You are here
Home > తాజా వార్త‌లు > అంతరిక్ష కేంద్రం నుంచి కనబడిన వింత ఆకారాలు..! గ్రహాంతరవాసులేనా..?

అంతరిక్ష కేంద్రం నుంచి కనబడిన వింత ఆకారాలు..! గ్రహాంతరవాసులేనా..?

ఈ బ్రహ్మాండంలో శతకోటి పాలపుంతలు, అనంతకోటి సౌరకుటుంబాలు ఉన్నాయి. ఇంతటి విస్తృతమైన విశ్వంలో, కేవలం భూమిపైనే జీవం ఉందా..? ఇక వేరే ఏ గ్రహం పైనా జీవం ఉనికి లేదా..? శతాబ్దాల కాలంగా మనిషిని వేధిస్తున్న ప్రశ్న ఇది. దీనికి ఇప్పటివరకూ అయితే, ఇదమిద్ధంగా సమాధానం లేదు. కానీ అప్పుడప్పుడూ కనిపించే కొన్ని ఖగోళ వింతలు, ఏలియన్స్ అనేవి ఉన్నాయేమో అన్న సందేహాన్ని కలిగిస్తుంటాయి. తాజాగా అలాంటి సంఘటనే మరొకటి చోటు చేసుకుంది.

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్) కూడా ఈ విషయంలో నాసాతో కలిసి పనిచేస్తోంది. వేరే గ్రహాలపై జీవం ఉండటానికి వందశాతం ఆస్కారం ఉందని నాసా కూడా చెబుతోంది. అయితే ప్రస్తుతం భూమిపై గ్రహాంతరవాసులు వస్తూ వెళ్తూ ఉంటున్నారన్న విషయం మాత్రం నాసా అంగీకరించట్లేదు. తాజాగా స్పేస్ స్టేషన్ నుంచి కనిపించిన ఒక సంఘటన అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కాన్ స్ఫిరసీ థియరిస్టులు బ్రెట్ – బ్లేక్ లు తమ కెమెరాల్లో నిక్షిప్తం చేసిన ఒక వీడియోలో ఏవో కొన్ని ఆకారాలు అలా గాల్లో తేలుతూ ముందుకు సాగుతున్నాయి. చూడటానికి పొగలా అనిపిస్తున్న ఆ మూడు ఆకారాలు ఏమిటి..? అవి మేఘాలే అయితే, అంత ఎత్తులో వాటి ఆకారం మారుతూ ఉండాలి. కానీ అలా కాకుండా ఒకే ఆకారంలో ప్రయాణించాయి. మూడు వరసగా పక్కపక్కనే వెళ్లడం కూడా అనుమానాలకు తావు ఇస్తోంది. మరి ఇవేంటో అన్నది తేలటం మాత్రం కష్టమే..!

 

Facebook Comments
Top
error: Content is protected !!