“ఉద్యమ గడ్డకే సంకెళ్లా.. రాష్ట్రానికి ఊపిరి పోసిన తల్లికే స్వేచ్చ బంధా..? ఇదే నా తెలంగాణ రాజ్యం. ఇదేనా స్వేచ్చ గీతం. ఉక్కు పిడికిళ్లకు సంకెళ్లెస్తే ఏం జరుగుతుందో తెలియదా. ఉప్పెనను ఆపాలని చూస్తే ఏం అవుతుందో కొత్తగా చెప్పాలా..?”
తెలంగాణ ఉద్యమానికి ఊపిరి ఆ గడ్డ.. తెలంగాణ తొలి దశ నుండి మలి దశ దాక 60 ఏండ్ల కొట్లాటకు నిలువుటద్దం ఆ తల్లి. అక్కడ ఉరికొయ్యలకు వేలాడే తలలు కూడా గర్వంగా చావును ఎదిరిస్తాయి.. అగ్నికి ఆహుతయ్యే శరీరాలు ఉప్పెనను తోలుకొస్తాయి. ఎవడబ్బ జాగీరు రా నా నేల అంటూ గొంతులు పెక్కటిల్లుతాయి. పంచభూతలా సాక్షిగా నలుదిక్కుల ఎగిసిపడిన పోరాటం నా ఉద్యమాల గడ్డ ఉస్మానియా తల్లి సొంతం.
ఇక్కడ పోరాటాలు ఉగ్గు పాలతో నరనరాన ఇమిడిపోతాయి. ఇక్కడి చదువులు చరిత్రను మారుస్తాయి. మార్చాయ్.. మారుస్తున్నాయ్.ఇక్కడ చిగురించిన మొక్కలు వటవృక్షాలై రాజ్యాలను ఏలుతాయి.. ఏలాయ్.. ఏలుతున్నాయి. .
చదువు , సంస్కారం , పోరాటం, రాజకీయం ఒక్కటేమిటి ఇక్కడ నేర్చుకోలేనిదంటు లేదు. ఇది నా ఉస్మానియా విశ్వవిద్యాలయ ఘనత. తెలంగాణ రాష్ట్రానికి ఊపిరి పోసిన నా ఉస్మానియా ఇప్పుడు ఎవడికి కానరానిదైంది.
ఈ గడ్డపై గర్జించాల్సిన గొంతులను ఓ పేద్ద రాజకీయం మూగబోయేలా చేయాలని చూస్తోంది. కుట్రలకు ఇప్పుడే కాదు ఎప్పుడు బలికాబోదన్నది ఉస్మానియా విశ్వవిద్యాలయ గోడల చరిత్రే చెపుతోంది. తెలియనోడు ఎవడన్న ఉంటే చెవులు దగ్గర పెట్టి జాగ్రత్తగా వినండి. తరతరాల చరిత్రను నరనరాల్లో నింపుకునేలా తేజో మేదస్సు వెలిగిపోయేలా చెపుతోంది.
అనేక ప్రజాస్వామిక ఉద్యమాలకు వేదికైనా ఉస్మానియా విశ్వ విద్యాలయం ఇప్పుడు ప్రశాంతంగానే ఉంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో కీలక భూమికగా నిలిచిన ఉస్మానియా యూనివర్సిటీలో సభలు , సాంస్కృతిక కార్యక్రమాలు కొత్తేమి కాదు. ఇక్కడ స్వేచ్చ గాలిలా విహరిస్తూనే ఉంటుంది. మరి ఆ గాలినే ఆపాలనుకుంటే ఊపిరి ఆగి చావడం ఖాయం. ఇప్పుడు జరగబోయేది అదే.
ఉస్మానియా విశ్వ విద్యాలయంలో ఎలాంటి సభలు సమావేశాలు పెట్టొద్దని యూనివర్సిటీ హుకూం జారీ చేసింది. స్వేచ్ఛగా అభిప్రాయాల మార్పిడికి యూని వర్సిటీ వేదికలు కావాలని ఇటీవల జరిగిన ఉస్మానియా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలను ప్రారంభిస్తూ ప్రథమ పౌరుడు, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చెప్పిన సంగతి తెలిసిందే. అలా ప్రకటించి కనీసం రెండు నెలలైనా గడవక ముందే సభలపై యూనివర్సిటీ నిషేధం విధించింది.
యూనివర్సిటీ అధ్యాపకులు, బోధకులు, సిబ్బంది విద్యా, పరిశోధనేతర కార్యకలాపాలకు పాల్పొడొద్దని బుధవారం రాత్రి ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది. విశ్వవిద్యాలయం ప్రాంగణంలో రాజకీయ, బహిరంగ సభలను అనుమతించబోమని స్పష్టం చేసింది. విశ్వవిద్యాలయాల లక్షం విద్యాపరమైన, పరిశోధన సంబంధిత అంశాలకే పరిమితమని పేర్కొంది. ఇది అసలయ కథ. అయితే విద్యార్థి శక్తిని అడ్డుకునే దమ్ము ధైర్యం ఎవరికుంది. ఉన్నపలంగా రాత్రికి రాత్రికి హుకూం జారీ చేయడం వెనుక ఎవరి హస్తం ఉంది.
ఉద్యమ చరిత్రకు నిలువుటద్దమైన ఉస్మానియానినే.. ఉద్యమాలకే దూరం చేయాలన్న ఆలోచన ఇప్పటి కిప్పుడు పుట్టిందేనా..? లేక ఉస్మానియాలో అడుగు పెట్టిన క్షణంలో మాట పడిపోయిన వెంటనే పుట్టిందా..? సభలు వద్దని చెప్పడానికి ప్రధాన కారణం కాంగ్రెస్ త్వరలో సభ నిర్వహిస్తామని తెలపడమేనా..?
కాంగ్రెస్ ఇలా ప్రకటించడమే ఆలస్యం విద్యాశాఖ మంత్రి అలా ప్రకటన కూడా ఇచ్చేశాడే దాని వెనుకున్న అసలు మర్మం ఏంటి..? ఇంకా ప్రత్యేకంగా చెప్పాలా.. వీసిల నోటీసుల వెనుక.. ఉస్మానియా విద్యార్థులను అనచివేసే దోరణి వెనుక ఏ మైండ్ గేమ్ హస్తం ఉందో. నేనే రాజు నాదే రాజ్యం అనుకునే ఏ పాలన చివరి వరకు సాగలేదు అపజయంతో అదపాతాళానికి వెళ్లకుండా లేదు. విద్యార్థులతో ఆటలు మంచివి కావు.. అందులోనూ ఉస్మానియా విద్యా శక్తితో ఆటలు అసలుకే ఎసరు తెచ్చినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు. రాత్రి నిర్ణయాలు అసలు వెలుగే లేకుండా చేసినా చేయొచ్చు. తస్మాత్ జాగ్రత్త.
దట్టంగా కప్పుకున్న పొగ మంచుతో ఢిల్లీ ఆగ్రా జాతీయ రహదారిపై భారీ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అసలు ముందు ఏ వాహనం ఉందో తెలుసుకునే వీలు లేకుండా పొగ మంచు దట్టంగా కమ్ముకోవడం పక్కన ఉన్న మనిషి కూడా కనిపించకపోవడంతో ...
సూపర్ స్టార్ రజినీకాంత్ గత కొంత కాలం నుండి రాజకీయాల గురించి మాట్లాడుతూ.. రాజకీయాల్లోకి రావడం పక్కా అని చెప్పడం జరిగింది. కానీ పార్టీ పేరు గాని, అజెండా గాని ఇంతవరకు చెప్పలేదు. అందరూ పార్లమెంట్ ఎన్నికల్లోపు పూర్తిగ రాజకీయాల్లోకి వస్తారని ...
తమిళనాడు రాష్ట్రం లో ఒక దారుణం జరిగింది. అయితే ఈ ఘటనకు సోషల్ మీడియా ఫన్నీ యాప్ టిక్ టాక్ కారణమవడం గమనార్హం. వివరాల్లోకి వెల్తే.. తమిళనాడు లోని కోవై ప్రాంతంలో నివసించే భార్యభర్తలు నందిని కనకరాజు లకు కొద్ది రోజులుగ ...
బడ్జెట్ అంకెల గారడీః తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ కొండను తవ్వి ఎలుక తోక చూపించిన విధంగా ఉంది. అంకెల గారడీ తప్ప ఈ బడ్జెట్ వల్ల ఎవరికి లాభం లేదు అని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. నొప్పించక తానొవ్వక అన్నట్లు ...
నా తప్పేం లేదు గేమ్ వల్ల ఆత్మహత్య చేసుకుంటున్నారంటే ఈ సమాజంలో అలాంటి బలహీనమైన మనుషులను ఏరిపారేస్తున్న.. ఈ మాటలను అంటుంది ఎవరంటే.. ఫిలిప్ బొడికిన్. ఈయనే ఈ ప్రాణాలను బలిగొంటున్న "బ్లూవేల్" అనే గేమ్ ను తయారు చేసాడు.
ఒక ఆట ...
యోగి ఆదిత్యనాధ్ ఒక నెల ముందు కేవకం ఒక సాదువు.. అందరి దృష్టిలో సన్యాసి. ఇంకా కొందరి దృష్టిలో సన్నాసి. అతి పెద్ద రాష్ట్రాన్ని బీజేపీ చేజిక్కించుకున్నాక అనూహ్యంగా తెర మీదకి వచ్చిన పేరు యోగి. సరిగ్గా నెల తరువాత ఆయనో ...
నెగ్గలేమని తెలిసి కూడా కేవలం రాజకీయ ప్రయోజనాలు ఆశించి తీవ్రంగ భంగ పడింది తెలుగు దేశం పార్టీ.
అవిశ్వాస తీర్మానంలో సభ్యుల సంఖ్య ఆధారంగ టీడీపీ కి 13 నిమిషాల సమయం ఇచ్చినా అది గంట సేపు పొడిగించినా కూడా టీడీపీ ఎంపీలు ...
సిడ్నీ: ప్రయాణికులంతా ఎవరి సీట్లలో వారు కూర్చొని.. విమానం టేకాఫ్ కోసం ఎదురుచూస్తున్న తరుణంలో.. బాంబులు పెట్టారన్న వార్త వారి గుండెలదిరిపడేలా చేసింది. దీంతో అంతా ఒక్కసారిగా విమానం నుంచి బయటకు దూకేశారు. తీరా విమానంలో తనిఖీలు నిర్వహించిన బాంబు స్క్వాడ్.. ...
సార్ వెళ్లిపోయి అప్పుడే రెండెళ్లయింది. నిన్న మొన్న మనల్ని విడిచి వెళ్లినట్టు తోస్తోంది. అయినా ఆయనెక్కడికెళ్లాడు.. ప్రతి నిమిషం ప్రతి క్షణం మన కణకణం రగిలిస్తూ మనలో కొత్త భావాలను పుట్టిస్తూ మనసే మతం మనమే కులం మన బాటే ధర్మం ...
కలియుగ ప్రత్యక్ష దైవం గ పూజలందుకునే వేంకటేశ్నరుడు కొలువై ఉన్న తిరుమల ఆస్థానంలో రోజు రోజుకు అపచారాలు బయటపడుతూనే ఉన్నై..
మొన్నటికి మొన్న టీటీడీ లో ఉన్నత స్థాయి లో ఉద్యోగం చేస్తూ హిందువుల సొమ్మును నెల నెల జీతంగ తింటూ ...
తెలంగాణ ప్రభుత్వం పేద, మారుమూల ప్రాంత విద్యార్థులు, యువజనుల కోసం అమోఘమైన కృషి చేస్తుందని అస్సాం ఐటి శాఖ మంత్రి కేశభ్ మహంత కొనియాడారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి విద్య, వైద్య, మహిళ, ఉపాధి, ఆరోగ్య రంగాలను అభివృద్ధి చేసేందుకు ...
సీఎం కేసీఆర్ తన సర్వేతో ఎమ్మెల్యేలు, మంత్రులకు దిమ్మ తిరిగిపోయే షాక్ ఇచ్చారు. ఇప్పటి వరకు ఏ ఒక్క నాయకున్ని పాలనలో పని తీరుపై ప్రశ్నించని ముఖ్యమంత్రి.. ఈ సర్వేతో ఒక్క సారిగా ఉగ్రరూపం చూపించారు. సర్వేలో పాలన సరిగ్గా లేదని ...
ఇప్పుడు దేశమంతా ఒకటే చర్చ.. పౌరసత్వ సవరణ బిల్లు.వాస్తవానికి ఈ బిల్లును సమర్థించే మెజారిటీ ప్రజలకు దాదాపు ఒక అవగాహన ఉంది. కానీ వ్యతిరేకిస్తున్న కొందరికి ఈ బిల్లుపై సరైన అవగాహన లేక, మరో వర్గం అయితే బీజేపీ ప్రభుత్వం ఏం ...
ఖాకీలంటే కర్కశత్వం కాదు మానవత్వం అని నిరూపించారు కరీంనగర్ పోలీసులు. మాలో కూడా మనసున్న మారాజులున్నారు అని తెలిసేలా ఓ తండ్రిలేని ఆడబిడ్డకు అన్ని తామై దగ్గర ఘనంగా పెళ్లి చేశారు. అందరి చేత శబాష్ పోలీస్ అనిపించుకుంటున్నారు.
కరీంనగర్ జిల్లా రామడుగు ...
2019 ఎన్నికల సమరం ముంచుకొస్తున్న తరుణంలో రాష్ట్రం లో భాజపా జనాల్లోకి దూసుకెలుతోంది ఈ విషయం లో భాజపా అధిష్ఠానం దాదాపు సక్సెస్ అవుతోంది. తాజాగా మేడ్చల్ నియోజకవర్గం జవహర్ నగర్ లో ఆ పార్టీ రాష్ట్ర ఉపాద్యక్షులు నియోజకవర్గ ఇంఛార్జ్ ...
తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ దుమారం రేపుతున్న టీడీపీ నేత రేవంత్ రెడ్డి ఎపిసోడ్ ఇంకా కంటిన్యూ అవుతుంది. వచ్చే నెల 9న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ లో చేరబోతున్నటు వార్తలొస్తున్నై.. గత వారంలో ఢిల్లీ వెల్లి కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు ...
భాజపా సీనియర్ నాయకులు పట్టభద్రుల MLC ఎన్ రాంచందర్ రావు ఇంట్లో విషాదం నెలకొంది.ఈ ఉదయం 9:30 సమయంలో రాంచందర్ రావు తల్లి శ్రీమతి రాఘవ సీత పరమపదించారు. దీంతో వారి కుటుంబంతో పాటు రాంచందర్ రావు సన్నిహితులు పార్టీ శ్రేణులు ...
మన దేశం నుండి నల్లధనాన్ని తరలించి చాలామంది స్విట్జర్లాండ్ లోని స్విస్ బ్యాంక్ లో దాచుకున్న ఖాతాల వివరాలు సమాచార హక్కు క్రింద ఇవ్వడం కుదరదని ఈ విషయం సమాచార హక్కు చట్టం 8(1)A, 8(1)(f) ప్రకారం మినహాయింపు ఉందని ప్రభుత్వం ...
తెలంగాణ ఆపద్దర్మ ముఖ్యమంత్రి కేసిఆర్ మరోసారి తన నోటికి పనిచెప్పారు.
నిన్న జరిగిన తెరాస పార్టీ బహిరంగసభ లో ప్రతిపక్షాల పై తీవ్ర స్థాయి లో విమర్శలు చేసారు.
ఆయన చేసిన విమర్శలు వాడిన భాష పై పలువురు రాజకీయ సామాజిక ...
కర్నాటక లో ఎన్నికల చదరంగం మతం రంగు పులుముకుంటోంది.. హిందువులను విభజించి లబ్ది పొందడానికి అధికార కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది. ఎన్నికలు దగ్గరపడ్డ సమయంలో ఆ రాష్ట్రం లో 18% ఉన్న లింగాయత్ లను హిందువులు కాదంటూ.. ...
దేశ వ్యాప్తంగా ఈ నెల 23న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఇదే అదనుగ భావించిన ఉగ్రమూకలు అదే రోజు దేశంలో ఉగ్ర దాడి కి పాల్పడి అలజడి సృష్టించడానికి కుట్రలు చేసాయి.పాకిస్తాన్ ఉగ్రవాదులు ఉగ్రదాడికి ఎంచుకున్న ప్రాంతాల్లో శ్రీనగర్, అవంతిపుర వైమానిక ...
అసలే తిక్క.. దానికో లెక్క కూడా లేదు.. బాసలెన్నో చేసి ఆశలు పెంచాడు. అవన్నీ అడియాశలైపోయాయి. ఈయన అరవింద కాదు, గురవింద అని తెలుసుకున్నారు హస్తిన జనం.. ఎంసీడీ ఎన్నికల్లో చెంప పెట్టులాంటి తీర్పు ఇచ్చారు. ఏదో చేస్తానని వచ్చింది ఆమ్ ...
తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ఉమ్మడి ఆంద్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి ఎన్టిఆర్ తనయుడు నటుడు నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించడంతో నందమూరి అభిమానులు టీడీపీ అభిమానులు చాలా ఆవేదనకు గురవడం జరిగింది.
సంఘటన జరిగి రెండు రోజులు గడిచినా ...
దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడ్డాడని ఆరోపనలు ఎదుర్కుంటున్న JNU విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు కన్హయ కుమార్ చెంప ఛెల్లుమనిపించారు విద్యార్ధులు.. లక్నోలో జరుగుతున్న లిటరరీ కార్యక్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
లక్నోలో మొదలైన ఈ లిటరరీ కార్యక్రమం మూడు రోజుల ...