
అక్కడ ఇక్కడ ఏం మార్పు లేదు. ఒకటే భావం తెలుగు నాయకులంతా ఒక్కటే అన్న మాట నిజం చేసి చూపిస్తున్నారు నేతలు. సిన్సియర్ అధికారులను పట్టుకుని 5 ఏళ్ల లలో ఊడిపోయే ఉద్యోగాలతో నోరు జారుతున్నారు. నోటికి ఎంతొస్తే అంతా.. చేతలకి ఏమనిపిస్తే అది చేస్తు అభాసపాలవుతున్నారు మన నేతలు. అటు ఆంధ్రప్రదేశ్ అమరావతి సాక్షిగా.. ఇటు తెలంగాణ కరీంనగరం సాక్షిగా ఒకటే వివాదం కలెక్టర్లను రాజకీయ నాయకులు తమ అహంకారాన్ని ప్రదర్శిచడం… మరీ ఇదేనేమో నీతి.
ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా కలెక్టర్ అహ్మద్ బాబు, తెలంగాణలోని కరీంనగర్ జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ ఇద్దరు సిన్సియర్ అధికారులన్నది ఏ ఒక్కరిని అడిగినా చెపుతారు. కానీ అలాంటి అధికారులను పట్టుకుని రాజకీయ నాయకులు తమ బలాన్ని నిరూపించుకోవాలని చూశారు. కృష్ణా జిల్లా కలెక్టర్ అహ్మద్ బాబుతో ఏకంగా ఆ రాష్ట్ర ప్రతిపక్ష నేత ఖయ్యానికి కాలు దువ్వారు. నువ్వెంతా అంటూ నాలుగు మాటలు జారడు కూడ. ఇక తెలంగాణలోనూ సేమ్ సీన్… కరీంనగర్ జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ పై ఆ జిల్లా నేతలు నువ్వెంతంటే నువ్వెంతా అనే స్థాయికి వెళ్లారు. మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, కరీంనగర్ జిల్లా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఇద్దరు మూకుమ్మడిగా కలెక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఈ వివాదానికి కారణం ప్రొటోకాల్ పాటించకపోవడం అంటా.. స్టేజ్ మీద తమ ఇద్దరి ఫోటోలు పెట్టకపోవడం అంటా. ఫోటోలు లేకపోతే ఇంత యాగి చేస్తున్నారే.. రేపు పదవులు పోతే పరిస్థితి ఏంటి..? ఎవరు ప్రొటోకాల్ పాటిచలేదో వీళ్ల మాటల్లోనే తేలిపోతుంది.
గంగులకమలాకర్ కాస్త తగ్గింతి మాట్లాడితే.. మానకొండూర్ ఎమ్యెల్యే రసమయి మాత్రం కాస్త ఓవర్ గానే రియాక్ట్ అయ్యాడు. కలెక్టర్ ను పట్టుకుని ఏకవచనంతో సంబోదిస్తూ హద్దులు మీరాడు మన ఎమ్మెల్యే. ఏయ్ కలెక్టర్ అంటూ ఆవేశంతో ఊగిపోయాడు. ఒక ఎమ్మెల్యే అలా మాట్లాడితే సిన్సియర్ ఐఏఎస్ అధికారి చూస్తు కూర్చుంటాడ.. తను కూడా ధీటుగానే సమాధానం ఇచ్చాడు. డోంట్ టాక్ అంటూ కలెక్టర్ సర్ఫరాజ్ గారు కూడా ఆవేశంగా వేలు చూయించారు. ఇక వివాదం చిలికి చిలికి గాలి వానగా మారకముందే ఆర్థిక మంత్రి ఈటెల కల్పించుకుని వివాదాన్ని సద్దుమణిగేలా చేశారు. అయితే స్టేజ్ మీద ఓ కేంద్రమంత్రి, ఓ రాష్ట్ర మంత్రి, అధికార పార్టీ బలం, బలగం అంతా ఉండగానే ఇంతలా రెచ్చిపోయిన ఎమ్మెల్యేలు రేపు సాదరణ ప్రజానికం పై దాడులు చేయరని ఏమన్న నమ్మకం ఉందా…? ప్రజా వ్యవస్థ అంటే ఇదేనా.. పాలకులు వ్యహరించే తీరు ఇదేనా. తెలంగాణ ఉద్యమంలో మీరు నేర్చుకున్నది, చూపించింది తెగువ ఇదేనా అని ప్రశ్నిస్తున్నారు ప్రజలు.