You are here
Home > తాజా వార్త‌లు > ముప్పు తిప్పులు పెట్టిన నీట్.. ఒకే పరీక్ష రెండు పేపర్లు.

ముప్పు తిప్పులు పెట్టిన నీట్.. ఒకే పరీక్ష రెండు పేపర్లు.

నీట్.. దేశ వ్యాప్తంగా ఒకే పరీక్ష .ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ వైద్యవిద్య ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఇది. కానీ బాష మారగానే ప్రశ్న పత్రమే మారిపోయింది. ఒకే పరీక్ష ఒకే సమయానికి జరిగినా మాధ్యమాల తేడాతో ప్రశ్నలు మొత్తం మారిపోయాయి. ఆంగ్ల మాధ్యమానికొకటి.. తెలుగు మాధ్యమానికి మరొక పేపర్ ను ఎంపిక చేసి విద్యార్థులను నిండా ముంచింది. తెలుగు మాధ్యమాన్ని ఎంపిక చేసుకున్న విద్యార్థులకు ఇచ్చిన ప్రశ్నపత్రం.. ఆంగ్ల మాధ్యమాన్ని ఎంపిక చేసుకున్న విద్యార్ధులకిచ్చిన ప్రశ్నపత్రం పూర్తిగా వేర్వేరుగా ఉండడం అయోమయానికి కారణమైంది. మొత్తం 180 ప్రశ్నల్లో ఒక్కటి కూడా రెండు మాధ్యమ ప్రశ్నపత్రాల్లో కలవకపోవడం గమనార్హం.

ఈనెల 7న నీట్‌ పరీక్ష జరగింది. ఇక ఈ పరీక్ష తీరులో  కూడా చాలానే వ్యతిరేకత వ్యక్తమైంది. అదంత రూల్స్ అనుకున్నా పరీక్ష విదానంలో మరెందుకు రూల్స్ పాటించలేదంటున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు. తెలంగాణలో దాదాపు 45 వేల మంది విద్యార్థులు పరీక్ష రాశారు. 85 శాతం ఇంగ్లీష్ మీడియం ఎంపిక చేసుకోగా మిగిల వారు తెలుగు మీడియం ని ఎంచుకున్నారు.

అయితే దేశ వ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లోనూ ఒకేతరహా ప్రశ్నపత్రాన్ని ఇవ్వాల్సి ఉండగా, ఇంగ్లీష్.. తెలుగు ప్రశ్నపత్రాలు పూర్తిగా వేరు వేరుగా ఇచ్చి సమస్య సృష్టించారు.  చాలా పరీక్ష కేంద్రాల్లో ఇంగ్లీష్ ను ఎంపిక చేసుకున్న విద్యార్థులకు తెలుగులో ప్రశ్నపత్రమిచ్చారు. తెలుగు మాధ్యమ ప్రశ్నపత్రంలోనూ తెలుగు-ఆంగ్లం రెండు ప్రశ్నలూ ఉండడంతో ప్రశ్నపత్రం మారిన విషయాన్ని విద్యార్థులు గుర్తించలేకపోయారు. ఇంగ్లీష్ మీడియం ప్రశ్నపత్రం విడిగా ముద్రించారన్న విషయాన్ని ఆలస్యంగా గుర్తించారు. దీంతో తీవ్రంగా మోసపోయామని తెలుసుకున్న విద్యార్థులు ఇప్పుడు లభోదిభోమంటున్నారు.

ఇతర ప్రాంతీయ భాషల్లో ప్రశ్నలు ఒకేలా ఉండగా.. కేవలం ఇంగ్లీష్ మీడియంలో ముద్రించిన ప్రశ్నపత్రం మాత్రమే వేరుగా ఉందన్న సంగతి ఆలస్యంగా తేలింది. అంతే కాక ఇలా మార్పులతో కూడిన తెలుగు-ఇంగ్లీష్ లో ఇచ్చిన ప్రశ్నపత్రం చాలా కఠినంగా ఉందని కూడా నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల తీవ్రంగా నష్టపోతామని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని కోరుతున్నారు.

ఈ విషయంపై నీట్‌ నిపుణులు పీవీఆర్‌కే మూర్తి మాట్లాడుతూ.. ‘‘తెలుగు మాధ్యమంలో ముద్రించిన ప్రశ్నపత్రంలో దాదాపు 30-40 ప్రశ్నలు చాలా కఠినంగా ఉన్నాయి. ఒక్కో ప్రశ్నకు నాలుగు మార్కులుండటంతో విద్యార్థులు నష్టపోయే అవకాశాలున్నాయి’’ అని పేర్కొన్నారు. రసాయన శాస్త్ర అధ్యాపకుడు రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘‘ఈ సమస్య అన్ని ప్రాంతీయ భాషలున్న రాష్ట్రాల్లోనూ ఎదురైంది. ఆంగ్ల మాధ్యమ ప్రశ్నపత్రం రాసినవారికి 600కు పైగా మార్కులొస్తే.. తెలుగు ప్రశ్నపత్రం రాసిన విద్యార్థులకు 400కు మించకపోవచ్చు. దీనిపై సీబీఎస్‌ఈ స్పష్టత ఇవ్వాలి’’ అని అభిప్రాయపడ్డారు.

Source: ఈనాడు 

Related Posts
ఒక యువతి ని డైరెక్ట్ గ ఎదుర్కోలేక ఆమె ఆస్తులను ద్వంసం చేస్తున్న శివసేన సర్కార్.
దేశ వ్యాప్తంగా కూడా ఇప్పుడు బాలివుడ్ స్టార్ నటి కంగనా రనౌత్ మరియు మహారాష్ట్ర శివసేన సర్కార్ ఎపిసోడ్ గురించే చర్చ జరుగుతోంది. అధికార పార్టీ శివసేన హెచ్చరికలను ఏమాత్రం ఖాతరు చేయకుండా చెప్పిన తేదీ చెప్పిన సమయానికి ముంబై లో ...
READ MORE
అమరావతిలో రాజ్ భవన్, హైకోర్ట్ కట్టినందుకు 1500 కోట్ల ఖర్చు చేసినట్టు చెప్పిన టీడీపీ సర్కార్
ఆంధ్రప్రదేశ్ టీడీపీ సర్కార్ కేంద్రానికి నూతన రాజధాని అమరావతి లో హైకోర్ట్ మరియు రాజ్ భవన్ లు నిర్మించినట్టు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక యుటిలైజేషన్ సర్టిఫికేట్ సమర్పించినట్టు తెలుస్తోంది. మొన్న రాజ్యసభ లో వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ...
READ MORE
కాంగ్రెస్ బడా నాయకుడు దిగ్విజయ్ సింగ్ కు ఓటమి భయం.!!
కాలం చాలా బలయమైనది మరియు విచిత్రమైనది.. ఈ మాట మనం అప్పుడప్పుడూ వింటూంటాం కానీ ఇది అక్షరాల సత్యం, భోపాల్ లో సిట్టింగ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ అగ్ర నాయకుడు దిగ్విజయ్ సింగ్ పరిస్థితి ఇలాగే తయారైందిప్పుడు. ఎందుకంటే హిందూ ధర్మ ...
READ MORE
ఆగ‌ని మార‌ణ‌హోమం.. అట్టుడికి పోతున్న హ‌ర్యానా.
బాబా మీద భ‌క్తి ఉన్మాదాన్ని త‌లపిస్తోంది. బాబా మ‌ద్ద‌తుదారుల హింసాకాండంతో పంజాబ్ హ‌ర్యానాలు అట్టుడికిపోతున్నాయి. తీవ్ర‌వాదుల్లా రెచ్చిపోతున్న గుర్మీత్ రామ్ ర‌హీమ్ సింగ్ మ‌ద్ద‌తుదారులు అరాచకం సృష్టిస్తున్నారు. మార‌ణ‌హోమం సృష్టిస్తూ ప్ర‌జ‌సంప‌ద‌ను అగ్గికి ఆహుతి చేస్తున్నారు. అత్యాచారం కేసులో డేరా సచ్చా ...
READ MORE
పంజాబ్ కాంగ్రెస్ లో లుకలుకలు మంత్రి పదవికి సిద్దూ రాజీనామా.!!
పంజాబ్ రాష్ట్రం లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ లో లుకలుకలు బయటపడ్డాయి.ఈ పరిణామం కాంగ్రెస్ పార్టీ కి దెబ్బ మీద దెబ్బ తాకినట్టైంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా బలహీనపడ్డ కాంగ్రెస్ కి ఈ పరిస్థితి మరింత కుంగదీసినట్టైంది.అయితే మొన్నటి పార్లమెంట్ ...
READ MORE
మమతా బెనర్జీ సరికొత్త మత రాజకీయం వెనక PK హస్తం.??
దశాబ్దాల పాటు కమ్యునిస్టులు కంచుకోట గ ఏలిన రాష్ట్రం పశ్చిమ బెంగాల్ అలాంటి రాష్ట్రం లో కమ్యునిస్టుల ఓటు బ్యాంకు ను తనవైపుకు తిప్పుకుని ముఖ్యమంత్రి గ గెలిచింది తృణముల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మమతా బెనర్జీ. అయితే కమ్యునిస్టుల పై ...
READ MORE
గురువుకు శఠగోపం.. శిష్యుని ఎత్తులను అద్వానీ ముందే ఊహించారా..?
అద్వానీ అంతా ఊహించినట్టే జరిగింది.. కాబోయే భారత రాష్ట్రపతి అని చెప్పుకొచ్చిన ఎన్డీఏ వర్గం మాటకి ప్రధాని మోడీ పెద్ద శఠగోపమే పెట్టినట్టుగా కనిపిస్తోంది. గురువుకు గురు దక్షిణగా రాష్ట్రపతి పదవి ఇస్తారని భావించిన బీజేపీ, ఆర్ ఎస్ ఎస్ వర్గీయులకు ...
READ MORE
తెలంగాణలో కాంగ్రెస్ కు కోలుకోలేని ఎదురుదెబ్బ..
2014 లో అధికారం కోల్పోయి దేశ వ్యాప్తంగా డౌన్ ఫాల్ అవుతున్న కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎలాగైనా నరేంద్ర మోడి ని అడ్డుకుని అధికారంలోకి రావాలని గల్లీ పార్టీ లను కూడా కలుపుకుంటూ ఒక ప్రతిపక్షంగ ప్రజా సమస్య లపై ఫోకస్ ...
READ MORE
కరోనా కేసుల్లోనూ.. అగ్ర స్థానం అమెరికా దే.! విషమిస్తోన్న పరిస్తితి.!!
ఆర్థిక రంగం లో సాంకేతిక రంగం లో ఇలా ఎన్నో రంగాల్లో ఎంతో అభివృద్ధి సాధించిన అమెరికా ప్రపంచం లోనే అగ్ర దేశం గా కొనసాగుతున్నది. ఇలా చాలా దేశాలకు అమెరికా పెద్దన్నగా వ్యవహరిస్తున్నది.అయితే ఆసుపత్రుల విషయం లో అయినా మరియు ...
READ MORE
ఒగ్గు కథకు ఓనమాలు ఒద్దిన సత్తయ్య ఇక లేడు.!!
చదివింది ఒకటో తరగతే కానీ.. ఒగ్గు కథ చెప్పడంలో శిఖరాన్ని అందుకున్నాడు అందుకే కాకతీయ విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ పొంది డా.చుక్క సత్తయ్య అయ్యాడు. ఒగ్గు కథ చెప్పడంలో సత్తయ్య ఎంత స్పెషలిస్ట్ అంటే.. దేశవ్యాప్తంగ దాదాపు 12 వేలకు పైగా ...
READ MORE
ప్రజాధనం అంటే లెక్క లేకుండ దుబారా చేస్తున్న చంద్రబాబు.. దేశవ్యాప్తంగ చర్చ.!!
మాది కొత్త రాష్ట్రం పేద రాష్ట్రం మాకు హోదా కావాలంటూ ప్యాకేజీలు కావాలంటూ ఏకంగ కేంద్ర ప్రభుత్వం పైనే అవిశ్వాస తీర్మానం అంటూ హడావుడి చేస్తూ పార్లమెంట్ లో సినిమా కథలు చెప్తూ బయట నపుంసక వేశాలు వేస్తూ నిరసనలు ...
READ MORE