You are here
Home > తాజా వార్త‌లు > జిల్లాలు పెంచి నేటికి ఏడాదీ.! పాలనను మాత్రం గాలికొదిలేసిన టిసర్కార్.!!

జిల్లాలు పెంచి నేటికి ఏడాదీ.! పాలనను మాత్రం గాలికొదిలేసిన టిసర్కార్.!!

ఎంతో అట్టహాసంగా ఆర్భాటంగ పది జిల్లాలను 31 జిల్లాలుగా విభజించి ఇక పరిపాలన అంటే ఏందో సూపిస్తం అని తొడలు కొట్టింది తెలంగాణ సర్కార్.. ఆ తంతు ముగించి గిట్ల నేటికి ఏడాది, కానీ ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉంది, దీనికి తోడు పాత పది జిల్లాలకు రెండు జోన్లుండేవీ.. ఆ జోన్లను బట్టే ఉద్యోగ నోటిఫికేషన్లుండేవీ ఇక ఇప్పుడు 31 జిల్లాలుగ విభజించాక ఏ ప్రాంతాన్ని ఏ జోన్ కింద విభజించాలో అనే మీమాంసలో పడిపోయింది టిసర్కార్.. జిల్లాల పునర్విభజన తర్వాత నిరుద్యోగ సమస్య మరింతగా పెరిగిపోయింది. ఆఖరికి ఉద్యోగ నోటిఫికేషన్లకేం తొందరుంది అని సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులే మీడియా ముందు చెప్పిండ్రంటే విషయం అర్థం చేసుకోవాలి. అధికార పార్టీ నాయకులు తెలంగాణ విశ్వవిద్యాలయాల్లో అడుగు పెట్టలేని పరిస్థితి ఉందంటే అతిశయోక్తి కాదు. ఇక ఈ ఉద్యోగాల విషయం ఇలా ఉంటే.. ఇంత వరకు పూర్తిగా పట్టాలెక్కలేని పరిస్థితి కొత్త జిల్లాలది. ఇక కొత్తగా మార్పులు చేర్పులు చేసిన మండలాల్లోనూ.. రెవెన్యూ డివిజన్లోనూ పూర్తిస్థాయి పాలన గాడిన పడలేదు. దీనికి తోడు ఇంకా ఆయా ప్రాంతాల్లో కొత్త జిల్లాలు కొత్త రెవెన్యూ మండలాల డిమాండ్ కోసం ఉద్యమాలు కొనసాగుతూనే ఉండగా మరోవైపు ఈ జిల్లాలు మాకొద్దు వీటి వల్ల మాకు ఒరిగిందేమీ లేదనే వారూ పెరుగుతున్నారు. ఏదో హడావుడిగా వారికి నచ్చినట్టు పది జిల్లాలను 31 ముక్కలుగా విభజించారు కానీ ఆ 31 జిల్లాలకు పర్మినెంట్ జిల్లా ఆఫీసులను జిల్లా స్థాయి అధికారులను కేటాయించాలన్న విషయాన్ని మాత్రం విస్మరించింది తెలంగాణ సర్కార్.
ఏ ఒక్క జిల్లాలోనూ సరైన ఆఫీసులకు.. ఆఫీసర్లకు దిక్కు దివాన కరువైంది.

నగరం నడిబొడ్డు నుండి మారుమూల పల్లెదాక.. అసెంబ్లీ నుండి అడవి మన్యం దాకా పాలనలో ఘననీయమైన మార్పులతో అభివృద్ధి ని ఫ్లెక్సిబుల్ చేసి వేగవంతం చేస్తున్నం అని, రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ వన్ అభివృద్ధి బాట పట్టిస్తం అని డబ్బా కొట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఆఖరికొస్తే.. అన్ని విషయాల్లో ఘోరంగ విఫలం అయిపోయి తీవ్ర విమర్శలపాలైతున్నది.
మరోపక్క ఆ ఉన్న అధికారులకు ఆయా జిల్లాలలో రూలింగ్ పార్టీ ఎంఎల్ఏలకూ లీడర్లకు మధ్య అస్సలు పొసగక జరగాల్సిన చిన్న చితకా పనులుకూడా జరగడంలేదు.

సరే జిల్లాలను ఏర్పాటు చేసి ఏడాదైనా పాలనను గాడిలో పెట్టలేదు ఇకనైనా పడుతుంది అనుకుంటే అది అత్యాశే అవుతదేమో..??
ఉన్న ఐదేండ్లలో మిగిలిన పుణ్య కాలం కేవలం సంవత్సరం నర, ఇప్పటికే 2019 ఎన్నికల వ్యూహాలు మొదలైనై.. ఇంకో నాలుగు నెలలైతే ప్రత్యక్ష ఎన్నికల వేడి మొదలవుతది, ఆ సమయంలో జిల్లాలను పట్టించుకునే నాధుడు ఉంటడా..?? ఇదే అరకొర ఏర్పాట్లతో కొద్దిమంది అధికారులతో మరో సంవత్సరమో రెండేల్లో పాలన కొనసాగితే గనక జిల్లాలో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు పూర్తిగ ప్రజలకు దూరమయ్యే ప్రమాదం ఉంది. అందుకే ఇప్పటికే.. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మాకు కావాల్సింది జిల్లాలు కాదు అభివృద్ధి, సంక్షేమ పథకాలు, నీతివంతమైన పాలన అంతే కానీ.. పిలుచుకోవడానికి మాత్రమే ఉపయోగపడే జిల్లాలు మాకెందుకని అంటున్నారు సామాన్య జనాలు. 31 జిల్లాలు ఏర్పాటు చేస్తే అభివృద్ధి వికేంద్రీకరణ జరిగి అందరికీ అడవుల్లో ఉండే ఆదివాసులకు కూడా అభివృద్ధి ఫలాలు అందుతై అనుకుంటే.. కేవలం రాజకీయ లబ్దికోసం ఏర్పాటు చేసి గాలికొదిలేయడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ప్రజలు.

ఇచ్చిన హామీలు ఒక్కటంటే ఒక్కటి కూడా నెరవేర్చడం లేదు రాష్ట్ర సర్కార్. పేదలకు డబుల్ బెడ్రూం అన్నారు అది కేవలం పేపర్లో ఫోటోలకే పరిమితం కాగా దళితులకు ముఖ్యమంత్రి పదవి దేవుడెరుగు మూడెకరాల భూమీ పథకం అయితే కేవలం ప్రచార ఆర్భాటమే అయింది. వీటన్నింటికీ జిల్లాలలో అధికార పార్టీ నాయకులు, ఎంఎల్ఏలు,ఎంఎల్సీలు మంత్రులు సాగిస్తున్న అరాచకాలు దౌర్జన్యాలు అదనం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా లో అడవి బిడ్డలను బట్టలిప్పి చెట్టుకు కట్టేసి కొట్టడాలు, నేరెల్లలో దళితుల పై రాక్షసకాండ, ఖమ్మం మిర్చి రైతుల చేతులకు బేడీలు, గతి తప్పిన రాజధాని వ్యవస్థ, ఉద్యమకారులపై చీత్కారాలు ఉద్యమ ద్రోహులకు తాయిలాలు.. ఇవన్నీ గాడి తప్పిన పాలనకు పరాకాష్టగా మిగిలాయి.
సెంటిమెంట్ ముసుగులో కుటుంబ పాలన సాగిస్తున్న అధికార పార్టీని 2019 లో ప్రజలు ఎంత వరకు స్వీకరిస్తారో చూడాలి మరి. 

Related Posts
చైనా వైరస్ అంటే.. చైనా కు కోపం వచ్చేస్తుంది మరి.!!
కరోనా వైరస్ చేస్తున్న విలయ తాండవం అంతా ఇంతా కాదు, ఈ వైరస్ వల్ల ప్రపంచ దేశాలు ఎంత ఇబ్బంది పడుతున్నాయో కళ్ళముందు చూస్తున్నం.ఇంతటి దారుణానికి ప్రత్యక్షం గ కారణమైన కమ్యునిస్టు చైనా దేశం.. ప్రవర్తన మరీ విడ్డూరంగ ఉంది.ఎందుకంటే అమెరికా ...
READ MORE
సంఘీ శక్తులే ఉగ్రవాదులు.. మరి వాళ్లు హిందువులో కాదో తేల్చుకోవాలి.
డిగ్గీ రాజా మళ్లీ నోరు జారారు. హిందువులు ఉగ్రవాదులు కాదని సంఘ్ పరివార్ వారు మాత్రమే ఉగ్రవాదులని తెలిపారు. హిందువులు ఏనాడూ టెర్రరిస్టులు కారని, అసలు హిందూ టెర్రరిజం అన్న పదమే లేదని హర్యానా మంత్రి అనిల్ విజ్ వ్యాఖ్యానించడంతో కౌంటర్ ...
READ MORE
తెలంగాణ పోలీసులపై సీఎం వరాల జల్లు..
తెలంగాణ పోలీసులపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ వరాల వర్షం కురిపించారు. హైదరాబాద్‌ మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీలో ఎస్సై స్థాయినుండి డీజీ స్థాయి వరకూ అధికారులతో కేసీఆర్‌ సమావేశమయ్యారు ... ఈ సందర్భంగా మాట్లాడిన కేసీఆర్ మహిళా పోలీసుల సౌకర్యాలు కల్పించాలని సూచించారు. దీనికవసరమైన సొమ్మును ...
READ MORE
“మహర్షి” పేరుతో జనాల జేబులు ఖాళీ చేయడానికి సిద్దమైన థియేటర్లు.!!
టాలీవుడ్ ప్రముఖ సినీ నటుడు మహేష్ బాబు నటించిన లేటెస్ట్ సినిమా "మహర్షి" కి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక అనుమతులు ఇచ్చినట్టు తెలుస్తోంది. విడుదల నుండి రెండు వారాల పాటు 80 టిక్కెట్ ను 110 గ మరియు మల్టీప్లెక్స్ లో ...
READ MORE
మొక్కలకు ప్రాణం పోద్దాం.. రేపటి భవిష్యత్ ను రక్షించుకుందాం.
ఏ చెట్టులో ఏ ఔషధ గుణాలున్నాయో తెలుసుకున్న ప్పుడే- వాటి విలువ అవగతమవుతుంది. మన పూర్వీకులు కొన్ని చెట్లలో ఔషధ గుణాలుండటం గమనించి, మనిషి ఆరోగ్యానికి ఉపకరిస్తాయని తెలుసుకొని వాటిని జాగ్రత్తగా పరిరక్షించి పూజించడం మొదలుపెట్టారు. వీటిలో తులసి, మామిడి, రావి, ...
READ MORE
ICC ప్రెసిడెంట్ రేస్ లో దూసుకెళ్తున్న మన దాదా.. పాక్ క్రికెటర్ సైతం మద్దతు.!!
రాబోయే జూలై లో ఇంటర్నేషనల్ క్రికెట్ కమిటీ (ICC) కి అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. కాగా ప్రతిష్టాత్మకమైన ఈ పదవికి పలు దేశాల క్రికెట్ టీం ల నుండి ప్రముఖులు పోటీ పడుతున్నారు. ఈ పదవికి భారత లెజెండరీ కెప్టెన్ మాజీ ...
READ MORE
సర్జికల్ స్ట్రైక్ 2 ఎఫెక్ట్.. ABVP ఆధ్వర్యంలో ఘనంగ విజయోత్సవాలు.!!
పుల్వామా ఉగ్ర దాడికి ప్రతీకారంగ నేడు పాకిస్తాన్ పై భారత్ జరిపిన వైమానిక దాడి విజయవంతం కావడంతో.. దాదాపు 400 మంది పాకిస్తాన్ ఉగ్రవాదులు హతం కావడంతో దేశ వ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి.ఈ క్రమంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ...
READ MORE
పాకిస్తాన్ ను ముక్కలు ముక్కలుగ చేయండి..!!
భాజపా రాజ్యసభ సభ్యుడు ప్రముఖ న్యాయవాది సుబ్రహ్మణ్యం స్వామి మన దేశ సీఆర్పీఎఫ్ సైనికులపై పాకిస్తాన్ జరిపిన ఉగ్ర దాడి పై తీవ్రంగ స్పందించారు. వెంటనే పాకిస్తాన్ తో దౌత్యపరమైన సంబంధాలు తెంచేసుకుని పాకిస్తాన్ లోకి వెల్లి ఆ దేశాన్ని నాలుగు ...
READ MORE
వంకర బుద్ధి చూపిస్తున్న చైనా.. శాంతి అంటూనే కాల్పులకు తెగబడుతోంది.
పాకిస్తాన్ మిత్ర దేశం చైనా కు కూడా పాకిస్తాన్ బుద్ది బాగానే అంటుకున్నటు అనిపిస్తోంది. సరిహద్దు సమస్యను శాంతియుత చర్చల ద్వారానే ఇరు దేశాల సమన్వయం తో పరిష్కారం మంచిదంటు చెప్తూనే మరో వైపు సరిహద్దులో మన సైన్యంపై కవ్వింపు చర్యలకు పాల్పడుతూ ...
READ MORE
తెలంగాణలో మిత్రపక్షాన్ని ఖాళీ చేయిస్తున్న బీజేపీ.. కమలం గూటికి టీటీడీపీ ఎమ్ఎల్ఏ బీసీ నేత ఆర్ క్రిష్ణయ్య.
బీసీ సంఘం జాతీయ అద్యక్షుడు తెలంగాణ టీడీపీ ఎమ్ఎల్ఏ ఆర్ క్రిష్ణయ్య బీజేపీలోకి చేరుతున్నాడా..? తెలంగాణలో మిత్రపక్షానికే గాలంవేసి ఖాళీ చేసే దిశలో బీజేపీ సాగుతుందా అంటే అవుననే సమాదానాలు వినిపిస్తున్నాయి. నిన్న మొన్నటి దాక రేవంత్ రెడ్డి చేరిక తప్పదని ...
READ MORE
భాజపా నేషనల్ మీడియా కోఆర్డినేటర్ తో భేటీ అయిన డా.గిరిధరాచార్యులు.!!
జర్నలిజం పవర్ ఛైర్మన్ ప్రముఖ విద్యావేత్త డా.గిరిధరాచార్యులు తన ఢిల్లీ పర్యటనను విజయవంతంగ కొనసాగిస్తున్నారు. పర్యటనలో భాగంగ పలువురు ప్రభుత్వ పెద్దలను కలిసిన ఆయన తద్వారా భాజపా నేషనల్ మీడియా కోఆర్డినేటర్ సంజయ్ తో భేటీ అయ్యారు. ఢిల్లీ లోని కార్యాలయంలో ...
READ MORE
పూర్ణః సాహ‌సానికి ప‌రిమితులుండ‌వు… బాలీవుడ్ తెర‌పై రేపే విడుద‌ల‌.
తెలంగాణ గొప్ప త‌నాన్ని తెలంగాణ మారుమూల ప‌ల్లెల అపార శ‌క్తిని ప్ర‌పంచానికి చాటిన బాలిక పూర్ణ‌. తెలుగు స‌త్తాను తెలంగాణ ఖ్యాతిని తెలుగు వెండితెర మ‌ర‌చినా బాలీవుడ్ మాత్రం హ‌క్కున చేర్చుకుంది. ఎంతో క‌ష్టానికోర్చి ప్రాణాలు ప‌ణంగా పెట్టి ఎవ‌రెస్ట్ శిఖారాన్ని ...
READ MORE
కాంగ్రెస్ నేత కాలేరు జై నవీన్ వంజరి జన్మధినం.
కాంగ్రెస్ పార్టీ ఉప్పల్ నియోజకవర్గం నాయకుడు కాలేరు జై నవీన్ వంజరి జన్మధిన వేడుకలు కార్యకర్త ల కోలాహలం మధ్య జరిగాయి. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజిగిరి లోక్ సభ నియోజకవర్గం లో రేవంత్ రెడ్డి గెలుపు లో ప్రధాన పాత్ర ...
READ MORE
ఆదిలాబాద్ లో తెలుగు దేశం ఖేల్ క‌థ‌మ్.. టీడీపీకి రాథోడ్ ర‌మేష్ రాం రాం.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఖాళీ అయిపోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కీలక నేతలంతా గులాబీ గూటికి చేరిపోగా ఇప్పుడు త‌న వంతుగా జిల్లాలో టీడీపీ పెద్ద దిక్కుగా ఉన్న పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ ఎంపీ రాథోడ్ రమేశ్ ఈ ...
READ MORE
ముర‌ళి మ‌ర‌ణంతో ఉస్మానియాలో ఉద్రిక్త‌త‌.. ఆత్మ‌హ‌త్య లెట‌ర్ ని పోలీసులు మార్చ‌రంటున్న ఓయూ విద్యార్థులు.
ముర‌ళి ఆత్మ‌హ‌త్య ప‌లు అనుమానాల‌ను రేకెత్తిస్తోంది. తెలంగాణ వ‌స్తే యువ‌త‌కు బంగారు భ‌విష్య‌త్ వ‌స్తుందని అమ‌రుడు శ్రీకాంత్ చారి త‌న ప్రాణాల‌ను ప‌నంగా పెడితే అలాంటి ప్రాణాలు మ‌ళ్లీ మ‌ళ్లీ పోవాల్సిన దుస్థితి ఇంకా కొన‌సాగుతోంది. ఉద్య‌మం చేసిన ఉస్మానియా ఇంకా ...
READ MORE
టీనేజీలోనే పిల్లలిలా తెగిస్తుంటే తల్లిదండ్రులు గాడిదలు కాస్తున్నారా.?
పార్టీకెలుతున్న అని చెప్పి ఇంట్లో నుంచి వెల్లి అమీన్ పూర్ గుట్టల్లో శవమై కనిపించిన ఇంటర్ విద్యార్థిని ఛాందిని జైన్ కేసులో విస్మయం కలిగించే విషయాలు తెలుస్తున్నై.. ఈ విషయాలన్నీ పిల్లల యొక్క తల్లిదండ్రుల వైపు వేలెత్తి చూపేవిధంగ ఉన్నై. పిల్లలను ఇంటర్నేషనల్ ...
READ MORE
ఎన్నికలు ముంచుకొస్తున్న వేల కర్నాటక లో బీజేపీ కి పెద్ద బూస్టింగ్..!!
ఈశాన్య రాష్ట్రాల ఎన్నికలు ముగిసాయి అనుకున్నటు గానే భాజపా తన ప్రభంజనాన్ని చూపించింది. కాంగ్రెస్ పార్టీ ఖాతాలు కూడా తెరవకపోగా.. కమ్యునిస్టులు ఘోరంగ దెబ్బతిన్నారు. ఇక ఇప్పుడు చూపంతా కర్నాటక పై. మరో రెండు నెలల్లో ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు రానున్నై.. ...
READ MORE
ఎంసెట్ లీకు వీరులకు అండగా ఉన్నది మంత్రి కేటిఆర్ మరియు ఎంపి కవితలే – ఏబీవీపీ
తెలంగాణ రాష్ట్రం లో ఎంసెట్ లీకు కుంభకోణం వ్యవహారం రోజు రోజుకు పెద్ద ఉద్యమానికి దారి తీస్తోంది. ఎంసెట్ లీకు వ్యవహారం పై అసలు నిందితులు నారాయణ విద్యా సంస్థల అధినేత ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ మరియు శ్రీ చైతన్య విద్యా ...
READ MORE
చంద్రబాబు దీక్ష సభనా.!బాహుబలి షూటింగా.!! ఒక్క రోజుకు 20కోట్ల ప్రజా ధనం ఖర్చు..
రాష్ట్రానికి కేంద్రం నిధులివ్వడం లేదంటూ.. హోదా కావాలంటూ.. రాష్ట్రం డబ్బు లేక అప్పుల్లో ఉందంటూ నిరసన దీక్షకు పూనుకున్న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏకంగ 20 కోట్ల ప్రజా ధనాన్ని ఖర్చు చేస్తున్నారు. అప్పుల్లో ఉన్నామంటూనే ...
READ MORE
చంద్రబాబు ని కూడా మనిషిగా మారుస్తారా.. అని నీలదీసిన పోసాని..!!
ప్రముఖ సినీ నటుడు దర్శకుడు రచయిత పోసాని కృష్ణ మురళి మరోసారి నెట్టింట్లో హాట్ డిస్కషన్ కి కారణం అవుతున్నాడు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కేంద్రానికి రాష్ట్రానికినడుస్తున్న రాజకీయ చదరంగం నేపథ్యం లో చర్చకోసమని ఓ తెలుగు ప్రైవేట్ న్యూస్ ...
READ MORE
చైనా ఓవరాక్షన్ కు కౌంటర్ ఇచ్చిన భారత్.!!
మరోసారి చైనా భారత్ విషయంలో తలదూర్చింది. హిమాచల్ ప్రదేశ్ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడి పలు అభివృద్ధి కార్యక్రమాల దృష్ట్యా పర్యటించగా అభ్యంతరం వ్యక్తం చేసింది డ్రాగన్ కంట్రీ చైనా.. హిమాచల్ ప్రదేశ్ సరిహద్దు వివాదస్పద ప్రాంతంగ పేర్కొనడం జరిగింది. ...
READ MORE
ఇక దేశంలో కమ్యునిజం అంతరించినట్టేనా..?
ప్రజాస్వామ్య దేశంలో ఒక రాజకీయ సంస్థ మనుగడలో ఉండాలంటే అధికారం తప్పనిసరి.ప్రతీ ఎన్నికకూ పురోగతి సాధించని పక్షంలో ఇక ఆ రాజకీయ పార్టీ అంతరించే లేదా కనుమరుగయ్యేందుకు సిధ్దంగ ఉన్నట్టే అంటున్నారు పలువురు రాజకీయ సామాజిక విశ్లేషకులు. ప్రస్తుతం మన దేశం ...
READ MORE
సినీ క్రిటిక్ కత్తి మహేష్ నిజంగా ఇంత నీచుడా..? రేపిస్టా..??
ఒక సాధారణ వ్యక్తి గ సినిమాల పై విశ్లేషణలు రాస్తూ సినీ క్రిటిక్ అనే కత్తి మహేష్.. తద్వారా తెలుగులో ప్రసారమైన టీవీ షో బిగ్ బాస్ లో పాల్గొని తర్వాత పవన్ కళ్యాణ్ జనసేన పై విమర్శలు చేయడం ద్వారా ...
READ MORE
కర్నాటకలో కాంగ్రెస్ మార్క్ పాలన.. గుమాస్తాగా మారిన ముఖ్యమంత్రి కుమార స్వామి.!!
దేశంలో 60 ఏండ్లు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ.. ప్రస్తుతం అతికష్టం మీద నడుస్తోంది. త్వరలో రాబోతున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాగైన విజయం సాధించాలని పరితపిస్తోన్నా ఈసారి కూడా అధికారం దక్కడం కాంగ్రెస్ పార్టీ కి ఎండమావిగానే మిగిలిపోనున్నదని విశ్లేషకుల అంచనా.. అయితే.. ...
READ MORE
అంగరంగ వైభవంగ ప్రారంభమైన లక్ష్మీ నృసింహ స్వామి బ్రహ్మోత్సవాలు..!!
కీసర మండలం చీర్యాల శ్రీ శ్రీ శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి బ్రహ్మోత్సవాలు నిన్న అంగరంగ వైభవంగ వేద మంత్రాల నడుమ ప్రారంభం జరిగాయి. ఆలయ చైర్మణ్ లక్ష్మీ నృసింహ స్వామి ఉపాసకులు మల్లారపు లక్ష్మీ నారాయణ కుటుంబ సమేథంగ ప్రత్యేక ...
READ MORE
చైనా వైరస్ అంటే.. చైనా కు కోపం వచ్చేస్తుంది మరి.!!
సంఘీ శక్తులే ఉగ్రవాదులు.. మరి వాళ్లు హిందువులో కాదో తేల్చుకోవాలి.
తెలంగాణ పోలీసులపై సీఎం వరాల జల్లు..
“మహర్షి” పేరుతో జనాల జేబులు ఖాళీ చేయడానికి సిద్దమైన థియేటర్లు.!!
మొక్కలకు ప్రాణం పోద్దాం.. రేపటి భవిష్యత్ ను రక్షించుకుందాం.
ICC ప్రెసిడెంట్ రేస్ లో దూసుకెళ్తున్న మన దాదా.. పాక్
సర్జికల్ స్ట్రైక్ 2 ఎఫెక్ట్.. ABVP ఆధ్వర్యంలో ఘనంగ విజయోత్సవాలు.!!
పాకిస్తాన్ ను ముక్కలు ముక్కలుగ చేయండి..!!
వంకర బుద్ధి చూపిస్తున్న చైనా.. శాంతి అంటూనే కాల్పులకు తెగబడుతోంది.
తెలంగాణలో మిత్రపక్షాన్ని ఖాళీ చేయిస్తున్న బీజేపీ.. కమలం గూటికి టీటీడీపీ
భాజపా నేషనల్ మీడియా కోఆర్డినేటర్ తో భేటీ అయిన డా.గిరిధరాచార్యులు.!!
పూర్ణః సాహ‌సానికి ప‌రిమితులుండ‌వు… బాలీవుడ్ తెర‌పై రేపే విడుద‌ల‌.
కాంగ్రెస్ నేత కాలేరు జై నవీన్ వంజరి జన్మధినం.
ఆదిలాబాద్ లో తెలుగు దేశం ఖేల్ క‌థ‌మ్.. టీడీపీకి రాథోడ్
ముర‌ళి మ‌ర‌ణంతో ఉస్మానియాలో ఉద్రిక్త‌త‌.. ఆత్మ‌హ‌త్య లెట‌ర్ ని పోలీసులు
టీనేజీలోనే పిల్లలిలా తెగిస్తుంటే తల్లిదండ్రులు గాడిదలు కాస్తున్నారా.?
ఎన్నికలు ముంచుకొస్తున్న వేల కర్నాటక లో బీజేపీ కి పెద్ద
ఎంసెట్ లీకు వీరులకు అండగా ఉన్నది మంత్రి కేటిఆర్ మరియు
చంద్రబాబు దీక్ష సభనా.!బాహుబలి షూటింగా.!! ఒక్క రోజుకు 20కోట్ల ప్రజా
చంద్రబాబు ని కూడా మనిషిగా మారుస్తారా.. అని నీలదీసిన పోసాని..!!
చైనా ఓవరాక్షన్ కు కౌంటర్ ఇచ్చిన భారత్.!!
ఇక దేశంలో కమ్యునిజం అంతరించినట్టేనా..?
సినీ క్రిటిక్ కత్తి మహేష్ నిజంగా ఇంత నీచుడా..? రేపిస్టా..??
కర్నాటకలో కాంగ్రెస్ మార్క్ పాలన.. గుమాస్తాగా మారిన ముఖ్యమంత్రి కుమార
అంగరంగ వైభవంగ ప్రారంభమైన లక్ష్మీ నృసింహ స్వామి బ్రహ్మోత్సవాలు..!!
Facebook Comments
Top
error: Content is protected !!