You are here
Home > తాజా వార్త‌లు > బీజేపీ వ్యూహం ఫలించేనా..? రాష్ట్రపతి ఎన్నిక ప్రతిపక్షాల మౌనమేల..

బీజేపీ వ్యూహం ఫలించేనా..? రాష్ట్రపతి ఎన్నిక ప్రతిపక్షాల మౌనమేల..

రాష్ట్రపతి ఎన్నికలో చోటు చేసుకున్న పరిణామం అనూహ్యం…ఆశ్చర్యం అని చెప్పవచ్చు. అగ్రనేతలు, వివిధ రంగాల ప్రముఖులు సహా ఎవరెవరో పేర్లు తెరపైకి రాగా వాటన్నింటినీ పక్కకు పెట్టి ఎవ్వరూ ఊహించని పేరు తెరపైకి వచ్చింది. అధికార బీజేపీ కూటమి తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేయబోయే వ్యక్తి పేరు ఖరారైంది. దళితనేతను రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీయే ప్రకటించింది.

రామ్‌నాథ్‌ కోవింద్‌ ఏకగ్రీవంగా ఎన్నికైతే ఆర్కే నారాయణ తర్వాత రెండో దళిత నేత రాష్ట్రపతి పీఠాన్ని అధిష్టించినవారు అవుతారు. బీహార్ గవర్నర్‌గా వ్యవహరిస్తున్న రామ్‌నాథ్‌ కోవింద్‌ను రాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ చీఫ్ అమిత్ షా సోమవారం పార్టీ నిర్ణయాన్ని వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నెల 23న రామ్‌నాధ్‌ కోవింద్ రాష్ట్రపతి పదవికి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ నెల 24న ప్రధాని మోదీ విదేశీ పర్యటనకు వెళ్లనున్నందున అంతకుముందే ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని బీజేపీ నాయకత్వం నిర్ణయించింది.

ఇక రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో బీజేపీ ముందునుంచి వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్నిక విషయంలో వ్యవహరించిన విధంగానే రాష్ట్రపతి అభ్యర్థి ఎన్నిక విషయంలోనూ ఇతర పేర్లను తెరపైకి తీసుకువచ్చింది. బీజేపీ అగ్రనేతలు అద్వానీ, మురళీ మనోహర్ జోషీ, సుష్మా స్వరాజ్, లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్‌, ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్ మోహన్ భగవత్, జార్ఖండ్ గవర్నర్ ద్రౌపదీ ముర్ము  పేర్లు వినిపించాయి. ఇందులో ఒక్కో దశలో ఒక్కొక్కరి పేరుపై ప్రచారం జరిగింది. కానీ… ఎక్కడా కూడా తమ అసలు అభ్యర్థి ఎవరో బయటపెట్టకుండా మోదీ, అమిత్ షాలు అడుగు ముందుకు వేశారు.

అలాగే పార్టీ తరఫున కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, రాజ్‌నాధ్ సింగ్, అరుణ్ జైట్లీలు విపక్షాలు, మిత్రపక్షాలతో సంప్రదింపులు జరిపారు. ఈ చర్చల్లోనూ తమ అభ్యర్థి ఎవరో వాళ్లు కూడా బయటపెట్టలేదు. ఇదే విషయాన్ని కాంగ్రెస్, వామపక్షనేతలతో పాటు మిత్రపక్షం శివసేన నేతలు కూడా ప్రశ్నించారు. అయినప్పటికీ గుంభనంగా వ్యవహరించిన మోదీ, షాలు చివరకు ఎవ్వరూ ఊహించని విధంగా దళిత మంత్రాన్ని పఠించారు. విపక్షాలకు షాకిస్తూ దళితాస్త్రం సంధించారు. రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో బీజేపీ మొదటి నుంచి గుంభనంగా వ్యవహరించింది. చివరికి పార్టీ పార్లమెంటరీ బోర్డు మీటింగ్ ముగిసిన తర్వాత స్వయంగా పార్టీ చీఫ్ అమిత్ షా ప్రకటిస్తేగానీ అసలు పేరు బయటకు రాలేదు.

రాష్ట్రపతి అభ్యర్ధిగా దళిత నాయకుడు రామ్‌నాథ్‌ కోవింద్‌ పేరును ప్రకటించిన బీజేపీ ఒక్కదెబ్బకు రెండు పిట్టలు కొట్టినట్లు వ్యవహరించింది. ఇందులో ఒకటి విపక్షాల మద్ధతు కూడగట్టడం. బీజేపీ సంధించిన దళితాస్త్రంతో విపక్షాలు ఒక్కసారిగా షాక్ తిన్నాయి. గతంలో వాజ్‌పేయ్ హయాంలో ఎలాగైతే అనూహ్యంగా అబ్దుల్ కలాం పేరును తెరపైకి తీసుకొచ్చి విపక్షాలకు చెక్ పెట్టారో ఇప్పుడు కూడా అలాగే దళితమంత్రాన్ని పఠించి విపక్షాలకు అవకాశం లేకుండా చేశారు. నిన్నా మొన్నటి వరకు ఉమ్మడి అభ్యర్థిని నిలబెడతామంటూ బీరాలు పోయిన విపక్ష నేతలు ఇప్పుడు ఒక్కొక్కరే బీజేపీ అభ్యర్థికి మద్ధతు పలుకుతున్నారు. ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్, తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్, సమాజ్‌వాదీ పార్టీ, జేడీయూ అధినేత బీహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌, ఆర్‌ఐపీ సహా పలువురు నేతలు రామ్‌నాథ్‌ అభ్యర్థిత్వానికి మద్ధతు ప్రకటించారు.

ఇక దళితులనే నమ్ముకున్న బీఎస్పీకి కూడా రామ్‌నాథ్‌కే మద్ధతు పలకడం మినహా మరో అవకాశం లేదు. ఇదిలా ఉంటే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి కూడా ఎన్డీఏ అభ్యర్థికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. మరోవైపు ఎన్డీయే తరఫు రాష్ట్రపతి అభ్యర్థిపై నిర్ణయం ఇప్పుడే చెప్పలేమని, పార్టీలో చర్చించిన తర్వాతే నిర్ణయం ప్రకటిస్తామని కాంగ్రెస్‌ ప్రకటించింది. అలాగే ప్రతిపక్షాలన్నీ ఈ నెల 22న సమావేశమై రాష్ట్రపతి అభ్యర్థి వ్యవహారంపై చర్చించిన తర్వాత, పోటీ ఉంటుందా లేదా అనేది అప్పుడే ప్రకటిస్తామని తృణమూల్‌ చీఫ్‌, పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ పేర్కొన్నారు. ఇక వామపక్షాలు కూడా ఎన్డీయే అభ్యర్థికి మద్దతుకు సుముఖంగా లేవు.

ఎవరీ రామ్‌నాధ్ కోవింద్?
రాష్ట్రపతి అభ్యర్థిగా తెరమీదకు వచ్చిన రామ్‌నాధ్ కోవింద్ 1945 ఆగస్టు ఒకటో తేదీన ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ ప్రాంతంలోని దహేత్ జిల్లాలో జన్మించారు. దళితవర్గానికి చెందిన రామ్‌నాథ్‌ కాన్పూర్ యూనివర్సిటీ నుంచి న్యాయవాద పట్టా పుచ్చుకున్నారు. ఢిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో 16 ఏళ్లపాటు న్యాయవాదిగా పనిచేశారు.

1994లో తొలి సారి రాజ్యసభ సభ్యునిగా ఎన్నికైన ఆయన 2000వ సంవత్సరంలో మరోసారి రాజ్యసభ సభ్యునిగా ఎన్నికయ్యారు. పలు పార్లమెంటరీ కమిటీల్లో సభ్యునిగా పని చేశారు. 1998-2002 మధ్య బీజేపీ దళిత మోర్చా అధ్యక్షునిగా వ్యవహరించిన ఆయన 2015 ఆగస్టు 16న బీహార్‌ రాష్ట్ర గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టారు. 2002 అక్టోబర్‌లో భారత్ తరఫున ఐక్యరాజ్యసమితిలో ప్రసంగించిన ఆయన దళితులు, వెనకబడిన వర్గాల అభ్యున్నతి కోసం విశేషంగా కృషి చేశారు. 

Related Posts
అక్కడక్కడ హింస, ఘర్షణలు, దారుణాలతో విఫలంగ ముగిసిన భారత్ బంద్.!!
పెట్రోల్ మరియు డీజిల్ ధరలు పెరిగాయనే కారణంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ మరియు కమ్యునిస్ట్ పార్టీలు కవిసి భారత్ బంద్ కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.. అయితే ఈ బంధ్ ప్రభావం ఎక్కడా కనిపించకపోవడంతో కావచ్చు బహుశా ఫ్రస్టేషన్ లో అక్కడక్కడా ...
READ MORE
ఇండియా వద్దు.. భారత్ లేదా హిందూస్తాన్ గ మార్చాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్.!!
మన దేశానికి గల పేర్లు అంటే భారత్ మరియు హిందూస్తాన్ మరియు ఇండియా అని తెలిసిన విషయమే.. కానీ నేడు మన దేశ పౌరుల్లో ఇండియా అంటూ చెప్పడం ఎక్కువ కనబడుతోంది. అయితే ఇలా ఇండియా అని పిలవడం గర్వ కారణం ...
READ MORE
ఈ ఏడాది మాంకాళమ్మ బోనాలకు లాక్ డౌన్ ఎఫెక్ట్.!!
తెలంగాణ ప్రజలకు మా అంకాలమ్మ బోనాల జాతరకు విడదీయరాని అనుబంధం ఉంటుంది. బోనాల ఉత్సవాల ప్రస్తావన లేకుండా తెలంగాణ చరిత్రను వర్ణించడం కష్టం. అయితే అలాంటి ఘనచరిత్ర ఉన్నటువంటి బోనాల జాతర ఈ ఏడాది జరుపుకోవడం కష్టంగా కనిపిస్తుంది. కరోనా మహమ్మారి ...
READ MORE
జగన్ పై హత్యాయత్నం కేసు అప్డేట్స్.. టీడీపీ సర్కార్ కు షాక్.!!
విశాఖపట్నం విమానాశ్రయంలో ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైసిపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పై కోడి కత్తితో జరిగిన హత్యాయత్నం కేసు విచారణ వేగంగ జరుగుతుంది.ఈ కేసు ఎన్ఐఏ విచారణ చేయడాన్ని వ్యతిరేకించిన రాష్ట్ర ప్రభుత్వం హైకోర్ట్ లో పిటిషన్ వేయగా.. ...
READ MORE
మల్కాజిగిరిలో నిబద్ధత గల మార్గదర్శి ని ఎన్నుకోబోతున్న ప్రజలు.!!
ఇంక రెండు రోజులే మిగిలి ఉన్నై పార్లమెంట్ ఎన్నికల మొదటి దశ పోలింగ్ కు. రెండు తెలుగు రాష్ట్రాలలో పూర్తిగా ఒకే దశలో 11 వ తేదీన పోలింగ్ ముగియనుంది.ప్రచారం ముగింపు దశకు చేరడంతో అన్ని ప్రధాన పార్టీ ల అభ్యర్థులు ...
READ MORE
కేంద్రం ఆధ్వర్యంలో రోజూ 2,80,000 కోవిడ్ టెస్టులు – డా.రాజేష్
IJARSH మరియు లెక్స్ ప్రైస్ సంయుక్తంగా నిర్వహించిన ఆన్ లైన్ సదస్సులో ముఖ్య అతిథిగా హాజరయ్యారు నీతిఅయోగ్ హెల్త్ రీసెర్చ్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ డా.రాజేష్. ఈ సందర్భంగా కరోనా మహమ్మారి వైరస్ నీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా ఎదుర్కుంటున్నాయో పలు ఆసక్తికర ...
READ MORE
ఇప్పటికైనా దళిత ముఖ్యమంత్రి అవుతాడా లేదా..?
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక వరుసగా రెండో సారి ముఖ్యమంత్రి అయ్యారు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. అయితే మొదటి సారి తెరాస అధికారం లోకి రావడం కోసం రకరకాల రాజకీయ వ్యూహాలు వేసిన కేసిఆర్.. తెరాస అధికారం లోకి వస్తె మొదటి ముఖ్యమంత్రి ...
READ MORE
జర్నలిజానికి వన్నె తెస్తున్న జర్నలిజం పవర్ అప్పుడే.. ఏడాది పూర్తి చేసుకుంది.!!
జర్నలిజం అంటే నాట్ ఫర్ జస్ట్ ఫన్.. జర్నలిజం అంటే ఫోర్త్ ఎస్టేట్ అంటూ.. ఒక అత్యున్నత ఆలోచనా విధానంతో.. అత్యంత విలువలు కలిగినా భావజాలంతో.. సామాన్యుడి పక్షాన నిలబడి సమసమాజం కోసం.. ప్రముఖ సామాజికవేత్త మేధావి డా.గిరిధర ఆచార్యుల ఆలోచనలకు ...
READ MORE
అర‌వ‌గోల అయిపోయిందా.. ఇక మ‌న‌  తెలుగు లోకంలోకి రండి.
వారం రోజుల నుంచి ఒక‌టే మోత‌. పొద్దున లేచింది మొద‌లు మ‌ళ్లీ తెల్లారే వ‌ర‌కు రికం లేకుండ ఒక‌టే వార్త. త‌మిళ‌నాడులో అద‌యింది. త‌మిళ‌నాడులో ఇద‌యింది.. అమ్మ ఆత్మ గోసించింది.. ప‌న్నీరు జ‌ల్లైంది శ‌శిక‌ళ క‌న్నీరై పారింది ఇదే వార్త‌లు పాడిందే ...
READ MORE
ఛండాలమైన రోడ్లు, దారుణమైన ట్రాఫిక్, కంపు కంపు గల్లీలు.. ఇది నగరజీవి బతుకు.!!
హైద్రాబాద్ భాగ్యనగరం అంటే నిజంగా భాగ్యాల నగరం అనుకుంటారు చాలామంది, కానీ హైద్రాబాద్ కేవలం ధనవంతులకే అంటే పబ్బులకు క్లబ్బులకు తిరిగేవాడికి తప్ప సామాన్య జనాలకు మాత్రం నరకప్రాయంగ మారింది. హైద్రాబాద్ లో నగరజీవి పరిస్థితి ఎలా ఉందంటే చెప్పుకుంటే సిగ్గుపోయేలా ఉంది. ...
READ MORE
తప్పు చేయకుంటే CBI, NIA అంటే రాష్ట్ర ప్రభుత్వాలకు ఎందుకు భయం..?
CBI(సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్) మరియు NIA(నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ) సంస్థలంటే దేశవ్యాప్తంగ అన్ని రాష్ట్రాలలోనూ నమ్మకం ఉంటుంది ఎందుకంటే ఈ సంస్థలకు రాజ్యాంగం ద్వారా స్వతంత్ర ప్రతిపత్తి ఉంటుంది. రాష్ట్రాలలో ఏదైన కేసులో విచారణ సరిగా జరగని పక్షంలో ...
READ MORE
జాతీయ గీతం వస్తే ఎందుకు నిలబడాలని చర్చించేవాల్లు హిమదాస్ ను చూసి సిగ్గుపడాలి.!!
ప్రపంచ జూనియర్ అథ్లెటిక్స్ అండర్-20 లో 18 ఏండ్ల యువ అథ్లెట్ మహిళల 400 మీటర్ల రేసులో 51.46 సెకన్లలో ముగించి విజేత గ నిలిచి దేశానికి స్వర్ణం సాధించింది. అంతే కాదు ట్రాక్ అండ్ ఫీల్డ్ లో పతకం సాధించిన ...
READ MORE
బ్రేకింగ్ న్యూస్ :- కోమటి రెడ్డి కి కోర్టు తీర్పు రాకముందే సెక్యూరిటీ తొలగించిన టి సర్కార్.!!
అసెంబ్లీ లో జరిగిన వివాదస్పద నిరసనల మూలంగ నల్గొండ ఎంఎల్ఏ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి పై స్పీకర్ అధికారాల పేరుతో వేటు వేసింది కేసిఆర్ సర్కార్. కాగా ఈ విషయం పై కోమటి రెడ్డి ని రాజకీయంగ దెబ్బతీయడానికి ముఖ్యమంత్రి కేసిఆర్ ...
READ MORE
కరోనా పై పోరాటం..మందులు పంపి అమెరికాను ఆదుకోనున్న భారత్..!!
ప్రపంచం లో ఏ దేశానికి ఎటువంటి అవసరం వచ్చినా ఆదుకొనే శక్తి ఉంది ఎవరికి అంటే, అది అమెరికా అని అనుకుంటారు చాలా మంది ప్రజలు. అయితే చైనా వల్ల పుట్టిన మహమ్మారి కరోనా వైరస్ వల్ల అమెరికా గజ గజ ...
READ MORE
టమాటలకు జవాన్ల కాపలా.. కలికాలం బాస్ కలికాలం.
ఏంటి టొమాటోలకు జవాన్లు కాపలనా ఊకో బాస్.. వాటిని ఎవరెత్తుకెళుతారు.. అసలే సండే జనాలు ముక్కా చుక్కా వెంట పడుతారు కానీ నీసు లేకుండా శాకహారం అంటూ పరుగులు పెడుతార అని అనుకోకండి. ఇప్పుడు చికెన్ మటన్ ల కంటే టమాటకే ...
READ MORE
మాయావతి కి దిమ్మదిరిగే షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు.!!
ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి బహుజన్ సమాజ్ వాది పార్టీ అధినేత మాయావతి కి అత్యున్నత న్యాయస్థానం దిమ్మదిరిగే షాక్ ఇచ్చింది.ఉత్తర ప్రదేశ్ కి ఆమె ముఖ్యమంత్రి గ పదవిలో ఉన్న సమయంలో పార్టీ ప్రచారానికి వేలాది కోట్ల ప్రజా ధనంతో ...
READ MORE
ఈరోజు మోడీ జీవితంలో ప్రత్యేకమైనది.!!
మొట్టమొదటిసారి దేశ హోదాలో సొంత ఊరికి వెల్లిన మోడీ.. సెక్యూరిటీని ఆపేసి భావోద్వేగంతో మామూలు వ్యక్తిలా తానే నడుచుకుంటూ వెల్లి చిన్నప్పుడు చదువుకున్న పాఠశాల లో మోకాల్లపై కూర్చొని అక్కడి మట్టిని తీసుకుని బొట్టుగా పెట్టుకున్నాడు. సాధారణంగా ప్రధాని నరేంద్ర మోడీ ...
READ MORE
కలెక్టర్ v/s అధికార పార్టీ MLA, రాష్ట్రమంత రచ్చ రచ్చ అవుతున్న గొడవ
జనగాం అధికార పార్టీ ఎంఎల్ఏ ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన ల మద్య గొడవ సెక్రటేరియట్ కార్యాలయం దాకా వెల్లింది. ఆదినుండే విభేదాలు నడుస్తున్న వీరి మద్యలో తాజాగా బహిరంగంగా కలెెక్టర్ శ్రీదేవసేన ఎంఎల్ఏ భూకబ్జాలకు పాల్పడుతున్నాడని వ్యాఖ్యానించడం ...
READ MORE
ఆధార్ డాటా మాయం.. భారీగా దొంగిలిస్తున్న ఇంట‌లిజెన్స్ ఏజెన్సీలు.
ఆధార్ డాటా... భార‌త ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న ప్రాజెక్ట్. దేశంలో ప్ర‌తి ముఖ్య‌మైన ప‌నికి ఆధార్ ను అనుసందానం చేస్తు దేశంలో ప‌టిష్ట‌మైన భ‌ద్ర‌త‌ను ఏర్పాటు చేస్తున్నామ‌ని చెపుతోంది. కానీ అలాంటి అత్యంత గోప్యంగా ఉండాల్సిన స‌మాచారం ఇప్పుడు దేశాలు దాటిపోతుంద‌న్న ...
READ MORE
అట్టర్ ఫ్లాప్ అయిన హైద్రాబాద్ మెట్రో రైల్.! కారణాలేంటి.??
ఏండ్ల తరబడి వాయిదాల మీద వాయిదాలు ఛేదించి, రాజధాని జనాలను ముప్పు తిప్పలు పెట్టి, ఇంకా నిర్మాణం సాగుతూనే ఉన్నప్పటికీ మొదటి దశ ప్రారంభమైంది. అది కూడా ప్రధాని మోడి చేతుల మీదుగా ఘనంగ అట్టహాసంగ మొదలైంది. కానీ మూడు నెలలు ...
READ MORE
బాలివుడ్ ఖాన్ ల పై కరణ్ జోహార్ పై సర్వత్రా నిరసనలు, తాజాగా ఖంగన షాకింగ్ నిర్ణయం.!!
బాలివుడ్ స్టార్ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకున్న ఘటన బాలివుడ్ లో బడా నటులు ఖాన్ లను బడా నిర్మాత కరణ్ జోహార్ ను పట్టి ఊపెస్తోంది. వీళ్ళ వల్లే సుశాంత్ సింగ్ తీవ్ర మనో వేదనకు గురై ...
READ MORE
పోలీసులలో గిచ్చుడు పోలీసులు వేరయా.. ఇది తెలంగాణ పోలీస్ స్టైల్.!!
పోలీసంటే ఎలా ఉంటారు చేతిలో లాఠీ ఉంటుంది, ఎస్సై లేదా ఇన్స్పెక్టర్ స్థాయి అయితే బెల్టుకొక తుపాకి ఉంటుంది. ఇక పై స్థాయి అధికారుల నుండి వచ్చే ఆదేశాల ప్రకారం లాఠీ లతో తుపాకీలతో శాంతి భద్రతలను పరిరక్షిస్తుంటారు.ఇక రాజ్యాంగం ప్రకారం ...
READ MORE
టిఆర్ఎస్ ఎంపి టీడీపీ వాల్లతో కూర్చోవాల్సి వచ్చింది.. ఎందుకో తెలుసా.?
రాజకీయ నాయకుల్లో దురాశ దుర్భుద్ధి ఎక్కువవడంతో ప్రస్తుతం మొత్తం కన్ఫ్యూజ్ రాజకీయాలు కనబడుతున్నై. ఒక పార్టీ నుండి ఇంకో పార్టీ కి ఎందుకు వెలతారో ఎప్పుడు వెలతారో అర్థం కాని పరిస్థితి. ఊసరవెల్లి కంటే వేగంగ రంగులు మార్చే శక్తి బహుశా ...
READ MORE
చైనా తో ఢీ అంటే ఢీ, దూకుడుగా దూసుకెళ్తున్న భారత్..యుద్ధం తప్పదా.?
డ్రాగన్ కంత్రీ కంట్రీ కరోనా కంట్రీ చైనా తో ఢీ అంటే ఢీ అంటూ తలపడుతోంది భారత్. గాల్వన్ లోయ మాదే అంటూ పేచీ పెడుతున్న చైనా కు గుణపాఠం చెప్పేందుకు చైనా దురాక్రమణ ను తిప్పి కొట్టేందుకు అన్ని విధాలా సన్నద్ధమవుతున్నది ...
READ MORE
మురళీధర్ రావు పై కుట్రలు పన్నిన దొంగలకు గుణపాఠం చెప్పిన న్యాయస్థానం.!!
దేశ వ్యాప్తంగా ఒక్కో రాష్ట్రాన్ని కైవసం చేసుకుంటూ ధర్మ స్థాపన చేస్తున్న ప్రధాని నరేంద్ర మోడి టీం లో ముఖ్యమైన నాయకుడు మురళీధర్ రావు పై జరిగిన కుట్రలను భగ్నం చేసింది న్యాయస్థానం. దీంతో ధర్మం మొదట్లో ఆరోపనలు నిందలు ఎదుర్కున్నా ...
READ MORE
అక్కడక్కడ హింస, ఘర్షణలు, దారుణాలతో విఫలంగ ముగిసిన భారత్ బంద్.!!
ఇండియా వద్దు.. భారత్ లేదా హిందూస్తాన్ గ మార్చాలంటూ సుప్రీంకోర్టులో
ఈ ఏడాది మాంకాళమ్మ బోనాలకు లాక్ డౌన్ ఎఫెక్ట్.!!
జగన్ పై హత్యాయత్నం కేసు అప్డేట్స్.. టీడీపీ సర్కార్ కు
మల్కాజిగిరిలో నిబద్ధత గల మార్గదర్శి ని ఎన్నుకోబోతున్న ప్రజలు.!!
కేంద్రం ఆధ్వర్యంలో రోజూ 2,80,000 కోవిడ్ టెస్టులు – డా.రాజేష్
ఇప్పటికైనా దళిత ముఖ్యమంత్రి అవుతాడా లేదా..?
జర్నలిజానికి వన్నె తెస్తున్న జర్నలిజం పవర్ అప్పుడే.. ఏడాది పూర్తి
అర‌వ‌గోల అయిపోయిందా.. ఇక మ‌న‌ తెలుగు లోకంలోకి రండి.
ఛండాలమైన రోడ్లు, దారుణమైన ట్రాఫిక్, కంపు కంపు గల్లీలు.. ఇది
తప్పు చేయకుంటే CBI, NIA అంటే రాష్ట్ర ప్రభుత్వాలకు ఎందుకు
జాతీయ గీతం వస్తే ఎందుకు నిలబడాలని చర్చించేవాల్లు హిమదాస్ ను
బ్రేకింగ్ న్యూస్ :- కోమటి రెడ్డి కి కోర్టు తీర్పు
కరోనా పై పోరాటం..మందులు పంపి అమెరికాను ఆదుకోనున్న భారత్..!!
టమాటలకు జవాన్ల కాపలా.. కలికాలం బాస్ కలికాలం.
మాయావతి కి దిమ్మదిరిగే షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు.!!
ఈరోజు మోడీ జీవితంలో ప్రత్యేకమైనది.!!
కలెక్టర్ v/s అధికార పార్టీ MLA, రాష్ట్రమంత రచ్చ రచ్చ
ఆధార్ డాటా మాయం.. భారీగా దొంగిలిస్తున్న ఇంట‌లిజెన్స్ ఏజెన్సీలు.
అట్టర్ ఫ్లాప్ అయిన హైద్రాబాద్ మెట్రో రైల్.! కారణాలేంటి.??
బాలివుడ్ ఖాన్ ల పై కరణ్ జోహార్ పై సర్వత్రా
పోలీసులలో గిచ్చుడు పోలీసులు వేరయా.. ఇది తెలంగాణ పోలీస్ స్టైల్.!!
టిఆర్ఎస్ ఎంపి టీడీపీ వాల్లతో కూర్చోవాల్సి వచ్చింది.. ఎందుకో తెలుసా.?
చైనా తో ఢీ అంటే ఢీ, దూకుడుగా దూసుకెళ్తున్న భారత్..యుద్ధం
మురళీధర్ రావు పై కుట్రలు పన్నిన దొంగలకు గుణపాఠం చెప్పిన
Facebook Comments
Top
error: Content is protected !!