You are here
Home > తాజా వార్త‌లు > ఎల్బీనగర్ అడ్డాగా అధికార పార్టీ కార్పొరేటర్ల కమిషన్ దందా..?

ఎల్బీనగర్ అడ్డాగా అధికార పార్టీ కార్పొరేటర్ల కమిషన్ దందా..?

హైదరబాద్ విశ్వనగరంగా రూపుదిద్దుకుంది. గత పాలకుల పాలన అంతమై తెలంగాణ రాష్ట్రం సిద్దించింది. ఉద్యమ పార్టీనే అధికారంలోకి వచ్చింది. మూడేళ్లు గడిచిపోయాయి…రాష్ట్ర రాజధాని ఈ మూడేళ్లలో మరింత అభివృద్ది పథంలో దూసుకెళుతుంది. అందుకు గాను ప్రభుత్వం క్లీన్ అండ్ గ్రీన్ పాలన చేయాలని.. అవినీతికి తావుండ కూడదని పక్కాగా ముందుకు వెళుతుంది. అయితే ప్రభుత్వ నిర్ణయానికి హైదరబాద్ కార్పొరెటర్లు మాత్రం తూట్లు పొడుస్తున్నారు. బిల్డర్లను బెదిరిస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే కోట్లు ఖర్చు పెట్టి గెలిచాం ఆ మాత్రం వసూల్ చేసుకోకపోతే ఎలా అంటూ కమిషన్ రాజాల రేంజ్ లో ఎదురు ప్రశ్నిస్తున్నారు. పునాది వేసింది మొదలు అంతస్తు లేచే వరకు తమకు ఇవ్వాల్సిన వాట తప్పక ఇవ్వాలని బెదిరిస్తున్నారు. ఇంతకీ ఆ కార్పొరెట్లు ఎవరు..? ప్రభుత్వానికి ఈ విషయం తెలియదా..? ఒకవేళ తెలిసినా తెలియనట్టు కావాలనే ప్రభుత్వం నడుచుకుంటుందా..?


ఎల్బీనగర్ ఏరియాలో కార్పొరేటర్ల వసూళ్ల దందా మూడు పువ్వులు ఆరుకాయలుగా సాగుతోంది. మొన్నటి జీహెచ్ ఎంసి కార్పొరేటర్ల ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందిన ప్రభుత్వానికి చెందిన ఓ కార్పొరేటర్ మరో 8 మంది కార్పొరేటర్లను కలుపుకుని వసూళ్ల దందాకు తెరలేపారు. అధికారంలో ఉన్నది తమ ప్రభుత్వమే అని పర్మిషన్ రావలంటే తప్పకుండా డబ్బులు ఇవ్వాలని బెదిరిస్తున్నారు.  కాదు కూడదంటే ఎంతకైనా తెగించేందుకు సిద్దమవుతున్నారు. ఈ దందాలో మహిళ కార్పొరేటర్లు సైతం చేయి చేయి కలిపి నడుస్తున్నారు.


ఓ పక్క తెలంగాణ సర్కార్ అక్రమాలకు తావివ్వకుండా భాగ్యనగరంలో భవన నిర్మాణాలు కొనసాగాలని.. అసలు అవకతవకలే లేకుండా ఎక్కడ ఎలాంటి లాలుచీలు పడకుండా నిర్ణయాలు తీసుకుంటుంది. కానీ ఎల్బీనగర్, ఉప్పల్,  నాగోల్ లో మాత్రం అవేవి చెల్లవంటున్నారు ఇక్కడి టీఆరెస్ ప్రభుత్వ కార్పొరెటర్లు. ఎట్టి పరిస్థితుల్లో మాములు ఇవ్వాల్సిందేనని లేకుంటే అనుమతులు ఇచ్చేదే లేదని హుకుం జారీ చేస్తున్నారు. దీంతో బిల్డర్లు   చేసేదేమి లేక అడిగిన కాడికి సమర్పించుకుంటున్నారు. అయితే ఈ వసూళ్ల దందా రోజు రోజుకి మితిమీరడంతో ఇక చేసేది లేక బిల్డర్ అసోసియేషన్ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ను కలవాలని నిర్ణయించుకుంది. మంత్రిని కలిసి తమ గోడు వెల్లబుచ్చుకోవాలని డిసైడ్ అయ్యారు బిల్డర్లు. అయితే ఈ విషయం తెలుసుకున్న కార్పొరేటర్లు బిల్డర్లను బుజ్జగించేందుకు ప్రయత్నాలు మొదలెట్టారు. ప్రత్యేకంగా ఓ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి టీఆరెస్ కు చెందిన కీలక నేత ఒకరు అధ్యక్షత వహించి సమస్యను సాల్వ్ చేయాలని చూశారు.

ఇక ఆ నేత మాటలు వింటుంటే మారింది ప్రభుత్వమే కాని పాలన కాదని అర్థం అవుతుంది. సీఎం తీసుకునే నిర్ణయాలు కింది స్థాయిలో అసలు అమలు కావడం లేదని పక్కగా తెలుస్తుంది. లంచాలకు మరిగిన కార్పొరెటర్లు చెపుతున్న మాటలు వింటే షాక్ అవక తప్పదు. వాళ్ల మాటలు ఎలా ఉన్నాయంటే కోట్లు ఖర్చు చేసి గెలిచాం అవన్ని వసూళు చేసుకోవద్దా… గత పాలకులు కోట్లల్లో ఆర్జించారు మేము లక్షల్లో అడిగితే తప్పా.. మాకెవడిస్తాడు.. ఒక్కో నెల రెండు లక్షలు ఖర్చవుతుంది.. ఇక ఇప్పుడేమో పార్టీ సభ్యత్వ నమోదని ఇంకా భారం పెరిగింది. తొమ్మిది నుండి పది లక్షల ఖర్చస్తుంది. అవన్ని ఎక్కడి నుంచి తేవాలి.. మీ నుండి గుంజకపోతే ఎక్కడి గుంజాలి అంటున్నడు ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన అధికార పార్టీ నేత. ఇక బిల్డర్లు మాత్రం మేమే దొరికామా.. సక్రమంగా నిర్మాణాలు చేసినా లంచాలు ఇవ్వాలా అంటున్నారు. లక్షల్లో సమర్పించుకుంటే అక్రమంగా కట్టకతప్పదని అందుకు మీరు ఒప్పుకుంటార అని బిల్డర్ల తరుపున వ్యక్తి ప్రశ్నించాడు. మీరెమన్నా చేసుకొండి మాకు డబ్బులు ఇవ్వాల్సిందే అని కార్పొరేటర్ల తరుపు నుండి సమాదానం.


ఇది ఎల్బీనగర్ అడ్టాగా జరుగుతున్న కార్పరేటర్ల వసూళ్ల దందా. ఇలా అక్రమ వసూళ్లకు తెగపడితే బిల్డర్లు అక్రమాలు కట్టకుండా ఊరుకుంటారా… అవి కూలి అమాయకుల ప్రాణాలు తీయకుండా ఉంటాయ. ఇదే కొనసాగితే ఇక భాగ్యనగరం భద్రమైన నగరం ఎందుకు అవుతుంది.  ఇప్పటికైనా ముఖ్యమంత్రి ఈ తరహా కార్పొరేటర్ల పై ప్రత్యేక దృష్టి పెట్టక పోతే స్వరాష్ట్రం వచ్చి కూడా లాభం లేదు. గత పాలకులు కోట్లు తిన్నారు మేం లక్షలు తింటే తప్పేంటి అని వసూళ్లకు ఎగబడితే గత పాలకులకు పట్టిన గతే మీకు కూడా పడుతుందనేది సత్యం.

https://youtu.be/zCq2Z_B3FBE 

Related Posts
కన్నీళ్లు తుడిచిన ఖాకీలు.. దగ్గరుండి ఆడబిడ్డ పెళ్లి చేసిన కరీంనగర్ పోలీసులు.
ఖాకీలంటే కర్కశత్వం కాదు మానవత్వం అని నిరూపించారు కరీంనగర్ పోలీసులు. మాలో కూడా మనసున్న మారాజులున్నారు అని తెలిసేలా ఓ తండ్రిలేని ఆడబిడ్డకు అన్ని తామై దగ్గర ఘనంగా పెళ్లి చేశారు. అందరి చేత శబాష్ పోలీస్ అనిపించుకుంటున్నారు. కరీంనగర్ జిల్లా రామడుగు ...
READ MORE
ఆపరేషన్ కమల్.. తెలంగాణలో పట్టుకు అమిత్ షా నయా ఫ్లాన్.
అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ కైవసం చేసుకోవడంతో ఎక్కడ లేని జోష్ లో ఉంది బీజేపి. ఉత్తరాది రాష్ట్రంలో సత్తా చాటుతూనే దక్షిణాది రాష్ట్రాలపై ఓ కన్నెసింది. ప్రాంతీయ పార్టీలు పాలన లో కొనసాగుతున్న రాష్ట్రాలపై త్రిముఖ వ్యూహన్ని ప్రదర్శిస్తోంది బీజేపీ. ...
READ MORE
వీల్లు దళిత సంఘ నాయకులా లేక హిందూ ధర్మ వ్యతిరేకులా..??
కులానికి మూలం మతం.. మతం లేనిది కులం లేదు.. మతమంటే ప్రస్తుత లౌకికసమాజంలో విలువ లేనిదైంది కానీ మతమంటే పవిత్రమైనది మానవత్వం ధర్మం నీతి నిజాయతి ఆచారం సాంప్రదాయం నేర్పించేది. ప్రతీ మతాచారంలో దైవారాధన ఉంటుంది. దైవారాధన అనేది మానవాళి విశ్వాసం. ...
READ MORE
రాజన్నా నీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు…
ఆయన ఒక్కసారి నా మనిషి అనుకుంటే చాలు ఇక ఆ మనిషి కి ఏ లోటు రాదు. నమ్ముకున్న వ్యక్తిని సొంతమనిషిలా చూసుకోవడం.. ఎంతటి కష్టాల నుండైనా గట్టెక్కించడం ఆయనలో ఉన్న స్వభావం. ప్రజలను మన అనుకునేవాడే నాయకుడు ఆయనే డా.వై.ఎస్. ...
READ MORE
పొట్టి దుస్తుల్లో అమ్మాయి.. రెచ్చిపోయిన అబ్బాయి.
ముస్లిం దేశాల్లో అమ్మాయిలు నిండుగా వస్త్రాదారణ చేసుకోకపోతే రచ్చ రచ్చే. అదే జరిగింది ఇప్పుడు. రంజాన్ మాసంలో పొట్టి దుస్తులు వేసుకుని బస్సు ఎక్కిందని ఆరోపిస్తూ.. ఓ అమ్మాయి చెంప చెళ్లుమనించాడో యువకుడు. ఆమె ప్రతిఘటించేందుకు ప్రయత్నిస్తే మరోసారి దాడి చేసి, వెంటనే ...
READ MORE
ప్రగతి భవన్ సాక్షిగా.. జ‌ర్న‌లిస్టుల కుటుంబాల‌కు ఆర్థిక సాయం అందించిన కేసీఆర్.
తెలంగాణ క‌న్నీళ్ల‌ను క‌ష్టాల‌ను త‌మ రాత‌ల‌తో మాట‌ల‌తో ప్ర‌పంచానికి తెలియచెప్పి అలుపెరుగ‌ని పోరాటాన్ని చేశారు తెలంగాణ జ‌ర్న‌లిస్టులు. తెలంగాణ పోరాటంలో జ‌ర్న‌లిస్ట్ ల పాత్ర అనిర్వ‌చ‌నీయం. కానీ కొన్ని అనివార్య కార‌ణాల వ‌ల్ల యుద్దంలో స‌మిధ‌లుగా మారిన క‌లం వీరుల క‌ష్టాల‌ను ...
READ MORE
అరె యోగి.. ఒక్క నెలే.. తిట్టిన నోళ్లే పొగుడుతున్నాయి.
యోగి ఆదిత్యనాధ్ ఒక నెల ముందు కేవకం ఒక సాదువు.. అందరి దృష్టిలో సన్యాసి. ఇంకా కొందరి దృష్టిలో సన్నాసి. అతి పెద్ద రాష్ట్రాన్ని బీజేపీ చేజిక్కించుకున్నాక అనూహ్యంగా తెర మీదకి వచ్చిన పేరు యోగి. సరిగ్గా నెల తరువాత ఆయనో ...
READ MORE
అమిత్ షా లేఖాస్త్రం పై ముఖ్యమంత్రి ఏమని స్పందిస్తారు.??
భాజపా జాతీయ అధ్యక్షులు అమిత్ షా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు కి తొమ్మిది పేజీల లేఖ రాయడం హాట్ టాపిక్ గా మారింది. ఎన్డీఏ నుండి తెలుగు దేశం పార్టీ బయటకి రావడంతో అమిత్ షా ...
READ MORE
ముఖ్యమంత్రికి వియ్యంకుడైతే.. చట్టాలు వర్తించవా.? ఇదెక్కడి ప్రజాస్వామ్యం.??
ప్రజా ప్రతినిధుల పై ఉన్న క్రిమినల్ కేసులన్నీ కాలగర్భంలో కలిసిపోతాయి, నేటికీ.. ఈ క్రిమినల్ కేసుల నుండి తప్పించుకోవడానికి ఈ అవినీతి నేతలంతా అధికారాన్ని విచ్చల విడిగా వాడేసుకుంటుంటారు.. ఇలాంటి సీన్లు మనకు మామాలే, కానీ ఈ చెడు సంస్కృతి కి ...
READ MORE
2300 మెట్లెక్కి వెంకటేశ్వరున్ని దర్శించుకున్న ఆవు..!
కొన్ని నమ్మకాలు బలంగా ఉంటాయి.. మరి కొన్ని కార్యాలు అంతకు మించిన నమ్మకాన్ని పెంచుతాయి. భక్తి బావాలకు సాక్ష్యాలుగా నిలుస్తాయి. ఇప్పుడు మేము చెప్పబోయే విషయంగా కూడా అలాంటిదే. హిందువులు అతి పవిత్రంగా కొలిచే ఏడుకొండల వాడి కొండపై మరో అద్భుతం ...
READ MORE
డా. సౌమ్యకు యంగ్ ఉమెన్ ఇన్ సైన్స్ అవార్డ్-2019 అవార్డ్ ప్రదానం.!!
ఉస్మానియా యూనివర్శిటీ లో ఫోరేన్సిక్ సైన్స్ విభాగంలో పని చేస్తున్న డా. సౌమ్యకు 2019 సంవత్సరానికి గాను యంగ్ ఉమెన్ ఇన్ సైన్స్ అవార్డ్ ప్రదానం చేస్తున్నటు వీనస్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ నిర్వాహకులు తెలిపారు. ఈ సంధర్భంగ వీనస్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ...
READ MORE
అదంతా చట్టబద్దమే.. కాంగ్రెస్ టీడీపీ లకు భాజపా ను విమర్శించే అర్హత లేదు – కిషన్ రెడ్డి
పార్లమెంట్ లో ఆరు మంది రాజ్యసభ సభ్యులున్న తెలుగు దేశం పార్టీ నుండి నలుగురు రాజ్యసభ సభ్యులు భాజపా లో చేరడంతో మూడోవంతు సభ్యులు చేరినట్టైంది. దీంతో రాజ్యాంగం లోని పదవ షెడ్యూల్డ్ ప్రకారం టీడీపీపీ భాజపా లో విలీనం జరిగిందని, ...
READ MORE
బ్రేకింగ్:- దుబ్బాక ఉప ఎన్నిక ఫలితాలు నవంబర్ 10.. షెడ్యూల్ ఖరారు.
తెలంగాణ లో ఎన్నికల వేడి రగిలిస్తున్న దుబ్బాక ఉప ఎన్నికకు సంబంధిన షెడ్యూల్ విడుదల అయింది. అక్టోబర్ 9 న నోటిఫికేషన్ విడుదల కానుండగా నామినేష‌న్ల దాఖలుకు చివ‌రితేదీ అక్టోబ‌ర్ 16. 17 వ తేదీన నామినేషన్లను ప‌రిశీలించనున్నారు. నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ‌కు చివ‌రి తేదీ ...
READ MORE
నీకు సిగ్గుంటే కేసిఆర్ ఇచ్చే చెక్కు తీసుకోకు.!!
ప్రజల పట్ల బాధ్యత తో మెలగాల్సిన ప్రజా ప్రతినిధులు ప్రజాస్వామ్య విలువలను పాతరేసి ప్రజలపై నోరు పారేసుకోవడం.. మరియు ఆ ప్రజలను మేమే పెంచి పోషిస్తున్నం.. జనాలంతా మా దయా దాక్షిణ్యాలతోనే తింటున్నారు అనే చందంగ ప్రవర్తించడం హేయమైన చర్యగ అభివర్ణిస్తున్నారు ...
READ MORE
కేసిఆర్ కు ఎందుకు వేయాలి ఓటు.? ప్రశ్నిస్తున్న దళిత సమాజం.!!
ఓ వైపు ముందస్తు ఎన్నికలకు సై అంటూ మరోసారి గెలుపు కోసం వ్యూహాలు రచిస్తూ భారీ జన సమీకరణ అంటూ సభలంటూ హల్ చల్ చేస్తూ మరోసారి గెలిపిస్తే బంగారు తెలంగాణ చేసేస్తా అని జనాల ఓట్లను పొందేందుకు కష్టపడుతున్నారు గులాబీ ...
READ MORE
డ్రాగన్ కంట్రీ లో ముస్లింల బతుకు దిన దిన గండం.! మహిళల పై దాష్టీకం.!!
డ్రాగన్ కంట్రీ చైనా లో ముస్లిం ప్రజలు పడుతున్న అవమానాలు అంతా ఇంతా కాదు. సెక్యులరిజానికి బ్రాండ్ అంబాసిడర్ గ డబ్బా కొట్టుకునే కమ్యునిస్టులు ఏలుతున్న చైనా దేశం లో ముస్లింలు తీవ్రమైన అణచివేతకు గురవుతున్నారు. ఇప్పటికే ముస్లిం మహిళల భుర్కా ...
READ MORE
బ్రేకింగ్ న్యూస్:- నందమూరి హరికృష్ణ హఠాన్మరణం.. షాక్ లో ఎన్టిఆర్ ఫ్యామిలీ.!!
మాజీ దివంగత ముఖ్యమంత్రి టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టిఆర్ కుమారుడు నటుడు రాజకీయ నాయకులు నందమూరి హరికృష్ణ నేటి వేకువజామున నల్గొండ జిల్లా అన్నెపర్తి పోలిస్ బెటాలియన్ సమీపంలో కారు అదుపు తప్పడంతో ఎగిరి బోల్తాపడడంతో తలకు తీవ్రంగ గాయం కావడంతో ఆసుపత్రిలో ...
READ MORE
సినీ క్రిటిక్ కత్తి మహేష్ నిజంగా ఇంత నీచుడా..? రేపిస్టా..??
ఒక సాధారణ వ్యక్తి గ సినిమాల పై విశ్లేషణలు రాస్తూ సినీ క్రిటిక్ అనే కత్తి మహేష్.. తద్వారా తెలుగులో ప్రసారమైన టీవీ షో బిగ్ బాస్ లో పాల్గొని తర్వాత పవన్ కళ్యాణ్ జనసేన పై విమర్శలు చేయడం ద్వారా ...
READ MORE
ముస్లిం నోట జై శ్రీరాం అన్న మాట.. మనసార నినదించిన ముస్లిం అధికారి.
జోర్ సె బోలో ప్యార్ సె బోలో జై శ్రీరాం జై శ్రీరాం.. ఈ మాటలు మేం అనమంటోంది కాదు ఓ ముస్లిం అధికారి చెప్తున్న నిబదాలు. భిన్నత్వంలో ఏకత్వం.. పరమతాన్ని గౌరవించే తత్వం మన భారతం అని మరోసారి నిరూపించారు ...
READ MORE
పాత్రికేయ రంగంలో మహిళామణులకు మూడు పుర‌ష్కారాలు.. 24 మందికి ద‌క్కిన‌ తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వ పుర‌ష్కారాలు
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ‌ రాష్ట్ర ప్రభుత్వం పురస్కారాలను ప్రకటించింది. వివిధ రంగాల్లో కృషి చేసిన 24 మంది మహిళల‌కు పురస్కారాలు ద‌క్కాయి. వృత్తి, విద్యా, సామాజిక, సాంస్కృతిక‌, వ్యవసాయంతో పాటు ప‌లు రంగాల్లో సేవలందించి రాణించిన ప‌లువురు మ‌హిళ ...
READ MORE
ఆరోగ్యానికి ఏ నెంబ‌ర్ పండు మంచిది…? ప‌ండుపై నెంబ‌ర్ చెబుతున్న ర‌హ‌స్యం మేంటి.?
పండేంటి నెంబ‌ర్ ఏంట‌ని ఆశ్చ‌ర్య‌పోకండి. ఇప్ప‌టికే ఈ విష‌యం మాకు తెలుస‌ని పెద‌వి కూడా విర‌వ‌కండి. మ‌రొక్క‌సారి మీ దృష్టికి తీసుకు రావ‌డంలో త‌ప్పు లేద‌ని.. తెలియ‌ని వారికి మ‌రింత చెప్పేందుకే ఈ పండు సంఖ్య‌లో ఉన్న మ‌ర్మాన్ని మీకోసం ఇలా ...
READ MORE
గ్యాస్ సిలిండర్ల పేలుడు మాట ఇక వినిపించదు..
గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురు మృతి మరో నలుగురికి గాయాలు.. తృటిలో తప్పిన పెను ప్రమాదం సిలిండర్ దాటికి కుప్పకూలిన ఇంటి పై కప్పు. గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తుండగా ప్రమాదం.. ఇలాంటి వార్తలు నిత్యం వింటునే ఉంటాం. గ్యాస్ సిలిండర్ పేలుళ్ల ...
READ MORE
మోగిన బడి గంట.. సెలవులకిక టాటా..
రెండు నెలల పాటు ఆనందంగా, సంతోషంతో ఆడుతూ పాడుతూ గడిపేశారు. అప్పుడే వేసవి సెలవులు ముగిశాయి. ఇలా వచ్చి అలా వెళ్లిపోయిన సెలవులకు వీడ్కోలు చెప్పి పిల్లల ఇక బడి బాట పట్టనున్నారు. అమ్మమ్మ తాతయ్యలతో కలిసి పల్లెటూర్లలో పొలాల గట్లపైన ...
READ MORE
ట్విట్టర్ లోకి ఎంట్రీ ఇచ్చిన మలాల..
ఆడపిల్లలకు విద్య దక్కాలంటూ పోరాటం చేసి, చిన్న‌వ‌య‌సులోనే నోబెల్ శాంతి బహుమ‌తి సాధించిన మ‌లాలా యూసుఫ్ జాయ్ సామాజిక మాధ్యమైన ట్విట్టర్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. పాఠాశాలలే ఆడపిల్లల జీవితాలను మారుస్తాయని తెలిపిన మలాల బడి చదువుకు భాయ్ చెప్పి ట్విట్టర్ లోకి ...
READ MORE
ఉగ్రదాడికి వ్యతిరేకంగ హోరెత్తుతున్న భారతం.. పాక్ ను ఖతం చేయాల్సిందే..!!
పుల్వామా లో సైన్యం పై పాకిస్తాన్ ఉగ్రవాదులు జరిపిన మానవబాంబు దాడి పట్ల యావత్ భారతం కోపంతో రగిలిపోతోంది.గల్లీ గల్లీ లో నిరసన ర్యాలీలు చేస్తూ పాకిస్తాన్ దిష్టిబొమ్మలను దగ్దం చేస్తూ నినదిస్తోంది. అంతటా ఒకే నినాదం దెబ్బకు దెబ్బ తీయాలి, ...
READ MORE
కన్నీళ్లు తుడిచిన ఖాకీలు.. దగ్గరుండి ఆడబిడ్డ పెళ్లి చేసిన కరీంనగర్
ఆపరేషన్ కమల్.. తెలంగాణలో పట్టుకు అమిత్ షా నయా ఫ్లాన్.
వీల్లు దళిత సంఘ నాయకులా లేక హిందూ ధర్మ వ్యతిరేకులా..??
రాజన్నా నీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు…
పొట్టి దుస్తుల్లో అమ్మాయి.. రెచ్చిపోయిన అబ్బాయి.
ప్రగతి భవన్ సాక్షిగా.. జ‌ర్న‌లిస్టుల కుటుంబాల‌కు ఆర్థిక సాయం అందించిన
అరె యోగి.. ఒక్క నెలే.. తిట్టిన నోళ్లే పొగుడుతున్నాయి.
అమిత్ షా లేఖాస్త్రం పై ముఖ్యమంత్రి ఏమని స్పందిస్తారు.??
ముఖ్యమంత్రికి వియ్యంకుడైతే.. చట్టాలు వర్తించవా.? ఇదెక్కడి ప్రజాస్వామ్యం.??
2300 మెట్లెక్కి వెంకటేశ్వరున్ని దర్శించుకున్న ఆవు..!
డా. సౌమ్యకు యంగ్ ఉమెన్ ఇన్ సైన్స్ అవార్డ్-2019 అవార్డ్
అదంతా చట్టబద్దమే.. కాంగ్రెస్ టీడీపీ లకు భాజపా ను విమర్శించే
బ్రేకింగ్:- దుబ్బాక ఉప ఎన్నిక ఫలితాలు నవంబర్ 10.. షెడ్యూల్
నీకు సిగ్గుంటే కేసిఆర్ ఇచ్చే చెక్కు తీసుకోకు.!!
కేసిఆర్ కు ఎందుకు వేయాలి ఓటు.? ప్రశ్నిస్తున్న దళిత సమాజం.!!
డ్రాగన్ కంట్రీ లో ముస్లింల బతుకు దిన దిన గండం.!
బ్రేకింగ్ న్యూస్:- నందమూరి హరికృష్ణ హఠాన్మరణం.. షాక్ లో ఎన్టిఆర్
సినీ క్రిటిక్ కత్తి మహేష్ నిజంగా ఇంత నీచుడా..? రేపిస్టా..??
ముస్లిం నోట జై శ్రీరాం అన్న మాట.. మనసార నినదించిన
పాత్రికేయ రంగంలో మహిళామణులకు మూడు పుర‌ష్కారాలు.. 24 మందికి ద‌క్కిన‌
ఆరోగ్యానికి ఏ నెంబ‌ర్ పండు మంచిది…? ప‌ండుపై నెంబ‌ర్ చెబుతున్న
గ్యాస్ సిలిండర్ల పేలుడు మాట ఇక వినిపించదు..
మోగిన బడి గంట.. సెలవులకిక టాటా..
ట్విట్టర్ లోకి ఎంట్రీ ఇచ్చిన మలాల..
ఉగ్రదాడికి వ్యతిరేకంగ హోరెత్తుతున్న భారతం.. పాక్ ను ఖతం చేయాల్సిందే..!!
Facebook Comments

Leave a Reply

Top
error: Content is protected !!