You are here
Home > తాజా వార్త‌లు > చెట్లు ప్రాణాలు తీస్తున్నాయి..అదృష్టం లేకుంటే ఇంతే.

చెట్లు ప్రాణాలు తీస్తున్నాయి..అదృష్టం లేకుంటే ఇంతే.

రాష్ట్రాలు వేరు కానీ ఘటనలు మాత్రం ఒకటే.. ఆయువు నిచ్చి ప్రాణం కాపాడే చెట్లే అర్థాంతరంగా ప్రాణాలు తీస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం లో ఓ ఘటన చోటు చేసుకుంది. అత్యంత రద్దీగా ఉండే రహదారిపై హఠాత్తుగా ఓ చెట్టు కూలిపోయింది. చెట్లు కూలడం కామన్.. కానీ అదే సమయంలో అటు వైపుగా వస్తున్న వారి ప్రాణాలను మింగేయడమే ఇక్కడ దుర్ఘటన. సడన్ గా చోటు చేసుకున్న ప్రమాదంలో కోనరావుపేట మండలం ధర్మారంకు చెందిన ఇద్దరు అక్కడికక్కడే మృతి చెెందారు. ఆ పక్కనే వెళుతున్న విద్యార్థులు తృటిలో ప్రమాదం నుండి తప్పించుకున్నారు.

సేమ్ టూ సేమ్ ఇలాంటి ఘటనే మహరాష్ట్రాలో చోటు చేసుకుంది. ముంబై మహానగరం. చెంబూర్ ప్రాంతం. ఉదయం ఏడు గంటలకు కంచన్ నాథ్ అనే 58 ఏళ్ల మహిళ రోడ్డుపై మార్నింగ్ వాక్ కోసం బయటకు వచ్చింది. అప్పటికే వర్షపు జల్లులు పడుతున్నాయి. రోజూ వెళ్లే రోడ్డే.. చిరు జల్లులే కదా వాకింగ్ ప్రారంభించింది. చంద్రడే సొసైటీ ఏరియాకు వచ్చిన సమయంలో.. సరిగ్గా ఆమె ఉన్న ప్రదేశంలోనే రోడ్డు పక్కన ఉన్న పెద్ద కొబ్బరిచెట్టు పడింది. అది కూడా ఆమె నెత్తిమీదనే పడింది. స్పాట్ లోనే కుప్పకూలిపోయింది. చుట్టుపక్కలవారు వెంటనే ఆమెను బయటకు లాగారు. అప్పటికే స్పృహ లేకుండా పడి ఉంది. సమీపంలోని శుష్రత్ ఆస్పత్రికి తరలించారు. icuలో చికిత్స పొందుతూ కన్నుమూసింది. కంచన్ నాథ్.. గతంలో దూరదర్శన ఛానల్ లో యాంకర్ గా పని చేసింది. చాలా ప్రొగ్రామ్స్ కూడా చేసింది. ఎంతో మందికి సుపరిచితురాలు. ప్రస్తుతం ఇంట్లోనే ఉంటోంది. ఈ ఘటనపై ఆమె భర్త ఆగ్రహం వ్యక్తం చేశారు. ముంబై మున్సిపల్ కార్పొరేషన్ తీరును తప్పుబట్టారు. ప్రమాదంలో ఉన్న చెట్లను తొలగించటంలో విఫలం అయ్యారని… రోడ్డుపైకి వచ్చిన జనానికి రక్షణ ఇవ్వటంలో BMC ఫెయిల్ అయ్యిందని ఆరోపణలు చేస్తున్నారు.

 

Facebook Comments
Top
error: Content is protected !!