
వెబ్ ప్రపంచంలోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన మైక్ టీవి తెలంగాణ పాటను సరికొత్తగా ఆవిష్కరించింది. పల్లె మట్టి వాసనలను.. స్వచ్చమైన మనుషుల గొప్పతనాన్ని తెలిపేలా సాగిన ఈ పాట అభిమానులను అలరిస్తోంది. రాజస్థాన్‌కు చెందిన భన్వరి దేవి పాడిన పాటకు స్ఫూర్తి పొంది ఈ పాట ట్యూన్ సమకూర్చారు. తెలంగాణ ఆవిర్బావ దినోత్సవ సంధర్బంగా ఈ పాటను విడుదల చేసింది మైక్ టీవి.
రేలారే రేలారే.. నీళ్లల్లో నిప్పల్లే.. వచ్చింది నిజమల్లే.. పడి లేచి నిలిచే రణములో నాతెలంగాణా.. లేచి నిలిచి గెలిచే రణములో… పల్లె మట్టి వాసనలే.. స్వచ్ఛమైన మనుషులే.. అందమైన భూమి జగములో నాతెలంగాణా.. బంగారు భూమి జగములో….అంటూ తెలంగాణ కీర్తి, గొప్పతనం, సంస్కృతి, భాష, యాస గురించి ఈ పాటలో ఎంతో అందంగా చెప్పారు. కొట్లాట నేర్పిన నేల తెలంగాణ, సిరులు పండే మాగాణి, చెరువుల మిలమిల మెరుపు, పక్షుల కిలకిల అరుపు అంటూ మన తెలంగాణ గొప్పతనం, ఖ్యాతిని గురించి ఎంత గొప్పగా చెప్పారో… చూస్తూ.. విని ఎంజాయ్ చేయండి.. జైతెలంగాణ.. జైజై తెలంగాణ.