
సన్నీలియోన్.. పోర్న్ స్టార్ నుండి బాలీవుడ్ బ్యూటీగా మారిన అందాల తార. ఆ అందాలకు ఫిదా అవ్వని కుర్రకారంటూ లేరు. మత్తెక్కించే అందాలతో వెండితెరను ఊపేస్తోంది. ఇప్పుడా బోల్డ్ సుందరి కేరళాలో అడుగుపెట్టడమే ఆలస్యం సునామీ వచ్చినంత పని చేశారు అక్కడ అభిమాన జనం.
సన్నీతో తమ సినిమాల్లో అందాలు ఆరబోయించడా నికి ఫిల్మ్ మేకర్స్ మాత్రమే కాదు… పలు పాపులర్ మేగజైన్స్ కూడా పోటీ పడుతున్నాయి. కవర్ పేజీలపై ఆమె హాట్ ఫోజుల కోసం పోటీ పడుతున్నాయి. మామూలుగా ఒక బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంటే బిజీ బిజీగా ఉంటోంది సన్నీ. రకరకాల షో లలో డాన్స్ చేయటానికి కూడా సన్నీ కి ఆఫర్లు వస్తూనే ఉన్నాయి.
ఒక్క కేరళ ఘన స్వాగతం చూస్తే చాలు సన్నీ అందాల మత్తులో అభిమానులు ఎంతగా మునిగిపోయారో తెలుస్తుంది. కొచ్చిలో ఓ మొబైల్ కంపెనీ ఇనాగరేషన్ కోసం అక్కడికి వెళ్ళిన సన్నీని చూసేందుకు జనాలు ఎగబడ్డారు. అక్కడి రోడ్లన్ని ఇసుకెస్తే రాలనంతగా కిక్కిరిసిపోయాయి.
సూపర్ స్టార్ లాంటి హీరోగాని, లేక ఒక రాజకీయ నాయకుడు గాని వచ్చినా ఇంత జనం వస్తారో రారో తెలియదు గాని సన్నీ లియోన్ చూడటానికి మాత్రం అంతమంది కేరళ అభిమానులు తరలొచ్చారు. జనం రాకతో ఆ ప్రాంగణం మొత్తం జనసంద్రంగా మారింది. కొచ్చిలోని ఎంజీరోడ్ లో ఉన్న షాప్ ఓపెనింగ్ కి సన్నీ రావడం చాలా ఆలస్యమవు తుందని తెలిసిన కూడా ఆమె కోసం గంటల తరబడి వెయిట్ చేశారు అభిమానులు.
అభిమానుల పిచ్చి ప్రేమతో సన్నీ ఫిదా అయింది. ఆనందం ఆపుకోలేక ఫ్లయింగ్ ముద్దుల వర్షం కురిపిం ఇంది. ఇక అభిమానులు ఆగుతార ఒకటే కేకలు అరు పులు. ఈ కార్యక్రమం ముగిసాక తన ట్విట్టర్లో అభిమా నాన్ని చాటుకుంది. కొచ్చి ప్రజలు చూపించిన ప్రేమకు నేను ధన్యురాలిని. వారి ప్రేమను జీవితంలో ఎప్పటికి మరచిపోలేను అంటూ కామెంట్ పెట్టి ఓ వీడియోని కూడా పోస్ట్ చేసింది సన్నీ. అయితే ఒబామా, ట్రంప్ తర్వాత సన్నీ లియోన్ కోసం ఇంత భారీగా ప్రజలు హాజరు అయ్యారు అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు ఫ్యాన్.