కల్వకుంట్ల తారక రామరావు.. జర్నలిజంపవర్ చూసిన కోణంలో ఈ పుట్టిన రోజు శుభాకాంక్షల్లు ప్రత్యేకమైన విషెస్ లు ఆయనకు నచ్చవు. అయినా జనం మెచ్చే యువ నేతకు మా వంతు అక్షర శుభకాంక్షలు. కొట్లాడి సాధించిన తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ది పరిచే మహత్తర బాద్యతను తన భుజానకెత్తుకున్న కల్వకుంట్ల వారసుడికి జన్మదిన శుభాకాంక్షలుతో….
తెలంగాణ రాష్ట్రం సిద్దించి 29 వ రాష్ట్రంగా ఏర్పడి కొత్త గా సరికొత్తగా బుడిబుడి అడుగులతో మూడేళ్లు పూర్తి చేసుకుని నాలుగవ ఏడులోకి చేరిపోయింది. కల్వకుంట్ల తారక రాముడు ఈ మూడేళ్ల పాలనలో తన దైన ముద్ర వేయడమే కాకుండా పాలకులకూ అధికారులకు మధ్య సమన్వయం చేయడంలోనూ ప్రజలందరికీ ఓ దిక్సూచిలా నిలబడ్డ నాయకుడు గా పేరు గడిస్తున్నారు.

ఐటీ శాఖ మంత్రిగా రాష్ట్రంలోని ప్రధాన నగరాలన్నింటి నీ సాంకేతికంగా తీర్చిదిద్దాలని అహర్నిశలు పనిచేస్తూ ఇటు పంచాయతి శాఖ మంత్రిగానూ తనదైన ముద్ర వేస్తున్నారు.
ఇలా ఓవైపు పార్టీ పటిష్టతకు పాటుపడుతూ మరోవైపు పాలనలోనూ పారదర్శకత అమలు చేస్తూ నేటి మేటి లీడర్ గా యువతనూ ప్రజలనూ విపరీతంగా ఆకర్శిస్తున్నారు కేటీఆర్.
అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తు తండ్రికి తగ్గ తనయుడిగా ముందుకు సాగుతున్నారు. అందులో దివ్యాంగులకు ఆయన ప్రత్యేకంగా శిక్షణా తరగతులు పెట్టి వారికి ఉపాధి కల్పించాలనే సంకల్పం ప్రత్యేకంగా చెప్పాల్సిందే.
ఆయన చేసిన.. చేస్తున్న కార్యక్రమాలు కొన్ని..
1. పేద విద్యార్థుల కోసం సర్కార్ బడులను సాంకేతికంగా తీర్చిదిద్దడం
2. ప్రజలకు ఉచిత వైఫై సౌకర్యం అందించడం
3. పంచాయతి పాలనలో పారదర్శకతను నెలకొల్పి పంచాయితి రహదారులను ప్రభుత్వ పరిధిలోకి తీసుకురావడం
4. చేనేత కార్మికుల సమస్యల తీవ్రతను అర్థం చేసుకోవడం
5. రాజధానిలో 5 రూపాయల భోజన కేంద్రాల ఏర్పాటు చేసి వాటిని విస్తరింపచేయడం
6. వాటర్ గ్రిడ్ పథక రూపకల్పన
7. స్టార్టప్ ద్వారా పరిశ్రమలను ప్రోత్సహించడం
8. నగరాల్లో బహిరంగ మలమూత్ర విసర్జనను అరికట్టి రాష్ట్రాన్ని క్లీన్ అండ్ గ్రీన్ గా మార్చడం
ఇంకా ఇలా ఎన్నో మరెన్నో.. ఆయన ఉన్నతమైన ఆలోచన విదానానికి నిదర్శనం.
తండ్రి తెలంగాణ ఉద్యమకారుడిగా రాజకీయ నాయకుడిగా ప్రజల్లో కీర్తి ప్రతిష్టలు పొందుతుండగా.. తండ్రికి తగ్గ తనయుడిగా కేటిఆర్ కూడా చిన్ననాటి నుండే తనేంటో చాలా సంధర్భాల్లో నిరూపించారు.
అందుకే తండ్రి కేసిఆర్ స్థాపించిన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో కీలక నేతగా ఎదిగారు.
ఎక్కడ ఏ ఉప ఎన్నికలొచ్చినా.. స్థానిక ఎన్నికలొచ్చినా ఏ మాత్రం అలసత్వం లేకుండా పార్టీకి ఘన విజయాలు అందించి గట్టి పునాదులు వేస్తున్నారు కేటిఆర్.

ఇక కేటిఆర్ వ్యక్తిగత విషయాలను చూస్తే..
ఆయన 1976 జులై 24 న సిద్దిపేట్ లో జన్మించారు.
సిరిసిల్ల నియోజకవర్గం నుండి ఎమ్ఎల్ఏ గా ఎన్నికై ఐటీ శాఖ మరియు పంచాయతి శాఖ మంత్రిగా బాద్యతలను చూస్తున్నారు.
బాల్యంలో పాఠశాల విద్యా సిద్దిపేట్ మరియు హైద్రాబాద్ లో చదివారు. ఆ తర్వాత నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గుంటూరు లో ఇంటర్మీడియట్, హైద్రాబాద్ నిజాం కాలేజ్ లో డిగ్రీ, పూణే లో ఎంఎస్సీ బయోటెక్నాలజీ, ఆ తర్వాత అమెరికా న్యూయార్క్ లో తన ఎంబీఏ పూర్తి చేసారు.
ఎంబీఏ పూర్తైన తర్వాత అక్కడే సాఫ్ట్ వేర్ రంగంలో ఐదేళ్ల పాటు ప్రాజెక్ట్ మేనేజర్ గా కూడా ఉద్యోగం చేసిన అనుభవం కేటిఆర్ సొంతం. అంతేకాదు ఆయన హైద్రాబాద్ లోనూ కొంతకాలం ఐటీ సంస్థను నిర్వహించారు.
అందుకే ఆయనకు తెలుగు భాష పై ఎంత పట్టుందో అంతే ప్రత్యేకంగా ఆంగ్ల భాషపై కూడా పట్టుంది.
అందువల్లనే ఆయన రాజకీయ నాయకుడిగానే కాక మేధావిగానూ గొప్ప వక్తగానూ తెలంగాణ ప్రజల మనసుల్లో గుర్తింపు పొందారు.
అయితే తండ్రి కేసిఆర్ రాజకీయాల్లో బిజీగా ఉండడం వల్ల తల్లి ప్రభావం ఆయన పై ఎక్కువ అని చెప్పొచ్చు.
సోదరి కల్వకుంట్ల కవిత తో బాల్యం నుంచే మంచి అనుబంధం కూడా ఉంది. తల్లి కేటిఆర్ ని డాక్టర్ గా చూడాలనుకుంటే.. తండ్రి ఐఏఏస్ గా చూడాలనుకు న్నాడు కానీ.. కేవలం పుస్తక పరిఙ్ఞానంతో ప్రజలను పాలించడం నచ్చని కేటిఆర్ ప్రజలతో ప్రత్యక్షంగా మమేకం అయి వారిలో ఒకడిగా ఉంటూ వారి సాదక బాధల్ని ప్రత్యక్షంగా తెలుసుకుని వారికి సేవ చేయాలనే గొప్ప ఆలోచనతో తండ్రి బాటలో అడుగువేసాడు.
అయితే సొంత కొడుకైనంత మాత్రాన ప్రత్యేకంగా ఏమీ ఉండదు నీ ఆలోచన ప్రకారమే ఎదగాలనే తండ్రి మాటను గౌరవిస్తూ సాధారణ కార్యకర్తగానే పార్టీకి సేవలందించి కార్యకర్తల మనసులను గెలిచాడు కేటిఆర్. అందుకే ఉద్యమం నాటి నుండి ఏనాడూ ఆయన పదవులకు ఆశ పడకున్నా ఆయనను వెతుక్కుంటూ పదవులు వచ్చాయి. అయినా అదంతా కార్యకర్తల సమిష్టి కృషి అని చెప్పడానికి ఏనాడూ వెనకడుగు వేయడు కేటీఆర్.
కేటీఆర్ ఆలోచన విధానాలు ఆయన కృషి ఫలితాలను గుర్తించి రిట్జ్ సీఎన్ఎన్ సంస్థలు సంయుక్తంగా “ఇన్ స్ప్రేషనల్ ఐకాన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్” తో కేటిఆర్ ని సత్కరించాయి. ఇది కూడా సమిష్టి విజయమే అని చెప్పడం అయనలో ఉన్న నేర్పు ఓర్పు నాయకత్వ లక్షణాలకి నిదర్శనం.
అందుకే ఇప్పుడు తెలంగాణ ప్రజలందరివాడు కేటిఆర్
ముందు ముందు కూడా మరిన్ని విజయాలు సాధించాలని ” జర్నలిజంపవర్” కోరుకుంటోంది. కల్వకుంట్ల తారక రాముడి కి జన్మదిన శుభాకాంక్షలు చెప్తోంది. హ్యపి బర్త్ డే కేటీఆర్.
https://youtu.be/n_QkXCDmMn0
Related Posts
గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్... ఒక ముఖ్యమంత్రి గా కంటే ఒక కామన్ మ్యాన్ గానే తను నడుచుకుంటాడని ఆ రాష్ట్ర ప్రజలే కాదు యావద్ దేశం ప్రజలు గర్వంగా చెప్పుకుంటారు. నీతి నిజాయితిలో పారికర్ పెట్టింది పేరని అభిమానుల మాట. ...
READ MORE
మన ప్రధాని నరేంద్ర మోడీ కలల పథకం ఆశల సౌథం.. బుల్లెట్ ట్రైన్.
ఈ బుల్లెట్ రైలు మన పట్టాల మీద రయ్యిమని రెప్పపాటు వేగంతో బుల్లెట్ స్పీడ్ తో దూసుకెలుతుంటే.. ఉంటుంది మజా..!!
అందుకే మన ప్రధాని కూడా ఏనాడైతే జపాన్ దేశం ...
READ MORE
భారత్ చైనా రష్యా దేశాల యొక్క విదేశాంగ మంత్రుల సమావేశం లో పాకిస్తాన్ వక్ర బుద్ధి ని ఎండగట్టిన మన దేశ విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్, ఈ సమావేశం సాక్షిగ పాకిస్తాన్ ఉగ్ర దేశమని మరోసారి ప్రపంచ దేశాలకు ...
READ MORE
తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ మొత్తానికి పట్టుపట్టి అనుకున్నది సాదించింది. జర్నలిస్టు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తూ ముందుకు సాగుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక అక్రిడేషన్ ఉన్న జర్నలిస్ట్ లు హాయిగా ఏసీ బస్సులో ఎంచక్కా ప్రయాణించొచ్చు. అందుకు సంబందించిన జీవో జారీకి ...
READ MORE
పుల్వామా ఉగ్ర దాడికి ప్రతీకారంగ నేడు పాకిస్తాన్ పై భారత్ జరిపిన వైమానిక దాడి విజయవంతం కావడంతో.. దాదాపు 400 మంది పాకిస్తాన్ ఉగ్రవాదులు హతం కావడంతో దేశ వ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి.ఈ క్రమంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ...
READ MORE
ప్రేమిస్తే ప్రియురాలి ప్రేమ ఎంత తియ్యగా హాయిగా ఉంటుందో.. ఆ ప్రియురాలిని తిరస్కరిస్తే అంత ప్రమాదకరంగ ఉంటుంది ఇందుకు ఉదాహరణగ కేరళ రాష్ట్రం తిరువనంతపురం లో జరిగింది. కొంత కాలంగ ప్రేమలో మునిగితేలుతున్న ఓ ప్రేమ జంట ఆఖరికి వారి కథలో ...
READ MORE
తెలుగు సినీ సంచలనం నటి శ్రీ రెడ్డి తాజాగా సినీ క్రిటిక్ కత్తి మహేష్ ని ఛి కొట్టింది. ఓ టీవీ ఛానల్ లైవ్ షో లో సునీత అనే ఆర్టిస్టు కత్తి మహేష్ పై లైంగిక ఆరోపనలు చేయడంతో ఆ ...
READ MORE
భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ముషీరాబాద్ నియోజకవర్గం శాసనసభ సభ్యులు డా.కే.లక్ష్మణ్ జన్మధినం పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగ అన్ని జిల్లాలలో మండల కేంద్రాలలో కార్యకర్తలు సంబరాలు జరుపుతున్నారు.
గత పది రోజులుగా మార్పు కోసం జన చైతన్య యాత్ర పేరుతో ...
READ MORE
ధర్నా చౌక్ ను కాపాడుకోవాలని ఒక వర్గం.. లేదు లేదు ఇందిరాపార్క్ సంరక్షణే మా భాద్యత అంటూ మరో వర్గం పోటా పోటీగా నిన్న ధర్నా చౌక్ వద్దా నిరసన తెలిపిన సంగతి తెలిసిందే. ప్రజా సమస్యల పోరాట వేదికగా ఉన్న ...
READ MORE
గ్రేటర్ ఎన్నికలు అంటే అసెంబ్లీ ఎన్నికలకు సెమీ ఫైనల్ అని అంటారు. బల్దియా లో ఏ పార్టీ హీరో గా నిలుస్తుందో, ఆ పార్టీ నే తర్వాత రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తదని కూడా అంటారు. అలాంటి ఎన్నికల్లో ...
READ MORE
లేక లేక కలిగిన సంతానం ముక్కోటి దేవతలకు మొక్కుకోగా పుట్టిన బాలుడు అర్థాంతరంగ కన్నవారికి కడుపుకోత మిగిల్చి కానరాని లోకాలకు పోవడంతో ఆ దంపతుల దుఖాన్ని ఆపడం ఎవరితరం కాలేదు. అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకు పసితనంలోనే కనుమరుగైపోవడం చూసి స్థానికులు కూడా ...
READ MORE
బోడుప్పల్ టీఆర్ఎస్ నేత శ్రీనివాస్ రెడ్డి మూడు పెళ్ళిల్ల వ్యవహారం.. రెండో భార్య సంగీత నిరసన దీక్ష వివాదం అందరికీ తెలిసిందే..
మొదటి భార్య స్వాతి కి విడాకులు ఇచ్చాడు శ్రీనివాస్ రెడ్డి, కానీ రెండో భార్య సంగీత కు విడాకులు ఇవ్నకుండానే ...
READ MORE
చైనా చేస్తున్న ఓవరాక్షన్ తో ఇపుడు పాకిస్తాన్ మాత్రమే కాదు చైనా పేరు చెప్తేనే భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారత్ చైనా బార్డర్ లో మన సైనికులతో గొడవకు దిగుతోంది చైనా, అదే విధంగా మన దేశ శత్రువు ఉగ్రవాద ...
READ MORE
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం గంట గంటకు నూతన మలుపులు తీసుకుంటోంది. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ హోదా అంశాన్ని ప్రధానంగ తీసుకుని ప్రజల్లోకి వెల్లాలని నిర్ణయించుకుంది అధికార తెలుగుదేశం పార్టీ. ఇటు కేంద్రంలో ఉన్న భాజపా కూడా హోదా కంటే కూడా ...
READ MORE
వస్తు సేవల పన్ను(GST) లో మరికొన్ని వస్తువుల పై పన్ను తగ్గే విదంగ ఎక్కువ పన్ను స్లాబ్ నుంచి తక్కువ పన్ను స్లాబ్ లో చేర్చడం జరిగింది. సవరించిన పన్ను రేట్లను కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇందుకు సంబంధించి దాదాపు 40 ...
READ MORE
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ కథనం ప్రతి ఒక్కరి హృదయాలను కదిలిస్తోంది. కన్నీటి సంద్రంలో ముంచుతుంది. ప్రభుత్వాల చేతగాని చర్యను ప్రశ్నిస్తోంది. ఓ నిండు ప్రాణం బలికావాడానికి ప్రధాన కారణాలను కళ్లముందు చూపుతుంది. అంకుల్ నేను కూడా మీ కన్నబిడ్డలాంటి ...
READ MORE
21వ ఆధునిక శతాబ్దం లోనూ టెక్నాలజీ తో పరుగులు తీస్తున్న తరుణంలోనూ.. అంతరిక్షానికి విహారయాత్రకు వెలుతున్న ఈ కాలంలోనూ.. దురాచారం నుండి బయటపడలేకపోతున్నాడు సగటు మనిషి. ఇంకా ఆ దురాచారాలకి బలైపోతున్నాడు.
** హైద్రాబాద్ చిల్కనగర్ లో జరిగిన దారుణం సంధర్భంగ ...
READ MORE
గత కొంత కాలంగ పెట్రోల్ ధరలు కొద్ది కొద్దిగా పెరగడమే తప్ప తగ్గకపోవడంతో అది నేడు 80 రూపాయలు దాటింది. వాస్తవానికి పెట్రోల్ ధరల నియంత్రణ లో కేంద్ర ప్రభుత్వ నియంత్రణ ని మెచ్చుకోవాలి.
ఎందుకంటే గత ఎన్నికలు అనగా 2014 ఎన్నికల ...
READ MORE
బాహుబలి ఫీవర్ మాములుగా లేదు. ఉన్న ఉద్యోగం ఊడినా పర్వాలేదు కానీ బాహుబలి 2 చిత్రాన్ని చూడాల్సిందే కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో తెలుసుకోవాల్సిందే అంటున్నారు చిరు ఉద్యోగులు. ప్రభుత్వం, ప్రైవేట్ అని తేడా లేకుండా రేపు దేశ వ్యాప్తంగా విడుదలవబోతున్న ...
READ MORE
యుగానికి ఆది ఉగాది. ప్రకృతిలో మార్పు కారణంగా వచ్చే తొట్టి తొలి పండుగ. తెలుగు వారంతా గొప్పగా జరుపుకునే పండుగ. మనస్సు అన్ని కర్మలకు మూలమని గ్రహించిన తెలుగువారు ఆ మనసుకు అదిపతి అయిన చాంద్రమానాన్ని ప్రమాణంగా స్వీకరించి దాని ఆధారంగా ...
READ MORE
షోయబుల్లాఖాన్ తెలంగాణ విమోచనం కోసం పోరాడిన తొలిదశ ఉద్యమకారుడు, గొప్ప దేశభక్తుడు అంతేకాదు ఆయన జర్నలిజానికి వన్నె తెచ్చిన గొప్ప జర్నలిస్ట్. ముస్లిం కుటుంబంలో జన్మించినప్పటికీ నిజాం నిరంకుశత్వ పాలనను ను వ్యతిరేకించి తెలంగాణ ను నాటి హైద్రాబాద్ సంస్థాన్ ను ...
READ MORE
ఇస్రో విజయాన్ని చూసి దేశం మురిసిపోతుంది. ఇది నా భారత ఖ్యాతి అంటూ కాలర్ ఎగిరేసి చెపుతోంది. విశ్వాంతరాల్లో చరిత్ర తిరగరాసిన ఇస్రోకి ప్రపంచం వంగి సలాములు చేస్తుంది. సతీష్ ధవన్ స్పేస్‌సెంటర్ (షార్) వేదికగా ఇస్రో తన శాస్త్రసాంకేతిక పరిజ్ఞానంతో ...
READ MORE
ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా కనిగిరి లో సభ్య సమాజం తల దించుకునేలా జరిగిన ఘటనతో.. ఆ దారుణానికి పాల్పడిన ముగ్గురు యువకులను కన్న తల్లిదండ్రులకు తీరని మచ్చ ఏర్పడింది.
తోటి విద్యార్థినిని ప్రేమ పేరుతో స్నేహం ముసుగేసుకుని కన్ను మిన్ను కానకా అత్యాచార ...
READ MORE
తెలంగాణ పోలీసులపై ముఖ్యమంత్రి కేసీఆర్ వరాల వర్షం కురిపించారు. హైదరాబాద్ మాదాపూర్‌లోని హెచ్ఐసీసీలో ఎస్సై స్థాయినుండి డీజీ స్థాయి వరకూ అధికారులతో కేసీఆర్ సమావేశమయ్యారు ... ఈ సందర్భంగా మాట్లాడిన కేసీఆర్ మహిళా పోలీసుల సౌకర్యాలు కల్పించాలని సూచించారు. దీనికవసరమైన సొమ్మును ...
READ MORE
తెలంగాణ రాష్ట్రంలోనే యాదాద్రి నరసింహుడి తర్వాత ఆ స్థాయిలో పేరుగాంచిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మేడ్చల్ జిల్లా కీసర మండలం చీర్యాల లోని శ్రీ శ్రీ శ్రీ లక్ష్మి నకసింహ స్వామి దేవస్థానం. ఈ పుణ్యక్షేత్రం భక్తులకు కొంగుబంగారంగ, కోరిన కోరికలకు నెలవుగ ...
READ MORE
పారికర్ మాటల్లో తప్పు లేదు… అధికారులు అంతటి ఘనాపాటిలే.
మన బుల్లెట్ ట్రైన్ ఖర్చెంతో తెలుసా..?? మొదలవనున్న పనులు.
బీజింగ్ సమావేశం లో పాక్ వక్ర బుద్దిని ఎండగట్టి, ఉగ్రదేశంగ
టీయూడబ్ల్యుజే పట్టుపట్టి అనుకున్నది సాదించింది..
సర్జికల్ స్ట్రైక్ 2 ఎఫెక్ట్.. ABVP ఆధ్వర్యంలో ఘనంగ విజయోత్సవాలు.!!
ప్రియున్ని లాడ్జికి పిలిచింది.. పథకం ప్రకారం సంసారానికి పనికిరాకుండా చేసింది.
కత్తి మహేష్ ని “ఛి” కొట్టిన శ్రీ రెడ్డి.!! ఎందుకో
జన చైతన్య యాత్రికుడికి జన్మధిన శుభాకాంక్షలు.. రాష్ట్ర వ్యాప్తంగ కార్యకర్తల
బలైందా…? బలి చేశారా..? లేక్ వ్యూ సీఐ శ్రీదేవి పరిస్థితేంటి..?
దుబ్బాక ఎఫెక్ట్ బల్దియా పై తీవ్రంగానే పడనుందా..? అవుననే అంటున్న
నిడదవోలు లో విషాదం.. మీ ఇంట్లో చిన్న పిల్లలుంటే టీవీని
అతనికి రెండు పెళ్లిల్లు అయ్యాయని తెలిసే.. మూడో పెళ్లి చేసుకున్న.!!
టిక్ టాక్ కు టైం దగ్గర పడినట్టేనా.. మన దేశ
టీడీపీ మంత్రులు కూడా రాజీనామా చేసేసారు..!!
GST లో మార్పులు.. తగ్గనున్న మరో 40 రకాల వస్తువులు.!
స్వర్గం నుండి ఓ చిన్నారి ఆవేదన.. అంకుల్ మీకు మేం
టెక్నాలజీ యుగంలోనూ మూఢనమ్మకానికి “బలి” అయిపోతున్న మనిషి.!!
పెట్రోల్ ధరలపై సోషల్ మీడియా లో తప్పుడు ప్రచారం.!!
బాహుబలి 2.. కట్టప్ప ఎందుకు చంపాడో నాకు తెలియాలి.. ఫ్లీజ్
ఉగాది విశిష్టత ఏంటి..? ఉగాది పండుగను ఎలా జరుపుకుంటే ఉత్తమం..?
స్వేఛ్చకు ఆయుధాలు ఆయన అక్షరాలు.. నేడు షోయబుల్లాఖాన్ జయంతి.
విశ్వాంతరాల చరిత్ర తిరగరాసిన ఇస్రో విశ్వరూపం.
బద్మాష్ పని చేసిన బాడుకవ్ లు.. ఆ దారుణ దృష్యాలను
తెలంగాణ పోలీసులపై సీఎం వరాల జల్లు..
ధనుర్మాసం సంధర్భంగ చీర్యాల శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయంలో