆలోచిస్తే బాగుండేది. ఒక్క ఓయూలోనే కాదు తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వంపై ఎదరవుతున్న వ్యతిరేకతను అర్థం చేసుకుని రాస్తే బాగుండేది. ఎంతైనా మళ్లీ ఎన్నికల ముందు అన్ని అనుకూలంగా చూసుకుని భారీ ఉద్యోగ ప్రకటన ఇచ్చి ఇన్నాళ్ల నిరుద్యోగుల కోపం,  ఆవేశాన్ని ప్రేమగా చల్లారుస్తారన్నది కూడా వాస్తవమే కానీ ఇంకా ఏడాదిన్నర వరకు నిరుద్యోగ యువత చస్తూ బ్రతకాల్సిందేనా.. ఇంకా కల్లబొల్లి మాటలు నమ్ముతూ ఉద్యోగాల వేటలో వయసును కరిగించుకోవాల్సిందేనా.. సదరు ఇంటికి పత్రిక గుర్తిస్తే మంచిదేమో. ప్రభుత్వ తీరు మారాలని చెప్పడంలే ఒక్క సారి నిరుద్యోగుల వైపు నుండి నిజాయితిగా ఆలోచించమని కోరుతున్నాం.

Related Posts
మహనీయుల జయంతి సందర్భంగా సెలవులు అవసరమా…?
గాంధీ జయంతి సెలవు.. గాంధీ వర్దంతి సెలవు అంబెద్కర్ జయంతి సెలవు.. అంబెద్కర్ వర్దంతి సెలవు.. సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ ల నుండి మొన్నటి అబ్దుల్ కలాం జీ వరకు మహనీయుల పుట్టిన రోజులు.. అమరులైన రోజులు ప్రభుత్వాలకు సెలవు. ...
READ MORE
రేవంత్ వెళుతున్నాడంటా..? ఇక మ‌న ప‌ని అంతేనా..?
ఫైర్ బ్రాండ్ తెలంగాణ‌ ప‌సుపు ద‌ళంకు మిగిలిన ఒకే ఒక్క నాయ‌కుడు. మంచి వాక్చాతుర్యం అంత‌కు మించి కేసీఆర్ అంటే పీక‌ల దాక ఉన్న కోపం ప‌లు పార్టీల‌కు ప్రాణం పోస్తుంది. ఇక రేవంత్ రెడ్డి కండువా మార్చ‌డం ఖాయం అని ...
READ MORE
పౌరసత్వ బిల్లు పాసవడంతో పాకిస్తాన్ హిందువుల హర్షం..!!
పౌరసత్వం బిల్లు చట్టరూపం దాల్చడంతో ఆనందంలో పాకిస్తాన్ నుండి వచ్చిన హిందూ శరణార్థులు. ప్రస్తుతం వెంటనే 25 వేల మంది పాకిస్తాన్ హిందూ శరణార్థులకు లభించనున్న భారత పౌరసత్వం. స్వాతంత్ర్యం అనంతరం భారత్ నుండి పాకిస్తాన్ మతం ప్రాతిపదికన విడిపోయినపుడు పాకిస్తాన్ ...
READ MORE
బాలధీర పరుశురామ్ ఇక లేడు.. అనారోగ్యంతో కన్నుమూత.
రాంచరణ్ వీరాభిమానిగా చెర్రీ డైలాగ్ లను గుక్క తిప్పుకోకుండా డైలాగ్ చెప్పగలిగే బాలమెగాపవర్ స్టార్ బాలధీర పరుశురామ్ ఇకలేరు. సోషల్ మీడియాలో తన నటన డైలాగ్స్ ద్వారా అభిమానులను అలరించిన పరశురామ్ అనారోగ్య కారణంగా పదేళ్లకే వందేళ్లు పూర్తి చేసుకుని లోకాన్ని ...
READ MORE
కల్వకుంట్ల కవిత 5 ఏండ్లలో సాధించలేనిది, అర్వింద్ 8 నెలల్లో సాధించాడు.!!
2019 లోకసభ ఎన్నకల్లో దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన స్థానం నిజామాబాద్ లోకసభ నియోజకవర్గం. ఎందుకంటే ఇక్కడ పసుపు బోర్డ్ ఏర్పాటు కోసం అంతకు ముందు హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి కూతురు కల్వకుంట్ల కవిత ను ఎంపీ గ గెలిపించారు ఇక్కడి ప్రజలు. ...
READ MORE
సోషల్ మీడియా ద్వారా ఆర్మీని ప్రశ్నించిన రాయ్ మ్యాథ్యూ అనుమానస్పద మృతి.. అతనిది హత్యా..?? ఆత్మహత్యా..?
గత నెల 25న సోషల్ మీడియాలో హల్ చల్ చేసిన సైనికుడు రాయ్ మ్యాథ్యూ గుర్తున్నాడా. ఆర్మీ సహయక్ స్టింగ్ ఆఫరేషన్ పై సోషల్ మీడియా లో ఫోస్ట్ చేసి అధికారుల చేతిలో పిచ్చోడిగా ముద్ర పడ్డ రాయ్ ఇక లేడు. ...
READ MORE
లాంచనంగా ప్రారంభమైన ఓయూ శతాబ్ది ఉత్సవాలు.. అంతలోనే నిరసన సెగ.
తెలంగాణ చరిత్ర, సంస్కృతి ప్రతిబింబించే విధంగా  ఉస్మానియా విశ్వవిద్యాలయ శతాబ్ధి ఉత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి.  విద్యార్థులు, కళాకారుల ఆటపాటలతో శనివారం ఉదయం ఉస్మానియా విద్యాలయంలో ఘనంగా ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ప్రధాన అతిధిగా వీసి రామచందర్  హజరై 2కే రన్ ...
READ MORE
జియో దెబ్బకు కుదేలైన ఐడియా ఒడాఫోన్ లు కలిసి కొత్త నెట్వర్క్.!!
మొబైల్ నెట్వర్క్ లో భారత రిలయన్స్ సంస్థ సృష్టించిన సంచలనం జియో. ప్రస్తుతం మన దేశం లో మోబైల్ రంగం అంటే.. జియో కి ముందు జియో తర్వాత అనేంతగ పరిస్థితి మారింది. అంతకు ముందు మొబైల్ నెటవర్క్ రంగంలో రారాజుగ వెలుగొందిన ఏయిర్టెల్ ...
READ MORE
అమృత కి కోటి ఇస్తానన్న ఎల్ రమణకు.. వరంగల్ పూజారి కనబడలేదా..??
ఒకోసారి రాజకీయ నాయకుల ప్రవర్తన జుగుప్సాకరంగ అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటిదే ఇపుడు మరో ఉదంతం పై సోషల్ మీడియా లో చర్చ జరుగుతోంది. ఈమధ్యనే మిర్యాలగూడ లో తొమ్మిదోతరగతి లవ్ తో 18 ఏండ్లు పడగానే మ్యారేజ్ చేసుకుని భార్య తండ్రి ...
READ MORE
పాకిస్తాన్ మద్దతు దారులకు కట్జూ సపోర్ట్..
గాడిద తంతే తిరిగి తంతామా ఇది సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండేయ కట్జూ వ్యాఖ్య. ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశారో తెలుసుకుంటే టైటిల్  కరెక్ట్ అని మీరే అంటారు. పాకిస్తాన్ కు మద్దతు తెలుపుతున్న మద్దతు దారులకు తన వ్యాఖ్యలతో పరోక్షంగా ...
READ MORE
టీఆర్ఎస్ తోనైనా కలుస్తాం.. టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు
కేంద్రం లో భాజపా ను వ్యతిరేకించే పార్టీ లతో గ్రాండ్ అలయన్స్ ఏర్పాటే లక్ష్యం అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఈ క్రమంలో అవసరమైతే టీఆర్ఎస్ ను అయినా కలుపుకుని వెల్తాం అన్నారు. అయితే చంద్రబాబు నాయుడు వ్యాఖ్యల పట్ల ...
READ MORE
రేవంత్ రెడ్డి ని చూసి ఆ ఎంఎల్ఏ లు సిగ్గుపడాలేమో.??
గత కొంత కాలంగ రేవంత్ రెడ్డి టాపిక్ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ హాట్ టాపిక్ గా మారింది. ఆయన ఢిల్లీ వెల్లి కాంగ్రెస్ అధిష్టానంతో సంప్రదింపులు కూడా జరిపినట్టు వార్తలొచ్చాయి.. త్వరలోనే కాంగ్రెస్ లోకి వెలుతున్నాడనే ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో ఆయన ...
READ MORE
2019 లో ప్రధాన మంత్రి ఎవరో తేల్చేసిన PK..!!
ఒకవైపు భాజపా సేనతో మరోసారి ప్రధానమంత్రి కావడానికి నరేంద్ర మోడి, మరోవైపు దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాలలో ఉన్న చిన్నా చితకా పార్టీలన్నీ కలిసి నరేంద్ర మోడి తప్ప ఇంకెవరైనా ప్రధాన మంత్రి కావాలని మహా కూటమి పేరుతో ప్రయత్నం.ఈ మధ్య ...
READ MORE
బ్రేకింగ్ న్యూస్:- మహాంకాళమ్మ సాక్షిగ పోలిస్ v/s జర్నలిస్ట్..!!
నేటి ఉజ్జాయిని మహాంకాళి బోనాల పర్వదినం సంధర్భంగ ఉదయం నుండే నగరం నలుమూలల నుండి అమ్మవారి భక్తులు బారులు తీరారు. నిన్నటి రాత్రి నుండే పోలీసు అధికారుల పర్యవేక్షణ భద్రత ఏర్పాట్లు ముమ్మరంగ సాగుతున్నై. తల్లి దర్శనానికి ఎందరో ప్రముఖులు విఐపీలు వస్తుంటారు ...
READ MORE
ఎన్నడూ లేనిది, పీవీ నీ పొగుడుతున్న కాంగ్రెస్ పార్టీ నెహ్రూ కుటుంబం.!!
కాంగ్రెస్ పార్టీ.. దశాబ్దాల కాలం దేశాన్ని ఏలి, దేశాన్ని అభివృద్ధి చేయడంలో పూర్తిగా విఫలం చెంది, ప్రస్తుతం పార్లమెంట్ లో ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేని పరిస్థితిలో ఉంది. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ...
READ MORE
కమల్ పై “కేసు” బుక్.! ఇవే ఆ సెక్షన్లు.!!
హిందూ ఉగ్రవాదం అంటూ.. తీవ్ర మతపరమైన రెచ్చగొట్టే విధంగ వ్యాఖ్యలు చేసి వివాదస్పదమైన కమల్ హాసన్ పై కేసు నమోదైంది. హిందూ ఉగ్రవాదం పెరిగిపోతోంది, హిందువుల్లో ఉగ్రవాదులున్నారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగ దేశ వ్యాప్తంగా దుమారం అవుతున్నై. ఈ క్రమంలో కమల్ పై ...
READ MORE
కరోనా వ్యాక్సిన్ తయారీలో పెద్దన్న పాత్ర లో భారత్.!!
చైనా లో పుట్టి ప్రపంచ దేశాలను వణికించిన భయంకర మహమ్మారి అంటు వ్యాధి కోవిడ్ 19 కరోనా కు వ్యాక్సిన్ తయారీలో ప్రపంచ దేశాలకు భారత్ పెద్దన్న పాత్ర పోషిస్తున్నది. ఈ క్రమంలోనే బ్రెజిల్ దేశం ఇప్పటికే తమ దేశ ప్రజలకు ...
READ MORE
రాత్రి మినీ డ్రెస్ వేసుకునే పడుకుంట..లేకుంటే నాకు నిద్ర రాదు – లేడీ బాబా రాధే మా
రాధే మా చాలా మందికి పరిచయం అక్కర్లేదు.. ఇంకొందరు ఆమె అవతారం చూసి గుర్తుపడతారు.. అమెనే రాధే మా.. మహిళా సాధ్విగా గుర్తింపు పొందింది ఈవిడ. కాగా జీన్స్ ప్యాంట్లు ధరించీ.. కురచ దుస్తులు( షార్ట్స్) ధరించీ.. డాన్సులు చేస్తూ ఉన్న ...
READ MORE
శివాజి యూత్ ఆద్వర్యంలో అవయవదానం పై అవగాహన సదస్సు.!!
హైద్రాబాద్ ఉప్పల్ కేంద్రంగ కొనసాగుతున్న శివాజీ యూత్ అసోసియేషన్ ఆద్వర్యంలో రేపు ఛత్రపతి శివాజీ మహరాజ్ 391 వ జయంతి సంధర్భంగ అవయవ దానం పై అవగాహన సదస్సును నిర్వహించనున్నారు. గతంలోనూ ప్రజా సంక్షేమం దృష్ట్యా చాలా రకాల సేవా కార్యక్రమాలను ...
READ MORE
భద్రాద్రి రామయ్య దర్శనానికి డ్రెస్ కోడ్.
భద్రాచల రామయ్య వారి దర్శనానికి ఆలయ అధికారులు కొత్త నింబంధన తీసుకొచ్చారు. ఏడు కొండల వాడి దర్శనానికి ఎలా అయితే డ్రెస్ కోడ్ ఉంటే దర్శనానికి అనుమతిస్తారో అలాంటి సంప్రదాయ వస్త్రాలను దరించి వస్తేనే రాములోరి దర్శనానికి అనుమతిస్తామంటున్నారు. భద్రాచల సీతారాముల దర్శనార్థం ...
READ MORE
జ‌ర్న‌లిస్ట్ ల‌కు శుభ‌వార్త. అక్రిడేషన్ లేకున్నా హెల్త్ కార్డులు
టీయూడబ్ల్యూజే రూపొందించిన జర్నలిస్ట్ డైరీ ఆవిష్క‌ర‌ణ స‌భ‌లో ప్రెస్ అకాడమీ ఛైర్మ‌న్ అల్లం నారాయ‌ణ జ‌ర్న‌లిస్ట్ ల‌కు శుభ‌వార్త తెలియ‌జేశారు. ఇక అక్రిడేషన్ లేకున్నా హెల్త్ కార్డులు అంద‌రికి వ‌ర్తిస్తాయ‌ని తెలిపారు. అక్రిడేషన్ లేని జ‌ర్న‌లిస్ట్ లు వెంట‌నే ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని ...
READ MORE
మరోసారి తన సహజ బుద్దిని చూపిన బాలక్రిష్ణ
ఎన్నిసార్లు విమర్శలపాలైనప్పటికీ నటుడు హిందూపురం టీడీపీ ఎంఎల్ఏ నందమూరి బాలక్రిష్ణ తన ఆవేశాన్ని ఆపుకోలేకపోతున్నాడు, పదే పదే టీడీపీ కార్యకర్తలపై అభిమానులపై దాడి చేస్తూనే ఉన్నాడు. తాజాగా మరోసారి హిందూపురంలో టీడీపీ ఇంటింటి కార్యక్రమంలో ఒకరి ఇంటికెల్లే సంధర్భంలో.. ఓ టీడీపీ ...
READ MORE
YS షర్మిల పార్టీ పెడితే తెలంగాణ లో ఎవరికి లాభం ఎవరికి నష్టం.. విశ్లేషణ
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కూతురు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి చెల్లెలు వైఎస్ షర్మిల పెట్టబోయే కొత్త పార్టీ గురించి హాట్ టాపిక్ నడుస్తుంది. ఈ విషయం ఇంత హాట్ టాపిక్ గా మారడానికి ...
READ MORE
భారతమంతా మోడీమయం.. తెలంగాణ లో అనూహ్యంగ పుంజుకున్న కమళదళం.!!
ఎగ్జిట్ పోల్స్.. ఊహజనిత ఫలితాల సర్వేలు. కానీ ఎగ్జాట్ పోల్స్ ఈరోజు విడుదల అయ్యాయి. భాజపా నాయకులు చెప్పినట్టుగానే ఎగ్జిట్ పోల్స్ ను మించి అనూహ్య ఫలితాలతో దేశ వ్యాప్తంగా దుమ్ము దులిపింది నరేంద్ర మోడి సేన. 542 స్థానాలున్న లోక ...
READ MORE
కిషన్ రెడ్డి కి మరిన్ని సూపర్ పవర్స్ ఇచ్చిన అమిత్ షా..!!
సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి విజయకేతనం ఎగరేసి నరేంద్ర మోడి మంత్రి మండలి లో హోంశాఖ సహాయ మంత్రి గ పదవిని పొందిన తెలంగాణ భాజపా నాయకుడు కిషన్ రెడ్డి కి, హోంశాఖ క్యాబినేట్ మంత్రి అమిత్ షా మరిన్ని పవర్స్ ...
READ MORE
మహనీయుల జయంతి సందర్భంగా సెలవులు అవసరమా…?
రేవంత్ వెళుతున్నాడంటా..? ఇక మ‌న ప‌ని అంతేనా..?
పౌరసత్వ బిల్లు పాసవడంతో పాకిస్తాన్ హిందువుల హర్షం..!!
బాలధీర పరుశురామ్ ఇక లేడు.. అనారోగ్యంతో కన్నుమూత.
కల్వకుంట్ల కవిత 5 ఏండ్లలో సాధించలేనిది, అర్వింద్ 8 నెలల్లో
సోషల్ మీడియా ద్వారా ఆర్మీని ప్రశ్నించిన రాయ్ మ్యాథ్యూ అనుమానస్పద
లాంచనంగా ప్రారంభమైన ఓయూ శతాబ్ది ఉత్సవాలు.. అంతలోనే నిరసన సెగ.
జియో దెబ్బకు కుదేలైన ఐడియా ఒడాఫోన్ లు కలిసి కొత్త
అమృత కి కోటి ఇస్తానన్న ఎల్ రమణకు.. వరంగల్ పూజారి
పాకిస్తాన్ మద్దతు దారులకు కట్జూ సపోర్ట్..
టీఆర్ఎస్ తోనైనా కలుస్తాం.. టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు
రేవంత్ రెడ్డి ని చూసి ఆ ఎంఎల్ఏ లు సిగ్గుపడాలేమో.??
2019 లో ప్రధాన మంత్రి ఎవరో తేల్చేసిన PK..!!
బ్రేకింగ్ న్యూస్:- మహాంకాళమ్మ సాక్షిగ పోలిస్ v/s జర్నలిస్ట్..!!
ఎన్నడూ లేనిది, పీవీ నీ పొగుడుతున్న కాంగ్రెస్ పార్టీ నెహ్రూ
కమల్ పై “కేసు” బుక్.! ఇవే ఆ సెక్షన్లు.!!
కరోనా వ్యాక్సిన్ తయారీలో పెద్దన్న పాత్ర లో భారత్.!!
రాత్రి మినీ డ్రెస్ వేసుకునే పడుకుంట..లేకుంటే నాకు నిద్ర రాదు
శివాజి యూత్ ఆద్వర్యంలో అవయవదానం పై అవగాహన సదస్సు.!!
భద్రాద్రి రామయ్య దర్శనానికి డ్రెస్ కోడ్.
జ‌ర్న‌లిస్ట్ ల‌కు శుభ‌వార్త. అక్రిడేషన్ లేకున్నా హెల్త్ కార్డులు
మరోసారి తన సహజ బుద్దిని చూపిన బాలక్రిష్ణ
YS షర్మిల పార్టీ పెడితే తెలంగాణ లో ఎవరికి లాభం
భారతమంతా మోడీమయం.. తెలంగాణ లో అనూహ్యంగ పుంజుకున్న కమళదళం.!!
కిషన్ రెడ్డి కి మరిన్ని సూపర్ పవర్స్ ఇచ్చిన అమిత్
Facebook Comments
Top
error: Content is protected !!