
నంద్యాల ఉపఎన్నిక ట్రెండ్ మొదటి నుంచీ టీడీపీకి అనుకూలంగా స్పష్టమైంది. ప్రతి రౌండ్ లోనూ అధికార పార్టీ హవా చాటుతోంది. ఓట్ల శాతం పెరగడంతో ఆదిక్యం రావనుకున్న ప్రాంతాల్లో సైతం టీడీపీ దూసుకుపోతోంది. రౌండ్ రౌండ్ ఆదిక్యత చాటు అంతకంతకు మెజార్టీని పెంచుకుంటూ దూసుకుపోతోంది. వైసిపికి ఎక్కడ కూడా ఆదిక్యత కనిపించడం లేదు.
ఓటింగ్ వివరాలు:
తొలిరౌండ్: టీడీపీ-5,477, వైసీపీ-4,279, కాంగ్రెస్-69 ఓట్లు.
రెండో రౌండ్: టీడీపీ-5,162, వైసీపీ-3,400, కాంగ్రెస్-73 ఓట్లు.
మూడో రౌండ్: టీడీపీ-6,640, వైసీపీ-3,553, కాంగ్రెస్-77 ఓట్లు.
నాలుగో రౌండ్: టీడీపీ-6,465 , వైసీపీ- 2,859, కాంగ్రెస్-56 ఓట్లు.
ఐదో రౌండ్: టీడీపీ-6,975, వైసీపీ-3,563, కాంగ్రెస్-87 ఓట్లు.
ఆరో రౌండ్: టీడీపీ-6161, వైసీపీ-2858 ఓట్లు.
నంద్యాలలో కొనసాగుతున్న టీడీపీ ఆధిక్యం
తొలిరౌండ్లో టీడీపీకి 1,198 ఓట్ల మెజారిటీ.
రెండో రౌండ్లో టీడీపీకి 1,762 ఓట్ల మెజారిటీ.
మూడో రౌండ్లో టీడీపీకి 3,113 ఓట్ల మెజారిటీ.
నాలుగో రౌండ్లో టీడీపీకి 3,597 ఓట్ల మెజారిటీ.
ఐదో రౌండ్లో టీడీపీకి 3492 ఓట్ల మెజారిటీ.
ఐదో రౌండ్ పూర్తయ్యేసరికి టీడీపీకి 13,162 ఓట్ల ఆధిక్యం.
ఇక ఆదిక్యం పక్కగా దూసుకుపోతుండటంతో టీడీపీ శ్రేణుల్లో ఆనందం పొంగిపొర్లుతోంది. నంద్యాల ఉప ఎన్నిక ఫలితాలు తమకు అనుకూలంగా ఉండడంతో టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్య మంత్రి చంద్రబాబు ఇంటివద్ద పార్టీ కార్యకర్తలు పటాసులు కాల్చి తమ ఆనందోత్సాహాలను ప్రకటించా రు. అటు-చంద్రబాబు మూడేళ్ళ పాలనకు ఈ ఎన్నిక ఫలితాలు నిదర్శనమని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహ న్ రెడ్డి వ్యాఖ్యానించారు.
రాష్ట్ర అభివృద్ధికోసం బాబు పడుతున్న కష్టాన్ని నంద్యాల ప్రజలు గుర్తించారని అన్నారు. ఈ ఎన్నిక ప్రచారంలో జగన్ వాడిన భాష అక్కడి ప్రజలకు ఆగ్రహం కలిగించిందని, కాకినాడ కార్పోరేషన్ ఎన్నికల్లోనూ టీడీపీ హవా కనిపించడం ఖాయమని ఆయన పేర్కొన్నారు.
























