
కుకునూర్ పల్లి ఎస్సై ప్రభాకర్ రెడ్డి హత్య..? ఆత్మహత్య అని చెప్పడాని కంటే హత్య అని చెప్పేందుకే ఆదారాలు ఎక్కువున్నాయన్నది ఆఫ్ ది రికార్డ్. హైదరబాద్ బ్యూటిషన్ శిరిషా ఆత్మహత్య..? సేమ్ టూ సేమ్ ఇక్కడ కూడా హత్య అని చెప్పేందుకే ఆదారాలు ఎక్కువ. అయితే ఎక్కడో చనిపోయిన శిరీషకి.. ఆ చావు తరువాత కుకునూర్ పల్లి పోలీస్ క్వార్టస్ లో చనిపోయిన ప్రభాకర్ రెడ్డి అసలు లింక్ ఎక్కడిది. మీడియ కోడై కూస్తున్నట్టు శిరీషను ప్రభాకర్ రెడ్డి అత్యాచారం చేశాడా..? అదే నిజమైతే శిరిషా కుకునూర్ పల్లి నుండి వంద కిలోమీటర్లు ప్రయాణించి హైదరబాద్ లో అది కూడా తను పని చేస్తున్న ఫోటో స్టూడియోలో ఆత్మహత్య చేసుకోవడం ఏంటి. మిస్టరీ మరణాల వెనుక చాలా లోతు కథలే ఉన్నట్టుగా మాత్రం అర్థం అవుతోంది.
ఇద్దరివి ఆత్మహత్యలు కావు హత్యలే అన్నది తేట తెల్లమవుతోంది. మొదట శిరీష మరణం విషయానికి వస్తే. శిరీష చనిపోయిన సమయంలో చూశానని చెపుతున్న ఆమె స్నేహితుడు రాజీవ్.. ఆమె ఉరి వేసుకున్న చున్నీని విప్పి కిందకి దింపాడని చెప్తున్న విషయమే పలు అనుమానాలకు తావిస్తోంది.
శిరీష తనతో పాటు తన వాహనంలో వచ్చింది.. కార్ పార్క్ చేసి వచ్చేలోపే ఉరి వేసుకుంది. వెంటనే నేను వచ్చి చూసే సరికి ఫ్యాన్ కి వేలాడుతుందని చెప్పిన రాజీవ్ మాటల్లో అసలు నిజం ఏ మూలన కూడా కనిపించడం లేదు.
ఒక వేళ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంటే మెడ.. ఒంటి మీద గాయాలెందుకు అయ్యాయి. ఉరి వేసుకుని చనిపోయిన మాటే నిజమైతే కేవలం పార్క్ చేసి వచ్చే లోపే శిరిష ఉరి తాడు ఫ్యాన్ కి కట్టి అంతలోనే ఉరి వేసుకుని చనిపోయిందా.
ఉరి వేసుకుని చనిపోయిన కేసుల్లో నాలుక బయటకి వస్తదని చెప్తారే.. అలా ఎందుకు జరగలేదు. ఇంకా ఇంకా శిరీష మృతిలో అనుమానాలు చాలానే.
ఇక ఎస్సై ప్రభాకర్ రెడ్డి విషయానికి వస్తే…
తానుంటున్న పోలీస్ క్వార్టర్స్ లోనే ప్రభాకర్ ఆత్మహత్య చేసుకున్నాడు. అది కూడా తన సర్విస్ రివాల్వర్ తో.. అదే నిజమైతే….
కుర్చీలో కూర్చుని కాల్చుకున్న ప్రభాకర్ రెఢ్డి పాయింట్ బ్లాక్లో తుఫాకీ తో కాల్చుకుంటే… తన బాడీ ఆపోజిట్ డైరక్షన్ లో పడిపోవాలి కదా. అలా ఎందుకు జరగలేదు. తను ఎడమ కణితికి కాల్చుకున్నాడంటే బుల్లెట్ కుడి కణితి నుండి బయటికి వెళ్లి అక్కడ దగ్గరలో ఉన్న గోడకు తగలాలి కదా. మరి బుల్లెట్ ఏది..?
25 యార్డ్స్ రేంజ్ లో ఉన్న పిస్టల్ తో… అదీ కూడా పాయింట్ బ్లాక్ లో కాల్చుకుంటే… కాల్చుకున్న వ్యక్తి ఖచ్చితంగా తను కూర్చున్న ప్లాస్టిక్ కుర్చీలో నుండి 100% పక్కకు పడి పోవాలి కదా… మరెందుకు పడిపోలేదు..? ప్రాణం పోతుంటే గిలాగిలా కొట్టుకుని ఊపిరి వదిలితే నిశ్శబ్ధంగా ఉన్న చోటు నుండి కదలకుండా ఎలా చనిపోతాడు…?
ఎడమ కణితికి కాల్చుకుంటే రక్తం కచ్చితంగా తన వ్యతిరేక దిశలో పడాలి, మరి ప్రభాకర్ రెడ్డి మరణంలో తన వెనకాల రక్తం ఎలా పడింది…?
సర్విస్ రివ్వాల్వర్ తో పాయింట్ బ్లాంక్ లో కాల్చుకుంటే తన కుడి చేతికి గాయం ఎలా అయ్యింది…? రక్తం మరకలు మొత్తం బట్టలకూ అంటకుండా కేవలం ఒక వైపే ఎందుకు పడ్డాయి..?
ఎడమ చేతితో లేదా కుడి చేతితో కాల్చుకుంటే గన్ తన నుండి దూరంగా లేదా వ్యతిరేక దిశ లో లేదా తన దగ్గర్లో అయినా పడాలి. కానీ రివ్వాల్వర్ తన కాళ్ల కింద, అదీ ఎడమ కాలి వెనుకాల ఎవరో పెట్టినట్లు ఎందుకు పడింది..?
ఇక అసలు అభియోగం అర్ధరాత్రి తాగి తన వద్దకు వచ్చిన శిరీష ని అత్యాచారం చేశాడన్నదే నిజమైతే ప్రాథమిక శవ పంచనామలో అల్కహాల్ తీసుకున్నట్టుగా ఎందుకు రాలేదు..? తప్పు చేసిన విషయం రిఫోర్ట్ లో బహిర్గతం అయిందా..?
అసలు ఈ రెండు మరణాల్లో జనం చెప్పుకుంటున్నది నిజమా..? మీడియా చెపుతున్న కథనాలు నిజమా..? నిజాయితీ ఆపీసర్ అని ముద్ర వేసుకున్న వ్యక్తికి.. ఒకరితో వివాహం జరిగి.. మరొకరితో సంబంధంలో ఉన్న మహిళతో లింకేంటి…?
అసలు నిజమేంటి. మరణంలో ప్రభాకర్ రెడ్డి బలిపశువుగా మారాడా..? లేక మీడియా కథనాల లెక్క కరెక్టేనా..? నిజం తెలియాలంటే అబద్దం చావాలి. అది త్వరలోనే జరగాలి.