
మదర్సా ఈ పేరు వినగానే మతం మాత్రమే గుర్తుకు రావడంలో తప్పులేదు. అక్కడి బోధన అలా ఉంటుందని అనుకోవడం లో కూడా తప్పు లేదు. కానీ నిజానికి మదర్సా అంటే అది కాదని చెపుతున్నాయి నిజమైన మదరసాలు. అసలు మదరసా అంటే ఏంటి.. అక్కడ కేవలం ఒకే భాషకు సంబందించిన భోదన మాత్రం ఎందుకు చెపుతారు. మరీ నిజమైన మదరసాలు ఏం చెపుతున్నాయి. ఆ నిజమైన మదరసాలు ఎక్కడ ఉన్నాయి. భిన్నత్వంలో ఏకత్వం కాదు.. ఏకత్వంలో భిన్నత్వం అని చాటుతున్న ఆ పాఠశాలల్లోకి ఒక్క సారి వెళ్లొద్దామా…
మదరసా అంటే ముస్లిం పిల్లలకు విద్యాబుధ్దులు నేర్పే పాఠశాల. మదరసా అనేది అరబిక్ పదం… అంటే పాఠశాల అని అర్థం. మదరసాలలో ఇస్లాం మతసారాన్నిమాత్రమే బోధిస్తారు. ఇక్కడంతా ఆధునిక విద్యకు చాలాదూరం.. ఇది చాలా మంది అభిప్రాయం. కానీ అదే మదరసాల నుండి ఓం భూర్భువస్సువః అనే మాటలు ద్వనిస్తే… గాయత్రి మంత్రం ప్రశాంతంగా వినిపిస్తే.. మీరు వింటున్నది నిజమే మదరసాల్లో గాయత్రిమంత్రం వినిపిస్తుంది. హింధుధర్మం అరబిక్ భాషలో నలువైపుల ప్రసరిస్తుంది. మధ్యప్రదేశ్లోని మందసోర్ జిల్లాలో ఉన్న మదరసా గురుకుల్ విద్యాపీఠ్, మదరసా జైన్ వర్ధమాన్లో అడుగుపెడితే మదరసాలపై ఉన్న దురభిప్రాయం మటుమాయమవడం ఖాయం.
మదరసా అంటే ముస్లిం మతానికి మాత్రమే కట్టుబడిన పాఠశాల అని మీరు తప్పుగా అనుకోవడం ఇక ఉండదు. అక్కడి మదరసాల్లో ఒకే మాట ధ్వనిస్తుంది మతమౌడ్యం చూద్దామన్న కానరాదు. హిందూముస్లిం అనే తేడాలు అక్కడ కనిపించవు. అక్కడంతా భాయి భాయి.. మతం అంటే మానవత్వం అని చాటి చెప్పే ప్రదేశాలే మధ్యప్రదేశ్ లోని మదరసాలు. మతసామరస్యం గురించి ఉపన్యాసాలు ఇవ్వడమే తప్ప దానికోసం కృషి చేసేవాళ్ల సంఖ్య తక్కువ. పైగా రాజకీయ ప్రయోజనాలకోసం మత విద్వేషాల్ని పెంచేవాళ్లే ఎక్కువ. అందుకే మతసామరస్యమన్నది ఎప్పటికీ ఓ అసంపూర్ణ కలగానే మిగిలిపోతుందేమో అనిపిస్తుంటుంది. కానీ మధ్యప్రదేశ్లోని మందసోర్ జిల్లాలోని మదరసాలను సందర్శించినప్పుడు అది నిజమయ్యే తీరుతుందనిపిస్తుంది. అంతేకాదు, చాలామందిలో మదరసాలమీద ఉన్న దురభిప్రాయమూ తొలగిపోతుంది.
నిదా మహిళా మండల్ అనే స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నడుస్తోన్న ఈ మదరసాలు బడుగు, బలహీన వర్గాలకోసం జిల్లావ్యాప్తంగా సుమారు 128 ఉన్నాయి. 78 పాఠశాలల్లో ఆధునిక విద్యతోబాటు హిందువులు సోలా సంస్కార్, గీతా సాగర్, గాయత్రీ మంత్రాలను నిత్యం వల్లె వేస్తూ హింధుసంప్రదాయాలను నిత్యం పాటిస్తూ ఉంటారు. ఇక్కడ పద్దతుల ప్రకారం తృతీయ భాషగా ఉర్దూ తీసుకున్నవాళ్లు దీనియాత్నూ సంస్కృతాన్ని తీసుకున్నవాళ్లు హిందూ సనాతనధర్మాన్నీ చదువుతారు. ఇస్లాంకు చెందినవాళ్లు తమ ఖురాన్ ఎంత ఇష్టంగా చదువుతారో అంతే ఇష్టంగా గాయత్రీ మంత్రాన్ని కూడా చదువుతారు. అదేమంటే ఆ మంత్రం చదవడానికి వీనులవిందుగా ఉంటుంది అంటున్నారు అక్కడి ముస్లిం విద్యార్థులు.
ఎవరి మతాన్ని వాళ్లు అభ్యసిస్తూనే ఖాళీ సమయంలో ఇరు మతాలకు చెందిన పిల్లలూ ఒకరి నుంచి మరొకరు ఆయా మత ధర్మాలను నేర్చుకుంటూ కనిపిస్తారక్కడ. హింధును ముస్లిం.. ముస్లింను హింధు అక్కడ తమ తమ కుటుంబ సభ్యులుగానే చూస్తారు. ఇదే భారతదేశ మంతటా ఉంటే ఎంత బాగుండో. కానీ మసీదులనుండి మదరసాలు వేరు పడాలి కదా. అప్పుడే దేశ వ్యాప్తంగా మదరసా విద్య అంటే మత విద్యకాదు అని చెప్పగలిగేది. ఇక్కడ కూడా అదే ఇబ్బంది.. మసీదుల నుంచి మదరసాలను వేరుగా తీసుకురావాలని కూడా ప్రయత్నిస్తున్నాం. అయితే అది అనుకున్నంత సులభం మాత్రం కాదు. కానీ మా ప్రయత్నం మేం చేస్తున్నాం అంటున్నారు ఇక్కడి సిబ్బంది. ఇది భారతదేశ గొప్పతనం అంటే.. భిన్నత్వంలో ఏకత్వం కాదు.. ఏకత్వంలో భిన్నత్వం కావాలి అప్పుడే మన దేశం భావిభారత భాగ్యోదయ దేశం అవుతుంది.