
శారీరక సంబందాలే ప్రాణాలు తీసుకునేలా చేశాయా..? అవమానాలతోనే ఆత్మహత్యలకు పాల్పడ్డారా..? కుకునూర్ పల్లి ఎస్సై, బ్యూటిషన్ శిరీష అలియాస్ విజయలక్ష్మి మరణాలు ఆత్మహత్యలేనా. అవును ఆత్మహత్యలే అంటూ లెక్క పక్కాగా తేల్చేశారు పోలీసులు. మీరెంతయినా అనుమానాలు పెట్టుకొండి ఇదే నిజం అని చెప్పేశారు హైదరబాద్ సీపీ మహేందర్ రెడ్డి. శారీరక సంబందాల కారణంగానే ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారని. పరువు పోతుందనే యువ పోలీస్ ఆత్మహత్య చేసుకుని చనిపోయాడని చెప్పేసి కేస్ క్లోజ్ చేశారు.
ఇక పోలీసులు చెప్పిన కథ.. స్వారీ కథనం.. ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ మీకోసం.
బ్యూటీషీయన్ శిరీష ఆత్మహత్య చేసుకుంది. లెక్క తెల్లగోల్. హైద్రాబాద్ సిపీ మహేందర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పేశారు సో ఇంకా చర్చలు అనవసరం. అయితే కుకునూర్ పల్లి పోలీస్ స్టేషన్ నుండి వచ్చిన తర్వాత ఆమె స్టూడియోలోనే ఆత్మహత్య చేసుకొందా..? మళ్లీ అనుమానపు ప్రశ్నలేంటి చెప్పారు కదా జస్ట్ పది నిమిషాల్లో ఉరి తాడును ఫ్యాన్ కి కట్టి ఉరివేసుకుని గిలగిలా కొట్టుకుని చనిపోయిందని. మరీ శిరీష పట్ల కుకునూర్ పల్లి ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి అసభ్యంగా ప్రవర్తించాడని పోలీసులు తెలిపారు. అవును.. మరీ అసభ్యంగా ప్రవర్తిన కారణంగానే ప్రభాకర్ రెడ్డి అవమాన భారానికి గురై చనిపోయాడా… యా అదే కదా సార్ చెప్పింది. సో అవమానపు మరణాలే అంతే కదా. ఇక మరి నిందితుల కథేంటి. అక్కడికే వస్తున్నా ఈ ఘటనలో నిందితులుగా ఏ – 1 శ్రవణ్ , ఏ – 2 రాజీవ్ లని తేల్చారు. అదేలా..? అది అర్థం కావాలంటే ప్రెస్ నోట్ ని అక్షరాల్లోకి మార్చిన ఈ కింది కథనాన్ని చదవాలి.
బ్యూటీషీయన్ శిరీష, కుకునూర్ పల్లి ఎస్ ఐ ప్రభాకర్ రెడ్డి ఎస్ ఐ ఆత్మహత్యల కేసులో మిస్టరీని పోలీసులు చేధించారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసులో అన్ని కోణాల్లో కేసును చేధించినట్టుగా పోలీసులు చెబుతున్నారు.
ఈ కేసును టెక్నికల్ గా పరిశోధించినట్టు పోలీసులు చెప్పారు. బ్యూటీషీయన్ శిరీష, రాజీవ్ కు మధ్య నెలకొన్న విబేధాలను పరిష్కరించుకొనే నేపథ్యంలోనే కుకునూరుపల్లికి వెళ్ళారని.. వారికి మధ్య వర్తిగా శ్రావణ్ వెళ్లాడని విచారణలో తేలింది. ఎస్ ఐ ప్రభాకర్ రెడ్డి దేవరకొండ ప్రోబేషనరీ ఎస్ ఐ గా పనిచేసిన సమయం నుండి శ్రవణ్ తో పరిచయం ఉన్న కారణంగా ఈ కేసును హైదరబాద్ టూ కుకునూర్ పల్లికి చేరిందని తేలింది. ఇక ఈ కేసులో ఏ – 1 గా శ్రవణ్ ఎలా చేరాడు.. ఇది లాస్ట్ లో చెప్తా శ్రద్దగా చదవండి ఓకేనా..
రాజీవ్ శిరీష మధ్యలో బెంగళూర్ నుండి హైదరబాద్ వచ్చిన తేజస్విని. వీళ్ల స్టోరితోనే ఈ రెండు మరణాలు సంభవించాయి. విజయలక్ష్మి అలియాస్ శిరీష బ్యూటిషన్ కోర్సు పూర్తి చేసుకుని సొంతగా ఓ షాప్ పెట్టుకుంది. అప్పటికే ఆమెకు పెళ్లయి 12 ఏళ్ల పాప కూడా ఉంది. ఆ షాప్ తో నష్టాలు రావడంతో ఆ దుకాణం మూసేసి రాజీవ్ అనే ఫోటో గ్రాపర్ వద్ద పనిలోకి చేరింది.
బ్యూటీషీయన్ గా శిరీష రాజీవ్ వద్ద నాలుగేళ్ళుగా పనిచేస్తోంది. అయితే వారిద్దరి ఏర్పడిన బంధం కాస్త శరీరక బంధంగా మారింది. ఇక్కడ పోలీసులు ఆమె పై ముద్ర వేసేశారు. శిరీష మంచిది కాదని ఈ మాటతో సమాజం బ్లైండ్ గా ఫిక్స్ అయింది. అయితే ఈ వివాహేతర సంబంధాన్ని శిరీషతో కొనసాగించాలని రాజీవ్ భావించాడు. అనుకోకుండా ఫేస్ బుక్ లో బెంగుళూరుకు చెందిన టెక్కీ తేజస్వీనితో పరిచయం ఏర్పడింది.
సీన్ కట్ చేస్తే.. రాజీవ్ కోసం తేజస్విని బెంగుళూరు నుండి ట్రాన్సపర్ పెట్టుకుని హైదరబాద్ రావడం.. హైదరబాద్ వచ్చాక తనను పెళ్లి చేసుకుంటా అన్న రాజీవ్ శిరీష తో చనువుగా ఉంటున్నాడన్న విషయం తెలియడం.. వచ్చిన మూడు నెలల్లోనే గొడవలు అవ్వడం దీంతో ఈ కేసు కాస్త బంజారహిల్స్ పోలీస్ స్టేషన్ కి కూడా చేరడం జరిగింది.
తేజస్విని, శిరీష మధ్య రాజీవ్ నాకు కావాలంటే నాకు కావాలని గొడవ ముదిరింది. రాజీవ్ ను పెళ్లి చేసుకోవాలని భావించిన తేజస్విని శిరీషతో ఉన్న వివాహేతర సంబంధాన్ని తేల్చుకోవాలని భావించింది. దీంతో మే 30వ, తేదిన తేజస్విని స్వయంగా రాజీవ్ స్టూడియోకు వచ్చి శిరీషతో గొడవ పెట్టుకొంది. అయితే ఈ విషయమై గొడవ పెద్దది కావడంతో రాజీవ్ 100 నెంబర్ కు ఫోన్ చేయడం.. బంజారాహిల్స్ పోలీసులు రావడం
ముగ్గురికి కౌన్సిలింగ్ ఇవ్వడం అన్ని జరిగిపోయాయి. అయితే రెండురోజుల్లో సమస్య పరిష్కారం కాకపోతే మళ్ళీ వస్తానని చెప్పి తేజస్విని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ నుండి బయటకి వచ్చేసింది.
ఆ తరువాత కూడా రాజీవ్, శిరీష ల మధ్య బంధం తెగకపోవడంతో తేజస్విని రాజీవ్ కు గుడ్ భాయ్ చెప్పేందుకు సిద్దమైంది. దీంతో తేజును కోల్పోవడం ఇష్టం లేని రాజీవ్ తన ఫ్రెండ్ శ్రావణ్ ని మధ్య వర్తిగా రంగంలోకి దింపాడు. ఇక్కడ ఇంకో ట్విస్ట్ శిరీష కి గతంలోనే శ్రవణ్ తో పరిచయముంది. అయితే ఈ విషయాన్ని రాజీవ్, శ్రవణ్ వద్ద ప్రస్తావించిన సమయంలో తనకు పరిచయమున్న కుకునూర్ పల్లి ఎస్ ఐ ప్రభాకర్ రెడ్డి సహయం తీసుకోవాలని శ్రవణ్ సూచించాడు.
ఇలా ఈ కేసులోకి ఎంట్రీ ఇచ్చాడు కుకునూర్ పల్లి ఎస్ ఐ ప్రభాకర్ రెడ్డి. ప్రభాకర్ కి శ్రావణ్ కి గతంలో మంచి పరిచయం ఉండటం ఈ కేసులో సాయం చేసే అవకాశం ఉండటంతో శ్రవణ్ ఈ తగాదాను ప్రభాకర్ రెడ్డి కి వివరించాడు. ఎక్కడో కుకునూర్ పల్లిలో ఉన్న ప్రభాకర్ కేసు టేకప్ చేయలేడు కనుక తనకు బాగా పరిచయం ఉన్న బంజారాహిల్స్ ఎస్ ఐ హరీందర్ కు ఈ విషయాన్ని చెప్పి తేజస్విని, శిరీష, రాజీవ్ ల మధ్య గొడవను పరిష్కరించాలని కోరాడు. అయితే ఈ నెల 13న ఈ మేరకు బంజారాహిల్స్ ఎస్ ఐ హరీందర్ ను కలిశారు రాజీవ్, శ్రవణ్, శిరీష. అయితే ఆ సమయంలో హరీందర్ బిజీగా ఉన్నానని.. వారం రోజుల తర్వాత రావాలని సూచించారు. దీంతో కేసు తెగేలా లేదని బావించిన శ్రవణ్ డైరక్ట్ కుకునూర్ పల్లికి వెళ్తేనే సమస్య పరిష్కారం అవుతోందని భావించి.. శిరీషను ఒప్పించి అక్కడికి బయలు దేరారు. అయితే ఇక్కడ తేజస్విని రాలేదు.
కేవలం శిరీష, రాజీవ్, శ్రవణ్ ముగ్గురు కలిసి కుకునూర్ పల్లికి ఈ నెల 13వ తేది రాత్రి బయలుదేరారు. రాత్రి పదకొండున్నర గంటలకు కుకునూర్ పల్లి పోలీస్ స్టేషన్ కు చేరుకొన్నా వారిని ప్రభాకర్ రెడ్డి తన క్వార్టర్స్ లోకి తీసుకెళ్లాడు. అయితే వీరంతా కుకునూర్ పల్లికి బయలుదేరే ముందు మార్గమధ్యలో విస్కీ, స్నాక్స్ తీసుకొన్నారని సీపీ చెప్పారు. మధ్యలో తాగేసి కుకునూర్ పల్లి చేరుకున్నారని ఎస్ ఐ క్వార్టర్ కి చేరుకున్న తరువాత కూడా మద్యం తాగారని తెలిపారు.
ఇక అసలు కథ ఇక్కడే స్టార్ట్ అయింది. మద్యం తాగిన ప్రభాకర్ రెడ్డి శిరీష బలవంతం చేయబోయారు. అదే సమయంలో అక్కడే బయట సిగరెట్ తాగుతూ ఉన్న రాజీవ్, శ్రావణ్ లు పరుగున వచ్చి శిరీష నుండి ప్రభాకర్ ను దూరంగా తీసుకొచ్చారు. అయితే ఆ సమయంలో శిరీష అరుపులు కేకలు వేయడంతో భయపడ్డ ఎస్ ఐ ప్రభాకర్ ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించడంతో శిరీష ను అక్కడి నుండి కొట్టుకుంటూ కారులో ఎక్కించుకుని హైదరబాద్ బయలు దేరారు శ్రావణ్, రాజీవ్ లు.
మద్యం మత్తులో కుకునూర్ పల్లి ఎస్ ఐ ప్రభాకర్ రెడ్డి శిరీషపై అసభ్యంగా ప్రవర్తించాడని ఆ సమయంలో శిరీష తాను అలాంటి దాన్ని కాదని ప్రాధేయపడిందని.. శిరీష భయంతో కేకలు వేయడంతో సిగరెట్టు తాగేందుకు పోలీస్ క్వార్టర్ నుండి బయటకు వచ్చిన రాజీవ్, శ్రవణ్ లు వెంటనే క్వార్టర్ లోకి వెళ్ళారని. అయితే ఆ సమయంలో శిరీష భయంతో ఓ మూలన నక్కి ఉందని నిందితులు చెప్పారని పోలీసులు చెబుతున్నారు. సో ఇక్కడ ప్రభాకర్ హత్యాచారం చేయలేదు. చేసే ప్రయత్నం మాత్రం చేశాడు.. సో తప్పు ప్రభాకర్ దే. ఇక్కడ ఇంకో విషయం రాజీవ్, శ్రావణ్ లకు దగ్గర్లో వేశ్యలు ఉంటారు వెళ్లి ఎంజాయ్ చేయండని చెప్పడం . వారు వెళ్లగానే శిరీష పై అగాయిత్యం చేసే ఫ్లాన్ లో ఉన్నాడని తేలింది.
ఇక ప్రభాకర్ రెడ్డి అసభ్య ప్రవర్తనతో షాక్ కి గురైన శిరీష అరవడం దాంతో ఆమెపై రాజీవ్ దాడి చేయడం అయినా వినని శిరీషను జుట్టు పట్టుకుని కార్లో ఎక్కించుకుని హైదరబాద్ బయలు దేరాడం జరిగాయి. అయితే ఎస్ ఐ ప్రభాకర్ రెడ్డి అత్యాచారయత్నం తో కారులో హైద్రాబాద్ కు తిరిగివస్తున్న సమయంలో తాగిన మత్తులో ఉన్న శిరీష కారు దిగేందుకు ప్రయత్నించింది. ఈ సమయంలో రాజీవ్ మరోసారి ఆమెపై దాడికి దిగాడని సిపీ చెప్పారు. దీంతో మానసికంగా కృంగిపోయిన శిరీష స్టూడియోకు వచ్చిన వెంటనే ఆత్మహత్య చేసుకొందన్నారు. అయితే హైదరబాద్ షేక్ పేట లోని రాజీవ్ స్టూడియో శిరీష చనిపోయిన స్థలం అక్కడి 202 రూం లోకి వెళ్లాలంటే థంబ్ ప్రెస్ చేసి డోర్ తెరవాలి. 3:40 ప్రాంతంలో హైదరబాద్ చేరుకున్న శిరీష, రాజీవ్, శ్రావణ్ లు.. శ్రావణ్ 3:50 కి తన ఇంటికి రిటర్న్ అవగా.. ఇంకా కిందికి రానీ శిరీష కోసం రాజీవ్ పైకి వెళ్లి చూశాడు. 4: 11 కి శిరీష చనిపోయినట్టు గుర్తించిన రాజీవ్ పోలీసులకు పోనద చేశాడు. ఇది శిరీష ఎండ్ కథ. ఇక శిరీష మరణ వార్త ఎస్ ఐ హరిదర్ ద్వారా తెలుసుకున్న ప్రభాకర్ రెడ్డి భయంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది సీపి చెప్పిన కథనం. ఏ 1 గా శ్రవణ్ ఎందుకొచ్చాడో చెప్పలేదు. ఇంకెందుకు మధ్య వర్తిగా ఉండి ఇద్దరి ఆత్మహత్యలకు కారణం అయ్యాడు కదా అందుకే. వాట్.. నోరు తెరవకండి అదంతే. శిరీష బ్యాడ్ ఉమెన్ ఎస్ ఐ ప్రభాకర్ రెడ్డి బ్యాడ్ పోలీస్ దట్స్ ఆల్ కేస్ క్లోజ్. ఇక మీడియాలో కథనాలు పొల్లుపోకుండా రిఫోర్ట్ లో లాగే వచ్చాయని మాత్రం నన్ను అడక్కండే.
సో ఫైనల్ గా రెండు చావులు అవమాన భారంతోనే.
























