
ఆపదలో ఉన్న జర్నలిస్ట్ లను ఆదుకోవడం తెలంగాణ జర్నలిజాన్ని బ్రతికించుకోవడమే తమ కర్తవ్యం అని చెపుతోంది టియుడబ్ల్యూజే నాయకత్వం. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్సకు చేతిలో చిల్లిగవ్వ లేక ఇబ్బంది పడుతూ మంచానికే ఫరిమితం అయిన ఎందరో జర్నలిస్ట్ లకు సాయం చేసేందుకు తామున్నామంటు ముందుకు వస్తున్నారు. ఇప్పటి వరకు ఓ లెక్క ఇక నుండి ఓ లెక్క మీకు మేమున్నాం అని చెపుతున్నారు. అయితే ఈ సేవలు, ఈ ఆదరణ నిరంతరాయంగా కొనసాగాలని.. తార తమ్య భేదాలు లేకుండా చూడాలని టియుడబ్ల్యూజే నాయకత్వాన్ని కోరుకుంటుంది జర్నలిజంపవర్. రాష్ట్రంలో ఇప్పటికి ఇంకా అలాగే ఉన్న అక్రిడేషన్ కార్డు, హెల్త్ కార్డు సమస్యలను అన్ని జిల్లాల్లో త్వరతగతిన పూర్తి చేసేల చర్యలు తీసుకోవాలని కోరుతుంది. జర్నలిస్ట్ లు ఇబ్బంది పడకుండా చూసుకుంటాం మీకు మేమున్నాం అని మీరిస్తున్న భరోసా కొనసాగాలని కోరుకుంటున్నాం. రాష్ట్ర బడ్జెట్ లో జర్నలిస్ట్ సంక్షేమానికి 30 కోట్లు కేటాయించిన తెలంగాణ ప్రభుత్వానికి మీ తరుపున మా తరుపునా ప్రభుత్వానికి కృతజ్ఞతలు.
టీయుడబ్ల్యూజే లేఖలోని వివరణ యాదతథంగా..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఒక కోటి రూపాయలు గా వున్న జర్నలిస్ట్ సంక్షేమనిధి ని మూడు సంవత్సరాల్లో 50 కోట్లకు పెంచిన ముఖ్యమంత్రి కె సి ఆర్ గారికి తెలంగాణ జర్నలిస్ట్ ల తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మొదటి ఆర్ధిక సంవత్సరం లోని పది కోట్ల నిధి తో వచ్చిన వడ్డీ ఇప్పటికే కొన్ని వందల జర్నలిస్ట్ ల కుటుంబాలకు ఆసరాగా నిలిచింది. రెండో సంవత్సరం కేటాయించిన మరో పది కలిపి మొత్తం 20 కోట్ల డిపాజిట్ వడ్డీ కోటి రూపాయలకు పైగా ప్రస్తుతం జర్నలిస్ట్ సంక్షేమ నిధి లో ఉన్నట్టు తెలుస్తోంది. చనిపోయిన వారికి లక్ష రూపాయల నగదు ఇప్పటికే అందించగా ప్రతి నెల 3000 చొప్పున వారికుటుంబాలకు అందిస్తున్నారు. అనారోగ్యం కారణంగా లేదా యాక్సిడెంట్ మూలంగా అచేతనావస్థలో వున్న జర్నలిస్ట్ లకు 50 వేల రూపాయలను కూడా ప్రభుత్వం ప్రెస్ అకాడమీ ధ్వారా అందించడం జరిగింది. ఇక గత ఆర్ధిక సంవత్సరం లోని వడ్డీ కోటిన్నర కూడా జర్నలిస్ట్ సంక్షేమానికి ఉపయోగపడుతుందనడం లో సందేహంలేదు.
ఈ సారి ఆర్ధిక సంవత్సరంలో ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్టుగా మరో 30 కోట్లను నిధికి కేటాయించి మొత్తం నిధిని 50 కోట్లకు పెంచడం జర్నలిస్ట్ సంక్షేమం పట్ల ముఖ్యమంత్రి గారికి వున్న కమిట్మెంట్ కు నిదర్శనంగా నిలుస్తోంది. మొత్తంగా 50 కోట్ల నిధి తో సంవత్సరానికి వచ్చే వడ్డీ మూడున్నర కోట్లకు చేరొచ్చని అంచనా. దీంతో రాష్ట్రం లోని ఏ జర్నలిస్ట్ కు ఎలాంటి ప్రమాదం జరిగినా ప్రెస్ అకాడమీ ద్వారా ప్రభుత్వం ఆదుకునే వీలుంటుందని ఆశాభావాన్ని మేం వ్యక్తం చేస్తున్నాం. ఇప్పటికే హెల్త్ కార్డ్స్ వినియోగంలోకి రావడం…. దాదాపుగా అందరికి అక్రిడిటేషన్ లు రావడం జరిగింది. ఇంకొన్ని జిల్లాల్లో ప్రాసెస్ లో వుంది … ఇక ప్రెస్ అకాడమీ ఖాతా లో జమ అయివున్న నిధి జర్నలిస్ట్ ల సంక్షేమం కోసం వినియోగించే విధంగా కార్యాచరణ రూపొందించాలని…. జర్నలిస్ట్ లకు పెన్షన్ విధానానికి గాను కార్యాచరణ రూపొందించాలని, ఆపదలో వున్న జర్నలిస్ట్ కు వెంటనే సాంత్వన చేకూరే విధంగా కార్యాచరణ రూపొందిస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం. ఇందుకు గాను కృషి చేస్తున్న …. ప్రెస్ అకాడమీ ఛైర్మెన్ అల్లం నారాయణకు కు దాని పాలకమండలి సభ్యులకు …… తెలంగాణ జర్నలిస్ట్ లకు నేనున్నాను అంటూ అన్ని వేళల ఆదుకుంటున్న గౌరవనీయ ముఖ్యమంత్రి కె సి ఆర్ గారికి తెలంగాణ జర్నలిస్ట్ లు తెలంగాణ యూనియన్ అఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ద్వారా నిండుమనస్సు తో కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.
























