
మన మీడియాకు ఆస్కార్ అవార్డ్ అనగానే తెర చాటు అందాలు మాత్రం గుర్తు కు రావడం కామన్. ఆ రెడ్ కార్పెట్ పై అడుగులు వేస్తు అందాలు ఆరబోసే ముద్దుగుమ్మల ఫోటోలు కథనాలు తప్ప మరొకటి గుర్తుకు రావు. ఇక ప్రియాంక లాంటి బాలీవుడ్ ముద్దు గుమ్మ ఆస్కార్ రెడ్ కార్పెట్ పై అడుగు పెట్టడమే ఆలస్యం బ్యానర్ ఐటమ్ లతో అదరగొట్టేస్తుంది. కానీ అదే కార్పెట్ పై ఓ ముంబాయి ఎనిమిదేళ్ల కుర్రాడు దర్జాగా కాలు మోపాడని.. ఓ సాదరణ ప్రభుత్వ స్వీపర్ కొడుకు ఆస్కార్ వేదికపై గర్వంగా తలెత్తుకు నిలుచున్నాడని ఎందరికి తెలుసు. ఇలా ప్రశ్నిస్తే అసలు ఆ కుర్రాడు ఎవరు అని తిరిగి ప్రశ్నే జవాబుగా వస్తుందనడంలో ఆశ్చర్యం లేదు. ఇక ఆ కుర్రాడు ఎవరు.. ముంబాయి మురికి వాడల నుండి అత్యుత్తమ అవార్డ్ వేదికపైకి ఎలా చేరుకోగలిగాడో ఒక్క సారి తెలుసుకుందా.
సన్నీ పవర్.. ఓ సాదరణ ప్రభుత్వ స్వీపర్ ఉద్యోగి కొడుకు. మురికి వాడల్లో తన జీవితాన్ని గడుపుతున్న అందరిలాంటి సాదరణ పిల్లాడే. కానీ వెండితెరపై వెలిగిపోవాలి.. తనలో ఉన్న సత్తాను ఈ ప్రపంచానికి చాటలన్న ధృడసంకల్పంతో వెండితెరకు పరిచయం అయిన కుర్రాడు. అతి కూడా మన వల్ల సంకల్పంతో కాదు హాలీవుడ్ కరుణతో. ఒక సాదరణ కుర్రాడిని తీసుకుని తమ చిత్రంలో అవకాశం ఇచ్చి తన అద్బుత నటనకు మురిసిపోయింది హాలీవుడ్. ముంబాయి మురికి వాడల్లో ఉండే కుర్రాడి జీవితం ఒక్క సారిగా మారిపోయింది.
2016 లో విడుదలైన లయన్ చిత్రంలో నటించిన సన్నీ పవర్ నటనకు హాలీవుడ్ ఆనందం అంతా ఇంత కాదు. బెస్ట్ యాక్టర్ గా బాప్ట అవార్డును సొంతం చేసుకున్న ఈ చిత్రం ఆస్కార్ అవార్డ్ వేదికపై నిలిచింది. ఇక ఈ సన్నీ పవర్ ఎంపిక కూడా ఆశమాసిగా జరగలేదు. 2000 మంది పిల్లల్లో సన్నీ పవర్ ను ది బెస్ట్ ఛైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంపిక చేసి రెడ్ కార్పెట్ పరిచింది ఆస్కార్. కేవలం హింది మాత్రమే మాట్లాడగలిగే ఈ కుర్రాడికి దగ్గరుండి ఇంగ్లీష్ ను నేర్పించి ఆస్కార్ వేదికపై బుజ్జి బుజ్జి ఇంగ్లీష్ తో అద్దరగొట్టే స్థాయికి తీసుకెళ్లింది హాలీవుడ్. దీనికంతటికి కారణం లయన్ చిత్ర యూనిట్. కానీ మన భారత మీడియా మాత్రం ఈ కుర్రాడి వంక కన్నెత్తి కూడా చూడలేదు. అంత గొప్ప వేదికపై మన ముంబాయి కుర్రాడి అదరగొడుతుంటే.. హాలీవుడ్ నటులు హక్కున చేర్చుకుని ముద్దాడుతుంటే మన మీడియా మాత్రం బాలీవుడ్, హాలీవుడ్ బామల అందాలను చూపించే పనిలో బిజిగా ఉండిపోయింది. ఇది మనకు హాలీవుడ్ కు ఉన్న తేడా. అక్కడ నటనకు పట్టం కడితే.. ఇక్కడ మనం అందాలకు పట్టం కడుతున్న.
టాలెంట్ ను తొక్కి పెట్టి కలర్ ప్రపంచంలో తేలిపోతున్నాం. మురికి వాడల్లో ఉండే టాలెంట్ ఎవడో దేశం కానీ దేశం వాడు వచ్చి గుర్తించేంత వరకు మనకు పట్టడం లేదంట మన భవిష్యత్ ఏంటో అర్థం చేసుకోవాలి. ఏది ఏమైన ఆస్కార్ వేదికపై నవ్వుల పువ్వుల పూయించిన సన్నీ పవర్ కు మా శుభాకంక్షలు.