You are here
Home > తాజా వార్త‌లు > పేద ప్రజలను కాలుష్యానికి బలిచేసి కాటికి పంపుతున్న తెలంగాణ ప్రభుత్వం.!!

పేద ప్రజలను కాలుష్యానికి బలిచేసి కాటికి పంపుతున్న తెలంగాణ ప్రభుత్వం.!!

హైద్రాబాద్ ని విశ్వనగరం చేస్తున్నం అంటోంది ప్రభుత్వం.. కానీ అదే విశ్వనగరం గ్రేటర్ హైద్రాబాద్.. 40 గ్రామాల ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతోంది అంటే నమ్మగలరా.??
* ఇది నిజం దాదాపు మూడు లక్షల మంది ప్రజలు ఆ కాలుష్య కాలసర్పం విషానికి బలైపోయి వారి కుటుంబాలు కనీస ఆసరను సైతం కోల్పోయి, ఉపాధి లేక ప్రమాదకర రోగాల బారిన పడి పిట్టల్లా రాలిపోతున్నారు.
ఇంత జరుగుతున్నా ప్రభుత్వం పాలకులు నిమ్నకు నీరెత్తినట్టు, దున్నపోతుపైన వాన పడ్డట్టు నిశ్శబ్ధం నటిస్తోంది. ఆ అమాయక జనాల జీవితాలను, ప్రాణాలను గాలికొదిలేసింది.

జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ వల్ల చుట్టు పక్కల నాలుగు కిలోమీటర్ల వరకు గ్రౌండ్ లెవల్, గాలి పూర్తిగ కాలుష్యంలో చిక్కుకున్నై. ఈ డంపింగ్ యార్డ్ లో గ్రేటర్ హైద్రాబాద్ మరియు చుట్టు పక్కల ప్రాంతాల నుండి ప్రతి రోజూ లక్షల టన్నుల చెత్తను, వందల లారీలలో తరలిస్తూ డంప్ చేస్తున్నారు.

ఇక్కడి జనాలు తాగు నీటి కోసం బోర్ వేస్తే.. ఆ బోర్ నుండి ఈ చెత్త డంపింగ్ యార్డ్ నుండి ఇంకుతున్న ప్రమాదకర రసాయన విషమే నీటిలో కలిసి వస్తున్నదంటే అర్థం చేసుకోవచ్చు అక్కడి జనాల బతుకుచిత్రం ఏ పరిస్థితుల్లో ఉన్నదో.!! ఇప్పటికే ఉన్న బోరు బావులన్నీ విషతుల్యమైపోయాయి.

*ఈ విషయమై ఏ స్థానికున్ని కదిలించినా.. వారి కల్లవెంట కారే కన్నీరే సమాధానం అవుతున్నది*

చుట్టు పక్కల గ్రామాల సాగునీటి చెరువులన్నీ కాలుష్యమే.. దాదాపు 16 చెరువులు విష రసాయనాలతో నిండిపోయాయి. ఆ చెరువుల దరిదాపుల్లోకి కూడా పోలేని దారుణ పరిస్థితి.
వ్యవసాయం అక్కడ ఒకప్పుడు ప్రధాన ఆదాయ వనరు.. కానీ నేడు ఆ పరిస్థితి లేదు. గొర్రెలు, పశువులకు దినదిన ప్రాణ గండమే.. ఆదమరిచి ఆ కాలుష్యం నీటిని తాగినా, ఆ చుట్టు పక్కల సంచరించిన ఇక ఆ పశువులు క్షేమంగ ఇంటికొచ్చే పరిస్థితి లేదు.!
గీత కార్మికులు ఒకప్పుడు ఇక్కడ మంచి ఆదాయంతో బతికేవారు, కానీ నేడు పూర్తిగ ఆ రసాయనాలు భూమిలో ఇంకుతుండడంతో ఎంతో బలంగ ఉండే తాటి చెట్లు, ఈత చెట్లు కూడా నల్లగా మాడిపోయి చచ్చిపోతున్నాయి. ఇలా దాదాపు అన్ని చేతి వృత్తులవారికి ప్రత్యక్షంగ పరోక్షంగ ఉపాధి కరువైంది.

2001 లో నాడు ఉమ్మడి ఆంద్రప్రదేశ్ లో టీడీపీ సర్కార్ హయాంలో నాటి మినిస్టర్ నేటి రాజ్యసభ సభ్యుడు దేవేందర్ గౌడ్ ప్రోద్భలంతో ఈ ప్రాంతంలో చెత్త వేయడానికి డంపింగ్ యార్డ్ ని మొదలుపెట్టారు. ఆనాడు దేవెందర్ గౌడ్ ఆడిందే ఆట పాడిందే పాట అందువల్ల ఆయన నిర్ణయాన్ని ప్రశ్నించే సాహసం ఎవరూ చేయలేదు. ఇలా నిర్ణీత సమయం అంటే నాలుగు నుండి ఐదేల్ల వరకు మాత్రమే చెత్త వేయాలని, అది కూడా కేవలం కాప్రా, ఉప్పల్, అల్వాల్ మూడు మున్సిపాలిటీల నుండి సేకరించిన చెత్తనే ఈ ప్రాంతానికి తరలించాలనేది ప్రతిపాదన కాగా..
తర్వాత ప్రభుత్వం మారింది 2004 లో వైఎస్ఆర్ ముఖ్యమంత్రి గ కాంగ్రెస్ అధికారం లోకి వచ్చింది. జవహర్ నగర్ ప్రజలంతా వైఎస్ రాజశేఖర్ రెడ్డి మా ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాడేమో అనుకున్నారు కానీ అభివృద్ధి చేసింది వారి నివాస బస్తీలను కాదు, ఈ కాలుష్య డంపింగ్ యార్డ్ ని. మొత్తం 70 లక్షల జనాలు విసర్జించే అన్ని మున్సిపాలిటీ, మొత్తం గ్రేటర్ హైద్రాబాద్ లోని చెత్తని ఇక్కడికే తరలించి.. ఒక రకంగ ఇక్కడి జనాల మృత్యు తేదీలను ఆనాడే డిసైడ్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం.

ఇక్కడే పాలకులు చేసిన మరో తప్పిదం కనిపిస్తోంది, ఇప్పటికే ఈ కాలుష్యం కంపులో ఉండలేక ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకుజీవుడా అని భూమినీ ఇంటినీ వదిలి వెలుతున్నారు జనాలు.. మరోవైపు ఇదే డంపింగ్ యార్డ్ పరిసర ప్రాంతాల్లోనే ప్రభుత్వం నివాస గృహాలను కట్టించి పేదలకు పంచింది. ఈ డంపింగ్ పరిధిలోనే.. బడుగు బలహీన వర్గాలకు దాదాపు 4500 వరకు పక్కా ప్రభుత్వ ఇల్లను నిర్మించింది. ఇందులో లబ్దిదారులు నివాసం ఉంటున్నారు. కొందరు డంపింగ్ కంపు భరించలేక పారిపోగా.. ఇంకొందరు విచిత్రమైన రోగాలతో చర్మ వ్యాధులు, శ్వాస సంబంధ, మతి మరుపు మొదలదు వ్యాధులతో మొత్తంగ రోగ నిరోధక శక్తి తగ్గిపోయి జీవన ప్రమాణ స్థాయి దారుణంగ పడిపోయింది.

ముఖ్యంగా గర్భినీ స్త్రీలు, చిన్న పిల్లలకు ఈ వ్యాధుల సమస్య తీవ్రంగ ఉంది. గర్భం దాల్చిన మహిళలను ఈ చుట్టు పక్కల ఉండకుండా వారి వారి బంధువుల ఇంట్లో ఉంచుతున్నారు.

ఈ డంపింగ్ యార్డ్ కు వ్యతిరేకంగ ముందు నుండీ ప్రజా పోరాటం చేస్తున్న భాజపా రాష్ట్ర ఉపాద్యక్షులు, మేడ్చల్ పర్యావరణ పరిరక్షణ కమిటీ అధ్యక్షులు కొంపెల్లి మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఇక్కడి పేద ప్రజలు డంపింగ్ యార్డ్ కాలుష్యం వల్ల చనిపోతున్నారు.. ఈ మరణాలకు కారణం ప్రభుత్వమే అని.. తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజలను హత్య చేస్తున్నదని తీవ్రంగ విమర్శిస్తున్నారు.
ఇక్కడే ఏర్పాటు చేసిన ప్రభుత్వ విద్యాలయాల్లో కూడా విద్యార్ధులు ఆరోగ్యంగ చదువుకునే పరిస్థితి లేదనీ కొంపెల్లి మోహన్ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేసారు.

కాగా.. 2004 లో రాష్ట్రం లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2007 లో “రాంకీ” అనే ప్రైవేట్ సంస్థ కు కాంట్రాక్ట్ పద్దతిలో ఈ డంపింగ్ యార్డ్ నిర్వాహన అప్పజెప్పింది.
*సేకరించిన చెత్తను, ఉత్పన్నమయ్యే కలుషిత నీటిని పూర్తిగ రీసైక్లింగ్ చేయడం
*చుట్టు పక్కల గ్రామాల ప్రజలకు కనీస వసతులు త్రాగు నీరు, రోడ్డు, వైద్యం,విద్య లాంటి సౌకర్యాలను మరియు ఉపాధిని అందించడం.
కానీ ఈ నిబంధనలను తుంగలో తొక్కింది రాంకీ సంస్థ. 339 ఎకరాలకు ప్రభుత్వం అనుమతినిస్తే నేడది అందుకు రెండింతల ప్రభుత్వ స్థలాలను ఆక్రమించింది. ఇంత దారుణం జరుగుతున్నప్పటికీ ఏ ఒక్కసారి కూడా రాంకీ యాజమాన్యం పై కనీస చర్యలు తీసుకోలేదు ప్రభుత్వం. గత ప్రభుత్వాలు ఏ రకమైన నిర్లక్ష్య ధోరణి అవలంబించాయో ప్రస్తుత ప్రభుత్వం కూడా అదే నిర్లక్ష్య ధోరణిలో ఉంది. మరోవైపు నాయకులకు అధికారులకు రాంకీ యాజమాన్యం లంచాలిచ్చి నోరు మూయిస్తోందనే వార్తలు సైతం వస్తున్నై.

ఇక రాంకీ సాగించే అరాచకాలు అంతా ఇంతా కాదు, అర్థరాత్రి సమయంలో కలుషిత నీటిని చెరువులలోకి వదిలేస్తున్నది రాంకీ సంస్థ. ఇక 24గంటలు భరించలేని కంపు సరేసరి. ఆ కంపుతో రోడ్లపై రివ్వున దూసుకుపోయే చెత్త లారీల ప్రమాదాలు మరో అదనం. ఆ లారీల వల్ల తరచూ రోడ్లు కొట్టుకుపోతుండగా.. ప్రమాదాలు కూడా జరుగుతుంటాయి.

నాలుగైదేండ్లకు మించి డంపింగ్ చేయకూడదని నిబంధనలు చెపుతున్నప్పటికీ.. 13 ఏండ్లైనా ఇంకా నరకంలోనే బతికీడుస్తున్నారు ఇక్కడి జనాలు. అయినా కొంతైనా మానవత్వం చూపడం లేదు పాలకులు. ఐదేండ్లకు ఒక్కసారి రావడం ఓట్లేయించుకోవడం ఇక్కడి ప్రజలను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూడడం పరిపాటిగ మారింది.

ఈ డంపింగ్ ఎఫెక్ట్ ప్రధానంగ జవహర్ నగర్, దమ్మాయిగూడ, చీర్యాల, నాగారం, రాంపల్లి,కీసర,ఏదులాబాద్ లాంటి చుట్టుపక్కల 40 గ్రామాల ప్రజలు తీవ్రంగ నష్టపోతున్నారు. 

Related Posts
బ్రేకింగ్:- టిక్ టాక్ వాట్సాప్ ట్విట్టర్ పై క్రిమినల్ కేసు నమోదు.!!
దేశం లో ప్రస్తుతం ప్రధాన సోషల్ మీడియా అయిన టిక్ టాక్, వాట్సాప్, ట్విట్టర్ యాజమాన్యాల పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.CAA కు వ్యతిరేకంగ దేశం లో అశాంతి నెలకొల్పేలా ప్రచారం చేస్తున్నాయని ఈ వ్యతిరేక వార్తలు ...
READ MORE
చిన్నారుల్లో కళను తట్టిలేపిన జక్కన్న బాహుబలి 2. అట్టపెట్టలతో మాహిస్మతి సామ్రాజ్యం.
బాహుబలి మానియా ఏ రేంజ్ లో ఉందో చెప్పేందుకు ప్రత్యక్ష సాక్ష్యమే ఈ చిన్నారుల కళ నైపుణ్యం. జక్కన్న చెక్కిన బాహుబలి ది కన్ క్లూజన్ ఓ వైపు వెండి తెర రికార్డులను బద్దలు కొడుతుంటే.. మరో వైపు కొత్త తరానికి ...
READ MORE
సుప్రీం కోర్టు జడ్జిల వివాదం.. కీలక పరిణామం..!!
సుప్రీంకోర్టు జడ్జిల వివాదం ఇప్పట్లో సమసిపోయేలా లేదు.. నలుగురు సీనియర్ జడ్జీలు జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ లోకూర్, జస్టిస్ కురియన్ జోసెఫ్, జస్టిస్ రంజన్ గొగొయ్ లు రెండు రోజుల క్రితం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా పై మీడియా సమావేశం ...
READ MORE
మూడు దశాబ్దాల తరువాత సర్దార్జీ రూపం లో గ్రామం లో ప్రత్యక్ష్యమయ్యాడు..
దాదాపు మూడు దశాబ్దాల క్రితం ఇంటి నుండి పారిపోయిన ఓ వ్యక్తి హఠాత్తుగా ప్రత్యక్షమైతే..? తల్లిదండ్రులు చిన్నప్పుడు పనిచేయడం లేదని మందలించడంతో ఇంటి నుండి పారిపోయిన ఓ వ్యక్తి సర్దార్ రూపంలో తిరిగి దర్శనం ఇస్తే..? తీరా తన గ్రామం వెతుక్కుంటూ ...
READ MORE
నీకు సిగ్గుంటే కేసిఆర్ ఇచ్చే చెక్కు తీసుకోకు.!!
ప్రజల పట్ల బాధ్యత తో మెలగాల్సిన ప్రజా ప్రతినిధులు ప్రజాస్వామ్య విలువలను పాతరేసి ప్రజలపై నోరు పారేసుకోవడం.. మరియు ఆ ప్రజలను మేమే పెంచి పోషిస్తున్నం.. జనాలంతా మా దయా దాక్షిణ్యాలతోనే తింటున్నారు అనే చందంగ ప్రవర్తించడం హేయమైన చర్యగ అభివర్ణిస్తున్నారు ...
READ MORE
30 ఏళ్లు పాలించాలని ఉంది.. సారు మనసులో మాట చెప్పేశాడు.. ఆంధ్ర జనం ఏమంటారో..?
వైసీపీ అధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి తన మనసులో మాటను బయటపెట్టారు. ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రిని అవ్వాలని ఒకటి కాదు రెండు కాదు ముప్పయేళ్లు ఏకచత్రాధిపత్యం వహించాలని.. ఆంధ్ర సీఎంగా రికార్డులకెక్కాలని తన కలలను తన మనసులో గూడు కట్టుకున్న ...
READ MORE
ఆవులలో గోవులు వేరయా.! తితిదే చేసేది మహా అపచారమయా.!!
తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చేస్తున్న అపచారం పై ప్రత్యేక వ్యాసం శ్రీవారి కైంకర్యాలకి పవిత్రమైన స్వదేశీ గోమాత పాలతో కాకుండా విదేశీ సంకరజాతి జెర్సీ ఆవు పాలతో సరిపెడుతున్న వైనం. కలియుగ దైవం శ్రీనివాసుడి ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తీవ్రమైన ...
READ MORE
గోల్కొండ మాంకాలమ్మా.. మా మంత్రులను క్షమించమ్మా..
అపచారం జరిగింది, కాదు కాదు అపచారం చేసారు. గోల్కండ మాంకాలమ్మ అమ్మవారి బోనాల సంధర్భంగ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా పట్టువస్త్రాలను సమర్పించడం ఆనవాయితీ. ఇంతవరకు బాగానే ఉంది కానీ ఆ పట్టువస్త్రాలను తీసుకొచ్చే మంత్రులే మర్యాద తప్పి భక్తుల మనోభావాలు ...
READ MORE
అకున్ సబర్వాల్ సెలవు పై ఎన్నో అనుమానాలు.. నిజాలను వెలికితీస్తే ఇంతేనా..?
డ్రగ్ మత్తు తెలంగాణ ను ఓ ఊపు ఊపేస్తోంది. స్కూళ్లు, కాలేజీలు, టాలీవుడ్ ఇలా మత్తులో జోగుతున్న ప్రతి వ్యవస్థలోనూ ఈ మత్తు చిత్తు చేస్తోందని దీని వెనుక పెద్దల హస్తం ఉందని తేలిపోయింది. మత్తు తేనేతెట్టను కుదుపిని సిన్సియర్ ఆపీసర్ ...
READ MORE
పసి పిల్లలని మింగుతున్న బోరు బావి భూతం ఈసారి ఓడిపోయింది.
అవును తెలుగు రాష్ట్రాల ప్రజలకు బాగా పరిచయం ఈ నోరు తెరిచిన బోరు బావుల్లో అభం శుభం తెలియని పసి పిల్లలు పడిపోవడం మొత్తం అధికారులనూ పాలకులనూ ప్రజలను ఉత్కంటకు గురి చేయడం జనాలంతా బోరు బావిలో పడ్డ చిన్నారి క్షేమంగా ...
READ MORE
కేసీఆర్ స్వాతంత్ర్య కానుక.. లక్షల ఉద్యోగాలు ఈ ఏడాదే అంటూ ప్రకటన.
తెలంగాణలో నిరుద్యోగులకు తీపి కబురు. 71 వ స్వాతంత్ర్య దినోత్సవం సంధర్బంగా సీఎం కేసీఆర్ శుభవార్తను వినిపించారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం కళ్లు కాయలు కాసేలా చూసిన నిరుద్యోగ యువతకు మరో సారి ఆశలు చిగురింప జేశారు. ఈ ఏడాదే 84876 ఉద్యోగ ...
READ MORE
ప్రియాంకకున్న మానసిక వ్యాధి పేరు వెల్లడించిన సుబ్రహ్మణ్యస్వామి.!!
కాంగ్రెస్ పార్టీ లో రాహుల్ తో గెలవడం లేదని మరో కొత్త ప్రయత్నంగ సోనియా గాంధీ కూతురు రాహుల్ చెల్లి అవినీతి ఆరోపనలు ఎదుర్కుంటున్న రాబర్ట్ వాద్రా భార్య ప్రియాంక వాద్రా ను ప్రత్యక్ష రాజకీయాల్లోకి తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. రావడం ...
READ MORE
తుపాకీ బుల్లెట్లకే భయపడని ధీరుడు చౌకబారు కేసులకు భయపడతాడా..??
మురళీధర్ రావు.. భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకుడు.. మన కరింనగర్ వాస్తవ్యులైన మురళీధర్ రావు, తెలంగాణ లోనే కాదు దేశంలో ఏ ప్రాంతానికి వెల్లినా అక్కడ జనాలు స్వఛ్చంధంగ ఆయనకి బ్రహ్మరథం పడతారనడంలో అతిశయోక్తి ఏమాత్రం లేదు.ఇంతటి అసాధారణ నాయకుడు ...
READ MORE
పౌరసత్వ బిల్లు పాసవడంతో పాకిస్తాన్ హిందువుల హర్షం..!!
పౌరసత్వం బిల్లు చట్టరూపం దాల్చడంతో ఆనందంలో పాకిస్తాన్ నుండి వచ్చిన హిందూ శరణార్థులు. ప్రస్తుతం వెంటనే 25 వేల మంది పాకిస్తాన్ హిందూ శరణార్థులకు లభించనున్న భారత పౌరసత్వం. స్వాతంత్ర్యం అనంతరం భారత్ నుండి పాకిస్తాన్ మతం ప్రాతిపదికన విడిపోయినపుడు పాకిస్తాన్ ...
READ MORE
బయటకెల్లి ప్రచారం చేయాలంటేనే భయపడిపోతున్న కాంగ్రెస్ అభ్యర్థి నటి ఊర్మిళ.!!
ప్రముఖ సినీ నటి ఊర్మిళ మతోండ్కర్ ఈ మధ్యనే కాంగ్రెస్ పార్టీ లో చేరి ముంబై నార్త్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే కొత్త కొత్త గ రాజకీయాల్లోకి వచ్చిన ఊర్మిళ కు ...
READ MORE
చిన్నారి శాన్వి హంతకుడు రఘకు మరణశిక్ష.. 5 ఏళ్ల తరువాత సంచలన తీర్పు.
న్యాయం ఎప్పటికైనా విజయం సాదిస్తుంది. అన్యాయం ఎన్నటికైనా ఓడక తప్పదని మరో సారి రుజువు చేసింది చిన్నారి శాన్వి హత్య కేసు. 2012లో అమెరికాలో శాన్వి అనే చిన్నారిని, ఆమె అమ్మమ్మ‌ను అత్యంత కిరాతకంగా హ‌త్య చేసిన సంఘ‌ట‌న అప్ప‌ట్లో సంచ‌ల‌నం ...
READ MORE
ముగిసిన ఢిల్లీ ఎన్నికల పోలింగ్, ఆప్ బీజేపీ ల మధ్యే పోటీ, తుస్సుమన్న కాంగ్రెస్.!!
దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాయి. ఎన్నికల్లో ప్రధానంగా అధికార ఆప్ మరియు బీజేపీ కాంగ్రెస్ పార్టీ లు పోటీ పడ్డప్పటికి, ఆప్ బీజేపీ ల మధ్యే హోరా హోరీ పోటీ జరిగినట్టు రాజకీయ విశ్లేషకుల అంచనా.అంతే కాదు ఈసారి ...
READ MORE
ఒక గొప్ప నాయకుడి విశ్వాసాన్ని వమ్ము చేసి ప్రజల ముందు దోషిగ నిలబడ్డ రాహుల్ గాంధీ.!!
రాహుల్ గాంధీ.. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు పార్లమెంటు లో ప్రతిపక్ష నేత.. ఆ హోదాలో ఆయన చేసే చర్యలు గానీ చెప్పే మాటలు గానీ జాతీయ స్థాయి లో ప్రచారం జరుగడమనేది సాధారణం. అలాంటప్పుడు ఆయన ప్రవర్తించాల్సిన తీరు రాజకీయ ...
READ MORE
సికింద్రాబాద్ కా సికందర్.. కిషన్ రెడ్డి సాబ్..!!
కిషన్ రెడ్డి.. పరిచయం అక్కర్లేని పేరు అంతే కాదు అంబర్ పెట్ ప్రజలకు ఆత్మీయుడు. రాజకీయాలంటే స్వార్థం కాదు సేవా అని, నమ్మిన సిద్దాంతం కోసం నిలబడ్డ జాతీయవాది. అందుకే తెలంగాణ భాజపా కి దిక్సూచిగ కార్యకర్తలకు అండగ ఎదిగిన కిషన్ ...
READ MORE
మూడు నెలల జైలు శిక్ష విధించాల్సిఉంటుందని అనిల్ అంబానికి వార్నింగ్ ఇచ్చిన సుప్రీంకోర్ట్.!!
రిలయన్స్ సంస్థ అధినేత అనిల్ అంబాని పై సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు సంచలనం కలిగిస్తోంది.ఎరిక్సన్ కు 550 కోట్ల బకాయిలను చెల్లించాలని సుప్రీం ఇచ్చిన ఆదేశాలను ధిక్కరించినందుకు అనిల్ అంబానిని మరో ఇద్దరిని దోషులుగ పేర్కొన్నది సుప్రీంకోర్టు.దాంతో నాలుగు వారాల్లోగో ...
READ MORE
సంకీర్ణ ప్రభుత్వాన్ని తిరస్కరించి సుస్థిరమైన పాలనను కోరుకున్న కన్నడ ప్రజలు.!!
నేడు వెలువడిన కర్నాటక శాసన సభ ఉప ఎన్నికల ఫలితాలు యావత్ దేశానికి ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చిందని పలువురు సామాజిక రాజకీయ వేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గత సంవత్సరంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వం ఏర్పాటుకు భారతీయ జనతా ...
READ MORE
తోక ముడిచిన డ్రాగన్.. “డోక్లాం” సరిహద్దు నుండి వెనక్కిపోనున్న చైనా సైన్యం..!!
గత రెండు నెలలుగా భూటాన్ - భారత్ డోక్లాం సరిహద్దు వద్ద చైనా చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. అందుకు ఏమాత్రం తీసిపోకుండా ఢీ అంటే ఢీ అని గట్టిగా నిలబడింది భారత సైన్యం. చైనా సైనికులు రాల్లతో దాడి ...
READ MORE
మనోల్లేమో పాకిస్తాన్ నటులను ఏరికోరి తెచ్చుకుంటారు, కాని మన చిత్రాలను పాకిస్తాన్ లో అడ్డుకుంటారు.!!
మన దేశాన్ని అస్థిర పర్చడానికి ఎల్లప్పుడూ సిద్దంగ ఉండే.. పాకిస్తాన్ చైనా లాంటి దేశాలతో మన భారత ప్రభుత్వం, మన సైనికులు ఎప్పటికప్పుడు ఎదురొడ్డి పోరాడుతుంటే.. మన నాయకులు మాత్రం దేశం నడిబొడ్డులో ప్రెస్ మీట్లు పెట్టి మన దేశానికి వ్యతిరేకంగ ...
READ MORE
ఆడదానికి ఆడదే శత్రువా..? ఇదేనా మహిళ లోకం అడుగుతున్న స్వేచ్ఛ.?
ఆడదానికి ఆడదే శత్రువనే ఓ పాత సామేత.. ఇది ఒక్కోసారి నిజమే అనిపిస్తోంది. ఇంత పరిపాలనా అభివృద్ధి జరిగినా.. రక్షణ వ్యవస్థ పటిష్టమైనా.. న్యాయ వ్యవస్థ నూతన చట్టాలు తెచ్చినా.. ఎన్ని "షీ" టీం లు ఏర్పాటు చేసినప్పటికీ.. స్త్రీ కి ...
READ MORE
ఈ కవర్ పేజీ చిత్రం చైనా లో ఇప్పుడు సంచలనం అవుతోంది.!
మన దేశంలో ప్రముఖ మ్యాగ్జిన్ గ పేరున్న ఇండియా టుడే పత్రిక.. తాజాగా చైనా పై ఒక స్టోరీ ఇచ్చింది. అందుకు తగినట్టుగా కవర్ పేజీని ముంద్రించింది. చైనా ఇప్పుడు భారత్ కు శత్రు దేశమైన పాకిస్తాన్ లో అధిక పెట్టుబడులు పెట్టి ...
READ MORE
బ్రేకింగ్:- టిక్ టాక్ వాట్సాప్ ట్విట్టర్ పై క్రిమినల్ కేసు
చిన్నారుల్లో కళను తట్టిలేపిన జక్కన్న బాహుబలి 2. అట్టపెట్టలతో మాహిస్మతి
సుప్రీం కోర్టు జడ్జిల వివాదం.. కీలక పరిణామం..!!
మూడు దశాబ్దాల తరువాత సర్దార్జీ రూపం లో గ్రామం లో
నీకు సిగ్గుంటే కేసిఆర్ ఇచ్చే చెక్కు తీసుకోకు.!!
30 ఏళ్లు పాలించాలని ఉంది.. సారు మనసులో మాట చెప్పేశాడు..
ఆవులలో గోవులు వేరయా.! తితిదే చేసేది మహా అపచారమయా.!!
గోల్కొండ మాంకాలమ్మా.. మా మంత్రులను క్షమించమ్మా..
అకున్ సబర్వాల్ సెలవు పై ఎన్నో అనుమానాలు.. నిజాలను వెలికితీస్తే
పసి పిల్లలని మింగుతున్న బోరు బావి భూతం ఈసారి ఓడిపోయింది.
కేసీఆర్ స్వాతంత్ర్య కానుక.. లక్షల ఉద్యోగాలు ఈ ఏడాదే అంటూ
ప్రియాంకకున్న మానసిక వ్యాధి పేరు వెల్లడించిన సుబ్రహ్మణ్యస్వామి.!!
తుపాకీ బుల్లెట్లకే భయపడని ధీరుడు చౌకబారు కేసులకు భయపడతాడా..??
పౌరసత్వ బిల్లు పాసవడంతో పాకిస్తాన్ హిందువుల హర్షం..!!
బయటకెల్లి ప్రచారం చేయాలంటేనే భయపడిపోతున్న కాంగ్రెస్ అభ్యర్థి నటి ఊర్మిళ.!!
చిన్నారి శాన్వి హంతకుడు రఘకు మరణశిక్ష.. 5 ఏళ్ల తరువాత
ముగిసిన ఢిల్లీ ఎన్నికల పోలింగ్, ఆప్ బీజేపీ ల మధ్యే
ఒక గొప్ప నాయకుడి విశ్వాసాన్ని వమ్ము చేసి ప్రజల ముందు
సికింద్రాబాద్ కా సికందర్.. కిషన్ రెడ్డి సాబ్..!!
మూడు నెలల జైలు శిక్ష విధించాల్సిఉంటుందని అనిల్ అంబానికి వార్నింగ్
సంకీర్ణ ప్రభుత్వాన్ని తిరస్కరించి సుస్థిరమైన పాలనను కోరుకున్న కన్నడ ప్రజలు.!!
తోక ముడిచిన డ్రాగన్.. “డోక్లాం” సరిహద్దు నుండి వెనక్కిపోనున్న చైనా
మనోల్లేమో పాకిస్తాన్ నటులను ఏరికోరి తెచ్చుకుంటారు, కాని మన చిత్రాలను
ఆడదానికి ఆడదే శత్రువా..? ఇదేనా మహిళ లోకం అడుగుతున్న స్వేచ్ఛ.?
ఈ కవర్ పేజీ చిత్రం చైనా లో ఇప్పుడు సంచలనం
Facebook Comments
Top
error: Content is protected !!