You are here
Home > తాజా వార్త‌లు > తెలంగాణ గిరిజన కుంభమేళా.. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర.!!

తెలంగాణ గిరిజన కుంభమేళా.. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర.!!

ఆసియా ఖండంలోనే అతి పెద్ద జాతరగ భారతదేశానికి తలమానికంగ నిలుస్తున్నది ఓరుగల్లు(జయశంకర్ భూపాలపల్లి జిల్లా) మేడారం సమ్మక్క సారలమ్మ గిరిజన జాతర.
ప్రతీ రెండేల్లకోసారి మాఘశుద్ద పౌర్ణమి రోజు సమ్మక్క సారలమ్మలకు ఘనంగ జాతర చేయబడుతుంది. దాదాపు 900 ఏండ్ల ఘన చరిత్ర ఉన్న మేడారం జాతర.. నేటికీ కూడా పూర్తిగ గిరిజన సాంప్రదాయ పద్దతిలోనే జరుగుతుండడం చెప్పుకోదగ్గ విషయం. దీనికి ముఖ్య కారణం గిరిజనుల్లో ఉన్న ఐకమత్యం అని చెప్పొచ్చు. గిరిజన తెగ ప్రజలు సాంప్రదాయం కోసం ప్రాణాలైన ఇస్తారు. సాంప్రదాయాన్ని గిరిజనులు వారి ఆత్మగౌరవంగ భావిస్తారు. ఇలా కాకతీయులతో భీకర యుద్ధంలో పోరాడి ప్రాణాలొదిలిన తల్లీ బిడ్డలే నేడు గిరిజన దేవతలుగ పూజలందుకుంటున్న సమ్మక్క సారలమ్మ లు.
అత్యంత భక్తి శ్రద్దలతో కొలిచే మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు ప్రతిసారీ దాదాపు కోటి మంది జనాభా హాజరవుతారని ఒక ప్రాథమిక అంచనా.!!
అందుకే మేడారం జాతరని ది యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ (UNESCO) కూడా గుర్తించింది.
తెలంగాణ నుండే కాకుండా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒరిస్సా, ఛత్తిస్ గడ్, జార్ఖండ్ రాష్ట్రాల నుండి సైతం లక్షలాది ప్రజలు తరలివస్తారు. అందుకే మేడారం దేశంలోనే అతిపెద్ద జాతరగ ప్రాఖ్యాతిగాంచింది.. ఇక ప్రపంచవ్యాప్తంగ చూసినా.. అతిపెద్ద గిరిజన జాతర అనడంలో అతిశయోక్తి లేదు.
గతంలో కొంతమంది గిరిజనుల మద్యే కొండపైనే జాతర జరిగేదని తెలుస్తున్నా.. ఆ తర్వాత భక్తులు విపరీతంగ పెరుగుతుండడంతో కొండ కింది భాగాన జాతర నిర్వహిస్తున్నారు.

* మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు చేరుకునే మార్గం:-
వరంగల్ జిల్లా కేంద్రం నుండి దాదాపు 110 కిలోమీటర్ల దూరంలో తాడ్వాయి మండలంలోని అటవీ ప్రాంతమే మేడారం. తాడ్వాయి నుండి 15 కిలోమీటర్ల దూరం ఉంటుంది మేడారం. వరంగల్ నుండి బస్సు మరియు ప్రైవేట్ క్యాబ్స్ ప్రయాణ సౌకర్యం కలదు.
ఇక హైద్రాబాద్ నుండి అయితే 270 కిలోమీటర్ల దూరం ఉంటుంది.

మేడారం మొత్తం గుట్టలు కొండలతో నిండిఉండే దట్టమైన అటవీ ప్రాంతం. ఈ కొండలమద్యే సమ్మక్క సారలమ్మ జాతర అంగరంగ వైభవంగ, అట్టహాసంగ ప్రభుత్వంచే అధికారికంగ జరుపబడుతున్నది. జాతరకు గిరిజనులే కాకుండ అన్ని వర్గాల వారు కులమతాలకు అతీతంగ భక్తులు తరలివచ్చి కొండదేవతలకు మొక్కులు తీర్చుకుంటారు. ఈ జాతరలో ప్రతి ఒక్కరు గిరిజన సాంప్రదాయాన్ని ఆచారాన్ని ఆస్వాదిస్తారు.

* ఇంత ఘన చరిత్ర కలిగిన మేడారం జాతరకు మూలం, నేపథ్యం, చరిత్రలోకి వెల్తే..
12 శతాబ్దం లో ప్రస్తుత జగిత్యాల జిల్లా అయిన “పొలవాస” పరిపాలకుడు గిరిజన దొర అతడే మేడరాజు.
మేడరాజు తన గిరిజన గూడెంలో సంచరిస్తుండగా ఒకానొక సమయంలో ఓ పసిపిల్ల దొరుకుతుంది. ఆ పాప చూడడానికి దేదీప్యమానంగ వెలుగుతూ దైవాంశ బిడ్డగా కనిపిస్తుంది. ఆ పాపనే తన కూతురుగ “సమ్మక్క” అని నామకరణం చేసి పెంచుకుంటాడు గిరిజన గూడెం దొర మేడ రాజు.
సమ్మక్క పెరిగి పెద్దయ్యాక తండ్రి మేడరాజు మేనల్లుడు పగిడిద్ద రాజుకు ఇచ్చి ఘనంగ వివాహం చేయిస్తాడు.
పగిడిద్ద రాజు “మేడారం” పాలకుడు, ఆ విధంగ సమ్మక్క మేడారంలో అడుగుపెడుతుంది.
తద్వారా సమ్మక్క పగిడిద్ద రాజు దంపతులకు సారలమ్మ, నాగులమ్మ, జంపన్న అనే ముగ్గురు సంతానం కలుగుతారు.

అంతా సంతోషంగానే సాగుతుండగా.. నాటి కాకతీయుల కాలంలో కాకతీయ ప్రభువు మొదటి ప్రతాపరుద్రుడు పగిడిద్ద రాజు యొక్క మామ, సమ్మక్క తండ్రి అయినటువంటి మేడరాజు పాలనలో ఉన్న “పొలవాస” పై దండెత్తి తన రాజ్యంలో విలీనం చేసుకుంటాడు ప్రతాప రుద్రుడు. ఆరోజు జరిగిన యుద్ధం నుండి ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని అల్లుడు పరిపాలిస్తున్న మేడారంలో తలదార్చుకుంటాడు మేడరాజు. తన అల్లుడు పగిడిద్ద రాజు కూడా మామ మేడరాజుకు అన్ని విధాల రక్షణ కల్పించి ఆశ్రయమిస్తాడు.
తర్వాత మేడారంలో తీవ్రమైన కరువు సంభవించడంతో కాకతీయులకు కప్పం కట్టలేకపోతాడు కోయదొర పగిడిద్ద రాజు.

ఈ విషయమై మేడారం దొరపై కోపం పెంచుకున్న ప్రతాపరుద్రుడు మేడారం పై తన సైన్యంతో దండెత్తుతాడు. అంతకు ముందే మేడరాజుకు ఆశ్రయమిచ్చాడనే విషయాన్ని తెలుసుకున్న ప్రతాపరుద్రుడు, పగిడిద్ద రాజు పై మరింత పగతో రగిలిపోయాడు.

గిరిపుత్రులు, ప్రతాపరుద్రుడి మద్య జరిగిన పోరాటంలో పగిడిద్ద రాజు, సారలమ్మ, నాగులమ్మ, మరియు సమ్మక్క తండ్రి మేడరాజులు మొదటగ వీరమరణం పొందుతారు. ఈ వార్త తెలిసిన జంపన్న అవమానభారంతో సంపెంగవాగులో దూకి ఆత్మహత్య చేసుకుంటాడు. ఆ తర్వాత నుండి సంపెంగ వాగు కాస్త జంపన్న వాగుగా పిలవబడుతోంది.
తన వాల్లంతా మరణించినప్పటికీ సమ్మక్క మాత్రం కాకతీయుల సైన్యం పై అపర కాళి లాగ విజృంభిస్తుంది. పోరాడుతున్నగొద్దీ సమ్మక్క శక్తి రెట్టింపవుతోంది.
సమ్మక్క పోరాటం ముందు నిలవలేక అష్టకష్టాలకు గురవుతుంది ప్రతాపరుద్రుడి సైన్యం. సమ్మక్క యుద్దతంత్రం చూసి ప్రతాపరుద్రుడు సైతం ఆశ్చర్యపోతాడు. తర్వాత వ్యూహాత్మకంగ సమ్మక్కను దొంగచాటున దెబ్బతీస్తుంది కాకతీయ సైన్యం.
ఆ గాయాలతోనే రక్తపు ధారలు పారుతుండగా యుద్దం నుండి తప్పించకుని చిలుకల గుట్టవైపు వెలుతూనే అదృశ్యమైపోతుంది. సమ్మక్క అనుసరిస్తూ సైనికులూ, అణుచరులు వెల్లినప్పటికీ ఆమె జాడ కనిపించలేదు. కానీ సమ్మక్క అదృష్యమైన దగ్గరే పుట్ట దగ్గర పసువు కుంకుమల భరిణే లభించడంతో.. ఆ ప్రదేశంలోనే ప్రతీ రెండేల్లకోసారి మాఘ శుద్ధ పౌర్ణమి రోజున అత్యంత భక్తి శ్రధ్దలతో అంగరంగ వైభవంగ జాతర చేస్తారు.

జాతరలో భాగంగ మొదటి రోజు సారలమ్మ ను కన్నెపల్లి నుండి గద్దె వరకు ఊరేగింపుగా తీసుకువస్తారు, రెండవ రోజు చిలుకల గుట్ట పై భరిణె రూపంలో ఉన్న సమ్మక్కను గద్దె వద్దకు ఊరేగింపుగా తీసుకువస్తారు, మూడవరోజు వనదేవతలిద్దరూ గద్దెలపై ఆసీనులవుతారు. నాలుగవ రోజు ఆవాహన పలికి దేవతలిద్దరినీ యుద్దస్థానానికి తరలిస్తారు. ఈ కార్యక్రమంలో దేవతలను గద్దెలపై ప్రతిష్టించేటప్పుడు భక్తులు పూనకాలతో పులకించిపోతుంటారు.
అయితే.. ప్రతిసారీ జాతరకొచ్చే భక్తుల సంఖ్య పెరుగుతుండడంతో ఇంతింతై వటుడింతై అన్నటు జాతర ప్రాముఖ్యత దేశ వ్యాప్తంగ ప్రాధాన్యత సంతరించుకుంది.

అమ్మవార్లకు ఇష్టమైన బంగారం(బెల్లం) సమర్పించి కోరికలు కోరితే తప్పక నెరవేరుతై అని భక్తుల ప్రగాఢ విశ్వాసం. భక్తులంతా అమ్మవారి ప్రసాదంగ బంగారాన్ని(బెల్లం) ని స్వీకరిస్తారు. బంధు మిత్రులకు పంచి పెడతారు. చాలమంది భక్తులు వారి శరీర బరువుకు తూకం వేసి అంత బరువు బంగారాన్ని సమర్పిస్తామని మొక్కుతారు భక్తులు. ఎన్ని కిలోల బంగారమైనా సరే ప్రత్యక్షంగ తినాల్సిందే తప్ప ఇతర వంటకాలకు అమ్మవారి బంగారాన్ని (బెల్లం) ఉపయోగించకూడదంటారు భక్తులు.

ఇక్కడి అమ్మవార్ల గద్దెలను భక్తుల రద్దీ కారణంగ 1940 సంవత్సరంలో ఏర్పాటు చేసారు. అంతకు ముందు చిలుకల గుట్ట పైనే జాతర జరిపేవారు.
ఆ తర్వాత 2006 నుండి నాటి ఉమ్మడి ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం చే అధికారికంగ నిర్వహించడం ఆనవాయితిగా వస్తోంది. 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. 

Related Posts
డిగ్రీ చదివిన ముస్లిం అమ్మాయిలకు ప్రధాని మోడీ వరం. “షాదీ షగున్’  పేరిట రూ. 51వేలు పెళ్లికానుక
బాలికా విద్యను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు మరో కొత్త పథకాన్ని ప్రారంభించనుంది. డిగ్రీ విద్యను పూర్తి చేసిన ముస్లిం యువతులకు 'షాదీ షగున్' పేరిట పెళ్లి కానుకగా రూ. 51 వేలను అందించాలని నిర్ణయం తీసుకోనుంది. మౌలానా ...
READ MORE
స్వ‌ర్గం నుండి ఓ చిన్నారి ఆవేద‌న‌.. అంకుల్ మీకు మేం ఏం పాపం చేశాం.
సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న ఈ క‌థ‌నం ప్ర‌తి ఒక్క‌రి హృద‌యాల‌ను క‌దిలిస్తోంది. క‌న్నీటి సంద్రంలో ముంచుతుంది. ప్ర‌భుత్వాల చేత‌గాని చ‌ర్య‌ను ప్ర‌శ్నిస్తోంది. ఓ నిండు ప్రాణం బ‌లికావాడానికి ప్ర‌ధాన కార‌ణాల‌ను క‌ళ్ల‌ముందు చూపుతుంది. అంకుల్ నేను కూడా మీ క‌న్న‌బిడ్డ‌లాంటి ...
READ MORE
హిందువులకు దగ్గర కావడానికి తహతహలాడుతున్న కామ్రేడ్లు..!!
కామ్రేడ్స్.. కమ్యునిస్ట్స్.. నక్సల్స్.. ఎర్రదళం.!! పేర్లలో మార్పు ఉండొచ్చేమో గానీ సిద్దాంతం ఒక్కటే. కానీ ఆ సిద్దాంతాన్ని పాటించడంలోనే వెనకబడిపోయి జనాలకు దూరమయ్యారు కామ్రెడ్లు. ఎప్పుడూ హేతువాదం లౌకికవాదం అంటూ మైనారిటీలకు భజన చేస్తూ హిందూ సమాజం పై కన్నెర్ర చేస్తూ ...
READ MORE
దళిత మహిళను వివస్త్రను చేసి ఈడ్చుకెల్లిన తెలుగుదేశం తమ్ముల్లు..!!
ఆంధ్రప్రదేశ్ లో పేదవారిపై మరోసారి పంజా విసిరారు అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులు. బలహీనులపై కనీస మానవత్వం చూపలేకపోయారు.. కనీసం మహిళలు అనే ఇంగిత జ్ఞానం మరిచిపోయి సిగ్గుతప్పిన చర్యలకు పాల్పడ్డారు. సభ్య సమాజం తల దించుకునేలా ప్రవర్తించారు.. బడుగు ...
READ MORE
నీకు మా మర్యాద నచ్చకుంటే.. అవార్డులు రివార్డులు అన్నీ తిరిగిచ్చేయాలి అంటున్న నెటిజన్లు..!!
బ్యాట్మింటన్ క్రీడాకారిని పీవీ సింధు చేసిన వివాదస్పద వ్యాఖ్యలు చర్చలకు దారి తీస్తోంది. విదేశాల్లోనే మహిళలకు ఎక్కువ గౌరవ మర్యాదలు ఉంటాయని భారత్ లో లేవని అనడం తాజా వివాదానికి దారి తీసింది. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వార్తలు రావడంతో సోషల్ ...
READ MORE
సోషల్ మీడియాని లైట్ గా తీసుకుంటే లైఫ్ అంతా కటకటాలపాలే..
వాట్సప్, ట్విట్టర్, ఫేస్ బుక్ కాదేవి భావవ్యక్తీకరణ కు అడ్టు. అయితే శృతిమించితే మాత్రం తిప్పలు తప్పవంటున్నారు పోలీస్ లు. తాజాగా వరుస పెట్టి జరుగుతున్న సోషల్ మీడియా ఘటనలతో వేగం పెంచారు. ఎక్కడ ఏ చిన్న తప్పు జరిగినా అందుకు ...
READ MORE
భార‌త రాష్ట్ర‌ప‌తిగా లాల్ కృష్ణ అద్వానీ.. గురుద‌క్ష‌ణ చెల్లించుకోబోతున్న ప్ర‌దానీ..!
భారతీయ జ‌న‌తా పార్టీ అగ్ర‌ నేత‌.. ప్ర‌దాని న‌రేంద్ర మోడి గురువ‌ర్యులు అగ్ర నేత లాల్ కృష్ణ అద్వానీ రాష్ట్రపతి కాబోతున్నారా..?? ప‌్ర‌దాని న‌రేంద్ర మోడీ గురుద‌క్షిణ‌గా అద్వానీని రాష్ట్ర‌ప‌తి పీఠం మీద చూడ‌ల‌నుకుంటున్నారు.. మిత్ర ప‌క్షాల అండ‌తో అద్వానీ రాష్ట్ర‌ప‌తి ...
READ MORE
125 కోట్ల మంది ఆశ.. శ్వాస మన దేశం కొస్తున్నాడు.
ప్రముఖ ఇజ్రాయిల్ పత్రిక ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనకు ప్రత్యేకంగా ఆహ్వానం పలికింది. మేల్కొండి! ప్రపంచంలోనే అతి ముఖ్యమైన ప్రధానమంత్రి వస్తున్నారు అంటూ ప్రధాని నరేంద్ర మోడీ ఇజ్రాయిల్ పర్యటనను ఉద్దేశించి ఆ దేశానికి చెందిన ప్రముఖ బిజినెస్ డైలీ ది ...
READ MORE
ఒక్కసారి మనుషులుగా ఆలోచిద్దాం.. విధి వంచిత కుటుంబాన్ని ఆదుకుందాం.
కాలం కాటేసి ఆ కుటుంబాన్ని చిన్నభిన్నం చేసింది. రోడ్డు ప్రమాదం ఆ కుటుంబాన్ని వీదిన పడేసింది. ఏ ఆదారం లేక ఇప్పుడు ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తుంది ఈ కుటుంబం. ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న కుటుంబం ఇప్పుడు అంతే ఆనందంగా ...
READ MORE
ఏడాదికి తెలంగాణ రాష్ట్రం కడుతున్న వడ్డీ ఎంతో తెలుసా..??
తాజాగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్రం భారీగ అప్పు చేసిన విషయం వెల్లడైంది. రాష్ట్రం ఏర్పడిన నాటికి కేవలం రూ69,517 వేల కోట్ల అప్పు ఉంటే, ఇప్పుడది ఐదేల్లలో 159% పెరుగుదలతో రూ1,80,239 కోట్లుగ తయారైంది. ...
READ MORE
టిక్ టాక్ వైద్యం.. ఆసుపత్రి పాలైన కుటుంబం.!!
ఆంధ్ర ప్రదేశ్ ప్రకాశం జిల్లా చీమకుర్తి లో దారుణ ఘటన చోటు చేసుకుంది. టిక్ టాక్ యాప్ లో కరోనా వ్యాధి రాకుండా ఉండాలంటే ఉమ్మెత్తకాయను తినాలని ఎవడో బుద్ధి లేనోడు విడియో పెడితే ఆ వీడియో చూసిన ఓ కుటుంబం, ...
READ MORE
బాబు ఏడ్చాడు. రాజకీయాలను పక్కనపెట్టి మానవత్వంతో స్పందించాడు.
నిరంతరం రాజకీయాలతో బిజిగా బిజిగా ఉంటూ ప్రతిపక్షాలను ఎదుర్కొంటూ.. అప్పుడప్పుడు అతిగా ఫైరయ్యే బాబు తొలి సారి కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఎప్పుడు గంభీరంగా ఉంటూ అధికారుల నుంచి నాయకుల వరకు అందరిని శాసించే చంద్రబాబు ఒక్కసారిగా ఉద్వేగానికి లోనయ్యారు. అనంతపురం సాక్షిగా ఆంధ్రప్రదేశ్ ...
READ MORE
న్యాయం కోసం నిరాహార దీక్షకు దిగిన ఫార్మా డి వైద్యులు.!!
ఎంబీబీఎస్ చదివినవారు డాక్టర్ వృత్తి చేపడుతారు, ఫార్మసీ చదివితే మెడికల్ ఫీల్డ్ లో స్థిరపడతారు. దాదాపు అన్ని రకాల మెడికల్ విద్యార్థులకు ప్రభుత్వ పరంగానూ ప్రైవేట్ గానూ ఉద్యోగవకాశాలు ఉన్నై.. కానీ ఫార్మా డి చదివిన వారి భవిష్యత్ ప్రశ్నార్థకంగ మారింది. ...
READ MORE
ప్రతిష్టాత్మకమైన FCI కమిటీ మెంబర్ గ డా.ఎం.గిరిధరాచార్యులను ఎంపిక చేసిన కేంద్రం.!!
ప్రతిష్టాత్మకమైన ఫుడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా(FCI) కమిటీ మెంబర్ గ ఎన్నికయ్యారు తెలంగాణ రాష్ట్రానికి చెందిన డా.ఎం.గిరిధరాచార్యులు. రెండేల్ల పరిది కాలం ఉండే ఈ పదవికి దేశ వ్యాప్తంగా ఎందరో ప్రముఖులు పోటీ పడుతుంటారు. కాగా FCI కమిటీ మెంబర్ గ ఎన్నికైన డా.ఎం.గిరిధరాచార్యులు ...
READ MORE
బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులుగా తిండేరు హనుమంత రావు
బీజేపీ సీనియర్ నాయకులు ఉప్పల్ నియోజకవర్గం రామంతపూర్ కి చెందిన తిండేరు హనుమంత రావు తాజాగా మేడ్చల్ మల్కాజిగిరి అర్బన్ జిల్లా కు బీజేపీ ఉపాధ్యక్షులుగా నియామకం అయ్యారు. ఈ మేరకు జిల్లా అధ్యక్షులు హరీష్ రెడ్డి అధికారికంగా వెల్లడించడం జరిగింది. బీజేపీ ...
READ MORE
పూర్ణః సాహ‌సానికి ప‌రిమితులుండ‌వు… బాలీవుడ్ తెర‌పై రేపే విడుద‌ల‌.
తెలంగాణ గొప్ప త‌నాన్ని తెలంగాణ మారుమూల ప‌ల్లెల అపార శ‌క్తిని ప్ర‌పంచానికి చాటిన బాలిక పూర్ణ‌. తెలుగు స‌త్తాను తెలంగాణ ఖ్యాతిని తెలుగు వెండితెర మ‌ర‌చినా బాలీవుడ్ మాత్రం హ‌క్కున చేర్చుకుంది. ఎంతో క‌ష్టానికోర్చి ప్రాణాలు ప‌ణంగా పెట్టి ఎవ‌రెస్ట్ శిఖారాన్ని ...
READ MORE
కొడుకుకి మాటలు నేర్పించడానికి లక్షలు ఖర్చు చేస్తున్న సిఎం.! విస్మయం వ్యక్తం చేస్తున్న జనాలు.!!
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో ప్రస్తుతం కుటుంబ పాలన నడుస్తుందని చెప్పడానికి ఇది మరో ఉదాహరణ అంటున్నారు తెలుగు ప్రజలు. ముఖ్యమంత్రి తనయుడు మంత్రి నారా లోకేష్ నాయుడికి తెలుగులో మాట్లాడడం రాదని అందరికీ తెలిసిందే.. ఆయన తెలుగులో మాట్లాడుతూ చాలా ...
READ MORE
నాడు గురువు దైవానికి ప్రతిరూపమైతే.. నేడు కార్పోరేట్ సెంటర్లో చిరుద్యోగి.
తల్లి జన్మనిస్తే.. గురువును జీవితాన్నిస్తాడు. *ఒకప్పుడు గురువు వద్దకు విద్యార్థి వెల్లి నమస్కరించి విద్యనభ్యసించేవాడు.. నేడు గురువే విద్యార్థి ఇంటికి వచ్చి పిల్లవాడికి గుడ్ మార్నింగి చెప్పి హోమ్ ట్యూషన్ చెప్తున్నాడు. *అప్పుడు ఉపాద్యాయుడంటే సమాజంలో భయం భక్తి నేడు ఉపాద్యాయుడంటే ఓ ఉద్యోగి ...
READ MORE
టీడీపీ తప్పుడు ప్రచారంపై సీరియస్ అయిన పురంధరేశ్వరి.!!
ప్రపంచంలోనే అతిపెద్ద సర్థార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం "స్టాచ్యూ ఆఫ్ యూనిటి" పేరుతో ఏర్పాటు చేసి జాతికి అంకితం చేసారు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడి. అయితే అక్కడ దేశంలో ఉన్న ప్రముఖ భాషలలో ఐక్య భారతం శ్రేష్ఠ భారతం అని రాసి ...
READ MORE
మరోసారి తన సహజ బుద్దిని చూపిన బాలక్రిష్ణ
ఎన్నిసార్లు విమర్శలపాలైనప్పటికీ నటుడు హిందూపురం టీడీపీ ఎంఎల్ఏ నందమూరి బాలక్రిష్ణ తన ఆవేశాన్ని ఆపుకోలేకపోతున్నాడు, పదే పదే టీడీపీ కార్యకర్తలపై అభిమానులపై దాడి చేస్తూనే ఉన్నాడు. తాజాగా మరోసారి హిందూపురంలో టీడీపీ ఇంటింటి కార్యక్రమంలో ఒకరి ఇంటికెల్లే సంధర్భంలో.. ఓ టీడీపీ ...
READ MORE
భక్తులకు వనదేవతలు.. వ్యాపారులకు మాత్రం లక్ష్మి దేవతలు.! మేడారం పరిస్థితి.!!
మేడారం సమ్మక్క సారలమ్మ జాతర అంటే తెలియని వారుండరు.. దేశ వ్యాప్త గుర్తింపు కలిగిన అతిపెద్ద ఉత్సవం.. ఇది గిరిజన జాతరనే అయినప్పటికీ కుల వర్గాలకు అతీతంగ భక్తులు తరలివస్తారు. ఇంకా చెప్పాలంటే హిందువులే కాకుండా ఇతర మతాల ప్రజలు సైతం ...
READ MORE
బ్యూటీషియన్‌పై అత్యాచార యత్నం.. ఎమ్మెల్సీ కొడుకనే తెలుగు మీడియా పట్టించుకోలేదా..?
ప్రేమిస్తున్నానని చెప్పాడు.. పెళ్లి చేసుకుంటా అని కూడా మాటిచ్చాడు తీరా ఇంటికి పిలిపించుకుని దారుణానికి ఒడిగట్టాడు ఓ ప్రేమికుడు. ఈ ఘటనలో ఎమ్మెల్సీ కుమారుడు కూడా ఉన్నాడు. అతని చేతిలో మోసపోయిన యువతి న్యాయం కోసం పోలీస్ స్టేషన్ మెట్లెక్కినా లాభం ...
READ MORE
తెలంగాణ నుండి మరొకరికి గవర్నర్ పదవి.  అది బద్దం బాల్ రెడ్డికేనా.?
రాష్ట్రపతి ఎన్నికలు ముగిసాయి. తొందర్లోనే ఉప రాష్ట్రపతి ఎన్నక కూడా ముగియనుంది. ఇక ఆ తర్వాత ఆయా రాష్ట్రాలకు గవర్నర్ ల నియామకం జరగాల్సి ఉంది. కేంద్రంలో భాజపా అధికారంలోకి వచ్చాక కూడా యూపీఏ హయాంలో వచ్చిన గవర్నర్లు కొనసాగుతున్నారు. ఇక వారందరి పదవీ కాలం ...
READ MORE
చీర్యాల నరసింహుడి బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి ని ఆహ్వానించిన ఆలయ చైర్మణ్.!!
తెలంగాణ ప్రముఖ ఆలయం చీర్యాల శ్రీశ్రీశ్రీ లక్ష్మి నృసింహ స్వామి దేవాలయంలో ఈ నెల 09 తేదీ నుండి 14 వ తేదీ వరకు జరగనున్న స్వామి వారి బ్రహ్మోత్సవాలకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ని కలిసి ...
READ MORE
విద్యా విలువలకు నిలువెత్తు నిదర్శనం అనిల్ కుమార్ ఠాకుర్ బర్త్ డే స్పెషల్.!!
ఈ లోకంలో మనిషి ఎదుగుదల కు అత్యంత ముఖ్య సాధనం.. మనిషి మనిషిగా మారాలన్నా ముఖ్యమైనది ఏదైనా ఉందంటే అది చదువు ఒక్కటే.. అందుకే మన సామెతల్లో విద్య లేని వాడు వింత పశువు అని ఎప్పుడో రాసి పెట్టి ఉంది. కానీ ...
READ MORE
డిగ్రీ చదివిన ముస్లిం అమ్మాయిలకు ప్రధాని మోడీ వరం. “షాదీ
స్వ‌ర్గం నుండి ఓ చిన్నారి ఆవేద‌న‌.. అంకుల్ మీకు మేం
హిందువులకు దగ్గర కావడానికి తహతహలాడుతున్న కామ్రేడ్లు..!!
దళిత మహిళను వివస్త్రను చేసి ఈడ్చుకెల్లిన తెలుగుదేశం తమ్ముల్లు..!!
నీకు మా మర్యాద నచ్చకుంటే.. అవార్డులు రివార్డులు అన్నీ తిరిగిచ్చేయాలి
సోషల్ మీడియాని లైట్ గా తీసుకుంటే లైఫ్ అంతా కటకటాలపాలే..
భార‌త రాష్ట్ర‌ప‌తిగా లాల్ కృష్ణ అద్వానీ.. గురుద‌క్ష‌ణ చెల్లించుకోబోతున్న ప్ర‌దానీ..!
125 కోట్ల మంది ఆశ.. శ్వాస మన దేశం కొస్తున్నాడు.
ఒక్కసారి మనుషులుగా ఆలోచిద్దాం.. విధి వంచిత కుటుంబాన్ని ఆదుకుందాం.
ఏడాదికి తెలంగాణ రాష్ట్రం కడుతున్న వడ్డీ ఎంతో తెలుసా..??
టిక్ టాక్ వైద్యం.. ఆసుపత్రి పాలైన కుటుంబం.!!
బాబు ఏడ్చాడు. రాజకీయాలను పక్కనపెట్టి మానవత్వంతో స్పందించాడు.
న్యాయం కోసం నిరాహార దీక్షకు దిగిన ఫార్మా డి వైద్యులు.!!
ప్రతిష్టాత్మకమైన FCI కమిటీ మెంబర్ గ డా.ఎం.గిరిధరాచార్యులను ఎంపిక చేసిన
బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులుగా తిండేరు హనుమంత రావు
పూర్ణః సాహ‌సానికి ప‌రిమితులుండ‌వు… బాలీవుడ్ తెర‌పై రేపే విడుద‌ల‌.
కొడుకుకి మాటలు నేర్పించడానికి లక్షలు ఖర్చు చేస్తున్న సిఎం.! విస్మయం
నాడు గురువు దైవానికి ప్రతిరూపమైతే.. నేడు కార్పోరేట్ సెంటర్లో చిరుద్యోగి.
టీడీపీ తప్పుడు ప్రచారంపై సీరియస్ అయిన పురంధరేశ్వరి.!!
మరోసారి తన సహజ బుద్దిని చూపిన బాలక్రిష్ణ
భక్తులకు వనదేవతలు.. వ్యాపారులకు మాత్రం లక్ష్మి దేవతలు.! మేడారం పరిస్థితి.!!
బ్యూటీషియన్‌పై అత్యాచార యత్నం.. ఎమ్మెల్సీ కొడుకనే తెలుగు మీడియా పట్టించుకోలేదా..?
తెలంగాణ నుండి మరొకరికి గవర్నర్ పదవి. అది బద్దం
చీర్యాల నరసింహుడి బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి ని ఆహ్వానించిన ఆలయ చైర్మణ్.!!
విద్యా విలువలకు నిలువెత్తు నిదర్శనం అనిల్ కుమార్ ఠాకుర్ బర్త్
Facebook Comments
Top
error: Content is protected !!