You are here
Home > తాజా వార్త‌లు > మాతృదినోత్సవ శుభాకాంక్షలుతో.. అమ్మలందరికి పాదాభివందనం.

మాతృదినోత్సవ శుభాకాంక్షలుతో.. అమ్మలందరికి పాదాభివందనం.

మాతృదేవోభవః..
అమ్మ అంటే ఆనందం, అమ్మంటే  ఆదరణ, అమ్మంటే ఆత్మీయత, అమ్మంటే ఆప్యాయత.. ఆదర్శం.. అనురాగం ఇలా ఎన్ని చెప్పుకున్నా ఎంత చెప్పుకున్నా ఆ అమ్మ ప్రేమ ముందు చాలా చాలా తక్కువే. భూ దేవికున్నంత ఓర్పు ఆకాశమంత ప్రేమ, పంచ భూతలను మించిన గుణం ఒక్క అమ్మది మాత్రమే. ఇవన్ని కేవలం అమ్మ అనే ఒకే ఒక్క వ్యక్తిలో సాధ్యం. మరి అలాంటి అమ్మ గురించి ఒక రోజులో ఒక కవితలో ఒక కావ్యంలో ఒక మాటలో చెప్పడం వీలవుతుందా. ఎందరు కవులు పుట్టుకు వచ్చిన ఎంత గొప్పగా వర్ణించిన అమ్మ తత్వం ఇంకా అనంతం. అయినా మా వంతుగా అమ్మ మీద ఒక చిన్న ఆర్టికల్ అంతే..


ఈ లోకం లో భూమి కంటే బరువైనదేదని మహాభారతంలో ఒక సంధర్బంలో అడిగారంట.. అందుకు ధర్మరాజు వెంటనే అమ్మ అని సమాధానమిస్తాడు. నిజానికి భూమికన్నాభరించే శక్తి అమ్మకి మాత్రమే ఉంది. అలాంటి అమ్మ కడుపున పుట్టిన ఎవరైనా మాతృదినోత్సవం సందర్భంగా ఆమెకి పాదాభివందనం చేయాల్సిందే. ఈ ఒక్క రోజే కాదు జీవితాంతం చేయాల్సిందే. కానీ ఈ ఉరుకుల పరుగుల జీవితంలో కట్టు బాట్లను వీడి బ్రతకాడానికి మాత్రమే యుద్దం చేస్తున్న ఈ సమాజంలో అమ్మ కు నిజమైన పండుగను అందించే బిడ్టలెందరు..?


నవమాసాలు మోసి ఒక బిడ్డకి జన్మనిస్తూ తను పునర్జన్మను పొందిన మరుసటి క్షణం నుండి తల్లిగా తన ప్రయాణం మొదలవుతుంది. పొత్తిళ్ళలో ఉన్న బిడ్డని చూసి తన ఒత్తిళ్లనే మరచిపోతుంది. కడుపులో తన్నినా ఎదుగుతూ గుండెల మీద తన్నినా మురిసిపోతుంది. తనని ఆ బిడ్ట ఎంత గాయపరిచినా బరించే తల్లి ఆ బిడ్టకు చిన్న దెబ్బ తగిలినా విలవిలలాడిపోతుంది. బిడ్డను కంటికి రెప్పలా కాపాడుతు ఇంతింతై వటుడింతయ్యే వరకు తోడుంటుంది. ఆది నుండి అనంత వరకు సాగే బిడ్డ ప్రయాణంలో తన ఊపిరిని మనకు ఊపిరిగా పోసి సాగుతుంది.


నడక నేర్పి… పలుకు నేర్పి… నడత నేర్పి… దగ్గరుండి గోరు ముద్దల్లో తన ప్రేమను కలిపి తినిపిస్తూ పెంచుతుంది. బుడి బుడి నడకలైనా, చిలక పలుకులైనా అన్ని అమ్మ దగ్గర నుండే నేర్చుకుంటాం. ఆకలి వేసినప్పుడు అమ్మ చేతి గోరుముద్దలైనా, అల్లరి చేసినప్పుడు అమ్మ చేతి దెబ్బలైనా కమ్మగానే ఉంటాయి. ఇలా బాల్యంలో ఆటపాటలు అమ్మ ఒడిలోన, మాట మంచితనం అమ్మ బడిలోన, ఆనందం మరియు ఆదర్శాలు అమ్మ గుడిలోన, మనమందరం నేర్చుకున్నవాళ్ళమే. అందుకే నేనంటాను మన అందరికీ అమ్మే ఆది గురువు. అమ్మ హృదయమే మనకి మొదటి పాఠశాల.


యవ్వనంలో మొదట స్నేహితురాలు అమ్మే. పెరుగుతున్న కొద్ది ఆమె ఇష్టాలను మన మీద రుద్దలేదు. మన ఇష్టాలను తెలుసుకొని వాటికి ఆమె భావాలను జోడించి మంచి మార్గంలో నడిపించింది. కుటుంబంలో పెరుగుతున్న కష్టాలు, ఆర్దిక ఇబ్బందులు తనలోనే దాచుకొని మనలను ఉన్నత మార్గాల వైపు నడిపిస్తుంది. మనకు వయసుతో పాటు పెరిగిన కోపం, కొంటెతనం ఇలా ఆమెను ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా, తనకు కోపం బిడ్ట మీద ఎన్నటికి కనిపించదు. పిల్లల సంతోషం కోసం దుఖాలను, బాధలను దిగమింగుతూ పిల్లల కళ్ళల్లో సంతోషం చూసి ఎంతో పొంగిపోతుంది ఆ పిచ్చి తల్లి.


అద్దాల మేడలో ఉన్నా..  పూరి గుడిసెలో ఉన్నా.. మురికి కాలువ పక్కన ఉన్నా.. స్వచ్చమైన నది తీరంలో ఏడంతస్తుల మేడలో ఉన్నా.. అమ్మ అమ్మే. తన చనుబాల రుణం ఈ జన్మకు కాదు కదా వచ్చే జన్మకు కూడా తీర్చలేమేమో. అమ్మరుణం తీర్చేది మరో అమ్మగా మారే మన ఇంటి లక్ష్మిలే. మరీ ఆ లక్ష్మిలను అమ్మ కడుపులో నుంచి బాహ్య ప్రపంచాన్ని చూడనివ్వకుండానే ఆ దేవుడు దగ్గరకి పంపుతున్న మనల్ని ఏమనాలి. మరో అమ్మను భూమి మీద రాకుండా చేస్తున్న ఈ లోకం తీరును ఏమని ప్రశ్నించాలి. నిన్నింత వాడిని చేసిన దేవతనక అనాథగా శరణాలయాల్లోకి చేరుస్తున్నావ్ మరీ నీ తీరును ఏమని ప్రశ్నించాలి. ఇన్నేళ్లు భారంగా మోసిన తల్లి ముసలితనంతో బాధపడితే బాధ్యతగా మెలగాల్సిన సమాజం అమ్మనే దూరం చేసుకుంటోంది. ఇదేనా తీరు.

అమ్మ అంటే ఆడబిడ్డ.. అమ్మ అంటే మరో జన్మ.. అమ్మగా మారే ప్రతి అమ్మాయిని గౌరవిద్దాం. కళ్ల ముందు కనిపించే నిజమైన దైవాన్ని నిత్యం పూజించుకుందాం. మాతృదేవోభవః.. ప్రపంచంలోని అందరి తల్లులకు మాతృదినోత్సవ శుభాకాంక్షలుతో  మా జర్నలిజంపవర్ తరుపున అమ్మలందరికి పాదాభివందనం. ముందుగా మా అమ్మకు.

Related Posts
కర్నాటక లో కాంగ్రెస్ పార్టీ కి సొంత ఎంఎల్ఏ నుండి ఎదురుదాడి..!!
కర్నాటక లో 122 సీట్ల నుండి 78 స్థానాలకు పడిపోయి అధికారం కోల్పోయి ఏకంగ ముఖ్యమంత్రే ఓడిపోయి.. ఇలా ముక్కుతూ మూలుగుతూ తప్పని పరిస్థితి లో కేవలం 37 సీట్లను గెలిచిన జేడిఎస్ తో లూలూచి పడిపోయి ఉన్న కాంగ్రెస్ పార్టీ ...
READ MORE
భావ ప్రకటన స్వేచ్చ పేరుతో బరితెగింపు
అప్పుడెప్పుడో ఎం.ఎఫ్.హుస్సేన్ అనే బూతు బొమ్మల ఆర్టిస్టుండేవాడు.. ఇతగాడి చిత్రాలను చూసి ఆహా ఏహో అంటూ కొనుక్కునేవారు.. దీంతో అతగాడికి మదమెక్కింది. భారత మాతను, హిందూ దేవతలను, మహిళలను నగ్నంగా గీసి అవమానించాడు.. హిందూ మత సంస్థలు అతనిపై ఆగ్రహించాయి.. ఎంఎఫ్ ...
READ MORE
మోడీ పై తప్పుడు ఆరోపనలు చేసాను నన్ను క్షమించండి – రాహుల్ గాంధీ
రాఫేల్ యుద్ధ విమానాల ఒప్పంద విషయమై ప్రధాన మంత్రి నరేంద్ర మోడి పై తప్పుడు ఆరోపనలు చేసానంటూ, ఆయన్ని దొంగ అని తప్పుడు ఆరోపనలు చేసినందుకు నన్ను క్షమించండని సుప్రీంకోర్టు సాక్షిగ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నివేదిక ...
READ MORE
పాకిస్తాన్ కు చుక్కలు చూపించిన సెవ్వాగ్, మహ్మద్ కైప్. కుల్ భూషణ్ ను ఉరి కలలో కూడా జరగదు.
కుల్‌భూషణ్ జాదవ్ ఉరి అంశంపై సోషల్ మీడియాలో హర్షం వ్యక్తమవుతోంది. హేగ్‌లోని అంతర్జాతీయ న్యాయస్థానం భారత్‌కు అనుకూలంగా తీర్పు చెప్పడంతో పాకిస్తాన్ కు చుక్కలు చూపిస్తున్నారు ఇండియన్ నెటిజన్లయ. తుది తీర్పును వెల్లడించే వరకూ జాదవ్‌ ఉరిశిక్షను ఆపేయాలని పాకిస్థాన్‌ను అంతర్జాతీయ ...
READ MORE
చంద్రబాబు ను పదునైన విమర్శలతో ఇరుకున పెట్టేసిన మోడీ..!!
ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడి పర్యటనను అడ్డుకుంటామని శపథం చేసిన టీడీపీ తమ్ముల్లు మోడీ సభ ను భాజాపా కార్యకర్తలను అడ్డుకోలేకపోయారు.. మోడీ అనుకున్న సమయానికి సభకు చేరడంతో సభ గ్రాండ్ సక్సెస్ అయింది.ఇక ఈ సభలో తెలుగులో ...
READ MORE
125 కోట్ల మంది ఆశ.. శ్వాస మన దేశం కొస్తున్నాడు.
ప్రముఖ ఇజ్రాయిల్ పత్రిక ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనకు ప్రత్యేకంగా ఆహ్వానం పలికింది. మేల్కొండి! ప్రపంచంలోనే అతి ముఖ్యమైన ప్రధానమంత్రి వస్తున్నారు అంటూ ప్రధాని నరేంద్ర మోడీ ఇజ్రాయిల్ పర్యటనను ఉద్దేశించి ఆ దేశానికి చెందిన ప్రముఖ బిజినెస్ డైలీ ది ...
READ MORE
బీజేవైఎం జిల్లా ఉపాద్యక్షుడిగ పవన్ కుమార్.!!
తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొని మరోవైపు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ లో మంచి నాయకుడిగా గుర్తింపు సంపాదించి పలు విద్యార్థి సమస్యలపై అలుపెరుగని ఉద్యమాలు చేసిన నిదానకవి పవన్ కుమార్ తాజాగా రంగారెడ్డి జిల్లా బీజేవైఎం ఉపాద్యక్షులుగ ఎన్నిక కావడం ...
READ MORE
రోబో భార్య అన్ని పనులు చేస్తుంది ఆ ఒక్కటి తప్ప..?
ఇదేంటి రోబో భార్య అంటున్నారు.. రోబో చిత్రం గురించి సూపర్ స్టార్ రజనీకాంత్ గురించి చెపుతున్నాం అని అనుకునేరు. అది కాదు మ్యాటర్.. ఓ వ్యక్తి తన భార్యగా ఓ రోబోను పెళ్లి చేసుకున్నాడు ఎందుకలా చేశాడు.. మరీ రోబో భార్యతో ...
READ MORE
హద్దులు మీరుతున్న విధేశీ సంస్థ లు.. మోడీని ఓడించాలంటూ రాజకీయ జోక్యం.!!
భారత రాజ్యంగం ప్రకారం భారతదేశం లో మత స్వేచ్ఛ ఉన్నది. ఎవరు ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు మార్చుకోవచ్చు, అవసరమైతే ప్రపంచంలో ఏ మతం నచ్చకుంటే కొత్త మతాన్ని కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. బహుశా మన దేశం లో ఉన్న మత స్వేచ్ఛ ...
READ MORE
రేపే.. రాక్షస సంహారం. నిర్భయ దోషులకు ఉరిశిక్ష కు సర్వం సిద్ధం.!!
నిర్భయ కేసు లో ఉరి శిక్ష ను తప్పించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేసిన దోషుల కు ఇక దాదాపు అన్ని దారులూ ముసుకున్నటే.దోషుల్లో ఒకడైన పవన్ కుమార్ గుప్త కు కోర్టును ఆశ్రయించే అవకాశం వల్ల పిటిషన్ వేసుకోవడంతో తాజాగా ఢిల్లీ ...
READ MORE
ప్రభుత్వాసుపత్రిలో పైసలు వసూల్లు చేస్తున్న సిబ్బంది.! అధికారుల వాటా ఎంత.??
వ్యభిచారం చేసేవారైనా అప్పుడప్పుడు సిగ్గు పడతారేమో కానీ.. ఈ ఆసుపత్రి సిబ్బందికి ఆ అవకాశమే లేదు, ఎందుకంటే ప్రసవాలకోసం వచ్చే పేద తల్లులలో మరియు వివిధ ఆరోగ్య సమస్యలతో వచ్చే పేద మహిళా రోగులలో "ధన లక్ష్మీ" ని చూసుకుంటున్నారు. వారిని ...
READ MORE
భాష రాని ప్రాంతంలో భ‌ర్తను పోగొట్టుకుని న‌ర‌క‌యాత‌న అనుభ‌విస్తోంది.
ఊరు కాని ఊరు బాష కానీ భాష.. అయిన వారెవ‌రు ప‌క్క‌న లేరు. జీవితాంతం తోడుంటా అని బాస చేసిన భ‌ర్త హ‌ఠాత్తు ఈ లోకాన్ని వ‌దిలి వెళ్లిపోయాడు. దీంతో ఆమెకు ఏం చెయ్య‌లో తోచ‌ని ప‌రిస్థితి భాష రాదు బాధ ...
READ MORE
బెంగాల్ దీదీకి షాక్ ఇచ్చిన నెంబర్ 2.
వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కి షాక్ ఇచ్చాడు ముకుల్ రాయ్. మమతా బెనర్జీ సారధ్యంలో నడిచే "తృణమూల్ కాంగ్రెస్ పార్టీ" లో దీదీ తర్వాత నెంబర్ టూ స్థానం ముకుల్ రాయ్ దే.. తృణమూల్ కాంగ్రెస్ వ్యూహకర్త గ ఆయన గుర్తింపు ...
READ MORE
కష్టాల్లో కాంగ్రెస్ పార్టీ.. కేసిఆర్ దెబ్బకు విల విల.!!
తెలుగు ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయం అంటే గుర్తోచ్చేది కాంగ్రెస్ పార్టీ. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి గ ఉన్నప్పుడు ఒక వెలుగు వెలిగింది కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత వైఎస్ రాజశేఖరరెడ్డి అకాల మరణం తర్వాత మలిదశ తెలంగాణ ...
READ MORE
ఫ్లాష్…. ఫ్లాష్… ఫ్లాష్…. మిర్చి రైతుల కష్టాలపై కేంద్రం కనికరించిందంట…
కేంద్రంకు మిర్చి రైతులపై ఎక్కడలేని ప్రేమ పుట్టుకొచ్చింది. కాలిపోతున్న మిర్చి పంటను కాపాడేందుకు కనికరం చూపించింది. ఎంతనో తెలుసా అక్షరాల పన్నెండు.... వేలనుకునేరు వందలే. 1250 రూపాయల ఇది అదనం అంటా..? మరి అసలెంతో అనే కదా.. అక్కడికే వస్తున్నాం. కేంద్రం ...
READ MORE
ఓయూ భూముల రక్షణకై నడుం బిగించిన ఏబీవీపీ, దిగొచ్చిన వీసీ.!!
ఉస్మానియా యూనివర్శిటీ భూములు ఆస్థుల రక్షణకై ఉద్యమాన్ని ఉదృతం చేస్తోంది ఏబీవీపీ. గతంలోనూ క్యాంపస్ భూముల పరిరక్షణ కొరకై ఉద్యమించింది ఏబీవీపీ. ఏబీవీపీ చొరవతోనే క్యాంపస్ భూములను గుర్తించి ఫెన్సింగ్ ఏర్పాటు కూడా అధికారులు చేపట్టారు. అయితే.. ఉస్మానియా యూనివర్శిటీ భూములు కొంతమంది ...
READ MORE
ఢిల్లీ లో పాలన అస్తవ్యస్థం.. ఆప్ ఎంఎల్ఏ లు అరెస్ట్.!!
ఢిల్లీ రాష్ట్రంలో పాలకులకూ ఆఫీసర్లకు మధ్య విభేదాలు తీవ్ర స్ఖాయికి చేరాయి. ఒక విధంగ చెప్పాలంటే అరవింద్ సర్కార్ పై ఐఏఎస్ అధికారులంతా ప్రజాస్వామ్య యుధ్దం ప్రకటించారు. వారు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతున్నారు. ముఖ్యమంత్రి దగ్గరుండి మరీ ఎంఎల్ఏ ...
READ MORE
చైనా కు మరోసారి భారీ షాక్ ఇచ్చిన భారత్.!!
ఒకవైపు శాంతి చర్చలు జరుపుతూనే, మరో వైపు సరిహద్దు లో కయ్యానికి కాలు దువ్వుతూ గొడవకు దిగుతున్న డ్రాగన్ కంట్రీ చైనా కు ఇప్పటికే పలుమార్లు షాక్ ఇచ్చింది భారత్. అటు సరిహద్దు గుండా చైనా ను ధీటుగా ఎదుర్కొంటూనే ఇటు ...
READ MORE
ఉత్తమ్ కుమార్ గడ్డం పరిస్థితేంది..? బండ్ల గణేష్ గొంతు ఎప్పుడు కోసుకుంటున్నాడు.??
తెలంగాణ ఎన్నికల ఫలితాలు విడుదల అవుతుండడం.. ఫలితాలు పూర్తిగ స్థానిక పార్టీ అయిన టీఆర్ఎస్ కు అనుకూలంగ వస్తుండడం, దాదాపు మరోసారి టీఆర్ఎస్ అధికారం చేపట్టడం ఖరారు కావడంతో.. సోషల్ మీడియా లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ...
READ MORE
డాక్టర్లకు ప్రధాని మోడీ సూచన.. అవే రాయండి.
పేదలకు అందని ద్రాక్షగా మిగిలిన వైద్యాన్ని నేలకు తెప్పించే పథకాలు కేంద్ర ప్రభుత్వం చేస్తూనే ఉంది. అందులో భాగంగానే వైద్యానికి భారంగా మారిన మందు బిల్లల రేట్లను జనరిక్ మందుల పేరుతో సామాన్యుడికి అందుబాటులోకి తెచ్చింది. ఇప్పుడు అవే మందులను దేశ ...
READ MORE
కుక్క తోకను ఆదర్శంగ తీసుకున్న పాక్, అడ్డదారిలో కాల్పులు నలుగురు భారత జవాన్ల మృతి.!!
పాకిస్తాన్ వక్రబుద్ది ఎంత మాత్రం మారడం లేదు. పదే పదే కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ అకారణంగ భారత జవాన్లపై దొంగతనంగ కాల్పులు జరిపి రాక్షసానందం పొందుతోంది. తాజాగా ఇంటర్నేషనల్ బాడర్ వద్ద భారత జవాన్ల పై కాల్పులకు తెగబడింది ...
READ MORE
నా తమ్ముడు దౌర్జన్యం చేయలేదు, అటవీ అధికారులే రాజకీయం చేస్తున్నారు.!!
సిర్పూర్ కాగజ్ నగర్ మహిళా పోలీస్ అధికారి అటవీ రేంజ్ ఆఫిసర్ పై దాడి కి పాల్పడిన జెడ్పీ వైస్ చైర్మన్ కోనేరు క్రిష్ణ ను వెనకేసుకొచ్చారు కోనేరు క్రిష్ణ అన్న తెరాస ఎంఎల్ఏ కోనేరు కోనప్ప. తన తమ్ముడు అధికారులపై ...
READ MORE
నంద్యాలో ప్రచారానికి అద్దె జనాలు.. హద్దు మీరుతున్న ఖర్చులు.
రోజు రోజుకు రాజకీయ నాయకుల చూపు చిన్నదైపోతోంది. జరిగిన తప్పులు, చేసిన మంచి పనులు.. వేటినైనా బూతద్దంలో పెట్టి చూడడం అలవాడుగా మారిపోయింది. మీడియా పోకస్ ఎక్కువ కావడంతో ప్రతి చిన్న విషయాన్ని ప్రిస్టేజ్ గా తీసుకుంటున్నారు. నిజానికి ఒక్క ఎమ్మెల్యే ...
READ MORE
వర్మ మెడకు జిఎస్టీ వివాదం ఉచ్చు..!! జైలు శిక్ష తప్పదా.??
వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా వెబ్ సిరీస్ అంటూ మియా మాల్కొనోవా అనే పోర్న్ స్టార్ తో వెబ్ చిత్రాలను తెరకెక్కించడంతో యావత్ మహిళాలోకం భగ్గుమంటోంది. వర్మ మహిళలను అవమానిస్తున్నారనీ.. అందుకు సంబంధించిన ఓ చర్చా వేదికలోనూ అవమానించేలా ప్రవర్తించారని, ...
READ MORE
పుట్టుక‌తోనే ల‌క్షాధికారి ఏడాది తిర్కుండానే క‌టిక‌దారిద్రంలో పెరుగుతున్నాడు.
అదృష్టం వెతుక్కుంటూ వ‌చ్చిన ద‌రిద్రం ఇంటి నుండి వెళ్లిపోలేని తిష్ట వేసి కూచోవ‌డంతో ఆ పేద కుటుంబం క‌టిక దారిద్రాన్ని అనుభ‌వించ‌క త‌ప్ప‌డం లేదు. కొడుకు రూపంలో అదృష్టం న‌డుచుకుంటూ వ‌చ్చినా పుట్టుక‌తోనే కొడుకు ల‌క్షాదికారిగా పేరు తెచ్చుకున్నా ఆ ఆనందం ...
READ MORE
కర్నాటక లో కాంగ్రెస్ పార్టీ కి సొంత ఎంఎల్ఏ నుండి
భావ ప్రకటన స్వేచ్చ పేరుతో బరితెగింపు
మోడీ పై తప్పుడు ఆరోపనలు చేసాను నన్ను క్షమించండి –
పాకిస్తాన్ కు చుక్కలు చూపించిన సెవ్వాగ్, మహ్మద్ కైప్. కుల్
చంద్రబాబు ను పదునైన విమర్శలతో ఇరుకున పెట్టేసిన మోడీ..!!
125 కోట్ల మంది ఆశ.. శ్వాస మన దేశం కొస్తున్నాడు.
బీజేవైఎం జిల్లా ఉపాద్యక్షుడిగ పవన్ కుమార్.!!
రోబో భార్య అన్ని పనులు చేస్తుంది ఆ ఒక్కటి తప్ప..?
హద్దులు మీరుతున్న విధేశీ సంస్థ లు.. మోడీని ఓడించాలంటూ రాజకీయ
రేపే.. రాక్షస సంహారం. నిర్భయ దోషులకు ఉరిశిక్ష కు సర్వం
ప్రభుత్వాసుపత్రిలో పైసలు వసూల్లు చేస్తున్న సిబ్బంది.! అధికారుల వాటా ఎంత.??
భాష రాని ప్రాంతంలో భ‌ర్తను పోగొట్టుకుని న‌ర‌క‌యాత‌న అనుభ‌విస్తోంది.
బెంగాల్ దీదీకి షాక్ ఇచ్చిన నెంబర్ 2.
కష్టాల్లో కాంగ్రెస్ పార్టీ.. కేసిఆర్ దెబ్బకు విల విల.!!
ఫ్లాష్…. ఫ్లాష్… ఫ్లాష్…. మిర్చి రైతుల కష్టాలపై కేంద్రం కనికరించిందంట…
ఓయూ భూముల రక్షణకై నడుం బిగించిన ఏబీవీపీ, దిగొచ్చిన వీసీ.!!
ఢిల్లీ లో పాలన అస్తవ్యస్థం.. ఆప్ ఎంఎల్ఏ లు అరెస్ట్.!!
చైనా కు మరోసారి భారీ షాక్ ఇచ్చిన భారత్.!!
ఉత్తమ్ కుమార్ గడ్డం పరిస్థితేంది..? బండ్ల గణేష్ గొంతు ఎప్పుడు
డాక్టర్లకు ప్రధాని మోడీ సూచన.. అవే రాయండి.
కుక్క తోకను ఆదర్శంగ తీసుకున్న పాక్, అడ్డదారిలో కాల్పులు నలుగురు
నా తమ్ముడు దౌర్జన్యం చేయలేదు, అటవీ అధికారులే రాజకీయం చేస్తున్నారు.!!
నంద్యాలో ప్రచారానికి అద్దె జనాలు.. హద్దు మీరుతున్న ఖర్చులు.
వర్మ మెడకు జిఎస్టీ వివాదం ఉచ్చు..!! జైలు శిక్ష తప్పదా.??
పుట్టుక‌తోనే ల‌క్షాధికారి ఏడాది తిర్కుండానే క‌టిక‌దారిద్రంలో పెరుగుతున్నాడు.
Facebook Comments
Top
error: Content is protected !!