You are here
Home > తాజా వార్త‌లు > అడుగడుగునా ఉద్దానాలు.. కిడ్నీ వ్యాదితో ఆదిలాబాద్ తండాలు విలవిలా.

అడుగడుగునా ఉద్దానాలు.. కిడ్నీ వ్యాదితో ఆదిలాబాద్ తండాలు విలవిలా.

ప్రాణాలు తోడేసే కిడ్ని వ్యాది ఆ గ్రామాలను పట్టిపీడుస్తోంది. పిల్లాజల్లా ముసలి ముతక అన్నా తేడా లేకుండా ప్రాణాలు తీసేస్తోంది. కిడ్నీ రక్కసి కోరలకి అడవుల జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్ వణికిపోతోంది. మారు మూల గ్రామాలైన గురుజ , లొద్దిగూడా , భూతాయి తండాలు కిడ్ని రక్కసితో పోరాడలేక విలవిలాడుతున్నాయి. అక్కడి నీళ్లు విషంగా మారుతున్నాయి. ఆ నీళ్లు తాగిన వారి ప్రాణాలు గాల్లో దీపాలుగా మారుతున్నాయి. కిడ్నీ మహమ్మారి పంజాకి ఇక్కడి వారు బతుకులు అతాలాకుతలం అవుతున్నాయి. ఆదుకునే దిక్కులేక మరణంతో యుద్దం చేస్తున్నాయి ఆ పల్లెలు.

ఇది ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలోని మారు మూల గిరిజన గ్రామం. పేరు గురుజ. ఒక్కప్పుడు ఆయురారోగ్యాలతో ఉన్న ఇక్కడి ప్రజలపై ఒక్కసారిగా కిడ్నీ రక్కసి పంజా విసిరింది. కిడ్నీ భూతం దెబ్బకు సంతోషంగా ఉన్న ఆ పల్లె మంచానపడింది. ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఇప్పటి వరకు పాతిక మందిని పొట్టన పెట్టుకుంది ఈ మహమ్మారి. మరో 15 మందికి పైగా ఈ వ్యాది భారీన పడి రోజులు లెక్కపెట్టుకుంటున్నారు. చిన్న పిల్లల నుంచి పండు ముసలి వరకు అందరికి అదే సమస్య. ఇంకొందరిదైతే తమకు వచ్చిన రోగమేమిటో తెలియని దుస్థితి. వేలకు వేలు ఆసుపత్రుల్లో ఖర్చు పెడుతున్నా రోగం నయం అయిన దాఖాలాలు కనిపించడం లేదు. కూలీ నాలి చేసుకుని బ్రతికే కుటుంబాలు ఈ మహమ్మారి దెబ్బతో కుప్పకూలిపోతున్నాయి. కిడ్నీ వ్యాది భారీన పడి ఇంటి యజమానులను పోగొట్టుకుని పుట్టెడు దుఃఖంలో మునిగిపోతున్నారు.

ఒక్క గురుజనే కాదు ఉమ్మడి ఆదిలాబాద్ నుండి విడిపోయి కొమ్రంభీం జిల్లా గా ఏర్పడిన లింగాపూర్ మండలం లోని లొద్దిగూడా మారు మూల గ్రామం పరిస్థితి కూడా ఇదే. ఆంధ్రప్రదేశ్ లో ఒక్క ఉద్దానం మాత్రమే కనిపిస్తే ఇక్కడ తండాలకు తండాలే ఉద్దానంలా మారిపోయి విలవిలాడుతున్నాయి. లొద్దిగూడ గిరిజన గ్రామం. ఈ ఊర్లో కిడ్నీవ్యాధి బాధితుల్లో 95 శాతంపైగా పురుషులే. గురుజలో ఆడ మగ భేదం లేకుండా కిడ్నీ భూతం పట్టుకుంటే ఇక్కడ మాత్రం కుటుంబ భారాన్ని మోసే మగవాళ్లను పట్టి పీడిస్తోంది. కిడ్నీ మహమ్మారి దెబ్బకు మగవాళ్లు అర్ధంతరంగా తనువుచాలిస్తుండటంతో వారి భార్యాపిల్లలు దిక్కులేనివారవుతున్నారు.

నలభై ఏళ్ల క్రితం ఈ గ్రామం ఏర్పడింది. ఈ ఊర్లో 50 దాకా కుటుంబాలు ఉన్నాయి. జనాభా 200 ఇందులో వ్యాధి సోకిన వారి సంఖ్య 60 మంది. అంతా మగవాళ్లే. దీంతో ఈ గ్రామానికి పిల్లనిచ్చేందుకు కూడా జంకుతున్నారు.

ఇక ఇలాంటి మరో గ్రామమే ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలంలోని భూతాయి తండా. ఇక్కడ కూడా కిడ్నీ మహమ్మారి రంకెలు వేస్తోంది. ఇక్కడ నీళ్లు తాగిన వారిని బాదిస్తూ ప్రాణాలు తీస్తుంది. ఈ మూడు మారుమూల గ్రామల పరిస్థితి ఒకటే కిడ్నీ వ్యాది. అది రావడానికి కారణం కూడా ఒకటే నీటి సమస్య. ఫ్లోరైడ్ శాతం అధికంగా ఉండటం. ఐదేళ్ల క్రితం వాటర్ ఫ్లాంట్ ఏర్పాటు చేసినా ఎవరు పట్టించుకున్న పాపన పోలేదు. నాలుగు కిలోమీటర్ల దూరంలోనే ఎంపీ నగేష్ స్వగ్రామం ఉన్నా.. ఎంపీ నియోజకవర్గంలోని గ్రామమే అయినా కనీసం ఒక్క సారి కూడా తమను చూసేందుకు తమ సమస్యలు వినేందుకు రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాణాలు పోతున్నా పట్టించుకున్న పాపన పోలేదంటూ కన్నీరు మున్నీరవుతున్నారు.

ఈ మూడు గ్రామాల జీవనాదారం వ్యవసాయమే. తమ భూములను, కన్న ఉరిని వదిలి వెళ్లలేక రోగాన్ని జయించలేక ఇక్కడే బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. తమకు సాగు తప్ప మరేపని తెలియదని, కన్నతల్లిలాంటి ఊరును విడిచి ఎక్కడికి వెళ్లేదని అక్కడి బడుగుజనం కన్నీటి పర్యంతమవుతున్నారు. గ్రామంలో కిడ్నీవ్యాధి చావుడప్పు మోగిస్తున్నా.. అధికారుల్లో చలనం మాత్రం రావడం లేదు.

కొమ్రంభీం జిల్లాలోని లొద్దిగూడా లో గత రెండు నెలల్లోనే రాథోడ్‌ ఓంకార్‌, అడె దులాజీ అనే ఇద్దరు యువకులు కిడ్నీలు చెడిపోవడంతో ప్రాణాలుకోల్పోయారు. గురుజ గ్రామంలో 2016 ఒక్క ఏడాది లోనే ( ఉత్తంజాదవ్, బొజ్జు నాయక్, అడెల్లు, చందునాయక్, బాబారావు రాథోడ్, విజయ్, అమీనాజాదవ్, పులిబాయి, లస్మన్న తో పాటు మరో 5 గురు ) 14 మంది ఈ కిడ్నీ వ్యాధితో ప్రాణాలు కోల్పోయారు. లొద్దిగూడాలో ఈ ఏడాదిలో మరో ఎనిమిది మంది మృత్యువాత పడ్డారు. గురుజలో సైతం అదే పరిస్థితి. మరో నలుగురు 2017 లో చనిపోయారు. ఇలా పదుల సంఖ్యల్లో పిట్టల్లా రాలుతున్న కనీసం కాపాడే ప్రయత్నం చేయడం లేదు ప్రభుత్వం.

ఈ విషయమై వైద్య సిబ్బందికి, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి చర్యలు చేపట్టడంలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. భోజనం కంటే మందులే ఎక్కువగా వేసుకోవాల్సి వస్తోందని వాపోతున్నారు. నీటి సమస్యతో ఈ కిడ్నీ వ్యాది వచ్చి ఉండవచ్చని తగ్గుతుందిలే భయపడాల్సిన అవసరంలేదంటూ డాక్టర్లు మందు చీటీలు రాసి పంపేస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గురుజ గ్రామంలోని సంజీవ్, పార్వతి బాయి దంపతులకు ముగ్గురు సంతానం. కూతురు లలిత ఐదేండ్ల వయసుకే కిడ్నీ వ్యాధితో చనిపోయింది. అంతలోనే కొడుకు విజయ్ 2014లో ఇదే వ్యాధితో 15 ఏళ్ల వయసులో కన్నుమూశాడు. పుట్టడు దుఃఖంలో ఉన్న ఆ కుటుంబాన్ని కిడ్నీ భూతం మరో సారి కోలికోలేని దెబ్బ కొట్టింది. మూడేళ్ల నుంచి కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న మరో కొడుకు నిఖిల్‌ 2017 ఫిబ్రవరిలో చికిత్సపొందుతూ చనిపోయాడు. దీంతో సంజీవ్ పార్వతి భాయిల కుటుంబం కన్నబిడ్డలను కోల్పోయి తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది.

లొద్దిగూడా, గురుజ , భూతాయి గ్రామాల్లో కిడ్నీ వ్యాధి ఇంతలా ఎందుకు విజృంభిస్తుందో మాత్రం ఏ వైద్యాధికారి చెప్పడం లేదు. వ్యాధి సోకడానికి కారణమేమిటో ఎవరు కనుక్కోలేక పోతున్నారు. ఈ గ్రామస్తులు తాగే నీటిలో ఐరన్ శాతం అధికంగా ఉండడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఆర్‌డబ్ల్యూఎస్, వైద్యాధికారులు ఈ గ్రామాల వైపు కన్నెత్తి చూడడం లేదు. వ్యాధిబారిన పడినవారు ప్రైవేటు వైద్యం చేయించుకుంటూ వేలల్లో ఖర్చు చేసుకుంటున్నారు. ఆర్థిక స్థోమత లేని వారు మాత్రం ఇంటికే పరిమితమై కన్నుమూస్తున్నారు. అందుకు సాక్ష్యమే తుమ్రం. స్వర్ణలత కుటుంబం. ఈ కుటుంబ యజమాని సుదర్శన్ కన్నుమూయడం పిల్లల ఆలనా పాలన చూడాల్సిన భారం తల్లి మీద పడింది. తల్లి కూడ కిడ్నీ బారీన పడటంతో ఆ కుటుంబం తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది. ఆపన్న హస్తం అందించే వారు లేకపోవడంతో పిల్లలు ఒక పూట తిని మరో పూట పస్తులుంటున్నారు.

ఒక్కరు కాదు ఇద్దరు కాదు పదుల సంఖ్యలో ప్రాణాలు పోతున్నా ప్రభుత్వంలో చలనం లేదు. కిడ్నీ మహమ్మారి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై ఇలా విరుచుకుపడి ప్రాణాలు తోడేస్తున్నా పట్టిచ్చుకునే నాధుడే కరువయ్యారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యాధికి శాశ్వత పరిష్కారం లభించకపోతే గ్రామం వల్లకాడులా మారే అవకాశం ఉందని, తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ఇప్పటికైనా అధికారులు మేలుకొని ఈ వ్యాధికి కారణమేమిటో నిర్థారణ జరిపి చికిత్స అందించాలని వేడుకుంటున్నారు. 

Related Posts
అమెరికా డల్లాస్ లోనూ టీడీపీ కి తాకిన నిరసన సెగ.!!
అమెరికా డల్లాస్ లో మహానాడు ఏర్పాటు చేసిన టీడీపీ కి అక్కడి తెలుగువారి నుండి గట్టి నిరసన సెగ తాకింది. ఈ విషయం సోషల్ మీడియా లో వైరల్ గ మారింది. సమాధానం చెప్పలేని పరిస్థితి లో పడిపోయింది టీడీపీ. విషయమేమంటే.. ...
READ MORE
చంద్రబాబు త్వరలో జైలుకు.. అందుకే 18 మంది టీడీపీ ఎంఎల్ఏ లు.. -సునీల్ దియోధర్
చంద్రబాబు నాయుడు ఆయన కుటుంబ సభ్యులు సన్నిహితులు అంతా అవినీతికి పాల్పడినందున త్వరలోనే చంద్రబాబు నాయుడు జైలుకు వెల్లకతప్పదని.. ఈ విషయం అర్థమయ్యే టీడీపీ కి చెందిన 18 మంది ఎంఎల్ఏ మాతో టచ్ లో ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేసారు ...
READ MORE
తండ్రి ముస్లిం తల్లి క్రిస్టియన్ అయినప్పుడు రాహుల్ గాంధీ హిందు ఎలా..?? దేశ వ్యాప్త చర్చ.!!
మన దేశ సైనికులని చంపుతున్న అంతర్జాతీయ ఉగ్రవాది మసూద్ అజహర్ ని మసూద్ గారు అంటూ మాట్లాడి పరువు పోగొట్టుకున్న కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పై ప్రస్తుతం దేశం ఒక విస్మయాన్ని కలిగించే చర్చ నడుస్తోంది. కేంద్ర ...
READ MORE
భూమా ఇకలేరు… గుండె పోటుతో ఆస్పత్రిలో కన్నుమూత.
నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగరెడ్డి  ఇకలేరు.  ఈ రోజు ఉదయం హఠాత్తుగా గుండె పోటుతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ విషయం తెలియగానే అభిమానులు షాక్ కు గురయ్యారు. గతంలో శోభానాగి రెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా.. ...
READ MORE
భైంసా దారుణ ఘటన గూర్చి ఒక్క బీజేపీ మాత్రమే ఎందుకు పోరాటం చేస్తున్నది.??
తెలంగాణ నిర్మల్ జిల్లా భైంసా లో జరిగిన దారుణ ఘటన గురించి దాదాపు ఏ మీడియా లో రాకున్నప్పటికి ఆ ఘటన లో వంద మందికి పైగా హిందువులు పదుల సంఖ్యలో హిందూ కుటుంబాలు రోడ్డున పడ్డాయి.సొంత ఊర్లో సొంత ఇంట్లో ...
READ MORE
ఓయూ ఉత్సవాల ప్రారంభానికి హాజరు కానీ గవర్నర్.. కారణం ఇదేనా..?
ఉస్మానియా విశ్వవిద్యాలయ వందేళ్లు పూర్తి చేసుకున్న సంధర్భంగా ఓయూ శతాబ్ది ఉత్సవాలు ఈ రోజు ఉదయం ఆర్స్ట్ కళాశాలలో లాంచనంగా ప్రారంభమయ్యాయి. వేలాది తరలి వచ్చిన విద్యార్థులతో ఉస్మానియా సందండి వాతవరణం కనిపించింది. అయితే ఈ కార్యక్రమాని ముఖ్య అతిధిగా హాజరై ...
READ MORE
టోల్ ఫ్లాజ్ పై స్టార్ హోటల్.. హైవే లో నోరూరించే వంటకాలు.
పాత ఒక రోత ఈ సంగతి పక్కన పెడితే కొత్త మాత్రం తప్పక ఒక వింతే అని చెప్పక తప్పదు. బుర్రున్నవాడు బూడిదను అమ్ముకొని అయినా కోట్లు సంపాదిస్తా డంటే ఇలాగే అనుకుంటా. అవును ఇప్పుడు మేము చెప్పే వ్యాపారం సంగతి ...
READ MORE
శివుడు జపించే రామ మంత్రం..
అడ్డ నామాల వాడి నోట నిలువు నామల వాడి మాట. ముక్కంటి కనులలో విష్ణుతత్వం. పరమేశ్వరుడు సృష్టి లయకారకుడు శివుడు రామ మంత్రాన్ని మనసార జపించాడని శాస్త్రాలు చెబుతున్నాయి. అంతటి పర పవిత్ర మంత్ర జగత్తును సర్వ పాపల నుండి పునీతులను ...
READ MORE
డ్రగ్స్ తో మా నాన్నకు ఎలాంటి సంబంధ లేదు.. తండ్రిని వెనకేసుకొచ్చిన పూరీ కూతురు.
ప్రస్తుతం డ్రగ్స్ కేసులో దర్శకుడు పూరి జగన్నాథ్ పేరే ప్రముఖంగా వినిపిస్తోంది. దానిపైన ఆయన ఇచ్చిన కౌంటర్ కూడా పూరీ డ్రగ్స్ మత్తులో పడిపోయాడని చెపుతున్నాయి. ఇదంతా ఒకెత్తయితే పూరీ కూతురు మాత్రం డ్రగ్స్ విషయంలో సంచలన కామంట్స్ చేసింది. డ్రగ్స్ ...
READ MORE
డ్రాగన్ కంట్రీ దుర్బుద్ధి, సరిహద్దులో భారత సైన్యం చైనా సైన్యం మధ్య గొడవ.!!
డ్రాగన్ కంట్రీ గ ఇప్పుడు కరోనా కంట్రీ గా పేరు తెచ్చుకున్న చైనా దేశం మరోసారి తన దుర్బుద్ధి ని ప్రదర్శించింది. ఉత్తర సిక్కిం భారత్ చైనా బార్డర్ వద్ద భారత భుబాగం లోకి చైనా ఆర్మీ చొరబడడం తో మన సైనికులు ...
READ MORE
యూపీలో సిఎం యోగి పైన కుట్రలు జరుగుతున్నయా..??
ఉత్తర్ ప్రదేశ్ లో భాజపా బంపర్ మెజారిటీతో గెలిచాక ఎవరిని ముఖ్యమంత్రి ని చేయాలో చర్చలు తర్వాత యోగీ ఆదిత్యానాద్ ని ఎంపిక చేసింది అధిష్టానం. కానీ ఈ నిర్ణయాన్ని తొలుత చాలామందే వ్యతిరేకించినా తర్వాత ఆయన పాలనలో తన మన ...
READ MORE
జాట్ అధ్యక్షులు పగుడాకుల బాలస్వామి జన్మధిన వేడుకలు.!!
జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (జాట్) అధ్యక్షులు తెలంగాణ ఉద్యమకారులు సీనియర్ జర్నలిస్ట్ పగుడాకుల బాలస్వామి జన్మధిన వేడుకలు పలువురు జర్నలిస్టులు మరియు సామాజిక వేత్తలు మేధావుల సమక్షంలో ఘనంగ జరిగాయి. ఈ సంధర్భంగ పలువురు ప్రముఖులు పగుడాకుల బాలస్వామి ...
READ MORE
ప్రధాని మోడీ హత్య కు హైద్రాబాద్ లో నే ప్లాన్ వేశారా.??
హైద్రాబాద్ నగరం మరోసారి సంచలనానికి కేంద్రబిందువైంది. ప్రపంచ దేశాలన్నీ మన దేశం ప్రధాన మంత్రి నరేంద్ర మోడి అంటే అమితమైన క్రేజ్ ని కనబరుస్తున్న క్రమంలో ప్రపంచవ్యాప్తం గ భారతీయత అంటే మరోసారి వెలుగులీనుతుంది. ఈ పరిణామాల నేపథ్యంలో మోడీ ని హత్య చేయడానికి ...
READ MORE
కాంగ్రెస్ సొంత కార్యకర్తలే కాంగ్రెస్ ను ఓడించి సుష్మా స్వరాజ్ ను గెలిపించారు..!!
కాంగ్రెస్ పార్టీ కి ఓ విచిత్రమైన అనుభవం ఎదురైంది.. అది ట్విట్టర్ వేదికగ జరిగింది. ఇరాక్ లో 39 మంది భారతీయులు చనిపోవడాన్ని గుర్తు చేస్తూ భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ విఫలం అయ్యారని మీరు భావిస్తున్నారా అంటూ కాంగ్రెస్ ...
READ MORE
న్యాయం కోసం నిరాహార దీక్షకు దిగిన ఫార్మా డి వైద్యులు.!!
ఎంబీబీఎస్ చదివినవారు డాక్టర్ వృత్తి చేపడుతారు, ఫార్మసీ చదివితే మెడికల్ ఫీల్డ్ లో స్థిరపడతారు. దాదాపు అన్ని రకాల మెడికల్ విద్యార్థులకు ప్రభుత్వ పరంగానూ ప్రైవేట్ గానూ ఉద్యోగవకాశాలు ఉన్నై.. కానీ ఫార్మా డి చదివిన వారి భవిష్యత్ ప్రశ్నార్థకంగ మారింది. ...
READ MORE
వీడు సర్కార్ డాక్టర్ రూపంలో ఉన్న.. రాక్షసుడు.! ఎందుకో తెలుసా.??
మనిషి చావు బతుకులో ఉన్నా కొన ఊపిరితో ఉన్నా.. డబ్బు లేనిదే వైద్యం చేయవు ప్రైవేట్ కార్పోరేట్ ఆసుపత్రులు. ఎంత ఎమర్జన్సీ అయినా సరే ఓ లక్ష డిపాజిట్ కట్టిన తర్వాతే లోపలికి ఎంట్రీ.. ఈ చండాలమైన కల్చర్ మన దేశం ...
READ MORE
మోడీ పర్యటనను అడ్డుకునే నైతిక హక్కు చంద్రబాబు కు లేదు..!!
ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడి పర్యటనను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న చంద్రబాబు నాయుడు అండ్ కో ను వైఎస్ఆర్సీపీ నేత అంబటి రాంబాబు ఎద్దేవా చేసారు.నాలుగేల్లు మోడీతో అంటకాగిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రధాని కావాలంటున్నాడు ...
READ MORE
కాషాయ కండువా కప్పుకున్న సంచలన సినీనటి.!!
తెలంగాణ లో భారతీయ జనతా పార్టీ దూసుకుపోతోంది. అధికారంలో ఉన్నా లేకున్నా మొదటి నుండి కూడా భాజపా లో గ్లామర్ డోస్ ఎక్కువగానే కనబడుతది. అక్షరాస్యత అవగాహనా చైతన్యం ఉన్న పట్టణ సాంప్రదాయం అలవడిన రంగాలలో సహజంగానే భాజపా బలం పెంచుకుంటుందనేది ...
READ MORE
మాయావతి కి దిమ్మదిరిగే షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు.!!
ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి బహుజన్ సమాజ్ వాది పార్టీ అధినేత మాయావతి కి అత్యున్నత న్యాయస్థానం దిమ్మదిరిగే షాక్ ఇచ్చింది.ఉత్తర ప్రదేశ్ కి ఆమె ముఖ్యమంత్రి గ పదవిలో ఉన్న సమయంలో పార్టీ ప్రచారానికి వేలాది కోట్ల ప్రజా ధనంతో ...
READ MORE
బాలీవుడ్ ఫ్లాప్ షో కు ఊరటనిస్తోన్న “టాయిలెట్”.
"టాయిలెట్" ఏక్ ప్రేమ్ కథా అంటూ తాజా చిత్రం తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్. శ్రీ నారాయణ సింగ్ దర్శకత్వం వహించాడు. ఈ విజయంతోనూ అకి విజయాల పరంపర కొనసాగినట్టు అయింది. ఈ చిత్రం కథకు ప్రధాని ...
READ MORE
సోషల్ మీడియా ద్వారా ఆర్మీని ప్రశ్నించిన రాయ్ మ్యాథ్యూ అనుమానస్పద మృతి.. అతనిది హత్యా..?? ఆత్మహత్యా..?
గత నెల 25న సోషల్ మీడియాలో హల్ చల్ చేసిన సైనికుడు రాయ్ మ్యాథ్యూ గుర్తున్నాడా. ఆర్మీ సహయక్ స్టింగ్ ఆఫరేషన్ పై సోషల్ మీడియా లో ఫోస్ట్ చేసి అధికారుల చేతిలో పిచ్చోడిగా ముద్ర పడ్డ రాయ్ ఇక లేడు. ...
READ MORE
పశువుల కాపరిపై అటవిశాఖ ప్రతాపం.. అడవుల్లో జరుగుతున్న అక్రమాలపై ఇదే తీరున వ్యవహరిస్తున్నారా..?
జన్నారం జింకల పార్క్ సమీపంలోని అటవీ ప్రాంతం నుండి గురువారం సాయంత్రం తన ఆవులను మేపుకొని తిరిగి వస్తున్న ఓ వృద్ధ పశువుల కాపరిపై అటవీ సిబ్బంది తన ప్రతాపం చూపారు. అడవిలో పశువుల సంచారం నిషేధమని ఛల్ జీపు ఎక్కు ...
READ MORE
తెలంగాణ లో అసలు శాంతి భద్రతలు ఎంతవరకు సేఫ్..??
ఎక్కడైనా ఎంతటి పటిష్టమైన భద్రతలు కలిగిన నగరమైనా హత్యలు కొట్లాటలు దోపిడీలు అప్పుడప్పుడైనా బయటపడుతుంటాయి. అదే నగరంలో పోలీసు శాఖ పటిష్టంగ ఉండి, పాలకులు సరైన రీతిలో పాలిస్తే శాంతి భద్రతలు కూడా భద్రంగానే ఉంటాయి. అయినా.. హైద్రాబాద్ లాంటి మహానగరంలో మారుమూల ...
READ MORE
రాజస్తాన్ లో మైనర్ బాలికలపై రేప్ జరిగితే, యూపీ లో ధర్నా చేస్తున్న రాహుల్.!
ఉత్తర్ ప్రదేశ్ హత్రాస్ ఘటన చుట్టూ రాజకీయాలు చెలరేగుతున్నాయి. సెప్టెంబర్ 14న హత్రాస్ జిల్లా బూలాగరి గ్రామంలో 19 ఏళ్ల దళిత బాలికపై నలుగురు ఉన్నత వర్గానికి నలుగురు కీచకులు దారుణానికి ఒడిగట్టారు. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఢిల్లీలోని సఫ్తర్ గంజ్ ...
READ MORE
చికెన్ తినాలీ..నీరా తాగాలీ.! సరే మరి, ఆస్పత్రులను ఎవరు సందర్శన చేయాలి.??
కోవిడ్ వైరస్ కు వేలాది మంది ప్రజలు చిక్కుకుని శారీరకంగా మానసికంగా ఆర్థికంగా శల్యం అవుతున్నా.. ఊహకందని కోవిడ్ మరణాలు సంభవిస్తున్నా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ఎందుకు ప్రవర్తిస్తున్నది అంటూ ప్రతిపక్షాలు సామాన్య ప్రజలు నెత్తి నోరు కొట్టుకుంటున్నా ...
READ MORE
అమెరికా డల్లాస్ లోనూ టీడీపీ కి తాకిన నిరసన సెగ.!!
చంద్రబాబు త్వరలో జైలుకు.. అందుకే 18 మంది టీడీపీ ఎంఎల్ఏ
తండ్రి ముస్లిం తల్లి క్రిస్టియన్ అయినప్పుడు రాహుల్ గాంధీ హిందు
భూమా ఇకలేరు… గుండె పోటుతో ఆస్పత్రిలో కన్నుమూత.
భైంసా దారుణ ఘటన గూర్చి ఒక్క బీజేపీ మాత్రమే ఎందుకు
ఓయూ ఉత్సవాల ప్రారంభానికి హాజరు కానీ గవర్నర్.. కారణం ఇదేనా..?
టోల్ ఫ్లాజ్ పై స్టార్ హోటల్.. హైవే లో నోరూరించే
శివుడు జపించే రామ మంత్రం..
డ్రగ్స్ తో మా నాన్నకు ఎలాంటి సంబంధ లేదు.. తండ్రిని
డ్రాగన్ కంట్రీ దుర్బుద్ధి, సరిహద్దులో భారత సైన్యం చైనా సైన్యం
యూపీలో సిఎం యోగి పైన కుట్రలు జరుగుతున్నయా..??
జాట్ అధ్యక్షులు పగుడాకుల బాలస్వామి జన్మధిన వేడుకలు.!!
ప్రధాని మోడీ హత్య కు హైద్రాబాద్ లో నే ప్లాన్
కాంగ్రెస్ సొంత కార్యకర్తలే కాంగ్రెస్ ను ఓడించి సుష్మా స్వరాజ్
న్యాయం కోసం నిరాహార దీక్షకు దిగిన ఫార్మా డి వైద్యులు.!!
వీడు సర్కార్ డాక్టర్ రూపంలో ఉన్న.. రాక్షసుడు.! ఎందుకో తెలుసా.??
మోడీ పర్యటనను అడ్డుకునే నైతిక హక్కు చంద్రబాబు కు లేదు..!!
కాషాయ కండువా కప్పుకున్న సంచలన సినీనటి.!!
మాయావతి కి దిమ్మదిరిగే షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు.!!
బాలీవుడ్ ఫ్లాప్ షో కు ఊరటనిస్తోన్న “టాయిలెట్”.
సోషల్ మీడియా ద్వారా ఆర్మీని ప్రశ్నించిన రాయ్ మ్యాథ్యూ అనుమానస్పద
పశువుల కాపరిపై అటవిశాఖ ప్రతాపం.. అడవుల్లో జరుగుతున్న అక్రమాలపై ఇదే
తెలంగాణ లో అసలు శాంతి భద్రతలు ఎంతవరకు సేఫ్..??
రాజస్తాన్ లో మైనర్ బాలికలపై రేప్ జరిగితే, యూపీ లో
చికెన్ తినాలీ..నీరా తాగాలీ.! సరే మరి, ఆస్పత్రులను ఎవరు సందర్శన
Facebook Comments
Top
error: Content is protected !!