
రాష్ట్రపతి ఎన్నికలు ముగిసాయి. తొందర్లోనే ఉప రాష్ట్రపతి ఎన్నక కూడా ముగియనుంది.
ఇక ఆ తర్వాత ఆయా రాష్ట్రాలకు గవర్నర్ ల నియామకం జరగాల్సి ఉంది.
కేంద్రంలో భాజపా అధికారంలోకి వచ్చాక కూడా యూపీఏ హయాంలో వచ్చిన గవర్నర్లు కొనసాగుతున్నారు.
ఇక వారందరి పదవీ కాలం ముగియనుండడంతో ఆయా రాష్ట్రాలకు నూతన గవర్నర్ల నియామకం జరగనుండడం.. ఈ క్రమంలో తెలంగాణ నుండి మరొక్క సీనియర్ నాయకునికి ఆ అదృష్టం వరించనుందని ఊహాగానాలొస్తున్నై..
కొన్ని వర్గాలైతే డైరెక్ట్ గ బద్దం బాల్ రెడ్డికే ఆ అవకాశం అంటున్నారు.
ఇప్పటికే తెలంగాణ కరింనగర్ కు చెందిన విద్యాసాగర్ రావు మహారాష్ట్ర గవర్నర్ గ పదవీ బాద్యతలు నిర్వహిస్తున్నారు.
ఇక గతంలో కార్వాన్ నియోజకవర్గం లో శాసనసభ ఎన్నికల్లో గెలిచిన అనుభవం ఉన్న బద్దం బాల్ రెడ్డి కూడా భాజపా లో సీనియర్ నాయకుడు.
ఆయన ఆనాడు దేశంలో ఇందిరా గాందీ అద్యక్షతన కాంగ్రెస్ సర్కార్ ఎమర్జెన్సీ విదించిన సమయంలో అద్వానీ, వాజ్ పేయి లతో జైలుకు కూడా వెల్లిన సంధర్బం ఉంది.
ఆ తర్వాత పార్టీ లో పలు విదాల పదవులు నిర్వహించిన ఆయన కార్వాన్ నియోజకవర్గం నుండి ఎంఎల్ఏ గా గెలిపొందారు.
తర్వాత నాటి ఉమ్మడి ఆంద్రప్రదేశ్ కు కాంగ్రెస్ నుండి ముఖ్యమంత్రి అయిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి కార్వాన్ నియోజకవర్గం లో మార్పులు చేర్పులు చేయడంతో ఆ తర్వాత నుండి ప్రతి ఎన్నికల్లోనూ చివరి వరకు వచ్చి కొద్ది తేడాతో ఓటమి పాలవుతున్నారు.
ఈ తతంగం అంతా కూడా వైఎస్ కుట్ర అనేవాల్లు సైతం చాలామందే ఉన్నారు.
కాబట్టి తెలంగాణ నుండి మరొక్కరికి గవర్నర్ పదవి ని కేంద్ర పార్టీ అవకాశం కల్పిస్తే బద్దం బాల్ రెడ్డే ముందు వరుసలో ఉంటారంటున్నారు ఆయన కార్యకర్తలు.



