You are here
Home > తాజా వార్త‌లు > దోస్త్ మేరా దోస్త్ నువ్వే నా ప్రాణం.. స్నేహితులందరికి మా శుభాకాంక్షలు.

దోస్త్ మేరా దోస్త్ నువ్వే నా ప్రాణం.. స్నేహితులందరికి మా శుభాకాంక్షలు.

ప్రపంచమంతా చీకటైపోయి దారి తెలియని క్షణాన నేనున్నానంటూ నిన్ను వేలు పట్టుకుని నడిపించే వాడు.. విషాదమంతా గుండెలను అల్లుకుని కన్నీటిదారల్లా ఉప్పొంగి వస్తున్న బాధను నాకు సగం పంచవా అంటూ నీ వెనుక పరిగెత్తుకు వచ్చేవాడు. సంతోషంలో సగం కష్టంలో మరింత బలం.. కన్నీళ్లను తుడిచే హస్తం ఒక్క మాటలో చెప్పాలంటే దేవుడిచ్చిన వరం. ఆ బంధమే “స్నేహం”..

వయసుతో సంబంధం లేదు.. కులంతో సంబంధం లేదు.. మతం అసలడగదు.. అమ్మాయా అబ్బాయా అన్న లింగవివక్షతను చూడదు. కేవలం మనసు మనసు కలిసి.. కనులు కనులు బాసలు చెప్పుకునేదే స్నేహమంటే. అరెయ్ ఒరెయ్ అన్నా, ఒసెయ్ ఏమే అన్నా.. మామా అన్నా, కాకా అన్నా , చిచ్చా అన్నా , సాలే అన్నా ఒక్కటే బంధం స్నేహబంధం. ఎక్కడ ఎప్పుడు ఎలా మొదలవుతుందో తెలియదు.. జీవిత చరమాంకం వరకు సాగుతుందని మాత్రం చెప్పగలం. కట్టకాలే వరకు తోడుండేదే నిజమైన స్నేహాం.

దోస్త్ మేరా దోస్త్ తూహీ మేరా జాన్.. నిజమే ఇలాంటి పాటలే కాదు ఆ మాటలు గుండె లోతుల్లో నిజమైన స్నేహితున్ని కళ్ల ముందు సాక్షాత్కరిస్తాయి. తొలకరి జల్లుల్లో తడిపేసి.. హోరు వానలో ముంచేసి.. వరదై గుండెల్లోతుల్లో జలజలమంటూ పారుకుంటే ఉప్పెనలా ముంచెత్తుతాయి.. ఆ స్నేహమాదుర్యంలో మునిగాక సముద్రమంత ఉప్పదనం కూడా తేనే కంటే తియ్యగా అమృతం కంటే కమ్మగా మారిపోతుంది.

రైలు ప్రయాణంలోనో అనుకోకుండా పక్క సీటులో కూర్చున్న అమ్మాయి/ అబ్బాయి వాడే నీ జీవితాంతం నీతో పాటు ది బెస్ట్ ఫ్రెండ్ గా కలిసి పయణించవచ్చు. గమ్యం తెలియని నడకలో హఠాత్తుగా నీ ముందు నిలబడి హాయ్ అని పలకరించనూ వచ్చు. ఫేస్ బుక్ ముఖపుస్తకంలో కనీసం ముఖం కూడా తెలియ కుండానే నీతో బంధం అల్లుకోనువచ్చు ఇలా ఒకటా రెండా అనేక మార్గాలు.. అనేకానేక విలువలు. నీకోసం తనదైన సిద్దాంతాన్ని వదులుకొని నీ మంచి కోసం నడిచేవాడే నిజమైన స్నేహితుడు.

కష్టాల సంద్రంలో కొట్టుకుపోతుంటే.. అప్పుల ఊబిలో పడి మునిగిపోతుంటే తన చేతిలో చిల్లిగవ్వ లేకపోయిన నీకు కొండంత అండగా నిలబడే వాడే స్నేహితుడు. అలాంటి వాడు మీకుంటే మీలో ఒకడై ఉంటే ఏ కష్టమొచ్చినా ఎంత నష్టమొచ్చినా వదులుకోకండి. ఎందుకంటే వాడికి తెలిసింది పంచడమే.. దానికి తెలిసింది తిరిగి అడగకపోవడమే. తీసుకోవడం కంటే ఇవ్వడమే తెలిసిన బంధమది.

అమ్మలాలనా నాన్న పాలన.. అన్నయ్య అభిమానం అక్క మమకారం.. అన్ని ఒక్క స్నేహితుడిలో ఉంటాయనడంలో ఆశ్చర్యం లేదు. మారి పోతున్న ఈ కాలంలో కాలం కంటే వేగంగా పరిగెడుతున్న మనసుల్లో మీలా ఆలోచించే మరో రూపమే స్నేహితుడు. వాడెక్కడున్నా మీ మంచి కోరుతాడే తప్ప చెడును కలలో కూడా కోరుకోడు. అలాంటి స్నేహ జన్మజన్మల వరమే తప్ప వదులుకునే భారం కాకుడదు. దూరం శరీరాలకే కానీ మనసులకు ఎన్నటికి కాకుడదు.

ఈ నయా జమానాలో చెడ్డీ దోస్తులను మరిచిపోతు న్నాం. బిజీ లైఫ్ లో పడి అసలైన స్నేహ బంధాన్ని దూరం చేసుకుంటున్నాం. పదవి అంతస్తులు హోదాలు ఇవేవి అడ్టు రాని స్నేహాన్ని కాలమ మత్తులో కావాలనే దూరం చేసుకుంటున్నాం. మరో జన్మలో మళ్లీ కలుస్తార న్నా నమ్మకం లేదు ఈ జన్మలో ప్రాణం పోయినా వద లని బంధాలని ఇగోల పేరుతో.. జలసీల పేరుతో.. కోపంగానో బాధగానో.. దూరం పెడుతున్నాం. ఇప్పుడం తా సోషల్ మీడియా స్నేహం రాజ్యమేలుతున్నా ఈ తరుణంలో నచ్చకపోతే బ్లాక్.. ఇంకా నచ్చకపోతే షిప్ట్ డిలీట్. ఇదేనా స్నేహానికి మీరిచ్చే విలువ.

ఏ బంధం లేకుండా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసి ఈ జీవిత అమృత బాంధవ్యాలను కట్టెకాలే వరకు దూరం చేసుకోమని ఈ రోజే ఈ క్షణమే బాస చేద్దాం.. ఒట్టేసి చెబుదాం “ఐ లవ్ యూరా దోస్త్” “నువ్వే నా ప్రాణమని”. గట్టిగా అరిచి చెబుదాం “నువ్వు లేని ఈ లోకం నాకెందుకురా” అని. పక్కనుంటే కౌగిలింతతో దూరంగా ఉంటే ఆనంద బాష్పాల పలకరింతలతో ఎలాగైనా చెప్పెద్దాం ఇంకెప్పుడు నీకు దూరం కానురా అని. నువ్వు తిట్టినా కొట్టినా ఈసడించుకున్నా నీ ప్రాణంగా పదికాలల పాటు సాగుతానని. “ఓ మై ఫ్రెండ్” హ్యపీ ఫ్రెండ్‌షిప్‌ డే రా.. ఓ మై ప్రెండ్ నువ్వే కద చిన్నా నా ప్రాణం. అయినా ఈ ఒక్క రోజే కాదురా పాగల్ మనకు రోజు హ్యపీ ఫ్రెండ్‌షిప్‌ డేనేరా అని చెప్పెద్దాం. ప్రియమైన మిత్రులందరికి “మా జర్నలిజంపవర్” తరపున అత్యంత గొప్ప రోజు శుభాకాంక్షలు. నింగి నేల మాదే మేమే ఈ జగానికి అక్షర దోస్తులం. మీ బంధంలో అల్లుకుపోయే పిచ్చోళ్లం.

Related Posts
అమృత కి కోటి ఇస్తానన్న ఎల్ రమణకు.. వరంగల్ పూజారి కనబడలేదా..??
ఒకోసారి రాజకీయ నాయకుల ప్రవర్తన జుగుప్సాకరంగ అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటిదే ఇపుడు మరో ఉదంతం పై సోషల్ మీడియా లో చర్చ జరుగుతోంది. ఈమధ్యనే మిర్యాలగూడ లో తొమ్మిదోతరగతి లవ్ తో 18 ఏండ్లు పడగానే మ్యారేజ్ చేసుకుని భార్య తండ్రి ...
READ MORE
అందరి మనసులను కదిలిస్తున్న గోవా ముఖ్యమంత్రి వర్క్ కమిట్మెంట్..!!
ఈ దేశం లో పంచాయతి వార్డ్ మెంబర్ నుండి ప్రధాన మంత్రి వరకైనా గెలిచేంత వరకే తర్వత జనాలంటే చిన్నచూపే అనే చర్చ సాగూతూనే ఉంది. అందుకేనేమో ఓట్లేసే జనాలు కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్నారు.. అవకాశం చిక్కినప్పుడే ఉపయోగం పొందాలని భావిస్తున్నారు. ...
READ MORE
పాల్వాయి ఇకలేరు. కులుమనాలిలో గుండెపోటుతో మృతి.
కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, రాజ్యసభ ఎంపీ పాల్వాయి గోవర్దన్‌ రెడ్డి గుండెపోటుతో కన్నుమూశారు. పార్లమెంట్‌ స్టాండింగ్‌ కమిటీ పర్యటనలో ప్రస్తుతం కులుమనాలిలో ఉన్న ఆయనకు శుక్రవారం ఉదయం గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దాంతో పాల్వాయిని చికిత్స నిమిత్తం సిమ్లాలోని ...
READ MORE
టోల్ ఫ్లాజ్ పై స్టార్ హోటల్.. హైవే లో నోరూరించే వంటకాలు.
పాత ఒక రోత ఈ సంగతి పక్కన పెడితే కొత్త మాత్రం తప్పక ఒక వింతే అని చెప్పక తప్పదు. బుర్రున్నవాడు బూడిదను అమ్ముకొని అయినా కోట్లు సంపాదిస్తా డంటే ఇలాగే అనుకుంటా. అవును ఇప్పుడు మేము చెప్పే వ్యాపారం సంగతి ...
READ MORE
భారత ఆర్మీ కి భారీ విరాళం ప్రకటించిన ICICI బ్యాంక్.!
దేశంలోనే అతిపెద్ద బ్యాంకింగ్ దిగ్గజం అయిన ICICI బ్యాంక్ తన దేశభక్తి ని చాటుకుంది. భారత ఆర్మీ కి తనవంతుగా 10కోట్ల రూపాయలను విరాళంగ ప్రకటించింది. అందులో భాగంగ మొదటగ ఐదు కోట్ల రూపాయల విలువైన చెక్కును కేంద్ర రక్షణ శాఖ ...
READ MORE
కన్న కూతురి ప్రాణం తీసిన టీడీపీ పట్టణాధ్యక్షుడు.!
తన ఇంట్లోనే హత్యకు గురైన నందుల జయదీపిక మిస్టరీ కేసును ఎట్టకేలకు పోలీసులు చేధించారు. హంతకుడు ఎవరో కాదు అందరితో పాటే తిరుగుతూ అందరిలో కలిసిపోయిన హతురాలు జయదీపిక తండ్రి నందుల రాజునే అని నిర్థారణ కాగా అసలు విషయాన్ని ఒప్పేసుకున్నాడు ...
READ MORE
బ్రేకింగ్ న్యూస్ :- ఫిలిం ఛాంబర్ ముందు బట్టలిప్పి కూర్చున్న తెలుగు హీరోయిన్.!!
గత కొంత కాలంగ తెలుగు హీరోయిన్లకు అవకాశాలు ఇవ్వకుండా కేవలం శారీరకంగ వాడుకుని వదిలేస్తున్నారనీ.. ఆరోపనలు చేస్తున్న హీరోయిన్ శ్రీ రెడ్డి తాజాగా ఫిలిం ఛాంబర్ ముందు బట్టలిప్పేసి అర్థ నగ్నంగ నిరసనకు దిగింది. మీడియా తో మాట్లాడుతూ ఆమే తనకు ...
READ MORE
ఇదేమి భారతం.. “నీట్” పేరుతో ఇంత నీచపు పనులా..?
నీట్ పరీక్ష.. ఇదేం పరీక్ష. ఇంతకన్న విషమ పరీక్ష మరొకటి ఉంటుందా. ఇంటి బిడ్డలను ఇంత నీచంగా చూసే పరీక్ష నా.. ఇది నీతి గల్ల నీట్ పరీక్షనా.. ఇప్పుడు సోషల్ మీడియా లో నీట్ పరీక్ష నిర్వహణపై యావత్ భారతం ...
READ MORE
భాజపా స్టేట్ దివ్యాంగ్ సెల్ జాయింట్ కన్వీనర్ గ డా.గిరిధర ఆచార్యులు నియామకం.!!
ప్రముఖ విద్యావేత్త డా. గిరిధర ఆచార్యులు మరో కీలక బాధ్యతకు నియమింపబడ్డారు. డా. గిరిధర ఆచార్యులు దివ్యాంగుల సంక్షేమం హక్కుల సాధన కోసం రాష్ట్ర వ్యాప్తంగ ఎనలేని పోరాటం, సేవ చేస్తున్న విషయం తెలిసిందే.. కాగా రాజకీయంగానూ భాజపా రాష్ట్ర అధ్యక్షులు ...
READ MORE
నీతి వంత‌మైన రాత‌లు రాస్తే మ‌ర‌ణ‌మే బ‌లిదానం. జ‌ర్న‌లిస్ట్ డే స్పెష‌ల్.
నిదుర.. అత‌నికి నిత్యం శత్రువే ర‌మ్మ‌న్న రాదు. తిండి అది కూడా బ‌ద్ద శ‌త్రువే,  తిందామ‌న్న స‌మ‌యం దొర‌కదు. వేడి వేడి ఛాయ‌తో దోస్తి చేయ‌డం త‌ప్ప మ‌రో దారి లేని నిక‌ర్సైన రాత‌గాడు. రచ్చ గెలిచి ఇంట గెల‌వ‌లేక పిల్ల‌ల ...
READ MORE
జన చైతన్య యాత్రతో జనాల్లోకి దూసుకుపోతున్న కమళ దళపతి.. కారు జోరుకు ఇక బ్రేకులేనా.!!
మార్పు కోసం జన చైతన్య యాత్ర పేరుతో రాష్ట్ర పర్యటన చేస్తున్న తెలంగాణ భాజపా అధ్యక్షులు డా.కె.లక్ష్మణ్ కేసిఆర్ పాలన పై నిప్పులు కురిపించారు. నిన్నటి రోజు దుబ్బాక మరియు కామారెడ్డి నియోజకవర్గాల్లో జరిగిన భాజపా సభలలో పాల్గొన్న డా.కె.లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్రం ...
READ MORE
ఒక మతానికే కొమ్ము కాయడం మంచిది కాదు.. సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాలి – లంకా దినకర్
ఆంధ్రప్రదేశ్ సర్కార్ చర్యలపై బీజేపీ నేత లంకా దినకర్ ఆగ్రహం వ్యక్తం చేసారు. గత నెల రోజుల వ్యవధి లో మత మార్పిడిలు విపరీతంగ పెరగడంపై ఆందోళన వ్యక్తం చేసారు.మొన్నీమద్య విశాఖ పోలీస్ కమిషనర్ పాస్టర్లకు చర్చీలకు ప్రత్యేక రక్షణ అంటూ ...
READ MORE
లవర్ తో భర్త గోవాకెల్తే.. ఇంట్లో ఉన్న భార్యపై మామ అత్యాచారం.
కంటికి రెప్పలా చూసుకోవాల్సిన భర్త పరాయి స్త్రీ ని తీసుకుని గోవా కు షికారుకెల్లగా.. కన్న కూతురిలా చూసుకోవాల్సిన మామ ఒంటరిగ ఉన్న కోడలి పై అఘాయిత్యానికి పాల్పడ్డ దుర్ఘటన మధ్యప్రదేశ్ లోని కట్ని జిల్లాలో జరిగింది. ఈ విషయాన్ని భర్తకు తెలియజేయగా ...
READ MORE
ఆ అమ్మాయిని పంపండి బాడీ మసాజ్ చేయించుకుంటా.! నా వల్ల కావట్లేదు.!
నేను దత్తత తీసుకుని పెంచుకున్న హనిప్రీత్ సింగ్ ఇన్సాన్ ను జైలుకు పంపండి బాడీ మసాజ్ చేయించుకుంటాను నాకు పిచ్చెక్కిపోతోంది.. ఈ మాటలు మాట్లాడుతున్నది ఇద్దరమ్మాయిలను రేప్ చేసిన కేసులో దోషి గా నిరూపితమై జైలులో శిక్ష అనుభవిస్తున్న డేరా బాబా.. ...
READ MORE
ఎవడికి ఇష్టం వచ్చినట్టు వాడు వ్యవహరిస్తున్నాడు. రాజకీయ సభలకు మీడియా నో ఎంట్రీ.
ఆంధ్ర, తెలంగాణ అన్న తేడా లేదు. ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అన్న హద్దులు లేవు. మీడియాకి ప్రతిపక్షమైన, పాలక పక్షమైన వార్తను చూపించే దోరణి మాత్రం ఒకటే. నిజాన్ని నిక్కచ్చిగా చెప్పడం కానీ ఇప్పుడున్న మీడియా పరిస్థితి అందుకు విరుద్దంగా ...
READ MORE
స్త్రీమూర్తి శీలాన్ని మతాల వారిగ విభజిస్తున్న లౌకికవాదులు – తూటుపల్లి రవి
కొంత కాలంగ పలు అత్యాచారాల ఘటనలు తద్వారా దేశంలో జరిగిన పరిణామాల నేపథ్యం లో ప్రముఖ జాతీయవాది భాజపా జాతీయ స్పోర్ట్స్ సెల్ కన్వీనర్ తూటుపల్లి రవి జర్నలిజం పవర్ తో తన అభిప్రాయాన్ని తెలియజేసారు.. ముఖ్యంగా తూటుపల్లి రవి మాట్లాడుతూ ...
READ MORE
సెలవులొచ్చేశాయోచ్… ఇక అల్లరే అల్లరి.
సెలవులొచ్చేశాయోచ్.. తెలంగాణ వ్యాప్తంగా పాఠశాలలకు ఈరోజుతో సెలవులు. ఎండలు మండిపోతున్నాయి.. అడుగు తీసి అడుగు వేయాలంటే సూర్యుడు తాపానికి గిర్రున తిరిగి కిందపడటం ఖాయం. ఇక ఇలాంటి ఎండల్లో పిల్లలు స్కూల్ అంటే నరకమే... అందుకే తెలంగాణ ప్రభుత్వం ఎండ కాలం ...
READ MORE
రాజన్నా నీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు…
ఆయన ఒక్కసారి నా మనిషి అనుకుంటే చాలు ఇక ఆ మనిషి కి ఏ లోటు రాదు. నమ్ముకున్న వ్యక్తిని సొంతమనిషిలా చూసుకోవడం.. ఎంతటి కష్టాల నుండైనా గట్టెక్కించడం ఆయనలో ఉన్న స్వభావం. ప్రజలను మన అనుకునేవాడే నాయకుడు ఆయనే డా.వై.ఎస్. ...
READ MORE
సైనిక శిబిరంపై ముష్కరుల గ్రనేడ్‌ దాడి…9 మందికి గాయాలు
శ్రీనగర్: ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లా ట్రాల్ ఏరియాలో సీఆర్‌పీఎఫ్ క్యాంపుపై ఉగ్రవాదులు గ్రనేడ్ విసరడంతో 9 మంది సీఆర్‌‍పీఎఫ్ సిబ్బంది గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. సోమవారంనాడు కూడా ఇదే తరహా దాడి ఘటన చోటుచేసుకుంది. ...
READ MORE
ఒక యువతి ని డైరెక్ట్ గ ఎదుర్కోలేక ఆమె ఆస్తులను ద్వంసం చేస్తున్న శివసేన సర్కార్.
దేశ వ్యాప్తంగా కూడా ఇప్పుడు బాలివుడ్ స్టార్ నటి కంగనా రనౌత్ మరియు మహారాష్ట్ర శివసేన సర్కార్ ఎపిసోడ్ గురించే చర్చ జరుగుతోంది. అధికార పార్టీ శివసేన హెచ్చరికలను ఏమాత్రం ఖాతరు చేయకుండా చెప్పిన తేదీ చెప్పిన సమయానికి ముంబై లో ...
READ MORE
మమతా బెనర్జీ సరికొత్త మత రాజకీయం వెనక PK హస్తం.??
దశాబ్దాల పాటు కమ్యునిస్టులు కంచుకోట గ ఏలిన రాష్ట్రం పశ్చిమ బెంగాల్ అలాంటి రాష్ట్రం లో కమ్యునిస్టుల ఓటు బ్యాంకు ను తనవైపుకు తిప్పుకుని ముఖ్యమంత్రి గ గెలిచింది తృణముల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మమతా బెనర్జీ. అయితే కమ్యునిస్టుల పై ...
READ MORE
కొత్త కొలువులొస్తున్నాయ్.. తెలంగాణలో మళ్లీ ఉద్యోగాల జాతర.
తెలంగాణ ప్రభుత్వం కొలువుల జాతరకు తెరలేపింది. రెవెన్యూ శాఖలో 2506 ఉద్యోగ నియామకాలకు సీఎం కేసీఆర్ ఆమోద ముద్ర వేశారు. ఉద్యోగ నియామక ప్రక్రియ వెంటనే ప్రారంభించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ ను సీఎం ఆదేశించారు. రెవెన్యూ శాఖలో రాబోయే ...
READ MORE
హైదరాబాద్‌లో ‘ఫ్లయింగ్ స్నేక్’ షాక్ అయిన జనం
రాజధానిలోని ఘోషామహల్ ప్రాంతంలో అరుదైన ఫ్లయింగ్ స్నేక్ కనిపించింది. ఓ ఫ్లై వుడ్ షాపులో దాక్కున్న ఈ పామును స్నేక్ సొసైటీ సభ్యులు పట్టుకున్నారు. నగరంలోనే కాదు, రెండు తెలుగు రాష్ట్రాల్లోను ఇంతవరకు ఇలాంటి స్నేక్‌ను చూడలేదని వారు చెబుతున్నారు. ఘోషామహల్ ప్రాంతంలోని ...
READ MORE
డెత్ టైమ్ చెప్తామంటున్న శాస్త్రవేత్తలు.
పుట్టుక నిజం చావు నిజం. ఆ మధ్యనున్న బ్రతుకంతా అబద్దం అన్నాడు ఓ కవి. పుట్టుక ఎప్పుడు ఎంత సమయానికి జరుగుతుందో వైద్యులు ఇప్పటికే తేల్చేశారు. అమ్మ కడుపునుండి తిథి, వర్జం, రావుకాలం చూసుకుని మరీ పుడుతున్నారు. మరీ చావో.. దీనికే ...
READ MORE
కేటీఆర్ బందువుల పబ్ లకు నోటీసులు ఎందుకివ్వరు..? : రేవంత్ రెడ్డి
డ్రగ్స్ కేసుపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నేరుగా సిఎం కెసిఆర్ కుటుంబంపైనే ఆరోపణలు గుప్పించారు  రేవంత్. కెసిఆర్ తనయుడు, మంత్రి కెటిఆర్ కుటుంబసభ్యులు, బంధువులు, మిత్రుల ఆధ్వర్యంలో నడుస్తున్న పబ్ లకు నోటీసులు ఎందుకు జారీ చేయలేదని ప్రశ్నించారు. ...
READ MORE
అమృత కి కోటి ఇస్తానన్న ఎల్ రమణకు.. వరంగల్ పూజారి
అందరి మనసులను కదిలిస్తున్న గోవా ముఖ్యమంత్రి వర్క్ కమిట్మెంట్..!!
పాల్వాయి ఇకలేరు. కులుమనాలిలో గుండెపోటుతో మృతి.
టోల్ ఫ్లాజ్ పై స్టార్ హోటల్.. హైవే లో నోరూరించే
భారత ఆర్మీ కి భారీ విరాళం ప్రకటించిన ICICI బ్యాంక్.!
కన్న కూతురి ప్రాణం తీసిన టీడీపీ పట్టణాధ్యక్షుడు.!
బ్రేకింగ్ న్యూస్ :- ఫిలిం ఛాంబర్ ముందు బట్టలిప్పి కూర్చున్న
ఇదేమి భారతం.. “నీట్” పేరుతో ఇంత నీచపు పనులా..?
భాజపా స్టేట్ దివ్యాంగ్ సెల్ జాయింట్ కన్వీనర్ గ డా.గిరిధర
నీతి వంత‌మైన రాత‌లు రాస్తే మ‌ర‌ణ‌మే బ‌లిదానం. జ‌ర్న‌లిస్ట్ డే
జన చైతన్య యాత్రతో జనాల్లోకి దూసుకుపోతున్న కమళ దళపతి.. కారు
ఒక మతానికే కొమ్ము కాయడం మంచిది కాదు.. సంస్కృతి సాంప్రదాయాలను
లవర్ తో భర్త గోవాకెల్తే.. ఇంట్లో ఉన్న భార్యపై మామ
ఆ అమ్మాయిని పంపండి బాడీ మసాజ్ చేయించుకుంటా.! నా వల్ల
ఎవడికి ఇష్టం వచ్చినట్టు వాడు వ్యవహరిస్తున్నాడు. రాజకీయ సభలకు మీడియా
స్త్రీమూర్తి శీలాన్ని మతాల వారిగ విభజిస్తున్న లౌకికవాదులు – తూటుపల్లి
సెలవులొచ్చేశాయోచ్… ఇక అల్లరే అల్లరి.
రాజన్నా నీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు…
సైనిక శిబిరంపై ముష్కరుల గ్రనేడ్‌ దాడి…9 మందికి గాయాలు
ఒక యువతి ని డైరెక్ట్ గ ఎదుర్కోలేక ఆమె ఆస్తులను
మమతా బెనర్జీ సరికొత్త మత రాజకీయం వెనక PK హస్తం.??
కొత్త కొలువులొస్తున్నాయ్.. తెలంగాణలో మళ్లీ ఉద్యోగాల జాతర.
హైదరాబాద్‌లో ‘ఫ్లయింగ్ స్నేక్’ షాక్ అయిన జనం
డెత్ టైమ్ చెప్తామంటున్న శాస్త్రవేత్తలు.
కేటీఆర్ బందువుల పబ్ లకు నోటీసులు ఎందుకివ్వరు..? : రేవంత్
Facebook Comments
Top
error: Content is protected !!