You are here
Home > తాజా వార్త‌లు > ఈ భామ్మ వంట ప్ర‌పంచంలోనే ది బెస్ట్ అంట‌.. ఒక్క సారి రుచి చూస్తే మ‌ళ్లీ మ‌ళ్లీ తినాల‌నిపిస్తుంది.

ఈ భామ్మ వంట ప్ర‌పంచంలోనే ది బెస్ట్ అంట‌.. ఒక్క సారి రుచి చూస్తే మ‌ళ్లీ మ‌ళ్లీ తినాల‌నిపిస్తుంది.

వంటల పోటీలు అన‌గానే టిప్పు టాప్ గా రెడి అయి కాస్లి వంట సామాన్లు ముంద‌రేసుకుని.. గ‌రిట‌ని అటు ఇటు ఓ ప‌ది సార్లు తిప్పి కెమెరా ముందే పోజిస్తే స‌రి.. కొత్త పేరుతో వెరైటి వంట‌కాన్ని ప‌రిచ‌యం చేసి.. ఇక ఆ వంట తిన్న యాంక‌రమ్మ సూప‌ర్ అని కితాబిస్తే ఎగిరి గంతేయ‌డం. ఇది ఈ నాటి మీడియాలో క‌నిపించే వంట‌ల వ‌య్యారాలు. కానీ ఓ వందేళ్ల ముస‌ల‌మ్మ ఈ నాటి ట్రెండ్ కి పోటీ వ‌స్తే.. ఆ అమ్మ చేతితో త‌యార‌య్యే వంట‌కాలు ప్ర‌పంచ అంతా మెచ్చితే… మెచ్చితే కాదు ఇప్పుడు ఆ వంట‌కాలే ది బెస్ట్ అని చెపుతోంది సోష‌ల్ మీడియా దిగ్గ‌జం యూట్యూబ్. మ‌రీ ఆ వందేళ్ల భామ్మ వండే వంట‌కాల రుచి మ‌నం కూడా టేస్ట్ చేస్తే పోలా..

రుచులంటే ఆ కాలంలోనివే మ‌రీ.. ఇప్పుడంతా మందు కూడు క‌దా.. ఆనాటి కాలం వ్య‌క్తులను ఎవ‌రిని ప‌ల‌క‌రించినా వినిపించే మాట‌. రాగి సంక‌టి గ‌ట్కా తిని ఆరోగ్యంగా ఉన్నాం కానీ ఇప్ప‌ట్లా ఏది ప‌డితే అది తింటే ఇక అంతే సంగ‌తులు అంటున్నారు పెద్ద‌లు. మ‌రీ ఆ నాటి కాలం వంట‌ల‌కు ఈ నాటి టెస్ట్ ని జ‌త‌చేసి వండితే.. ఈ వందేళ్ల తెలుగు భామ్మ ఆ ప‌నే చేస్తోంది. త‌న చేతితో ఏ వంట వండిన లొట్ట‌లేసుకుంటు తిన‌డ‌మే అని చెపుతోంది. ప‌చ్చ‌ని వాత‌వ‌ర‌ణంలో ఓ చ‌ల్ల‌ని నీడ నిచ్చే చెట్టు కింద.. పొలం గట్టుపై కట్టెల పొయ్యి మీదే సంప్రదాయ వంటల్ని వండుతూ.. ఈ ట్రెండి యుగ వార‌సుల‌కు అస‌లైన వంటల రుచిని చూపిస్తోంది. నిమిషాల్లో వంట పూర్తి చేసేలా కుక్కర్లు, మిక్సీలు వాడ‌టం కానీ.. ఆగ‌మేఘాల మీద వంట వండ‌టం కానీ ఉండ‌దు. ఈ భామ్మ చేతి వంట తినాలంటే కాస్త ఓపిక‌ప‌ట్టాల్సిందే.

ఇక భామ్మ చేసే వంటకాల్లో ఉప్పు పప్పుల లెక్కంతా చేతి కొల‌త‌ల్లోనే.. ఏది ఎంత వేస్తే రుచి ప‌చి ఉంటుందో ఈ భామ్మ‌కు కొట్టిన పిండి. ఇది అది అని కాదు వంద‌ల ర‌కాల వంట‌కాల‌ను త‌న చేతితో అధ్బుతంగా వండ‌గ‌ల నైపుణ్యం ఆమెది. ఆరు నెలల్లో ఆమ్లెట్‌, రొయ్యలూ, పీతలూ, దోసకాయ చికెన్‌, బ్రెడ్‌ ఆమ్లెట్‌ వంటి వంటకాలెన్నో తనదైన శైలిలో చేసి చూపింది. అందుకే దేశ విదేశాల్లోని 42 మిలియన్ల మంది వాటిని చూశారు. ఆ ఛానల్‌కి రెండున్నర లక్షల మందికిపైనే చందాదారులుగా మారిపోయారు. నూట ఆరేళ్ల ఈ బామ్మకి దేశవిదేశాల్లో అభిమానులున్నారు. చీరలూ, గ్రీటింగు కార్డులు పంపుతున్నారు. సన్మానం చేస్తామని ఆహ్వానం అందిస్తున్నారు. అదంతా ఈ బామ్మ చేతివంట మహత్యమే.

ఇంత చెపుతున్నావ్.. అస‌లు భామ్మ పేరు చెప్ప‌ట్లేదు అని అడుగుతున్నారు క‌దా అక్కడికే వ‌స్తున్నా. భామ్మ పేరు క‌ర్రి మ‌స్తాన‌మ్మ‌. ఊరు తెనాలి కి పది కిలోమీటర్ల దూరంలో ఉందీ చిన్న పల్లెటూరు. కంట్రీఫుడ్స్‌ యూట్యూబ్‌ ఛానల్ తో ఫేమ‌స్ అయింది. నిన్న‌మొన్న‌టి దాక ఎవ‌రికి తెలియ‌ని ఆ ఊరు క‌ర్రి మ‌స్తాన‌మ్మ వంట‌ల‌తో ఇప్పుడు ప్ర‌పంచ వ్యాప్తంగా ఫేమ‌స్ అయింది.

యూట్యూబ్ లో మ‌స్తాన‌మ్మ వంట‌కాల‌ను రోజుకు ల‌క్ష‌ల్లో వీక్షిస్తున్నారంట‌. ఈ దెబ్బ కంట్రీఫుడ్స్ యూట్యూబ్ ఛాన‌ల్ పంట పండుతోంది. అంతే కాదు ఈ విష‌యం తెలుసుకున్నవ‌రల్డ్ బీబీసీ ఛాన‌ల్ వారు త్వ‌ర‌లోనే గుడివాడ వెళ్లి.. పొలం గట్ల మధ్య కట్టెల పొయ్యి మీద సంప్రదాయ వంటలు చేస్తున్న కర్రె మస్తానమ్మ ఇంట‌ర్య్వూ తీసుకోవాల‌నే ఫ్లాన్ లో ఉన్నారంట‌. అది మ‌న తెలుగు భామ్మ వంట‌కాల స‌త్తా. గోల్డ్ ఈజ్ గోల్డ్ అని ఊరికే అన్నార పెద్ద‌లు.

Facebook Comments
Top
error: Content is protected !!