You are here
Home > తాజా వార్త‌లు > భర్తలను చంపిన భార్యలు.. కాలం మారింది గురూ.. అంతా అక్ర‌మ‌సంబంద‌మే.

భర్తలను చంపిన భార్యలు.. కాలం మారింది గురూ.. అంతా అక్ర‌మ‌సంబంద‌మే.

క‌లియుగంలో ఖ‌త‌ర్నాక్ భార్య‌లు పుట్టుకొస్తున్నారు. ప్రేమ పెళ్లి హ‌త్య‌.. ఇంతే. ప్ర‌తి హ‌త్య‌ల వెనుక ఓ అక్ర‌మ‌సంబందం. క‌ట్టుకున్న వాన్ని కాటికి పంపే ప‌క్కా స్కెచ్ లు వేయ‌డం. అనుకున్న‌ది అనుకున్న‌ట్టుగా చేసి చంపేయ‌డం ఇప్పుడు సూర్ప‌న‌క‌ల వ్య‌వ‌హ‌రశైలికి అద్దం ప‌డుతుంది. రాక్ష‌స స్త్రీల‌న్నా త‌మ భ‌ర్త‌ల‌కు విలువ‌నిస్తారేమో కానీ ఈ అప‌ర ప‌తివ్ర‌త‌లు మాత్రం క‌ట్టుకున్నభ‌ర్త‌ల‌ను న‌మ్మించి నీళ్లు లేని బావికాడ గొంతు కోసి గిలాగిలా కొట్టుకు చ‌స్తుంటే చూస్తు రాక్ష‌స ఆనందాన్ని పొందుతున్నారు. ఈ లిస్ట్ లోకే వ‌స్తారు ఇప్పుడు మ‌నం చెప్పుకోబోయే స్త్రీలు ( ఛీ లు ).
ఒక‌ప్పుడు బార్య‌ల‌ను చంపిన భ‌ర్త‌ల వార్త‌లు వినాల్సి వ‌చ్చేది ఇప్పుడు కాలం మారింది క‌లియుగం అంతానికి కాలం ద‌గ్గ‌ర ప‌డ్డ‌ట్టు ఉంది.. భ‌ర్త‌ల‌ను చంపుతున్న భార్య‌లు అని వార్త‌లు వినాల్సిన దుస్థితి దాపురిస్తుంది. అక్రమ సంబంధాల విషయంలో మహిళను నిందితురాలిగా చేయవచ్చు అని సుప్రీంకోర్టు ఇలా పరిశీలించిందో లేదో అప్పుడే తెలుగు రాష్ట్రాల్లో అప‌ర‌ ప‌తివ్ర‌త‌లు త‌మ విశ్వ‌రూపం చూపిస్తున్నారు. ప్రియుల మోజులో పడి భర్తలను అత్యంత కిరాతంగా చంపేస్తున్నారు. ఇవ‌న్నీ ఆవేశంలోనో, ఉద్రేకంలో జరుగుతున్న హత్యలు కావు.. ప‌క్కా ప్ర‌ణాళిక ప్ర‌కారం ప్రియుల మోజులు మోటు బాష‌లో చెప్పాలంటే అది తీర‌క ప్రియులు, వారి స్నేహితులను సాయం తీసుకుని భార్యలే పక్కా పథకం ప్రకారం హత్య చేస్తున్నారు. ఓ ప‌క్క బంగారం లాంటి పిల్ల‌లు అంత‌కు మించిన బంగారంలాంటి భ‌ర్త అయినా ఆ సుఖం కోసం అడ్డ‌దారులు తొక్కి భ‌ర్త‌ల‌ను మ‌ట్టు బెడుతున్నారు.

ఇక ఈ అప‌ర ప్రియురాళ్ల మోజు క‌థ గుంటూరు నుండి మొద‌లెడుదాం..
గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం పాతులూరుకు చెందిన శ్రీవిద్య తన బావతో వివాహేతర సంబంధం పెట్టుకొని భర్తను చంపింది. ఈ ఘటనలో నిందితుడు గొట్టిపాటి వీరయ్యతో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. బావతో కలిసి భర్తకు మద్యంలో విషం కలిపి ఇచ్చి భార్య చంపింది. గుంటూరు జిల్లాకు చెందిన నరేంద్రచంద్ర, శ్రీవిద్యలు భార్యాభర్తలు. భర్త గత నెల విగతజీవిడిగా కాల్వలో కనిపించాడు. పోలీసులు ఆరా తీయ‌గా భార్యనే బావసాయంతో కలిసి చంపినట్లుగా తేలింది. ఇక ట‌క్కుట‌మార లేడి శ్రీవిద్యకు బావ అయ్యే వీరయ్యతో పెళ్లికి ముందు నుంచే వివాహేతర సంబంధం ఉంది. పెళ్లయ్యాక బావతో కలిసేందుకు సమయం దొరకడం లేదని, మాట్లాడటానికి వీలుపడటం లేదని భావించిన‌ శ్రీవిద్య భర్త నరేంద్ర అడ్డు తొలగించుకోవాలనే ఉద్దేశంతోనే ఈ హత్య చేసినట్లు ఒప్పుకుంది. ఒక్క శ్రీవిద్య తోనే క‌థ ఒడిసి పోలేదు ఇక్క‌డ చాలా మంది శ్రీ‌విద్య‌లు తెర‌పైకి వ‌చ్చారు.

అనంతపురం నగర శివారులో రుద్రంపేట పంచాయతీ పంతులకాలనీలో నివాసం ఉంటున్న కిష్టప్పను జాతీయ రహదారి కక్కలపల్లి క్రాస్‌ సమీపంలో హత్య చేశారు. కిష్టప్ప తొమ్మిదేళ్ల క్రితం నిందితులలో ఒకరైన శ్వేతను పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు కలిసి పండ్ల తోటల్లో కూలీ పని చేసేవారు. ఈ క్రమంలో కిష్టప్పకు నూతిమడుగుకు చెందిన కృష్ణతో పాటు మామిడాకులపల్లికి చెందిన అక్కులన్న అలియాస్‌ సూరితో పరిచయాలు ఏర్పడ్డాయి. వారిద్దరూ అప్పుడప్పుడూ కిష్టప్ప ఇంటికి వచ్చి వెళ్లేవారు. ఈ క్రమంలో శ్వేతతో చనువుగా ఉండేవారు. ఈ విషయంపై కిష్టప్ప భార్యను మందలించాడు. దీనిని జీర్ణించుకోలేని భార్య ఎలాగైనా భర్తను అడ్డు తొలగించుకోవాలనుకుంది. కిష్టప్పను చంపితే తాము కలిసి ఉండవచ్చని కృష్ణతో తెలిపింది. కృష్ణ కూడా అంగీకరించాడు. అక్కులన్న, హరి, శ్వేత సహాయంతో కృష్ణ కిష్టప్పను హత్య చేశాడు. ఇప్పుడు ఆంధ్ర నుండి తెలంగాణ‌కు వ‌చ్చేద్దాం. ఇక్క‌డ శ్రీ‌విద్య, శ్వేత‌ల‌ ను మించిన విద్యావంతులు లేడీ కింగ్ ల క‌థ‌లు మిమ్మ‌ల్ని త‌ప్ప‌క ఆవేశానికి , ఆగ్ర‌హానికి గురి చేయ‌క‌పోవు.

ఇప్పుడు క‌థ ఆంధ్ర నుండి తెలంగాణ కు మారిస్తే ఇక్క‌డ సేమ్ సీన్స్.. స్క్రినిఫ్లే డైర‌క్ష‌న్ క్లైమాక్స్ అంతా సేమ్ టూ సేమ్.
తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లాలో ఓ మహిళ తన భర్తను హత్య చేసింది. కొండమల్లెపల్లి మడలం ఏపూరు తండాలో చోటు చేసుకుంది. అర్థరాత్రి దిండుతో ఊపిరాడకుండా చేసి ఆమె భర్తను చంపేసింది. భర్త సోమాను హత్య చేసిన ఉదంతంలో పోలీసులు భార్య భారతిని అరెస్టు చేశారు. వరుసకు బావ అయ్యే రమావత్‌ శివ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. డిసెంబర్‌ 28 రాత్రి మద్యం మత్తులో ఉన్న సోమ భార్య, కుమారుడితో గొడవ పడి నిద్రపోయాడు. ఇదే అదనుగా భావించిన భారతి ప్రియుడు శివకు ఫోన్‌ చేసి ఇంటికి పిలిపించుకుంది. భారతి, ప్రియుడు శివ ఇద్దరూ కలిసి హత్య సోమాను కిరాతకంగా హ‌త్య‌ చేశారు. మంచంపై నిద్రపోయిన సోమాను శివ గట్టిగా గొంతు నులమగా, భారతి భర్త సోమా ముఖంపై బొంతను వేసి ఊపిరి ఆడకుండా చేయడంతో అతను మృతి చెందాడ‌ని పోలీసుల విచార‌ణ‌లో తేలింది.

ఇక సూర్య‌పేట నుండి అడ‌వుల జిల్లా ఆసిపాబాద్ కు ఓ సారి వెళితే అక్క‌డ ఇదే సీన్.. సేమ్ టూ సేమ్. క‌థా స్క్రినిఫ్లే ఎండ్ కార్డు. కుమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని చింతల మానేపల్లి మండలం బాలాజీ అనుకోడ గ్రామంలో మల్లూరి భిక్షపతి (33)కి బాయక్కతో 16 ఏళ్ల కింద వివాహం జరిగింది. బాయక్కకు అదే గ్రామానికి చెందిన ఓ మాజీ నక్సలైట్‌తో వివాహేతర సంబంధం ఉంది. తమ అక్ర‌మ సంబందానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో భర్త భిక్షపతిని హ‌త్య చేసింది భార్య బాయ‌క్క‌. ఇక ఆసిపాబాద్ నుండి క‌రీంన‌గ‌ర్ జిల్లాకు వ‌స్తే.. ఇక్క‌డ కాస్త సీన్ వేరు..అక్ర‌మ సంబందం కార‌ణం కాదు గాని మెంట‌ల్ టార్చ‌ర్ పెడుతున్నాడ‌ని చంపేసింది ఈ భార్య‌. కరీంనగర్ పట్టణ శివారులో 2015 ఆగస్టులో ఓ భార్య తన భర్తను చంపింది. అయితే ఇది అక్రమ సంబంధానికి సంబంధించింది కాదని తెలుస్తోంది. మృతుడు ఎండీ సాబీర్(45) గత కొంత కాలంగా రోజు మద్యం తాగివచ్చి గొడవ చేస్తుంటే అది తట్టుకోలేకనే షహనాజ్ చున్నితో అతని మెడకు బిగించి హత్యచేసినట్లు తెలుస్తోంది.

ఇక ఇవ‌న్నీ ఒక ఎత్తు స్వాతి క‌థ ఒక ఎత్తు. నాగర్‌కర్నూలు జిల్లాలోని స్వాతి అనే మహిళ తన భర్తను హత్య చేసి ప్రియుడిని అతని స్థానంలో ప్రవేశపెట్టడానికి ఆడిన నాటకం ఓ సెన్షెన‌ల్ క్రైం స్టోరీ. రెండు తెలుగు రాష్ట్రాలు స్వాతి రియ‌ల్ స్టోరీ తీవ్ర సంచలనం సృష్టించింది. భ‌ర్త‌ సుధాకర్ రెడ్డి ని చంపేందుకు భార్య స్వాతి, ప్రియుడు రాజేష్ స‌హ‌కారంతో పక్కా ప్రణాళిక ప్ర‌కారం పని కానిచ్చారు. మద్యం సేవించి ఇంటికి వచ్చిన సుధాకర్‌రెడ్డిని ప్రియుడితో కలిసి స్వాతి హత్య చేసింది. ప్రియుడి ముఖంపై యాసిడ్ పోసి చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్చింది. ప్లాస్టిక్ సర్జరీ చేయించి తన భర్త స్థానంలో అతన్ని చూపించాలని అనుకుంది. ఇక ఆ త‌రువాత అంతా తెలిసిన స్టోరీనే. ఇప్పుడు అక్ర‌మ సంబందంతో జ‌ల్సా చేయాల‌నుకున్న స్వాతి , రాజేష్ ల జంట జైల్లో చిప్ప‌కూడు తింటున్నారు.

స్వాతిని ఆద‌ర్శంగా తీసుకుందో లేక నేను స్వాతి ఎక్క‌డ తీసిపోను అనుకుందో కానీ ఓ సాఫ్ట్ వేర్ ఇంజ‌నీర్ భార్య జ్యోతి అంత‌కు మించిన క్రైం క‌థ‌ను చూపించింది. నాగరాజు అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ భార్య జ్యోతి తన ప్రియుడు కార్తిక్‌తో కలిసి హత్య చేసిన ఉదంతం ఇప్పుడు మ‌రో సంచ‌ల‌నం. కేసు నుంచి తప్పించుకోవడానికి హత్య ఘటనలో పాలుపంచుకున్న నరేష్ అనే యువకుడు లాలాగూడలో బ్లేడుతో గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అతన్ని గుర్తించిన స్థానికులు 108కు కాల్‌ చేసి సమాచారం ఇచ్చారు. దీంతో గాంధీ ఆస్పత్రిలో చేర్పించిన అతన్ని పోలీసులు విచారించగా ఈ హత్య కోణం వెల్లడైంది. నేరం ఎక్క‌డ‌ బయటపడుతుందో, ఈ హత్యానెపాన్ని తనమీద ఎక్క‌డ మోపుతారో అన్న భయంతో న‌రేష్ అనే యువ‌కుడు ఆత్మహత్యకు ప్రయత్నించినట్టు పోలీసుల ఎదుట పేర్కొన్నాడు నిందితుడు న‌రేష్. శ్రీదేవి నుండి మొద‌లుకొని స్వాతి , జ్యోతిల వ‌ర‌కు అన్ని క‌థ‌లు అక్ర‌మ సంబందాల‌తో ముడి ప‌డిన‌వే. ఇంకా బ‌య‌ట‌ప‌డ‌ని అక్ర‌మ సంబందాల క‌థ‌లు ఎన్నో ఇంకా ఎంద‌రు భ‌ర్త‌లు చావుకు ద‌గ్గ‌ర‌గా ప్ర‌మాద‌పు అంచులో ఉన్నారో తెలియ‌దు. మ‌హిళ‌ల మీద దాడులు జ‌రిగితే గొంతులు చించుకునే మ‌హిళా సంఘాలు ఇలాంటి ఘ‌ట‌న‌లు జ‌రిగిన‌ప్పుడు ఎందుకు నోరు మొద‌ప‌రో మాత్రం ఇప్ప‌టి తెలిసి తెలియ‌ని స‌మాదాన‌మే. భ‌ర్త‌లు త‌స్మాత్ జాగ్ర‌త్త ఏమో ఏ పుట్ట‌లో ఏ అక్ర‌మ సంబందం ప్రియురాలు భార్య ముసుగులో దాగుందో. ఇది మా మాట‌కాదు జ‌నం మాట‌. స‌మాజం చేస్తున్న ముంద‌స్తు జాగ్ర‌త్త‌.. హెచ్చ‌రిక‌. బీ కేర్ ఫుల్.

Facebook Comments
Top
error: Content is protected !!