
సాధారణంగా బిడ్డ పుట్టిన వెంటనే తల్లి పాలను పట్టించడం ద్వారా పుట్టిన బిడ్డ ఆరోగ్యం గ ఉంటుంది. జరుగుతున్న శిశు మరణాలలో తల్లి పాలు అందకనే శిశువు పురిట్లోనే మరణిస్తున్న దాఖలాలు అనేకం. ఒకరకంగా ఈ పరిస్థితి ఈ ఆధునిక మనిషి విజ్ఞానానికి అగ్ని పరీక్ష వంటిది.
సరిగ్గా ఇలాంటి పరిస్థితినే తమకు అనుకూలంగ మార్చుకుంటున్నై కొన్ని కార్పోరేట్ వ్యాపార సంస్థలు. అమ్మ పాలలోని వాత్సల్యాన్ని వ్యాపారమయం చేస్తున్నాయి. తల్లి పాల బ్యాంక్ ల పేరుతో వ్యాపారం చేయడం ఆందోళన కలిగించే అంశం.
దేశ వ్యాప్తంగా చూస్తే అధికారికంగ ఈ తల్లి పాల బ్యాంకులు 15 లోపే ఉన్నా అనధికారికంగ 40 కి పైగా ఉన్నాయని సమాచారం. ఈ అమ్మ పాల బ్యాంకుల పై మన ప్రభుత్వాలకు అధికారులకు కూడా సరైన అవగాహన లేదని తెలుస్తోంది. అభివృద్ధి చెందిన విదేశాల్లో దశాబ్ద కాలం నుండే ఈ తల్లి పాల బ్యాంక్ ల నిర్వాహన జరుగుతుంది. మన దేశంలో ఇప్పుడిప్పుడే తల్లి పాల ఆవశ్యకత పై ప్రచారం జరుగుతుంది. వాస్తవానికి తల్లిపాలు అందక అనారోగ్యానికి గురవుతున్న శిశువులకు తల్లిపాలను అందించి బతికించడం గొప్ప విషయం.. చాలా ఆవశ్యకం.. అలాంటి తల్లిపాల ఆవశ్యకాన్ని గుర్తించి శిశువులకు అందించడం ప్రభుత్వాల బాధ్యత కూడా.. కానీ ఈ విషయంలో మన ప్రభుత్వాలు చాలా వెనకబడిఉండడం దురదృష్టకరం. మన దేశంలో మొట్టమొదటి సారిగ ఢిల్లీ లో ఈ తల్లి పాల బ్యాంక్ ఏర్పాటు జరిగింది. తర్వాత బెంగళూర్ మరియు రాజస్థాన్ లో ఏర్పాటు కాగా.. గతేడాది మన రాష్ట్రం లో నిలోఫర్ ఆసుపత్రిలో ఏర్పాటైంది.
ఈ విషయంలో మన దేశంలో పౌరులకు అవగాహన చాల తక్కువనే చెప్పాలి. కారణం పాలకుల నిర్లక్ష్యం..!!
పాలకుల నిర్లక్యాన్ని ఆసరాగ తీసుకున్న కార్పోరేట్ సంస్థలు అమ్మ పాలను కూడా వ్యాపారం చేస్తున్నాయి. ఈ క్రమంలో సరైన ప్రామాణాలు పాటిస్తున్నయా అంటే అది పెద్ద ప్రశ్నగానే మిగిలిపోతోంది. సాధారణంగా ఒక తల్లి రోజుకు 600ml వరకు పాలు ఉత్పత్తి చేయగలదు. కాగా తన శిశువుకు సరిపడా పాలు తాగించాక.. కొంతమంది తల్లులకు అధిక పాలు ఉత్పత్తి చేసే గొప్ప అవకాశాన్ని కలిగి ఉంటారు. ఈ పరిస్థితే తల్లి పాలకు దూరమైన శిశువులకు వరం అనుకోవచ్చు.
ఇలా అధిక ఉత్పత్తి ఉన్న తల్లుల నుండి సేకరించిన పాలను సరైన క్రమంలో భద్రపరిస్తే దాదాపు ఆరు నెలల పాటు నిల్వ చేయవచ్చు. కానీ ప్రస్తుతం కార్పోరేట్ సంస్థలు నిర్వహిస్తున్న తల్లి పాల బ్యాంక్ లలో ప్రమాణాలు పాటించడం లేదనే ఆరోపనలు వినిపిస్తున్మై. తల్లి పాలిచ్చే మహిళకు అంటువ్యాధులు ఉంటే పాల ద్వారా ఆ వ్యాధి ఆ పాలు తాగిన పిల్లలకు సోకే ప్రమాదం ఉంది. హెచ్ఐవీ లాంటి ప్రమాదకర వ్యాధులు కూడా వ్యాపించే అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వం ఈ విషయమై ప్రజల్లో విసృతంగ అవగాహన కల్పించాలనీ.. ప్రభుత్వమే అన్ని జిల్లా కేంద్రాల్లో అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో ఈ తల్లి పాల బ్యాంక్ కేంద్రాలను నిర్వహించి ఉచితంగ సురక్షితంగ అందించాల్సిన అవసరం ఉందని పలువురు వైద్య నిపుణులు మరియు సామాజికవేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.. ఇదే విషయమై గౌరీజీ స్మారక సమితి వారి ఆధ్వర్యంలో హైద్రాబాద్ లోని తార్నాక NIN ఆడిటోరియంలో తల్లి పాల కేంద్రం వాత్సల్యమా – వ్యాపారమా అనే సామాజిక అంశం పై చర్చా కార్యక్రమం జరిగింది. సభ అధ్యక్షులుగ ఆంధ్రప్రదేశ్ సమాచార పౌర సంబంధ శాఖ డైరెక్టర్ ఏ.ఎల్. కిస్మత్ కుమార్ వ్యవహరించగా.. వక్తలుగ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ డిప్యూటీ డైరెక్టర్ డా.దినేష్ కుమార్ మరియు కస్తూరిభా గాంధీ నేషనల్ మెమోరియల్ ట్రస్ట్ హైద్రాబాద్ శాఖ ప్రతినిధి శ్రీమతి పద్మావతి మరియు ఏఎంఎస్ కాలేజ్ ఆఫ్ లా ఫర్ ఉమెన్ ప్రిన్సిపల్ పి. లక్ష్మి మరియు సీనియర్ జర్నలిస్ట్ కే. మంజరి లు పాల్గొనగా.. ట్రస్టీలు గోనెల ఉపేంద్ర, స్వప్న బల్ల, జి. రమేష్, డి. జగదీశ్ కుమార్ లు నిర్వాహన ఏర్పాట్లు పర్యవేక్షించారు.
























