You are here
Home > క్రీడలు > ముచ్చటగా మూడోసారి ట్రోపి అందుకున్న ముంబై.. అతి జాగ్రత్తతో నిండా మునిగిన పుణే.

ముచ్చటగా మూడోసారి ట్రోపి అందుకున్న ముంబై.. అతి జాగ్రత్తతో నిండా మునిగిన పుణే.

అనుకున్నదే జరిగింది. చివరికి అనుభవమే గెలిచింది. పరుగుల వరద పారాల్సిన ఫైనల్ మ్యాచ్ లో తక్కువ స్కోర్ కే ఉత్కంఠ మ్యాచ్ కళ్ల ముందు కదలాడింది. 130 పరుహుల లక్ష్యంతో బరిలోకి దిగిన పుణే ముంబై అనుభవం ముందు మోకరిల్లింది. వికెట్లు చేతిలో ఉన్నా పరుగులు చేయడంలో అతి జాగ్రత్తగా ప్రవర్తించి మొదటికే మోసం తెచ్చుకుందు.

టి20 తరహా దూకుడు ఎక్కడా చూపించకుండా ఒత్తిడి పెంచుకుంది. 20 ఓవర్లలో ఏ దశలోనూ జట్టు రన్‌రేట్‌ కనీసం 7 పరుగులు దాటలేదంటేనే అర్థం చేసుకోవచ్చు పుణే ఎంత పేలవంగా ఆడిందో. చివరి వరకు నిలిచి విజయం వైపు నడిపించగలడని నమ్మిన స్టీవ్‌ స్మిత్‌ చివరకు ఈ పాపంలో భాగమయ్యాడు. మొత్తానికి రోహిత్ శర్మ అండ్ మ్యాచ్ కు ముందు అభిమానులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకునక ముచ్చటగా మూడవసారి ఐపిఎల్ 10 వ సీజన్ కప్పు ఎగరేసుకుపోయారు.

ఇక బెట్టింగ్ దందా షరా మాములే చివతి ఓవర్ వరకు సాగిన ఉత్కంఠ పోరులో కోట్లు చేతులు మారయన్నది ఆఫ్ ది రికార్డ్ మాట. ఒకనొక దశలో పుణే ఓటమికి సైతం బెట్టింగే కారణమా అనే అనుమానాలు కూడా వినిపించాయి.

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌–2017 టైటిల్‌ను ముంబై ఇండియన్స్‌ సొంతం చేసుకుంది. ఉప్పల్‌ స్టేడియంలో ఆదివారం ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో ముంబై ఒక్క పరుగు తేడాతో రైజింగ్‌ పుణే సూపర్‌ జెయింట్‌పై చిరస్మరణీయ విజయం సాధించింది. తక్కువ స్కోరే అయినా పట్టుదలగా ఆడిన రోహిత్‌ సేన ముచ్చటగా మూడోసారి ట్రోఫీని కైవసం చేసుకుంది. టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్‌ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. కృనాల్‌ పాండ్యా (38 బంతుల్లో 47; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) కీలక ఇన్నింగ్స్‌ ఆడగా, కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (22 బంతుల్లో 24; 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. అనంతరం పుణే సూపర్‌ జెయింట్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 128 పరుగులు మాత్రమే చేసి గెలుపు ముందు చతికిల పడింది. స్టీవ్‌ స్మిత్‌ (50 బంతుల్లో 51; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), అజింక్య రహానే (38 బంతుల్లో 44; 5 ఫోర్లు) రాణించారు. కృనాల్‌ పాండ్యాకు మ్యాన్‌ ఆఫ్‌ ద ఫైనల్‌ అవార్డు లభించింది.

ఇక ఆట అసలు, ఎసరు విషయానికి వస్తే భారీ హిట్టర్స్ టీంలో ఉన్న ముంబై ఫైనల్ మ్యాచ్ లో కేవలం 129 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ స్కోర్ చూసిన ప్రతి ఒక్క అభిమాని మ్యాచ్ పుణేదే అని మైండ్ లో బ్లైండ్ గా ఫిక్స్ అయ్యారు. కానీ అసలు కథ పుణే బ్యాంటిగ్ చేస్తుంటే తెలిసిపోయింది. పుణే హీరో కాదు జీరో అని. ధోని స్మిత్ లాంటి దిగ్గజ బ్యాట్ మెన్స్ క్రీజ్ లో ఉన్నా పరుగుల వరద పారలేదంటే అర్థం చేసుకోవచ్చు మ్యాచ్ ఎందుకు చెత్తగా మారిందో. మొత్తానికి రైజింగ్ పుణే రేజింగ్ లేకుండానే కెప్టెన్ స్వహస్తాలతో ముంబాయి చేతిలో విజయాన్ని పెట్టి పరాజయంతో మ్యాచ్ ను ముంగించింది. దీంతో ముచ్చటగా మూడో సారి ట్రోపి అందుకున్న ఐపిఎల్ జట్టుగా నిలిచింది. ఇక మరో సారి ఐపిఎల్ లో చూద్దమన్నా కనిపించని పుణే మొత్తానికి భారీ మూల్యాన్నే చెల్లించుకుంది. అనుభవంతో ఘనవిజయం సాదించిన రోహిత్ సేన సంబరాల్లో మునిగితేలింది. 

Related Posts
కోటిన్నర విరాళం మరోసారి రియల్ స్టార్ అనిపించుకున్న అక్షయ్ కుమార్.!!
సినీ పరిశ్రమలో చాలా మందే స్టార్లు ఉన్నారు కాని అందులో కొంత మందే రియల్ స్టార్లు అనిపించుకుంటారు. అందులో ప్రముఖంగా నిలిచే వ్యక్తి బాలివుడ్ స్టార్ అక్షయ్ కుమార్.ఇప్పటికే ఎన్నో సార్లు సమాజం కోసం తన సంపాదనను విరాళంగ ఇచ్చిన అక్షయ్, ...
READ MORE
పాకిస్తాన్ లో కిలో టమాట 200, గగ్గోలు పెడుతున్న జనం.!!
భారత్ పై ఉగ్ర దాడి చేసాక, భారత్ నుండి తీవ్ర ఆగ్రహాన్ని చవిచూస్తున్న పాకిస్తాన్.. అష్టకష్టాలను ఎదుర్కుంటోంది. దాడి నేపథ్యం లో పాకిస్తాన్ ను వ్యాపారం పరంగ గట్టిగ దెబ్బ కొట్టింది మోడీ సర్కార్. ఏకంగ పాకిస్తాన్ ఎగుమతి దిగుమతులపై 200 ...
READ MORE
మరి హిందూ ఆలయాల నిధులే ఎందుకు కావాలో చెప్పాలని మంత్రి కొడాలి నాని ని ప్రశ్నిస్తున్న జనం.!!
గత కొద్ది రోజులుగా ఆంధ్ర ప్రదేశ్ లో హిందూ ధర్మం పై మరియు హిందూ ఆలయాలు దేవుళ్ల విగ్రహాల పై దాడులు విపరీతంగా జరుగుతున్నాయి. అంతర్వేది ఆలయ రథం కాలిపోయిన ఘటన లో ఇంతవరకు ఎవరినీ కనీసం అదుపులోకి కూడా తీసుకోలేదు. కానీ ...
READ MORE
తెలుగు రాష్ట్రాలకు వేర్వేరు గవర్నర్లు?
తెలుగు రాష్ట్రాలకు త్వరలో వేర్వేరు గవర్నర్లు నియమితులయ్యే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం రెండు రాష్ట్రాల బాధ్యతలను నరసింహన్‌ ఒక్కరే చూసుకుంటున్నారు. కేంద్రం ఈసారి ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలకు వేర్వేరుగా గవర్నర్లను నియమించే అవకాశం ఉందని ఓ ముఖ్యనేత వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రానికి కర్ణాటకకు చెందిన శంకరమూర్తి, ...
READ MORE
ఆ ఒక్క మాటతో కేసిఆర్ ని ఇరుకున పెట్టేసిన మోడి.!!
మెట్రో రైల్ ప్రారంభించడానికి మరియు గ్లోబల్ బిజినెస్ సదస్సులో పాల్గొనడానికి హైద్రాబాద్ నగరానికొచ్చిన ప్రధాని నరేంద్ర మోడి.. బేగంపేట్ ఏయిర్పోట్ లో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. సభలో ప్రసంగించిన మోడీ.. సోదర సోదరీమణులారా అంటూ తెలుగులో మొదలు పెట్టి ...
READ MORE
బ్రేకింగ్ న్యూస్:- ప్రొ.కోదండరాం కారు కు ఆక్సిడెంట్
జేఏసీ చైర్మన్ ప్రొ. కోదండరాం కారు కు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఇద్దరు ద్విచక్ర వాహనదారులకు తీవ్రంగ గాయాలైనట్టు తెలుస్తోంది. కాగా ప్రొ.కోదండరాం ఈ ప్రమాదం నుండి బయటపడ్జారు చిన్నపాటి గాయలు మినహా ఎటువంటి నష్టం లేకుండా బయటపడడంతో కార్యకర్తలు ఆయన ...
READ MORE
ఒక్క విజయం రెండు రికార్డులు.. కోహ్లీ సేన ఘనత..
ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్ ను వరుసగ మూడో మ్యాచ్ లోనూ నెగ్గి సిరీస్ సొంతం చేసుకుంది కోహ్లీ సేన.. అంతే కాదు ఈ విజయం వరుసగ చూస్తే తొమ్మిదో విజయం దీంతో ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో 120 ...
READ MORE
చైనా వద్దన్న పనిని పట్టుబట్టి మరీ చేసిన మోడీ.. ఖంగుతిన్న చైనా
చాణక్య నీతితో భూటాన్ డోక్లాం సరిహద్దు వివాదం విషయంలో పై చేయి సాధించి చైనాను ప్రపంచ దేశాల ముందు దోషిగా నిలబెట్టటడంలో విజయం సాధించిన భారత్ సర్కార్.. ఈసారి అదే చైనాలే జరుగుతున్న బ్రిక్స్ దేశాల సమావేశంలో చైనా తో పాటు ...
READ MORE
IPL(ఇండియన్ ఫూల్స్ బెట్టింగ్ లీగ్)
పొట్టి క్రికెట్ వచ్చేసింది. బెట్టింగ్ రాయుళ్ల పండుగ స్టార్ట్ అయింది. పదో సీజన్ లో పదులు వందలు వేల కోట్లను క్షణాల్లో చేతులు మార్చే సీజన్ రానే వచ్చింది. వన్డే టెస్ట్ మ్యాచ్ ల బెట్టింగులు సరిపోక కోట్ల డబ్బులు క్షణాల్లో సంపాదించాలనే ...
READ MORE
సూపర్ స్టార్ మహేష్ ఫంక్షన్ లో జెర్రిల ఫుడ్.. దెబ్బకు దడుచుకున్న ప్రముఖులు.
అది సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రత్యేక అతిథిగా హాజరైన కార్యక్రమం. అందులోనూ 7స్టార్ హోటల్.. అతిథిలకు బోజన ఏర్పాట్లలలో ఎక్కడ ఏ లోపం వచ్చినా ఇబ్బందులు తప్పవు. కానీ అంత పెద్ద హోటల్ లో ఏకంగా మహేష్ బాబు తో పాటు ...
READ MORE
సోషల్ మీడియా లో ట్రెండ్ సెట్ చేస్తున్న నాగబాబు. తాజాగా మరో సంచలన కామెంట్.!
సోషల్ మీడియా లో ప్రముఖ సినీ నటుడు జనసేన నాయకుడు నాగబాబు ట్రెండ్ సెట్ చేస్తున్నారు. మొన్నటికి మొన్న నాథురం గాడ్సే ని పొగడ్తలతో ముంచెత్తి ఔరా అనిపించిన నాగబాబు, ఇప్పుడు మరోసారి మరో కొత్త పోస్టుతో తాజాగా వార్తల్లో నిలిచారు. భారత ...
READ MORE
పవన్ కళ్యాణ్ అంటే ఎవరో..! నాకతనితో పరిచయం లేదు.!!
ఆంధ్రప్రదేశ్ సీనియర్ పొలిటికల్ లీడర్.. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేసారు. నిన్న నెల్లూరు జిల్లా లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ముద్రగడ విలేకర్లు పవన్ కళ్యాణ్ ...
READ MORE
BS – 4 లైట్ ఆపుదామన్న ఆగదు.. వెలుగుతూనే…. ఉంటుంది.
సుప్రీంకోర్టు తీర్పు కొత్త వాహనాలకు వెలుగు నిస్తోంది. ప్రమాదాలను దూరం చేస్తోంది. బీఎస్ -3 వాహనాల స్థానంలో ఎంట్రీ ఇచ్చిన బీఎస్ - 4 వాహనాల హెడ్ లైట్లు కాస్త కొత్తగానే కనిపిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు కనిపించిన ఆన్ ఆఫ్ ...
READ MORE
ఇక వన్డేలకు కెప్టెన్ గ రోహిత్ శర్మ..?
ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు మొదటి సారి ప్రపంచ కప్ గెలవడంతో 2019 ఐసీసీ ప్రపంచ టోర్నీ ముగిసింది. కానీ లీగ్ దశలో అధ్భుతంగ ఆడి, సునాయసంగానే ఫైనల్ లో గెలిచి కప్ సాధిస్తుందనుకున్న కోహ్లీ సేన మాత్రం సెమిస్ లో న్యూజిలాండ్ ...
READ MORE
మరికొద్ది గంటల్లో మన సైనికుడిని మర్యాదగ అప్పజెప్పనున్న పాకిస్తాన్..!!
రోజులు మారినై.. దేశంలో రాజకీయాలు మారిన.. ఒకప్పుడు రాజకీయాల కోసం దేశ సమగ్రతను పణంగ పెట్టే నేతలుండేవారు. కానీ ఇప్పుడు భారత్ పూర్తిగా మారింది. ముందు దేశం తర్వాతే పార్టీ అయినా రాజకీయాలైనా. ఈ నేపథ్యం లో నే పుల్వామా దాడిలో ...
READ MORE
లాంచనంగా ప్రారంభమైన ఓయూ శతాబ్ది ఉత్సవాలు.. అంతలోనే నిరసన సెగ.
తెలంగాణ చరిత్ర, సంస్కృతి ప్రతిబింబించే విధంగా  ఉస్మానియా విశ్వవిద్యాలయ శతాబ్ధి ఉత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి.  విద్యార్థులు, కళాకారుల ఆటపాటలతో శనివారం ఉదయం ఉస్మానియా విద్యాలయంలో ఘనంగా ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ప్రధాన అతిధిగా వీసి రామచందర్  హజరై 2కే రన్ ...
READ MORE
బ్రేకింగ్ న్యూస్:- దత్తన్నకు అస్వస్థత..!!
హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ అస్వస్థతకు గురయ్యారు. ఇవాళ ఉదయం ఢిల్లీ వెళ్లాల్సిన ఆయనకు ఛాతి నొప్పి రావడంతో  వెంటనే హైదర్ గూడలోని అపోలో ఆస్పత్రికి తరలించారు.వైద్యులు ఆయనకు మెడికల్ టెస్ట్ లు చేస్తున్నారు.ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు ...
READ MORE
జియో దెబ్బకు కుదేలైన ఐడియా ఒడాఫోన్ లు కలిసి కొత్త నెట్వర్క్.!!
మొబైల్ నెట్వర్క్ లో భారత రిలయన్స్ సంస్థ సృష్టించిన సంచలనం జియో. ప్రస్తుతం మన దేశం లో మోబైల్ రంగం అంటే.. జియో కి ముందు జియో తర్వాత అనేంతగ పరిస్థితి మారింది. అంతకు ముందు మొబైల్ నెటవర్క్ రంగంలో రారాజుగ వెలుగొందిన ఏయిర్టెల్ ...
READ MORE
పారికర్ మాటల్లో తప్పు లేదు… అధికారులు అంతటి ఘనాపాటిలే.
గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్... ఒక ముఖ్యమంత్రి గా కంటే ఒక కామన్ మ్యాన్ గానే తను నడుచుకుంటాడని ఆ రాష్ట్ర ప్రజలే కాదు యావద్ దేశం ప్రజలు గర్వంగా చెప్పుకుంటారు. నీతి నిజాయితిలో పారికర్ పెట్టింది పేరని అభిమానుల మాట. ...
READ MORE
సార్ యాదిలో.. తెలంగాణ రాష్ట్రాన్ని కల్లారా సూడాలే అనే సారు కోరిక సాక్షిగా..
తెలంగాణ రాష్ట్రాన్ని కల్లారా సూడాలే.. గీ మాటే ఎప్పుడూ అనేటోడు మన జయశంకర్ సార్. తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే తన జీవితాన్ని త్యాగం జేసిన ఆజన్మ బ్రహ్మచారి. మంచితనం మానవత్వమే తప్ప ప్రతిఫలం కోరని నిస్వార్థపరుడు జయశంకర్ సార్. నేటి తెలంగాణ ...
READ MORE
ఫేక్ అకౌంట్ల తో తప్పుడు రాతలు రాస్తే కటకటాలే.. తెలంగాణ సర్కార్ సీరియస్ వార్నింగ్.
* ఫేస్ బుక్ లో ఇకపై ప్రజా ప్రతినిధులు, మంత్రుల పేర్లతో ఫేక్ అకౌంట్లకు చెక్ * ప్రభుత్వ సంస్థల పేర్లతోనూ సంబంధం లేని వ్యక్తులు ఫేస్ బుక్ లో ఇతర సోషల్ సైట్లలో అకైంట్లు, పేజీలను నిర్వహించరాదు * నిబంధనలను అతిక్రమిస్తే చట్టపరమైన ...
READ MORE
అరోరా కాలేజ్ లో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు..
హైద్రాబాద్ చిక్కడపల్లి లో గల ప్రముఖ విద్యాసంస్థ అరోరా డిగ్రీ కాలేజ్ లో 2017 బతుకమ్మ ఉత్సవాలు అంగరంగ వైభవంగ జరిగినై.!! విద్యార్దులంతా తెలంగాణ సాంప్రదాయ పద్దతిలో హడావుడి చేస్తూ ఆనందోత్సాహాలు చేసారు. రంగురంగుల పూలతో బతుకమ్మలు పేరుస్తూ బతుకమ్మ బతుకమ్మ ...
READ MORE
అష్టమ వ్యసనం.. స్మార్ట్‌ ఫోన్‌. ఈ వ్యసనం భారీన పడ్డారో ఇక అంతే.
‘‘టెక్నాలజీలు పెరిగి చేతుల్లోకి ఫోన్లొచ్చాక మనుషుల మధ్య దూరం తగ్గాలిగానీ.. ఇలా పెరిగిపోతోందేమిట్రా’’ ఓ ప్రశ్న.. సమాదానం ‘‘తప్పు టెక్నాలజీలో లేదు బాబాయ్‌. దాన్ని వాడే మనుషుల్లోనే ఉంది’’ నిజమే.. తప్పు మనలోనే ఉంది. దాన్ని సరిదిద్దుకోగలిగే తెలివీ మనలోనే ఉంది. ...
READ MORE
తెలంగాణ గుండెకాయ ఓయూ కి నాలుగేల్ల తర్వాత తిరిగి పూర్వ వైభవం.
ఏ పేరు చెప్తే యావత్ తెలంగాణ ఊపిరి పీల్చుకుంటదో.. ఏ పేరు చెప్తే తెలంగాణ ద్రోహుల లాగులు తడుస్తయో ఆ ఉద్యమాల పురిటి గడ్డ తెలంగాణకు అడ్డ అయిన ఉస్మానియా యూనివర్సిటీకి తరిగి పూర్వ వైభవం లభించింది. గత ఆగస్టు నెలలో యూనివర్శిటీని ...
READ MORE
ఏదో కొత్త రకం భాష లో డైలాగులు పేల్చిన బాలయ్య.. అది హిందీ అని డిసైడ్ చేస్తున్నారు నెటిజన్లు.!!
ప్రత్యేక హోదా కావాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడ లో ఒకరోజు దీక్ష చేస్తున్న సభకు హాజరైన నటుడు ఎంఎల్ఏ బాలక్రిష్ణ మైకులో మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడి ని ఉద్దేశించి కొన్ని రకాల సినిమా డైలాగులు పెల్చారు. నరేంద్ర మోడీ నార్త్ ...
READ MORE
కోటిన్నర విరాళం మరోసారి రియల్ స్టార్ అనిపించుకున్న అక్షయ్ కుమార్.!!
పాకిస్తాన్ లో కిలో టమాట 200, గగ్గోలు పెడుతున్న జనం.!!
మరి హిందూ ఆలయాల నిధులే ఎందుకు కావాలో చెప్పాలని మంత్రి
తెలుగు రాష్ట్రాలకు వేర్వేరు గవర్నర్లు?
ఆ ఒక్క మాటతో కేసిఆర్ ని ఇరుకున పెట్టేసిన మోడి.!!
బ్రేకింగ్ న్యూస్:- ప్రొ.కోదండరాం కారు కు ఆక్సిడెంట్
ఒక్క విజయం రెండు రికార్డులు.. కోహ్లీ సేన ఘనత..
చైనా వద్దన్న పనిని పట్టుబట్టి మరీ చేసిన మోడీ.. ఖంగుతిన్న
IPL(ఇండియన్ ఫూల్స్ బెట్టింగ్ లీగ్)
సూపర్ స్టార్ మహేష్ ఫంక్షన్ లో జెర్రిల ఫుడ్.. దెబ్బకు
సోషల్ మీడియా లో ట్రెండ్ సెట్ చేస్తున్న నాగబాబు. తాజాగా
పవన్ కళ్యాణ్ అంటే ఎవరో..! నాకతనితో పరిచయం లేదు.!!
BS – 4 లైట్ ఆపుదామన్న ఆగదు.. వెలుగుతూనే…. ఉంటుంది.
ఇక వన్డేలకు కెప్టెన్ గ రోహిత్ శర్మ..?
మరికొద్ది గంటల్లో మన సైనికుడిని మర్యాదగ అప్పజెప్పనున్న పాకిస్తాన్..!!
లాంచనంగా ప్రారంభమైన ఓయూ శతాబ్ది ఉత్సవాలు.. అంతలోనే నిరసన సెగ.
బ్రేకింగ్ న్యూస్:- దత్తన్నకు అస్వస్థత..!!
జియో దెబ్బకు కుదేలైన ఐడియా ఒడాఫోన్ లు కలిసి కొత్త
పారికర్ మాటల్లో తప్పు లేదు… అధికారులు అంతటి ఘనాపాటిలే.
సార్ యాదిలో.. తెలంగాణ రాష్ట్రాన్ని కల్లారా సూడాలే అనే సారు
ఫేక్ అకౌంట్ల తో తప్పుడు రాతలు రాస్తే కటకటాలే.. తెలంగాణ
అరోరా కాలేజ్ లో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు..
అష్టమ వ్యసనం.. స్మార్ట్‌ ఫోన్‌. ఈ వ్యసనం భారీన పడ్డారో
తెలంగాణ గుండెకాయ ఓయూ కి నాలుగేల్ల తర్వాత తిరిగి పూర్వ
ఏదో కొత్త రకం భాష లో డైలాగులు పేల్చిన బాలయ్య..
Facebook Comments
Top
error: Content is protected !!