
మంచి ఉద్యోగం.. సమాజంలో గౌరవం.. అంతకు మించి సమాజంలో మార్పును తీసుకు వచ్చే ఓదా. ఇన్ని ఉన్నా అతనికి ఆశ చావలేదు. ఐపిఎస్ హోదాను కాదనుకుని ఐఎఎస్ గా సెట్టావ్వాలనుకున్నాడు. మంచిదే ఉన్నత స్థాయికి చేరుకోవాలనుకోవడం ఇంకా ఏదో సాదించాలనుకోవడం మంచిదే.. అయితే ఈ యువ ఐపిఎస్ ఆఫీసర్ ఆశ కాస్త అత్యాశగా మారి అడ్డదారులు తొక్కడంతోనే అసలు కథ నడిచింది. ఐఏఎస్ కావాలనుకున్న తన కల అక్రమాల దారిలో ఉన్నఉద్యోగాన్ని కూడా ఊడగొట్టింది.
అచ్చం సినిమాలోలా పరీక్షలు రాసి తెర మీద స్టార్ లా రియల్ హీరో అయిపోదాం అనుకున్నాడు ఈ ఐపీఎస్ ఆఫీసర్. మున్నభాయి ఎంబిబిఎస్ , రోబో చిత్రాలను దింపేసి మనోడు ఎంచక్కా కలెక్టర్ నౌకరీనే సొంతం చేసుకుందాం అని ఫ్లాన్ వేశాడు. తీరా అడ్డదారి ఎన్నటికైనా చిప్పకూడు తినిపించకమానదని తెలుసుకునే లోపే పాపం మనోడు బుక్కయ్యాడు. దొరికితే దొంగ లేదా దొరక అనుకున్నాడో లేక .. యే నేను ఐపిఎస్ నన్నెవరు టచ్ చేస్తారు అనుకున్నాడో కానీ తీరా కలెక్టర్ కాకుండానే కటకటాలపాలు మాత్రం అయ్యాడు. ఇంతకు ఈ యువ ఐపిఎస్ ఆఫీసర్ చేసిన తప్పేంటి.. తొక్కిన అడ్డదారులేంటో మీరే చదవండి. తమిళనాడులోని తిరునల్వేలి జిల్లా ఏఎస్పీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఐపీఎస్ అధికారి సబీర్ కరీంకి ఐఏఎస్ కావాలన్నది కల. ఆ కల ను నిజం చేసుకోవడానికి ఆత్మవిశ్వాన్ని నమ్ముకోకుండా అడ్డదారిని నమ్ముకోవడమే ఈ ఐపీఎస్ అధికారి కొంపముంచింది. ఈజీగా ఐఏఎస్ సాదించాలని పక్కా ఫ్లాన్ వేసిన కరీం అడ్డదారిలోయూపీఎస్సీ పరీక్షలు రాసి అడ్డంగా దొరికి పోయాడు. ఏకంగా యూపీఎస్సీ పరీక్షల్లోనే కాపీ కొడుతు అధికారులకు చిక్కాడు.
చట్టాన్ని కాపాడాల్సిన పోలీసు అధికారి ఉండి చట్టంలోని లొసుగులను వాడుకుని ఐఏఎస్ అవ్వాలనుకున్న తన అత్యాస అసలుకే ఎసరు తెచ్చింది. యూపీఎస్సీ నిర్వహించే అర్హత పరీక్షలు మళ్లీ రాసినా ర్యాంకు రాకపోతే అన్న అనుమానం వచ్చింది కరీంకి. దీంతో రెండేళ్ల క్రితం అంతర్జాలంలోని డార్క్‌నెట్‌లో అక్రమ మార్గాలపై శోధించాడు. ఛాతికి సమీపంలో అమర్చుకునే ఆన్ లైన్ ఆధారిత మైక్రో కెమెరా, ఫోన్‌తో కూడిన పరికరాన్ని తెప్పించుకున్నాడు. దాన్ని అమర్చుకుని పరీక్ష గదిలోకి వెళ్లాడు. ఇచ్చిన ప్రశ్నపత్రాన్నిఆ సీక్రెట్ కెమెరాకు చూపిస్తూ ఆ ప్రశ్నపత్రాన్ని కెమెరా సాయంతో చిత్రికరించి గూగుల్ డ్రైవ్‌కు అటాచ్ అయ్యేలా చేస్తుంది. పరీక్ష హాలు వెలుపల ఉన్నవారు గూగుల్ డ్రైవ్‌లోని ప్రశ్నపత్రాన్ని చూసి వాటికి సమాధానాలు చెప్పడం ప్రారంభిస్తారు. ఆ సమాదానాలు బయట నుండి నేరుగా సఫీర్ వద్ద ఉన్న మైక్రోఫోన్ చేరేవి. ఇలా యూపీఎస్సీ పరీక్షలను దర్జాగా రాయాలనుకున్నాడు. ఇంతలో ఉన్నత అధికారులకు అనుమానం రావడం కరీం ను క్షుణంగా పరిశీలించడంతో మనోడు గుట్టు రట్టైంది. అయితే అత్యంత ఉన్నత స్థాయి పరీక్ష కావడంతో కరీం అరెస్ట్ ను గోప్యంగా ఉంచారు. ఈ వ్యవహరం అంతా ఎక్కడ నుంచి సాగింది అన్న గుట్టును విప్పేందుకు అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. తీగ లాగితే డొంకంత కదిలినట్టు చెన్నైలో మనోడి పరీక్షకు అతిడి భార్య హైదరబాద్ నుండి సహకరించిందని తేలింది. దీంతో రంగంలోకి దిగిన చైన్నె పోలీసులు హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. హైదరబాద్ టాస్క్ ఫోర్స్ టీం సోదాలు జరిపి కరీమ్ భార్య జాయిస్‌ను, అతనికి సహకరించిన లా ఎక్సలెన్సీ ఐఏఎస్ స్టడీ సర్కిల్ డైరెక్టర్ రాంబాబును సోమవారం రాత్రి అరెస్ట్ చేశారు. వీరి దగ్గర నుంచి ల్యాప్‌టాప్, బ్లూటూత్ పరికరాలను స్వాధీనం చేసుకుని ఇద్దరినీ చెన్నై పోలీస్ అధికారులకు అప్పగించారు హైద్రబాద్ పోలీసులు.
” అడ్డదారిలో ఐఏఎస్ కావాలనుకున్న కరీంకు సహకరించిన రాంబాబు ఇతనే.”
ఇది అసలు విషయం. టెక్నాలజీలో దూసుకుపోతున్న కాలంలో మంచి కంటే చెడే ఎక్కువగా చేసే అవకాశాలు ఉన్నాయని ఈ ఘటన మరో సారి రుజువు చేసింది. అడ్డదారిలో అందలం ఎక్కాలని చూస్తే ఎంతటి వాడైన బొక్కబోర్ల పడక తప్పదని ఐపీఎస్ అదికారి కరీం ఘటన నిజం చేసింది. ఆశ మంచిదే కానీ అత్యాసతో ఆలోచిస్తేనే పతనం తప్పదని కరీం స్టోరీ చెప్పకనే చెపుతోంది. అత్యాస దెబ్బకి ఉన్న పేరు సాదించిన ఉన్నత ఉద్యోగం.. ఇటు ఆ అత్యాసకు తోడుగా నిలిచినందుకు భార్య అరెస్ట్ చివరికి ఏం మిగిలింది చిప్ప కూడు తప్ప. అంతే మరీ. ఇక బయటకి రావడం కేసులు కొట్టి వేయడం అది తరువాత మ్యాటర్ కానీ ముందు సమాజంలో ఇలాంటి అత్యాస పరులు అడ్డదారుల్లో ఐఏఎస్ లు అయితే దేశానికి మాత్రం అత్యంత ప్రమాదకరం.
























