You are here
Home > తాజా వార్త‌లు > గాంధీ నోటుంటేనే ఈ గాంధీలోకి ఎంట్రీ. పేదల పాలిట శాపంగా మారుతున్న పెద్ద ఆస్పత్రి.

గాంధీ నోటుంటేనే ఈ గాంధీలోకి ఎంట్రీ. పేదల పాలిట శాపంగా మారుతున్న పెద్ద ఆస్పత్రి.

గాంధీ నీ తలరాత మారదా. ఏళ్లు గడుస్తున్న పేదలకు పెద్ద దిక్కువని తలస్తున్న నువ్వు మాత్రం మారడం లేదు. మారడం కాదు మరణ శయ్యవై పేదాల ప్రాణాలు గాల్లో కలుపుతున్నావ్. ఆపదలో ఆదుకుంటావని నీ దగ్గరకి వస్తున్న అతి సామాన్య బీద బిక్కిన హక్కున చేర్చుకుంటావని వస్తే ఆటోలో ప్రసావాలు జరిగేలా అద్బుతంగా పని చేస్తున్నావ్. తల్లులను నడి రోడ్డు పాలు చేసేలా విధులు నిర్వహిస్తున్నావ్ శభాష్  గాంధీ.

పేరుకు సర్కారు దవాఖానవి ..పేదల పాలిట వరానివి కానీ పైసల్ లేనిదే పురుడు పొయ్యవు.. నీకాడ అంతా ఫైస వసూలే. నీ గేటులో అడుగుపెట్టిన వారికి తెలుస్తుంది ఆ పరిస్ధితేందో. ఇక సామాన్యుడికి వచ్చిన రోగం తగ్గాలంటే…లంచం అనే రోగంతో పీడించుకు తినే వారి చేతులు తడిపితే గాని..నీక పెద్ద డాక్టర్ దర్శనం లభించదు. ఒకవేళ నీదగ్గర పైసలు లేకపోతే  ప్రాణాలు పోయినా పట్టించుకోరు ఇది సికింద్రబాద్ లోని గాంధీ ఆసుప్రతిలో పరిస్ధితి.

పురిటి నొప్పులతో భాదపడుతున్న ఓ తల్లి గాంధీ ఆసుపత్రి సిబ్బంది పుణ్యాన ఆటోలో ప్రసవించింది. నొప్పులెక్కువైన అట్టగూడకు చెందిన ఉషా అనే మహిళను హుటాహుటిన గాంధీ ఆసుపత్రికి తీసుకొచ్చారు. అయ్యా ఆడబిడ్డ పురిటినొప్పులతో బాధపడుతుందయ్యా అని సిబ్బందికి చెబితే.. స్ట్రెచర్ దీస్కరానికి పైసలైతయ్ అని ఒకలు, ఆమెను దవాఖాన్ల చేర్పిచ్చుకోనికి కొన్ని రూల్స్ ఉన్నయ్ అని ఇంకోలు.. ఇట్ల అడుగడుగునా… పైసల దాహం, నిర్లక్షం…ఇగేముంది.. పాపం ఆ తల్లి  ఆ ఆటోలోనే బిడ్డకు జన్మనిచ్చింది. ఒక్కలంటే ఒక్కలు గూడ  దవాఖాన సిబ్బంది సాయం జెయ్యనీకి రాలేదంటే గాంధీగాని పరిస్థితి ఎంత అధ్వాన్నంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఫైసల దాహం గాంధీ దవఖానాలో కనిపిస్తోంది. గాంధీ నోటు కనిపిస్తేనే ఈ గాంధీ లో వైద్యం జరిగేది. అయినా వైద్యం ఏం చేస్తాం తియ్ దేవుడి మీద భారం ఏసి.. కనమని చెప్పినట్టుంది. ఛీ ఇంకా ఎప్పుడు మారేది.. ఇంకా ఎప్పుడు గాంధీకి తెలివచ్చేది.  సర్కారు దవాఖాననే నమ్ముకున్న బీదబిక్కోల్ల పరిస్ధితి ఏమైతదో. ఇంకా ఎన్ని తిప్పలు పడాల్సి వస్తదో.

Facebook Comments
READ  డిగ్రీ చదివిన ముస్లిం అమ్మాయిలకు ప్రధాని మోడీ వరం. "షాదీ షగున్' పేరిట రూ. 51వేలు పెళ్లికానుక
Top
Please wait...

Subscribe to our latest news

Want to be notified when our article is published? Enter your email address and name below to be the first to know.
error: Content is protected !!