You are here
Home > తాజా వార్త‌లు > మరీ ఇంత అన్యాయమా.. కోర్టు మెట్లెక్కకుండా ఏ పరీక్ష అయినా నిర్వహించగలిగారా..? టీఎస్ సర్కార్ ను నిలదీసిన నిరుద్యోగి.

మరీ ఇంత అన్యాయమా.. కోర్టు మెట్లెక్కకుండా ఏ పరీక్ష అయినా నిర్వహించగలిగారా..? టీఎస్ సర్కార్ ను నిలదీసిన నిరుద్యోగి.

తొలి తెలంగాణ ప్రభుత్వం మనదే అన్న పేరే కానీ పరాయి పాలనకంటే అధ్వాన్నంగా ఉందని నిరుద్యోగుల ఆవేదన. ప్రభుత్వ కొలువులకు నిర్వహించే పోటీ పరీక్షల్లో ఒక్కంటే ఒక్కటి కూడా కోర్టు మెట్లు ఎక్కకుండా లేని పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఉద్యోగం లో అవకతవకలే దర్శనమిస్తున్నాయని.. ప్రతిష్టాత్మకంగా నిర్వహించాల్సిన పరీక్షలు అక్రమాలకు తావిచ్చేలా అవినీతిమయంతో నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటారంటున్నారు. గ్రూప్ 2 అస్తవ్యస్తంగా నిర్వహించిన తీరుపై ఓ నిరుద్యోగి ఆవేదన.
టీఎస్ పీఎస్సీకి ఓ నిరుద్యోగి లేఖ

గౌరవనీయులైన టీఎస్ పీఎస్సీకి, తెలంగాణ ప్రభుత్వానికి మర్యాదపూర్వకంగా ఈ లెటర్ రాస్తున్నాను. వీలైతే మేం అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పండి. లేదు.. మేం చెప్పం అని మీరంటే 2019 ఎన్నికలే ఆ సమాధానం చెప్తాయి..ఇది నా ఒక్కడి మాట కాదు. యావత్తు తెలంగాణ రాష్ట్రం సిద్ధించడానికి, మీ ప్రభుత్వం ఏర్పడటానికి కారకులైన నిరుద్యోగ యువకులందరిది.
నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో పీఠమెక్కారు..బాగనే ఉంది..అడగని వాళ్లకు, అడిగిన వాళ్లందరికీ జీతాలు పెంచుతున్నారు..ఇది మరీ బాగుంది… మరి నిరుద్యోగులేం పాపం చేశారని వాళ్ల జీవితాలతో చెలగాటమాడుతున్నారు? ఇంకా మీరు నిరుద్యోగులను ఓటర్లుగానే చూస్తున్నారా చెప్పండి..ఓటుతోనే సమాధానం చెప్తాం! . సరే ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంది మీ తెలంగాణ సర్కారు గురించి…
ఒక్కటే మాట మిమ్మల్ని అడుగుతున్నాను ఘంటా చక్రపాణి సర్. విద్యార్థుల భవిష్యత్తులతో ఇక మీరు ఆడుకున్నది చాలు. ఇంకొద్దు.. మేం కోల్పోయింది చాలు మీవల్ల. టీఎస్ పీఎస్సీ ఏర్పడగానే నిరుద్యోగుల జీవితాల్లో సంతోషమేర్పడింది..ఆ సీట్లో మీరు కూర్చోగానే దానికి మరింత వన్నె వచ్చిందని తెగ సంబరపడి పోయాం. ఇది మూణ్నాళ్ల ముచ్చటనేనని మూడేళ్ల పాలన గడవక ముందే ముద్దుగా తేల్చేశారు.
ఇంట్లో కూడు లేక, కట్టుకోవడానికి సరైన గుడ్డ లేక, చదువుకున్న చదువుకు విలువలేక, ఊర్లో కలిసిన ప్రతిసారి తెలిసిన వాళ్లు ఏం చేస్తున్నావు రా అడిగితే ఏం చెప్పాలో తెలియక అయోమయపడుతూ, అవమానపడుతూ, ఇంకెతకాలం చదువుతవురా అని పదే పదే తల్లిదండ్రులు తిడుతుంటే….అవన్నీ దిగమింగుకొని ఏదైనా ఒక పరీక్షకు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే నెల ముందు నుండే తెలిసి, తెలియని, మన, నా అనుకున్న వాళ్లందరినీ అడుక్కొని వెయ్యి రూపాయలు అప్పుగా తెచ్చుకొని ఊరి నుంచి 20 కి.మీలు ఛార్జీలు పెట్టుకొని ప్రయాణం చేసి తీరా అక్కడి కెళ్లాక ఆన్ లైన్ సెంటర్లో 40 కట్టి, అప్లై చేసినందుకు మీరు ఫిక్స్ చేసిన 250, 300, etc…. ఇలా ఎంతైతే అంత కట్టి బయట హోటల్ లో తిని అక్కడ ఇంకో 70 కట్టి తిరుగు ప్రయాణంలో ఇంటికి వస్తుంటే విజేత కాంపిటీషన్, ఉద్యోగ సోపానం, కరెంట్ అఫైర్స్ బుక్స్ కనిపిస్తే వాటిని కొని..కనిపించి, కనిపించని బుక్స్ ఇలా అన్ని కొనుక్కొని అప్పు తెచ్చుకున్న వెయ్యి ఒక్కరోజే ఖర్చు పెట్టి మళ్లీ ఇంటికొచ్చి బుక్స్ ముందరేసుకొని పొద్దస్తమానం చదివి పరీక్షలు రాస్తే మీరు చేస్తున్నదేమిటి?…ఇది ఒక వైపే….ఇంకో వైపు పుట్టిన ఊరును, కన్న తల్లిదండ్రులను, కట్టుకున్న భార్యా పిల్లలను అందరినీ వదిలేసి జాబు వస్తుందన్న నమ్మకంతో కోచింగ్ సెంటర్లలో వేలు ధారబోసి, అక్కడ ఉండడానికి ఓ రూమ్ వెతుక్కొని దానికి రెంట్ కడుతూ, బయట మెస్ లలో తింటూ రాత్రనక, పగలనక రూమ్ లల్లో, లైబ్రరీల్లో చదువుకొంటూ పరీక్షలు రాస్తే మీరు చేస్తున్నదేమిటి? పెళ్లిళ్లు మానుకొని, వచ్చిన సంబంధాలు చెడగొట్టుకొని ఇంట్లో వాళ్లకు సమాధానం చెప్పలేక, జీవితంలో స్థిరపడతామన్న భరోసా లేక మీరు రిలీజ్ చేసే నోటిఫికేషన్లనే నమ్ముకొని అప్పో సొప్పో చేసి చదువుకుంటూ కాలం వెళ్లదీస్తుంటే మీరు మాకిచ్చే బహుమతి ఇదా?
సరే ఇదంతా ఉండని గానీ….ఓ నిరుద్యోగ అభ్యర్థిగా కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాను… సమాధానం చెప్పండి….
• టీఎస్ పీఎస్సీ గ్రూప్ 2 ఫలితాల్లో అవకతవకలు జరిగితే పట్టించుకోరా? అది మీ బాధ్యత కాదా?
• ఓఎమ్ఆర్ షీట్లో వైట్ నర్ దిద్దిన వారిని సెలెక్ట్ చేయడం మీకు ఎంత వరకు సబబుగా ఉంది?
• మీరు(టీఎస్ పీఎస్సీ) ముందుగా ఇన్ స్ట్రక్షన్స్ లో పేర్కొన్నట్లు ఓఎమ్ ఆర్ షీట్ పై దిద్దు బాట్లు చర్యలను అంగీకరించబోమని చెప్పారు..మళ్లీ మీ నిబంధనలను మీరే ఉల్లంఘించడం ఎంత వరకు కరెక్ట్ ?
• అసలు వైట్ నర్ ను సెంటర్ లోకి ఎందుకు అనుమతించారు ? అన్నీ చెక్ చేసే మీకు వైట్ నర్లు కనిపించలేదా? వందల సంఖ్యలో వైట్ నర్లున్న ఓఎంఆర్ షీట్లు ఎలా వస్తాయి? దాని వెనక మీ హస్తం ఉందా?
• కట్ ఆఫ్ లిస్ట్ పెట్టకుండా డైరెక్ట్ ఫలితాలు రిలీజ్ చేయడం వెనుక ఏమైనా ఉద్ధేశం ఉందా?
• ఒకే సెంటర్ నుంచి వందల సంఖ్యలో అభ్యర్థులు ఎలా సెలెక్ట్ అయ్యారు ? దీని వెనక ఏదైనా మతలబు ఉందా? లేదా ఆయా సెంటర్లలో మాస్ కాఫీయింగ్ జరిగిందా?
• అర్హులకు అవకాశం దక్కలేదని రోడ్లపైకి వచ్చి వేలాది మంది అభ్యర్థులు వాపోతుంటే వారి గోడు మీకు వినిపించడం లేదా?
• వైట్ నర్ దిద్దే వారి విషయంలో సుప్రీంకోర్టు తీర్పును మీరు లెక్కచేయరా? అయినా మీరు లెక్కచేసి ఉంటే వైట్ నర్ పెట్టిన వాళ్లను సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు ఎందుకు పిలుస్తారు ?
• ఎప్పుడో నవంబర్ లో పరీక్ష అయిపోతే కొంతమంది అభ్యర్థులు వైట్ నర్ విషయంలో కోర్టుకు వెళ్లారు..మరి ఆ 3 నెలల గ్యాప్ లో మీరేం చేశారు ?వాళ్లు కోర్టు మెట్లు ఎక్కేదాకా వేచిచూశారా?
• 17 ప్రశ్నలను అర్ధాంతరంగా తొలగించారు.. దానికి సంబంధించి మీరు టీఎస్ పీఎస్సీ ఎలాంటి మార్గదర్శకాలు లేవు. టీఎస్ పీఎస్సీ అంటే రాజ్యాంగ బద్ధంగా ఏర్పడ్డ సంస్థ కాబట్టి అభ్యర్థులకు సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా మీకు ఉంది?
• ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు నియామకాల్లో అన్యాయం జరిగిందనే తెలంగాణను కొట్లాడి తెచ్చుకుంటిమి..ఇప్పుడు అందులో పెద్దగా మార్పేమీ కనిపించడం లేదు.దీనికి మీ సమాధానం ఏమిటి?

• మీరు ప్రైమరీ, ఫైనల్ కీ లు ఇవ్వడానికి ఎందుకంత సమయం తీసుకున్నారు? అభ్యర్థుల ఎదురుచూపులతో ఆటలాడాలనుకున్నారా? ఆ జాప్యానికి కారణాలేంటి?
• మీరిచ్చిన ప్రతి ‘కీ’ లో సవాలక్ష తప్పులున్నాయి..అంత నిర్లక్ష్యం ఎందుకు చేసినట్లు? పోనీ మీరు కొలువు దీరిన సర్కారులో కీ తయారు చేసే నిష్ణాతులు కరువయ్యారా? గ్రూప్ 2 అంటే మీ దృష్టిలో చిన్నపిల్లలు ఆడుకునే ఆటనా?
• గ్రూప్ 2 పరీక్షకు ముందు 350 మార్కులు తెచ్చుకొని చూపించండని సవాల్ చేసిన మీకు ఈరోజు 420,430,440, 450 మార్కులు తెచ్చుకున్న వాళ్లు కనిపించడం లేదా..? వాళ్లను సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు ఎందుకు అనుమతించడం లేదు..? అవి మార్కులు కావా..? ఇప్పటికీ చాలా మంది అన్నేసి మార్కులు తెచ్చుకున్నా జాబ్ వస్తుందన్న నమ్మకం లేకుండా చేశారు.
• మీది నిజంగా మాటల ప్రభుత్వమే అని నిరూపించారు. చేతల ప్రభుత్వం కాదని ఇప్పుడు తేలిపోయింది. ప్రకటనల్లో కాదు సర్ దమ్ము చూపించాల్సింది… చెప్పిన పని చెప్పినట్లు చేయడంలో చూపించండి..
• నోటిఫికేషన్ లో 1:2 ప్రకారం ఇంటర్వ్యూకు పిలుస్తామన్నారు..మళ్లీ కొత్తగా 1: 3 ఏంటీ సర్ ?ముందుగానే ఇలాంటి విషయాలు మీడియాకు చెప్పాల్సిన బాధ్యత, ప్రెస్ నోట్ రిలీజ్ చేయాలన్న కనీస జ్ఞానం లేదా..? డైరెక్ట్ గా మీరెవరు సర్ నిర్ణయాలు తీసుకోవడానికి..?

చివరగా ఒక్కటి అడుగుతున్నాను… దమ్ముంటే పరీక్షను రద్దు చేసి ఇంకో మూడు నాలుగు నెలలు గడువిచ్చి మీరు చేసిన తప్పును సరిద్దుకోండి. లేదంటే తెలంగాణలో నియామకాల కోసం మరో ఉద్యమం తప్పదు. విద్యార్థుల భవిష్యత్తును నిర్ధేశించండి అంతే కానీ విద్యార్థుల భవిష్యత్తులతో ఆడుకోకండి. వారి జీవితాలను అంధకారం చేయకండి.. అది మీ హక్కు కాదని తెలసుకోండి.
ఇట్లు
గోపాల్ రావు.పి
జర్నలిస్ట్
(ఇది జర్నలిస్ట్ గా రాయలేదు.. విద్యార్థిగా రాశా.. జర్నలిస్ట్ గా రాసుంటే ఆ పవర్ ఇంకోలా ఉండేది)

 

ఇది ఆయన ఒక్కడి అంతరంగం మాత్రమే కాదు గ్రూప్ లో మోసపోయామని చెపుతున్న నిరుద్యోగుల ఆవేదన కూడా. 

Related Posts
భాజపా నేషనల్ మీడియా కోఆర్డినేటర్ తో భేటీ అయిన డా.గిరిధరాచార్యులు.!!
జర్నలిజం పవర్ ఛైర్మన్ ప్రముఖ విద్యావేత్త డా.గిరిధరాచార్యులు తన ఢిల్లీ పర్యటనను విజయవంతంగ కొనసాగిస్తున్నారు. పర్యటనలో భాగంగ పలువురు ప్రభుత్వ పెద్దలను కలిసిన ఆయన తద్వారా భాజపా నేషనల్ మీడియా కోఆర్డినేటర్ సంజయ్ తో భేటీ అయ్యారు. ఢిల్లీ లోని కార్యాలయంలో ...
READ MORE
మైనర్ బాలికతో బలవంతంగ వ్యభిచారం చేయిస్తున్న మహిళలు అరెస్టు.!
హైద్రాబాద్ లో మరోసారి సెక్స్ రాకెట్ ముఠాలు పట్టుబడ్డాయి.. పోలీసులు ప్రభుత్వాలు ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నప్పటికీ "షీ" టీం ల పేరుతో ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేస్తున్నా.. ఈ సెక్స్ రాకెట్ మూఠాలు బరితెగిస్తూనే ఉన్నై. తాజాగా ఉప్పర్ ...
READ MORE
ఆదార్ దెబ్బ‌కు ఆ ఊళ్లో అంద‌రు ఒకే రోజు పుట్టారు.
ఆహా ఓహో ఆదార్ వచ్చేసింది ఇక భార‌త్ వెలిగిపోతుంది. అసలు ఎక్క‌డ ఎవ‌రు ఏ త‌ప్పు చేసినా ఇట్టే ప‌ట్టేయ వ‌చ్చు అక్ర‌మాల‌కు చోటుండ‌దు అవినీతికి అస‌లు అవ‌కాశ‌మే ఉండ‌దు.. అన్నింటికి ఆదార్ తో లింక్ ఖాయం అని చెపుతున్న కేంద్ర ...
READ MORE
ఆర్టీసీ బస్సు దొరికింది.. కానీ ఏం లాభం టైర్లు మాత్రమే మిగిలాయి.. అధికారుల ఆశలు గల్లంతైయ్యాయి.!!
ఎంజీబీఎస్ పక్కన గౌలిగూడ బస్ స్టాప్ లో కుషాయిగూడ కు చెందిన మెట్రో ఎక్స్ ప్రెస్ ఆర్టీసీ బస్సు ను దొంగలెత్తుకెల్లిన విషయం అందరికీ తెలిసిందే.. ఈ ఘటన ఒక రకంగ అధికారులను ఇరకాటంలోకి నెెట్టేసిన పరిస్థితి. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ ...
READ MORE
పిల్లల ఏడుపు వినిపిస్తే తలుపులు తీయొద్దు.. హెచ్చరిస్తున్న పోలీస్ శాఖ…
ఈ మధ్య ఈ మెసెజ్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అర్థరాత్రిలు బీహర్, గుర్గా నుంచి వచ్చిన ఓ ముఠా దోపిడికి పాల్పడుతుందని.. పిల్లలగా ఏడుపులు వినిపిస్తు సాయం కోసం అర్థిస్తున్నారని.. ఆదమరచి తలుపులు తీయగానే నిలువు దోపిడికి సిద్దమవుతున్నారని ...
READ MORE
జమ్ము కాశ్మీర్ లో గవర్నర్ పాలన.! ఏం జరగనుందోననే భయంలో పాకిస్తాన్.!!
దేశ రాజకీయాల్లో మరో అనూహ్య పరిస్థితి చోటు చేసుకుంది. జమ్ము కాశ్మీర్ రాష్ట్రం లో పీడీపీ భాజపా పొత్తు విడిపోవడంతో తప్పనిసరి పరిస్థితి లో ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తి రాజీనామా చేసారు. అంతకు ముందు భాజపా తన మంత్రులను ఉపసంహరించుకుంది. అయితే.. గత నెలంతా ...
READ MORE
మన రియల్ హీరో కు మరో గ్రేట్ అవార్డ్
ప్రముఖ సినీ నటుడు సోనూసూద్ ప్రస్తుతం దేశంలోనే సూపర్ క్రేజ్ రియల్ హీరో గా మారిపోయాడు. కరోనా లాక్ డౌన్ లో నష్టపోయిన ఎందరినో ఆయన స్వయంగా ఆదుకున్నాడు. ఇప్పటికే ఎందరో పేదలకు, పేద విద్యార్థులకు ఇలా వందలాది మందికి తన ...
READ MORE
మేఘాలలో రైలు ప్రయాణం… మంచుకొండలపై భారత రైల్వే సరికొత్త సవారి.
భారత రైల్వే సరికొత్త ఆవిష్కరణకు తెరలేపింది. మరో మైలు రాయిని దాటేందుకు సిద్దమైంది. ప్రపంచపు అత్యంత ఎత్తైన రైల్వే లైన్ నిర్మించడానికి ఇండియన్ రైల్వే రెడీ అంటోంది. ప్రస్తుతం ఈ రికార్డ్ చైనా రైల్వే ఖాతాలో ఉంది. బిలాస్‌పూర్-లేహ్-మనాలి మీదుగా హిమాలయాల్లో ...
READ MORE
భారత ఆర్మీ పై నోరుపారేసుకున్న రాహుల్ గాంధీ.!!
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి పప్పులో కాలేసాడు. మోడీ ని నెటిజన్ల చేత తిట్టిద్దాం అనుకుని, తానే వివాదంలో చిక్కుకుని అందరి చేతా చీవాట్లు తింటున్నాడు. నిన్నటి అంతర్జాతీయ యోగా దినోత్సవం సంధర్భంగ యావత్ దేశం యోగా ...
READ MORE
ఫేస్ బుక్ వాడితే వైఫై ఫ్రీ…
సోషల్‌ మీడియాను ఎక్కువగా వాడుతూ.. డేటా పెద్ద మొత్తంలో ఖర్చు అయిపోతుందంటూ బాధపడే వారందరికీ ఇక ఫేస్‌బుక్‌ లో ఓ అద్భుత ఫీచర్‌ అందుబాటులోకి రానుంది. అదే ''ఫైన్డ్ వైఫై'' ఫీచర్‌. ఈ ఫీచర్‌ ద్వారా చుట్టుపక్కల ఉచిత వైఫై సదుపాయం ...
READ MORE
టార్గెట్ రాజాసింగ్.. ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్న ప్రత్యర్ధులు.
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్.. జస్ట్ ఎమ్మెల్యే మాత్రమే అని ఫిక్స్ అయినట్టుగా కనిపించడం లేదు ప్రత్యర్థులు. భాగ్యనగరంలో రాజాసింగ్ అడుగు తీసి తప్పటడుగు వేయడమే ఆలస్యం నెక్ట్స్ మినెట్ లో కేసు బుక్ చేసేందుకు ప్రత్యర్థులు సిద్దమవుతున్నారు. తమకు అనుకూలమైన సమయం ...
READ MORE
సుప్రీంకోర్టు ఎవరికోసమైతే తీర్పు చెప్పిందో.. వారే తీర్పును వ్యతిరేకిస్తున్నారు.!!
తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన శబరిమల ఆలయంలోకి ఏ వయసు మహిళ అయినా ప్రవేశించొచ్చనే తీర్పు దేేసవ్యాప్తంగ తీవ్ర దుమారం రేపుతోంది. ఈ తీర్పుతో మహిళ కు సమాన హక్కు లభించిందని వ్యాఖ్యానించింది సుప్రీంకోర్టు. అయితే.. శతాబ్దాల కాలం నుండే ఆలయంలో నియమ ...
READ MORE
ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలు చూసుకోవాలి, వైన్స్ ఓపెన్ చేయడం తప్పు.
కరోనా వైరస్ కేసుల విషయంలో తమిళనాడు ఇబ్బందుల్లో నే ఉంది, రోజు రోజుకు అక్కడ కరోనా మహమ్మారి కేసులు పెరుగుతున్నాయి. కాగా లాక్ డౌన్ సడలింపు పేరుతో మద్యం దుకాణాలు తెరవడం పై సూపర్ స్టార్ రజనీకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ...
READ MORE
వలసవాద రోహింగ్యాలతో జాగ్రత్త.. మోడీని అప్రమత్తం చేస్తున్న జాతీయవాదులు.!!
ఇప్పుడు దేశమంతా చర్చనడుస్తున్న రోహింగ్యా ముస్లిం తెగలగురించి భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఉత్తరాలు వెల్లువెత్తుతున్నై.. దేశ భద్రత పై ఎట్టి పరిస్తతుల్లోనూ తగ్గేదిలేదని ఆ నరరూప రాక్షస తెగలపై ఏ చిన్న సానుభూతి చూపిన మన దేశం భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన ...
READ MORE
చైనా ఓవరాక్షన్ కు కౌంటర్ ఇచ్చిన భారత్.!!
మరోసారి చైనా భారత్ విషయంలో తలదూర్చింది. హిమాచల్ ప్రదేశ్ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడి పలు అభివృద్ధి కార్యక్రమాల దృష్ట్యా పర్యటించగా అభ్యంతరం వ్యక్తం చేసింది డ్రాగన్ కంట్రీ చైనా.. హిమాచల్ ప్రదేశ్ సరిహద్దు వివాదస్పద ప్రాంతంగ పేర్కొనడం జరిగింది. ...
READ MORE
సంచ‌ల‌న కామెంట్స్ చేసిన ఎమ్మెల్యే రోజా
మ‌హిళ సాధికారిత స‌భ‌కు ఆహ్వ‌నించి అవ‌మానించార‌ని  వై.ఎస్.ఆర్.సిపి ఎమ్మేల్యే రోజా ఆగ్ర‌హం వ్యక్తం చేసింది. పోలీసుల‌తో అమానుషంగా అరెస్ట్ చేయించార‌ని ఇదేనా మ‌హిళ సాధికారిత అంటూ మండిప‌డింది. త‌న‌పై జ‌రిగిన కుట్ర‌ను త‌న‌ను పోలీస్ లు ఎందుకు అరెస్ట్ చేశారో తెలుపుతో ...
READ MORE
2019 లో కాంగ్రెస్ పార్టీ తో టీడీపీ పొత్తు ఖరారైనట్టేనా.??
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరని అందరికీ తెలిసిందే.. కానీ రాజకీయ నాయకులు తలుచుకుంటే జనాల మైండ్ సెట్ ను కూడా మార్చగలరేమో అని సందేహం కలుగకమానదు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ టీడీపీ అనుబంధం చూస్తుంటే..!! రాష్ట్రాన్ని విభజించి సమైక్యాంద్ర ...
READ MORE
ఆ నిర్ణయం పై వెనక్కు తగ్గని రాహుల్ గాంధీ..!!
పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కి మరోసారి చేదు అనుభవం ఎదురవగా, అప్పటిదాక నేనే కాబోయే ప్రధాన మంత్రి అనుకున్న కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఓటమి భారంతో పార్టీ అధ్యక్ష బాధ్యతల నుండి ...
READ MORE
ప్రణభ్ నిర్ణయంతో మింగలేక కక్కలేక అనే పరిస్థితి లో కాంగ్రెస్ పార్టీ.!!
కాంగ్రెస్ పార్టీ లో ఆయనంటే వేదం.. ఆయన మాటే శాసనం. చాల మంది నేతలకు నెహ్రూ కుటుంబానికి భజనపరులనే పేరున్నా ప్రణభ్ ముఖర్జీ మాత్రం తనకంటూ ఒక విలువైన చరిత్రని రాసుకున్నారు. దాదాపు 50 ఏండ్ల అనుబంధం కాంగ్రెస్ పార్టీ తో ...
READ MORE
వాట్సప్ లో మరో కొత్త ఫీచర్.. ఫేవరెట్ చాట్.
ప్రపంచ వ్యాప్తంగా 1.2 బిలియన్ యూజర్స్ ను కలిగి ఉన్న టాప్  పాపులర్ యాప్ వాట్సాప్. సోషల్ మీడియా ప్రియులకు నచ్చేలా మార్పులు చేస్తూ దూసుకుపోతోంది. ప్రపంచ వ్యాప్తంగా రూపాయి ఖర్చు లేకుండా చాట్ చేసుకునే అవకాశం కల్పించిన ఈ యాప్ ...
READ MORE
నవమోసాలు.. అమ్మతనాన్ని కొనేసుకుంటున్న నీచులు.
అమ్మా.. ఈ పలుకు కొందరికి బంగారంగా మారుతుంది. తన కడుపులో నవమాసాలు మోసి కని పెద్ద చేయలన్నా ఆశ అడియాసగానే మారుతుంది. అలాంటి తల్లుల కోసం త్యాగం చేసే మరి కొందరు తల్లుల ఆరాటమే సరోగసి. కానీ ఈ ప్రయోగం ఇప్పుడు ...
READ MORE
బ్రేకింగ్: “లక్ష్మిస్ ఎన్టిఆర్” విడుదల వాయిదా..!!
సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా దర్శకత్వం వహించిన "లక్ష్మిస్ ఎన్టిఆర్" చిత్రం విడుదల ఆపాలని సినిమా థియేటర్లనే కాదు సోషల్ మీడియా ఫేస్ బుక్ లో యూ ట్యూబ్ లో ట్విట్టర్ లో ఎలాంటి ఫ్లాట్ ఫాం మీదా విడుదల ...
READ MORE
ఆ ఇద్దరినే రాజ్యసభ కు పంపనున్న గులాబీ బాస్.!!
ఈ నెల 26 న జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో తెలంగాణ లో రెండు స్థానాలకు ఎన్నికల జరగనుండగా.. ఎమ్మెల్యే ల సంఖ్యా పరంగా ఆ రెండు స్థానాలు కూడా అధికార టీఆర్ఎస్ కే దక్కనున్నాయి.ఈ క్రమంలో ఇప్పటికే రాజ్య సభకు ప్రాతినిధ్యం ...
READ MORE
బిగ్‌బాస్.. తెలుగుకు తెగులు పట్టిస్తున్న కిచిడీ షో.
బిగ్ బాస్.. అన్ని భాషల్లో హల్ చల్ చేసి కొన్ని భాషల్లో జనం చేత చివాట్లు పెట్టించుకుని రియాల్టీ పేరుతో నడుస్తున్న డమ్మీ రియాల్టీ షో. అసలు ఈ బాస్ రచ్చ గురించి రాయకూడదని నిర్ణయించుకున్నాం కానీ రాయక తప్పడం లేదు. ...
READ MORE
జగమంత కుటుంబం నాది.. మానవత్వ జీవితమే నాది..
ఖాకీ చొక్కా  గొప్ప తనం గురించి చాలానే కథనాలు రాశాం.. మంచిని చెప్పాం.. చెడును చీల్చి చెండడాం.. కానీ ఈ గొప్ప వ్యక్తి గురించి చెప్పాలంటే మాత్రం పదాలు చాలడం లేదు. ఎంత గొప్పగా చెపుదామని ప్రారంభించినా ఇంకా ఏదో వెలితి ...
READ MORE
భాజపా నేషనల్ మీడియా కోఆర్డినేటర్ తో భేటీ అయిన డా.గిరిధరాచార్యులు.!!
మైనర్ బాలికతో బలవంతంగ వ్యభిచారం చేయిస్తున్న మహిళలు అరెస్టు.!
ఆదార్ దెబ్బ‌కు ఆ ఊళ్లో అంద‌రు ఒకే రోజు పుట్టారు.
ఆర్టీసీ బస్సు దొరికింది.. కానీ ఏం లాభం టైర్లు మాత్రమే
పిల్లల ఏడుపు వినిపిస్తే తలుపులు తీయొద్దు.. హెచ్చరిస్తున్న పోలీస్ శాఖ…
జమ్ము కాశ్మీర్ లో గవర్నర్ పాలన.! ఏం జరగనుందోననే భయంలో
మన రియల్ హీరో కు మరో గ్రేట్ అవార్డ్
మేఘాలలో రైలు ప్రయాణం… మంచుకొండలపై భారత రైల్వే సరికొత్త సవారి.
భారత ఆర్మీ పై నోరుపారేసుకున్న రాహుల్ గాంధీ.!!
ఫేస్ బుక్ వాడితే వైఫై ఫ్రీ…
టార్గెట్ రాజాసింగ్.. ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్న ప్రత్యర్ధులు.
సుప్రీంకోర్టు ఎవరికోసమైతే తీర్పు చెప్పిందో.. వారే తీర్పును వ్యతిరేకిస్తున్నారు.!!
ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలు చూసుకోవాలి, వైన్స్ ఓపెన్ చేయడం తప్పు.
వలసవాద రోహింగ్యాలతో జాగ్రత్త.. మోడీని అప్రమత్తం చేస్తున్న జాతీయవాదులు.!!
చైనా ఓవరాక్షన్ కు కౌంటర్ ఇచ్చిన భారత్.!!
సంచ‌ల‌న కామెంట్స్ చేసిన ఎమ్మెల్యే రోజా
2019 లో కాంగ్రెస్ పార్టీ తో టీడీపీ పొత్తు ఖరారైనట్టేనా.??
ఆ నిర్ణయం పై వెనక్కు తగ్గని రాహుల్ గాంధీ..!!
ప్రణభ్ నిర్ణయంతో మింగలేక కక్కలేక అనే పరిస్థితి లో కాంగ్రెస్
వాట్సప్ లో మరో కొత్త ఫీచర్.. ఫేవరెట్ చాట్.
నవమోసాలు.. అమ్మతనాన్ని కొనేసుకుంటున్న నీచులు.
బ్రేకింగ్: “లక్ష్మిస్ ఎన్టిఆర్” విడుదల వాయిదా..!!
ఆ ఇద్దరినే రాజ్యసభ కు పంపనున్న గులాబీ బాస్.!!
బిగ్‌బాస్.. తెలుగుకు తెగులు పట్టిస్తున్న కిచిడీ షో.
జగమంత కుటుంబం నాది.. మానవత్వ జీవితమే నాది..
Facebook Comments
Top
error: Content is protected !!