You are here
Home > తాజా వార్త‌లు > పండుగల మాసానికి స్వాగతం.. శాకాహారం జిందాబాద్.

పండుగల మాసానికి స్వాగతం.. శాకాహారం జిందాబాద్.

శ్రావణ మాసం తెలుగు పంచాంగంలో పండుగలకు పుట్టినిళ్లు. ఈ మాసంలో మహిళా మణులు అత్యంత భక్తితో చేసే పండుగలే ఎక్కువ. మంగళగౌరి వ్రతం, నాగుల పంచమి, భానుసప్తమి, పుత్రా ఏకాదశి, దామోదర ద్వాదశి, వరలక్ష్మి వ్రతం, శ్రీకృష్ణాష్టమి ఇలా ఆడపడుచులు జరుపుకునే పండగల దర్శనమిస్తాయి. అన్న చెల్లెల్ల అనుబంధానికి ప్రతీకైన రాఖీ పౌర్ణమి వచ్చేది కూడా శ్రావణ మాసంలోనే. ఈ మాసం విష్ఞు మహేశ్వరులకు అత్యంత ప్రీతికరమైన మాసం. ఇక ఈ నెలలో కేవలం శాకాహరం బోజనం మాత్రమే తీసుకోవడం ఆనవాయితి. మద్యమాంసాలకు దూరంగా ఉంటూ.. ఎంతో పవిత్రతతో భక్తి శ్రద్దలతో ఈ శ్రావణ మాసాన్ని జరుపుకుంటారు.

మహాలక్ష్మికి ప్రాణనాథుడైన శ్రీమహావిష్ణువు జన్మ నక్షత్రమైన శ్రావణ నక్షత్రం పేరు మీదుగా ఏర్పడిందే శ్రావణ మాసం. ఈ మాసంలో వచ్చే ప్రతి శనివారం మహావిష్ణువును భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తారు భక్తులు. శ్రావణ మాసం ఈ ఏడాది జూలై 24వ తేదీ నుంచి ఆగస్టు 21వరకు ఉంది. ఈ శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాల్లో మంగళగౌరి , శుక్రవారాల్లో వరలక్ష్మి వ్రతాలను నిర్వహించి దేవీని పూజిస్తారు. అందుకే ఈ మాసాన్ని పండుగల మాసంగా పవిత్ర మాసంగా చెప్పుకొంటారు.

రైతులు పాడి పంటలు చల్లగ ఉండాలని.. పశుసంపద సమృద్దిగా సాగాలని పొలాల అమవాస్యను జరుపుకుంటారు. ఈ రోజున పశువులను భక్తిశ్రద్దలతో పూజిస్తారు. ఈ మాసంలో ఒక్కోక్క వారం ఒక్కొక్క ప్రత్యేకత సంతరించుకుంటుంది. ముఖ్యంగా సోమ, శుక్రవారాల్లో మహిళలు అత్యంత భక్తి శ్రద్ధ్దలతో పార్వతిదేవీని కొలుస్తారు.

శ్రావణ మాసంలో వచ్చే మొదటి సోమవారం శివుడికి అత్యంత ప్రీతికరమైనది. ఈ రోజున శివభక్తులు శ్రద్ధతో శివుడిని కొలుస్తారు. శ్రావణ మాసంలో వచ్చే ప్రతి సోమవారం ఉపవాస దీక్షలు చేపడుతారు భక్తులు. అభిషేకం, రుద్రహోమం, పార్వతీదేవికి కుంకుమార్చన చేస్తే పసుపు, కుంకుమలు కలకాలం నిలిచి ఉంటాయని మహిళల విశ్వాసం. ఇక ఈ నెలలో చేసే కార్యక్రమాలు పండుగలు..

మంగళగౌరి వ్రతం
నిండా నూరేళ్లు సౌభాగ్యవతిగా ఉండాలని, మంచి సంతానం కలగాలని కోరుతూ నూతన వధువులు ఈ మాసంలో ప్రతి మంగళవారం మంగళగౌరి వ్రతం నిర్వహిస్తారు. మొదటి మంగళవారం ( జులై 25 )న వస్తుంది.

నాగుల పంచమి..
సర్పదోషాలు తొలగిపోవడానికి శ్రావణ శుద్ధ పంచమి(జూలై 28) రోజున నాగుల పంచమిని జరుపుకుంటారు. పుట్టలో పాలు పోసి పూజలు చేస్తారు. భక్తి శ్రద్దలతో నాగ దేవతను పూజిస్తే పూర్వ జన్మ పాపాలు, నాగ దోషాలు పోతాయని నమ్మకం.

వరలక్ష్మీ వ్రతం..
ఆడపడుచులు నిండు నూరేళ్లు సౌభాగ్యంతో వర్థిల్లాలని కొరుతూ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం (ఆగస్టు 4) వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తారు. తమ పసుపు కుంకుమలు చల్లగా ఉండాలని కోరుకుంటారు.

రక్షాబంధన్..
సోదర, సోదరీమణుల బంధానికి ప్రతికంగా నిలిచే రక్షాబంధన్(ఆగస్టు 7) జరుపుకుంటారు. నువ్వు నాకు రక్ష నేను నీకు రక్ష.. మనమిద్దరం ఈ లోకానికి రక్షా అనే స్పూర్తిని రగిలిస్తూ.. నిండు నూరేళ్లు అండగా నిలుస్తానని బాస చేస్తారు సోదరులు.

కృష్ణాష్టమి..
శ్రావణ బహుళ అష్టమి రోజున(ఆగస్టు 14)న శ్రీకృష్ణుడి జన్మించాడని ఈ రోజును అత్యంత అట్టహసంగా దేశ వ్యాప్తంగా పండుగ గా జరుపుకుంటారు. ఉట్టి కొట్టే పండుగగా శ్రీ కృష్ణుడి లీలల పండుగా కృష్ణాష్టమిని జరుపుకుంటారు. చిన్న పిల్లలను ఈ రోజు కృష్ణుడిగా గోపికలుగా అలకరించి మురిసిపోతారు తల్లులు.

ఈ పండుగలన్ని ముగిసాక శ్రావణ మాసం అయిపోగానే వినాయకుడు భువికి దిగి వస్తాడని నమ్మకం. అందుకే వినాయక చవితిని 11 రోజులు దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. 

Related Posts
శబ్దానికి నిశబ్దానికి మధ్య “ఓంకారం”.
శబ్దానికి ఆధారం ఓంకారమే.. నిశ్శబ్దాన్ని ఛేదించి శబ్దాన్ని పుట్టించేది ఓంకారం.  చాలా మంది నిశ్శబ్దాన్ని కోరుకుంటారు. అలాగే ఎందరో శ్రవణానందం కలిగించే శబ్దాన్ని సంగీతంగా ఇష్టపడతారు. పంచభూతాల్లో శబ్దం ముందు నుంచి ఉంది. ఆ శబ్దమే ఆకాశం నుంచి పుట్టి ఓంకారమై శరీరంలో అణువణువును ...
READ MORE
ఉత్తమ్ కుమార్ గారు ఐ యామ్ నో “పప్పు”.!!
ట్విట్టర్ వేదికగా తెలంగాణ మంత్రి కేటిఆర్ తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కి ఆసక్తికర వ్యాఖ్యలతో కౌంటర్ ఇచ్చాడు. ఈ మధ్యనే స్విట్జర్లాండ్ దావోస్ లో జరిగిన ప్రపంచ ఆర్ధిక సదస్సుకు మంత్రి కేటిఆర్ హాజరయ్యారు. కాగా ఆ సదస్సుకు ...
READ MORE
హైదరబాదీలకు నడిరోడ్టుపై షాకిచ్చిన సచిన్..
హైదరబాదీ నగర వాహన దారులకు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ షాకిచ్చారు. అనుకోని అతిథిలా కనిపించి అందరిని ఆశ్చర్యచకితులను చేశాడు. హైదరబాద్ లోని ఓ ప్రాంతంలో సిగ్నల్ పడింది. వాహనాలు ఆగిపోయాయి.. అదే సమయంలో ఓ ఖరీదైనా కారు నుంచి ఓ ...
READ MORE
ఇక ఇప్పుడు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ను స్వాధీనం చేసుకోవడమే – సుబ్రహ్మణ్య స్వామి
ప్రముఖ న్యాయవాది రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి తాజాగా జరిగిన ఆర్టికల్ 370, 35ఏ రద్దు పై స్పందించారు. నరేంద్ర మోడి అమిత్ షా లు సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని ప్రశంసించారు. ఇక ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న వారికి లక్షలాది మంది ...
READ MORE
చేసుకున్న పాపానికి శిక్ష అనుభవిస్తున్న డ్రాగన్ కంట్రీ, చైనాలో తీవ్ర ఆహార కొరత.!!
ప్లాస్టిక్ ఉత్పత్తులు మొబైల్ ఫోన్ల ఉత్పత్తుల్లో గణనీయమైన ప్రగతి సాధించిన కమ్యునిస్టు దేశం చైనా.. ఆహారం విషయం లో మాత్రం దాదాపు నలభై శాతం వరకు ఇతర దేశాల మీదనే ఆధారపడింది. అయితే, మోసపూరిత బుద్ది వల్ల చైనా కు అందించే ఎగుమతులపై ...
READ MORE
మంత్రి మల్లారెడ్డి పై సంచలన ఆరోపణలు చేసిన నాయని నరసింహరెడ్డి.!!
అధికార టీఆర్ఎస్ పార్టీ లో మరోసారి అంతర్గత విభేదాలు రచ్చకెక్కాయి.కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి పై ఆ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.‘కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అవినీతిపరుడు. కార్మికుల పొట్టగొట్టిండు. ఇండస్ట్రీయలిస్టులకు ...
READ MORE
మహిళా నిరుద్యోగులకు శుభవార్త.. కస్తూర్బా పాఠశాలల్లో 1260 ఉద్యోగాలు.
తెలంగాణలోని నిరుద్యోగులకు శుభవార్త. కేంద్ర ప్రభుత్వం ఇటీవల మంజూరు చేసిన 84 కొత్త కస్తూర్బాగాంధీ బాలిక విద్యాలయాల్లో నియామకాలకు సర్వశిక్షా అభియాన్‌ చర్యలు చేపట్టింది. ఒక్కో స్కూల్లో 15 మంది సిబ్బంది చొప్పున మొత్తం 1,260 పోస్టులను భర్తీ చేసేందుకు మార్గదర్శకాలు ...
READ MORE
కోదండరాం కొత్త పార్టీ లోకి TRS నుండి ఎంత మంది MLA లు చేరుతున్నారు.?
తీవ్రమైన తర్జన భర్జనల తర్వాత తెలంగాణ రాజకీయ జేఏసీ ఇపుడు పూర్తి రాజకీయ పార్టీ గ "తెలంగాణ జన సమితి" పేరుతో అవతరించింది. తొందర్లోనే జెండా అజెండా ప్రకటించనున్నారు. బయటకి ప్రస్తుతానికి ప్రొఫెసర్ కోదండరాం ఒక్కరే కనిపిస్తున్నప్పటికీ అంతర్గతంగ పలువురు కీలక ...
READ MORE
ఎంఐఎం MLA చర్య పై సంచలన కౌంటర్ ఇచ్చిన ప్రముఖ సినీ నటి.!!
లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారి ఆలయం అభివృద్ధి కోసం నిధులు కావాలని ముఖ్యమంత్రి కేసిఆర్ ను ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ కలిసిన విషయం తెలిసిందే.. అయితే ఈ విషయమై సోషల్ మీడియాలో స్పందించిన ప్రముఖ సినీ నటి బీజేపీ నేత ...
READ MORE
అమెరికా లోనూ ఊపందుకున్న ‘బ్యాన్ టిక్ టాక్’.. భారత్ నిర్ణయం డ్రాగన్ పై ప్రభావం.!!
భారత్-చైనా సరిహద్దు గాల్వన్ లోయ వద్ద భారత్ సైన్యం పై దొంగ దాడి తర్వాత, అప్రమత్తమైన భారత ప్రభుత్వం అన్ని విధాలుగా డ్రాగన్ కంట్రీ కి చెక్ పెడుతున్నది. ఓ వైపు సరిహద్దు వద్ద పటిష్ట భద్రత చర్యలు తీసుకుంటూనే మరోవైపు ...
READ MORE
యూరప్ దేశంలో ఒక దేశ ద్రోహిని ఉరితీసిన రోజే నేటి “వాలెంటైన్ డే”(లవర్స్ డే).!!
దాదాపు 1500 సంవత్సరాల క్రితం నాటి యూరప్ దేశంలో క్లోడియస్ 2 అనే రాజు పరిపాలన ఉండేది. అప్పటి పరిస్థితులకు అనుగుణంగ దేశ రక్షణ కోసం నియమించబడ్డ సైన్యంలో కొన్ని నియమనిబంధనలు ఉండేవి. అందులో ముఖ్యమైనది సైన్యంలో పని చేస్తున్న సైనికులు ...
READ MORE
టీఆర్ఎస్ కు షాక్.. సీనియర్ లీడర్ రాజీనామా.!!
అధికార టీఆర్ఎస్ పార్టీ లో గత పదిహేనేండ్ల నుండి క్రీయాశీలకంగ ఉంటూ నగరంలో టీఆర్ఎస్ పార్టీ ఎదిగేందుకు కృషి చేసిన మలక్ పేట్ నియోజకవర్గం టీఆర్ఎస్ ఇంఛార్జ్ సతీష్ కుమార్ ఆ పార్టీ కి రాజీనామా చేయడం జరిగింది. 2014 మరియు ...
READ MORE
ప్రపంచమంతా గూగుల్ ని వాడుతుంటే.. చైనా ఏం వాడుతుందో తెలుసా.??
ఒక పాలు అమ్మే వ్యక్తి పాలను కల్తీ చేస్తూ అక్రమంగా డబ్బు సంపాదిస్తున్నా.. తనకోసం తన పిల్లల కోసం మాత్రం ఆ పాలు కాకుండా వేరే పాలను కొని తాగుతాడు. ఎందుకంటే అవి తాగితే ఏం జరుగుతదో వాడికి తెలుసు కాబట్టి. ఇలాంటిదే ...
READ MORE
వినాయక నగర్ డివిజన్ లో బీజేపీ అనూహ్య విజయం, ఫలించిన భాను ప్రకాష్ వ్యూహం.!!
ఈరోజు ఉదయం మొదలైన గ్రేటర్ ఓట్ల ప్రక్రియలో క్షణ క్షణం అభ్యర్థుల మెజారిటీ లు మారుతుండడంతో ఉత్కంఠ పెరుగుతున్నది. కాగా మల్కాజిగిరి నియోజకవర్గం BJYM రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాష్ సొంత డివిజన్ అయినటువంటి వినాయక్ నగర్ లో బీజేపీ కి అవకాశం ...
READ MORE
డా. సౌమ్యకు యంగ్ ఉమెన్ ఇన్ సైన్స్ అవార్డ్-2019 అవార్డ్ ప్రదానం.!!
ఉస్మానియా యూనివర్శిటీ లో ఫోరేన్సిక్ సైన్స్ విభాగంలో పని చేస్తున్న డా. సౌమ్యకు 2019 సంవత్సరానికి గాను యంగ్ ఉమెన్ ఇన్ సైన్స్ అవార్డ్ ప్రదానం చేస్తున్నటు వీనస్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ నిర్వాహకులు తెలిపారు. ఈ సంధర్భంగ వీనస్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ...
READ MORE
రేపే మహా సంగ్రామం. దేశమంతా అలర్ట్.
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రాష్ట్రపతి ఎన్నికలు రానే వచ్చాయి. రేపే ( సోమవారం ) రాష్ట్రపతి ఎన్నిక సంగ్రామం మొదలవనుంది. ప్రతిష్ఠాత్మకమైన ఈ ఎన్నికకు సంబందించి అన్ని ఏర్పాట్లు చేశారు. ఎక్కడ ఏ చిన్న అవాంఛనీయ సంఘటన జరగకుండా భారీ భద్రతను ...
READ MORE
నీతులు చెప్పే నటులు పవన్ కళ్యాన్ ని చూసి సిగ్గుపడాలేమో..!!
దేశంలో రోజు రోజుకు పెరుగుతున్న కరోనా వైరస్ కేసుల నేపథ్యంలో ఈ వైరస్ ప్రబలకుండా మనమంతా ఇంట్లోనే ఉందామంటు కొందరు సినిమా నటులు స్పెషల్ గ వీడియోలు చేసి సోషల్ మీడియా లో వదులుతున్నారు.కానీ ఉత్త మాటలే కాదు చేతలు కూడా ...
READ MORE
డబుల్ బెడ్రూం ఇల్లు రావాలంటే దేవుడిని ప్రార్థిస్తూ ఉండండి – మంత్రి శ్రీనివాస్ గౌడ్
కేసిఆర్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి నుండి కూడా ప్రతిష్టాత్మకంగా చెప్తున్న పథకం డబుల్ బెడ్రూం ఇండ్లు. ఇక ప్రతీ ఎన్నికల్లో కూడా లక్ష డబుల్ బెడ్రూం అంటూ ప్రచారం చేస్తున్నది కేసిఆర్ సర్కార్. కాగా ఈ డబుల్ బెడ్రూం ఇండ్లు ...
READ MORE
ప్రజా హృదయనేతకు జన్మధిన శుభాకాంక్షలు.!!
బడుగు బలహీన సామాజిక వర్గం వంజరి కులంలో జన్మించి ఆ వర్గానికే వన్నె తెచ్చిన జనం మెచ్చిన నాయకుడిగ ఎదిగిన మాజీ కార్పోరేటర్,తెలంగాణ ఉద్యమకారుడు, సీనియర్ అడ్వకేట్, టీఆర్ఎస్ పార్టీ నాయకుడు కాలేరు వెంకటేష్ వంజరీకి ఆ సంఘం నాయకులు, పార్టీ ...
READ MORE
అర్థరాత్రి చిచ్చు రేపిన సోషల్ మీడియా మెసేజ్.. ఉట్నూర్ లో 144 సెక్షన్ అమలు.
అడవుల జిల్లా ఆదిలాబాద్ లో అర్థరాత్రి కలకలం రేగింది. జిల్లాలోని ఉట్నూర్ ఐటీడిఏ పరిదిలో ఓ వ్యక్తి చేసిన సోషల్ మీడియా మెసేజ్ తో జిల్లా అంతా ఒక్క సారిగా ఉలిక్కి పడింది. రాత్రికి రాత్రి పోలీస్ ఉన్నతాధికారులను ఉరుకులు పరుగులు ...
READ MORE
తెలంగాణ సర్కార్ జీఎస్టీకి అనుకూలమా..? వ్యతిరేకమా..?
తెలంగాణ ప్రభుత్వం జీఎస్టీ పై వ్యవహరిస్తున్న వైఖరి వింతగా ఉంది. ఓ పక్కా ముఖ్యమంత్రి కేసీఆర్ జీఎస్టీ సూపర్ అని కితాబిస్తుంటే రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి మాత్రం జీఎస్టీ వల్ల మన రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని వాదిస్తున్నారు. జీఎస్టీపై తెలంగాణ ప్రభుత్వం ...
READ MORE
మరో పరువు హత్య: ప్రేమ వివాహం చేసుకుందని.. మేనమామలే కాలయములై..
ప్రేమ వివాహం చేసుకుని, తమ పరువును మంటకలిపిందన్న అక్కసుతో యువతి బంధువులు నూతన దంపతులను హతమార్చారు. ఈ పరువు హత్య రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం వెంకటంపల్లిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... వెంకటంపల్లికి చెందిన హరీష్(23 ), రచన(21 ) ...
READ MORE
పెళ్లి అయిన మూడే మూడు నిమిషాల్లో విడాకులు తీసుకున్న భార్య.. సంచలనం.!!
వివాహం చేసుకోవడం.. అందులో కొన్ని జంటలు విడిపోవడం మనం తరచూ చూసే అంశం. కానీ విడాకులు తీసుకోవడం అంటే పెళ్లి జరిగి కొంత కాలం తర్వాత తీవ్రమైన మనస్పర్థలు రావడం వల్లనో ఇంకేదైన బలమైన కారణం ఉంటేనో జరుగుతుంది. కానీ కువైట్ ...
READ MORE
200 నోటుకు వేలాయే..!!!
దేశవ్యాప్తం గ పెద్దనోట్ల రద్దు నిర్ణయం తర్వాత లావాదేవీల కోసం నోట్ల కొరత తీవ్రమైన పక్షంలో డిజిటల్ ఆన్ లైన్ పేమెంట్ల అంశం తెరముందుకొచ్చినా.. ఇంకా నోట్ల కొరత తీరని కష్టం గానే మారింది. ఈ క్రమంలోనే రిజర్వ్ బ్యాంక్ కొత్తగా 200 ...
READ MORE
ఆగిపోనున్న జెమిన్ న్యూస్ వార్తల ఊపిరి.. ఆందోళనలో సిబ్బంది.?
సన్ నెట్ వర్క్ 1998 లో ప్రారంభించిన న్యూస్ విభాగం ఆ తరువాత కాలంలో 24 గంటల న్యూస్ చానల్ గా రూపు దిద్దుకోగా దాన్ని అక్టోబర్24 నుంచి మూసివేస్తున్నట్టు ఈ రోజు అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు పారిశ్రామిక వివాదాల ...
READ MORE
శబ్దానికి నిశబ్దానికి మధ్య “ఓంకారం”.
ఉత్తమ్ కుమార్ గారు ఐ యామ్ నో “పప్పు”.!!
హైదరబాదీలకు నడిరోడ్టుపై షాకిచ్చిన సచిన్..
ఇక ఇప్పుడు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ను స్వాధీనం చేసుకోవడమే
చేసుకున్న పాపానికి శిక్ష అనుభవిస్తున్న డ్రాగన్ కంట్రీ, చైనాలో తీవ్ర
మంత్రి మల్లారెడ్డి పై సంచలన ఆరోపణలు చేసిన నాయని నరసింహరెడ్డి.!!
మహిళా నిరుద్యోగులకు శుభవార్త.. కస్తూర్బా పాఠశాలల్లో 1260 ఉద్యోగాలు.
కోదండరాం కొత్త పార్టీ లోకి TRS నుండి ఎంత మంది
ఎంఐఎం MLA చర్య పై సంచలన కౌంటర్ ఇచ్చిన ప్రముఖ
అమెరికా లోనూ ఊపందుకున్న ‘బ్యాన్ టిక్ టాక్’.. భారత్ నిర్ణయం
యూరప్ దేశంలో ఒక దేశ ద్రోహిని ఉరితీసిన రోజే నేటి
టీఆర్ఎస్ కు షాక్.. సీనియర్ లీడర్ రాజీనామా.!!
ప్రపంచమంతా గూగుల్ ని వాడుతుంటే.. చైనా ఏం వాడుతుందో తెలుసా.??
వినాయక నగర్ డివిజన్ లో బీజేపీ అనూహ్య విజయం, ఫలించిన
డా. సౌమ్యకు యంగ్ ఉమెన్ ఇన్ సైన్స్ అవార్డ్-2019 అవార్డ్
రేపే మహా సంగ్రామం. దేశమంతా అలర్ట్.
నీతులు చెప్పే నటులు పవన్ కళ్యాన్ ని చూసి సిగ్గుపడాలేమో..!!
డబుల్ బెడ్రూం ఇల్లు రావాలంటే దేవుడిని ప్రార్థిస్తూ ఉండండి –
ప్రజా హృదయనేతకు జన్మధిన శుభాకాంక్షలు.!!
అర్థరాత్రి చిచ్చు రేపిన సోషల్ మీడియా మెసేజ్.. ఉట్నూర్ లో
తెలంగాణ సర్కార్ జీఎస్టీకి అనుకూలమా..? వ్యతిరేకమా..?
మరో పరువు హత్య: ప్రేమ వివాహం చేసుకుందని.. మేనమామలే కాలయములై..
పెళ్లి అయిన మూడే మూడు నిమిషాల్లో విడాకులు తీసుకున్న భార్య..
200 నోటుకు వేలాయే..!!!
ఆగిపోనున్న జెమిన్ న్యూస్ వార్తల ఊపిరి.. ఆందోళనలో సిబ్బంది.?
Facebook Comments
Top
error: Content is protected !!