You are here
Home > తాజా వార్త‌లు > ఒక్క దుబ్బాకల్నే BJP దూకుడు ఈ రేంజ్ ల ఉంటే, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో TRS పరిస్తితి ఏంటి.?

ఒక్క దుబ్బాకల్నే BJP దూకుడు ఈ రేంజ్ ల ఉంటే, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో TRS పరిస్తితి ఏంటి.?

దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలో గెలుపు ఎవరిది అనే విషయం పక్కన పెడితే, అధికార టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం మేమే అని చెప్తున్న బీజేపీ, ఆ స్థాయిలోనే ఢీ అంటే ఢీ అంటూ పోటీ లో దూకుడు ప్రదర్శిస్తోంది.
అధికార పార్టీ తో ఎంత వరకైనా సై అంటుంది.
అయితే ఉప ఎన్నికలు అనివార్యం అయిన వెంట నుండే బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు దుబ్బాక లో గడప గడపకు వెళ్లి విస్పృత ప్రచారం చేస్తూ, జనాల్లో మంచి ఆదరణ పొందారు. దీంతో దాదాపు అన్ని సర్వేల్లో కూడా బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు కు విజయ అవకాశాలు ఉన్నట్టు చర్చ జరిగింది. దీంతో అప్పటిదాకా నిశ్చింతగా ఉన్న అధికార TRS పార్టీ కలవరపడి తన అధికారాన్ని వాడుకోవడం మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే అధికార TRS పార్టీ మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో పోలీసు అధికారుల ను వాడుకుంటుందనే ఆరోపణలు అన్ని వైపుల నుండి వస్తున్నాయి.

తద్వారా బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు కు సంబంధించిన ఇళ్ళల్లో మరియు వాహనాలను పదే పదే తనిఖీలు అంటూ బీజేపీ అభ్యర్థి కి అధికార TRS పార్టీ ఆటంకాలు కలుగజేస్తుంది అని ఆరోపిస్తూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ దుబ్బాక కు వెళుతుండగా అడ్డుకున్న పోలీసులు ఆయన్ని పోలీస్ వాహనంలో బలవంతంగా కుక్కి గొంతు పట్టి తోస్తూ భౌతిక దాడి సైతం చేయడంతో దుబ్బాక లో బీజేపీ కి TRS కు మధ్య గొడవ మరింత ముదిరింది. తద్వారా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హుటా హుటిన దుబ్బాక కు వెళ్లి అప్పటికే లాఠీ ఛార్జ్ లో పోలీసులకు బీజేపీ నాయకులకు మధ్య జరిగిన గొడవలో పలు బీజేపీ నాయకులకు బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు కు గాయాలు కావడంతో వారిని పరామర్శించారు. పోలీసులకు బీజేపీ నాయకులకు మధ్య జరిగిన గొడవలో అభ్యర్థి రఘునందన్ రావు చేయికి ఫ్రాక్చర్ కూడా జరగడంతో ప్రస్తుతం ఆయన చేతికి కట్టు తో నే ప్రచారంలో పాల్గొంటున్నారు.

తనిఖీలు అంటూ అధికార TRS పార్టీ అధికార దుర్వినియోగం చేస్తూ పోలీసుల చేత రఘునందన్ బంధువుల ఇంట్లో డబ్బులు దాచి బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ని బద్నాం చేసే ప్రయత్నం జరుగుతున్నదని రఘునందన్ రావు తో పాటు బీజేపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.
ఇక పోలీసుల దాడి కి గురైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపి బండి సంజయ్ నిన్నటి నుండీ ఆయన తన కరీంనగర్ ఎంపీ కార్యాలయం లో దీక్ష చేస్తూ TRS సర్కార్ వైఖరికి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం తీవ్రంగా నీరసించినట్టు తెలుస్తోంది తాజా హెల్త్ బులెటిన్ ప్రకారం షుగర్ లెవెల్స్ 59 కి పడిపోవడం ఆందోళన కలిగించే అంశం. తాజాగా బండి సంజయ్ పై దాడి అరెస్ట్ విషయమై జాతీయ బీసీ కమిషన్ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ కి మరియు డీజీపీ కి నోటీస్ కూడా జారీ చేసింది. ఘటన పై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఇప్పటికే బండి సంజయ్ పై దాడి జరిగిన వెంటనే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఫోన్ చేసి ఆరా తీసినట్టు కూడా సమాచారం. ఇక ఇప్పటికే బండి సంజయ్ పై జరిగిన దాడి ని ఆంధ్ర ప్రదేశ్ బీజేపీ చీఫ్ ఎమ్మెల్సీ సోము వీర్రాజు సహా జనసేన
అధ్యక్షుడు పవన్ కళ్యాన్ మరియు పలువురు రాజకీయ సామాజిక వేత్తలు ఖండించిన విషయం తెలిసిందే. ఇక నిన్నటి నుండే రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు నిరసనలు చేస్తున్నారు.. ఈరోజు ఉదయం BJYM రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాష్ ఆధ్వర్యంలో డీజీపీ కార్యాలయాన్ని సైతం ముట్టడించిన BJYM నాయకులను అరెస్ట్ చేశారు పోలీసులు.

ఇక ఈ దుబ్బాక యుద్దం పై పలువురు రాజకీయ విశ్లేషకులు స్పందిస్తూ..
రాష్ట్రం లో TRS కు మేమే ప్రత్యామ్నాయం అని చెప్తున్న బీజేపీ అది నిజమే అనేలా దూకుడుతో ముందుకెలుతున్నదని అభిప్రాయపడుతున్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో నే నాలుగు ఎంపీ స్థానాలు గెలిచి TRS కు షాక్ ఇచ్చినప్పటికి, బీజేపీ నీ కొంత లైట్ తీసుకున్న అధికార TRS పార్టీ కి దుబ్బాక ఎపిసోడ్ తో బాగానే అర్దం అవుతున్నట్టే కనిపిస్తోందని అంటున్నారు. ఒక్క దుబ్బాక ఉప ఎన్నికల్లో నే బీజేపీ తో TRS కు ఈ రేంజ్ లో పోరాడాల్సి వస్తే, ఇక రాబోయే గ్రేటర్ ఎన్నికల్లో మరియు అసెంబ్లీ ఎన్నికల్లో TRS పరిస్తితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు అని అంటున్నారు. అంతే కాదు ఒక్క ఉప ఎన్నికే కాబట్టి పోలీసు యంత్రాంగాన్ని వాడుకుంటున్నారు గానీ రాష్ట్ర స్థాయిలో అంటే అది సాధ్యం కాకపోవచ్చు అని కూడా స్పష్టం చేస్తున్నారు. ఇక జరిగిన సర్వేల ప్రకారమే దుబ్బాక లో గనక బీజేపీ గెలిస్తే, రాబోయే గ్రేటర్ ఎన్నికల్లో మరియు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఆధిపత్యాన్ని అడ్డుకోవడం ఎవరి వల్లా కాదనే చర్చ సైతం జరుగుతోంది. దుబ్బాక ఎపిసోడ్ లో బహుశా బీజేపీ ఈ రేంజ్ లో ఇంత స్పీడ్ గా రెస్పాండ్ అవుతుందని TRS పార్టీ గాని ఆ పార్టీ ఎలెక్షన్ ఇంఛార్జి మంత్రి హరీష్ రావు గాని ఊహించి ఉండకపోవచ్చని కూడా అంటున్నారు. దీంతో మంత్రి హరీష్ రావు TRS పార్టీ శ్రేణులు దుబ్బాక విషయంలో అతి చేసి బీజేపీ కి మరింత లాభం చేకూర్చారనీ కూడా వార్తలు వస్తుండడం ఆసక్తి కలిగిస్తున్న అంశం.

ఇక దుబ్బాక ఉప ఎన్నికలో మరో ప్రధాన రాజకీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కూడా పోటీ లో ఉన్నప్పటికీ అది నామమాత్రమే అనే చర్చ జరుగుతుండడం గమనార్హం. 

Related Posts
సెల్ఫీ తీసుకుంటూ రాకాసి అలకు బలైన డాక్టర్.. విషాధం.!!
సెల్ఫీ సరదా ఓ మహిళా డాక్టర్ ప్రాణం తీసుకున్న ఘటన గోవా బీచ్ లో జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం క్రిష్ణా జిల్లా జగ్గయ్య పేట మార్కండేయ బజార్ ప్రాంతానికి చెందిన రమ్యక్రిష్ణ గోవా లో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యురాలిగ పనిచేస్తోంది. ...
READ MORE
అమ్మాయిని చంపి..అవయవాలను మాంసాన్ని కత్తితో కోసి..??
మనిషి మాంసాన్ని తినడం మనం ఆదిమానవుల్లో మరియు అడవుల్లో అనాగరికంగ జీవించే తెగలలో ఉంటుందని తెలుసుకున్నం.. ఇంకా అంటే సినిమాల్లో చూస్తూ ఉంటాం..!! ఇదే తరహా ఇప్పుడు రష్యాలో జరిగింది ఒక అమ్మాయిని చంపి అవయవాలను, మాంసాన్ని కత్తితో కోసినట్టు నిర్థారించారు ...
READ MORE
నంద్యాల లో ఒక ఓటు ధర ఎంతో తెలుసా.?
తెలుగు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అసలు బతికే ఉందా.? నంద్యాల ఉప ఎన్నికలో ఒకో పార్టీ వారు తక్కువలో తక్కువగ 5 వేలు పంచుతున్నటు విపరీతమైన చర్చ నడుస్తోంది.. ఇప్పటికే వందల కోట్లని ప్రధాన రాజకీయ పార్టీలు ఖర్చు చేసినట్లు వార్తలొస్తున్నై.. ఇంకా ...
READ MORE
నాకు సెంచరీలు రికార్డులు సంతృప్తి ఇవ్వవు.. – రోహిత్ శర్మ
టీం ఇండియా హిట్టింగ్ బ్యాట్స్ మెన్ రోహిత్ శర్మ శ్రీలంక పై సెంచరీ రికార్డ్ తర్వాత మీడియా తో మాట్లాడుతూ.. నాకు సెంచరీలు రికార్డులు సంతృప్తిని ఇవ్వదని భారత క్రికెట్ జట్టు ప్రపంచ కప్ గెలిస్తేనే అసలైన సంతృప్తి అని సృష్టం ...
READ MORE
మన తెలంగాణ పెద్దసారు పుట్టిన రోజు ఇయ్యాల. సారు యాదిలో…
కొత్తపల్లి జయశంకరుడు.. తెలంగాణ ఉద్యమాన్ని యువత రక్తంలోకి అత్యంత వేగంగా ప్రవహింపజేసిన మహోద్యమం చరితుడు. సారు చెప్పిన మాటలు సారు వేసిన తోవ ఇ యాల తెలంగాణ లోకాన్ని వెలిగిస్తోంది. ఈ క్షణం సారుంటే ఎంత ముద్దుగుండో.. తెలంగాణ సిద్దించక ముందే ...
READ MORE
అంగరంగ వైభ‌వంగా తెలంగాణ రాష్ట్ర బంగారు పండుగ‌ బతుక‌మ్మ సంబురాలు.
తెలంగాణ రాష్ట్ర పండుగ.. బంగారు పండుగ.. తీరొక్క పూల బంగారు పండుగ బ‌తుక‌మ్మ సంబ‌రాల‌లు 9 రోజుల పాటు ఘ‌నంగా సాగ‌నున్నాయి. రాష్ట్ర పండుగ బతుకమ్మ ఉత్సవాలను ఈ నెల 20 నుంచి 28 వరకు 9 రోజుల పాటు ఘ‌నంగా ...
READ MORE
బ్రేకింగ్ :- వరల్డ్ కప్ టీం లో స్థానం సంపాదించిన ప్లేయర్లు వీల్లే..!!
క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూసే వన్డే ప్రపంచ కప్ కొద్ది రోజుల్లో మొదలు కానుంది. ఇదే సంవత్సరం మే నెల లో వన్డే ప్రపంచ కప్ ఇంగ్లాండ్ దేశం లో మొదలుకానుంది. మొట్ట మొదటి ఆట వేల్స్ వేదికగ జరగనుంది. ఈ ...
READ MORE
ఒగ్గు కథకు ఓనమాలు ఒద్దిన సత్తయ్య ఇక లేడు.!!
చదివింది ఒకటో తరగతే కానీ.. ఒగ్గు కథ చెప్పడంలో శిఖరాన్ని అందుకున్నాడు అందుకే కాకతీయ విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ పొంది డా.చుక్క సత్తయ్య అయ్యాడు. ఒగ్గు కథ చెప్పడంలో సత్తయ్య ఎంత స్పెషలిస్ట్ అంటే.. దేశవ్యాప్తంగ దాదాపు 12 వేలకు పైగా ...
READ MORE
దేశ ద్రోహం కేసు ఎదుర్కుంటున్న అర్బన్ నక్సల్ కన్హయ కుమార్ భవిష్యత్ ఏంటి.?
పాకిస్తాన్ మన దేశానికి వ్యతిరేకంగ ఉగ్రవాదులను తయారు చేస్తే ఇంటి దొంగలు దేశం లో ఉన్న విశ్వ విద్యాలయాల్లో విద్యార్థులను అర్బన్ నక్సల్స్ గ తయారు చేసి దేశం లోపలే దేశాన్ని విభజించే కుట్రలకు పన్నాగం రచిస్తున్నారు.ఈ క్రమం లోనే ...
READ MORE
సిఎం కూతురుపై రైతుల ఆగ్రహం.!!
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కూతురు నిజాంబాగ్ పార్లమెంట్ సభ్యురాలు కల్వకుంట్ల కవితకు ఊహించని పరిణామం ఎదురైంది. ఈ పరిణామంతో షాక్ తిన్న ఎంపి కవిత పోలీసుల సహాయంతో బయటపడ్డారు. అయితే మెట్ పల్లి మీదుగా ఆమె రోడ్డు మార్గంలో వెలుతుండగా ...
READ MORE
కమ్ముకుంటున్న అనుమానాలు.. పాప ప్రాణాలతో క్షేమంగా బయటకి వస్తుందా..?
రంగారెడ్డి జిల్లా బోరు బావి ఘటన రాష్ట్రంలో ఉత్కంఠతకు తెరలేపుతోంది. క్షణం క్షణం గడుస్తున్నకొద్ది ఆశలు మెల్లి మెల్లిగా సన్న గిల్లుతున్నాయి. ఇప్పటికే 50 గంటలు గడిచిపోవడంతో పాప ప్రాణాలపై ఆశలు కోల్పోయేలా చేస్తోంది. గంట గంటకు సిట్యువేషన్ మారిపోతుంది. మొత్తం ...
READ MORE
కర్నాటకలో నిత్యానంద వారసుడు.! సినీ హీరోయిన్ తో రాసలీలలు.!!
కర్నాటక రాష్ట్రం లో మరో దొంగ బాబ గుట్టు రట్టైంది. బెంగుళూరు శివార్లలో ఉండే మద్దేవనపురం మఠం స్వామిజీ అయిన నంజేశ్వర శివాచార్య అలియాస్ దయానంద స్వామి ఒక కన్నడ సినీ నటితో శృంగారంలో మునిగి తేలుతున్న ఒక వీడియో ఫుటేజ్ ...
READ MORE
కక్కుర్తికి పరాకాష్ట.. విస్మయం కలిగిస్తున్న మాజీ ముఖ్యమంత్రి నిర్వాకం.!!
ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ నిర్వాకం దేశ ప్రజలకు విస్మయం కలిగిస్తోంది. ఇక ఉత్తర ప్రదేశ్ జనాలైతే ముక్కున వేలేసుకుంటున్నారు. ఉత్తర ప్రదేశ్ లో అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రి పదవి కోల్పోయి దాదాపు ఏడాది కావస్తున్నా ఇంతవరకు ఆయన తను ...
READ MORE
నిత్యం వాడే ఆ మందులు నకిలీవంటా.. నిర్ధారించిన సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్.
తలనొప్పి, దగ్గు, దమ్ము, తుమ్ములు, జ్వరం, కాళ్ల నొప్పి, కీళ్ల నొప్పి ఇలా చిన్న చిన్నవాటికే మెడికల్ కి పరుగులు తీస్తుంటామ్. అక్కడ అనుభవం లేని ఓ వ్యక్తి ఈ గోలీ మింగెయ్ గంటలో తగ్గిపోద్దని సలహ ఇస్తాడు. డాక్టర్ సలహా ...
READ MORE
ఆర్బీఐలో కొలువుల జాత‌ర‌. ఈనెల 16 ఆన్‌ లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా టెక్నికల్ విభాగంలోని మేనేజర్, రాజభాష, సెక్యూరిటీ విభాగంలోని అసిస్టెంట్ మేనేజర్ పోస్టులను భర్తీ చేస్తారు. మేనేజర్ (టెక్నికల్)- 2 విద్యార్హతలు: సివిల్ ఇంజినీరింగ్ ...
READ MORE
కాంగ్రెస్ పార్టీ చేసిన పనికి ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రముఖ సినీ నటుడు.!!
ప్రముఖ నటుడు దర్శకుడు నిర్మాత అయిన మాధవన్ కాంగ్రెస్ పార్టీ పై సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. మన దేశ ప్రధాని నరేంద్ర మోడి చైనా తో అంతర్జాతీయ వేదికగా మరియు సరిహద్దు రక్షణలోనూ ఎంతకైనా సిద్దమంటూ ...
READ MORE
కరోనా వైరస్ దెబ్బకు విల విల్లాడుతున్న చైనా.!!
ఇప్పుడు ప్రపంచమంతా ఎక్కడ చూసినా ఒకటే చర్చ ప్రాణాంతక అంటువ్యాధి కరోనా వైరస్.ఈ వైరస్ చైనా లో పుట్టి మిగతా దేశాలకు పాకుతోంది. ప్రస్తుతానికి ఈ వైరస్ కు మందు లేదు. దాంతో ఈ వైరస్ బారిన పడిన జనం మృత్యువు ...
READ MORE
కర్నాటక ఎన్నికలు ముగిసాయి.! జస్టిస్ ఫర్ ఆసిఫా గ్యాంగ్ లు కనిపించడం లేదు.!!
ఎప్పుడో జనవరి లో జరిగిన ఉదంతాన్ని తవ్వి తీసి దేశ వ్యాప్తంగా సంచలన వార్తగా క్రియేషన్ చేసిన సంఘటన కథువా ఆసిఫా అనే చిన్నారి మృతి. పాప చనిపోవడానికి హత్య అని ఖచ్చితంగ చెప్పగలిగినా కూడా అత్యాచారం జరిగిందా లేదా అంటే అది ...
READ MORE
జేబులో చిల్లిగవ్వ కూడా లేదు.. పారిస్ లో బిచ్చమెత్తుకున్నాం.
ప్రముఖ డైరెక్టర్ రవిరాజా పినిశెట్టి కుమారుడు ఆది పినిశెట్టి విలక్షణమైన పాత్రలతో దక్షిణాది సినీ పరిశ్రమలో రాణిస్తున్నాడు. గుండెల్లో గోదారి, సరైనోడు.. ప్రస్తుతం నాని నటించిన చిత్రం నిన్నుకోరిలో విలన్ గా కనిపించబోతున్నాడు. అయితే దర్శకుడి కొడుకై ఉండి.. బాగా డబ్బున్న ...
READ MORE
చైనా యాప్ టిక్ టాక్ పై నిషేధం విధించిన ప్రభుత్వం.!!
చైనా కు సంబంధించిన టిక్ టాక్ యాప్ ను తమ స్టోర్ల నుండి నిషేధించాలని గూగుల్ మరియు యాపిల్ సంస్థ లకు ఆదేశాలిచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఈ యాప్ వల్ల పలువురు ప్రాణాలు కోల్పోవడం జరిగిన కాపణంగ ఇప్పటికే తమిళనాడు హైకోర్ట్ ...
READ MORE
కొత్త అసెంబ్లీ ఎందుకు.. కేసిఆర్ సర్కార్ పై హైకోర్టు ప్రశ్నల వర్షం..!!
పాత భవనంలో గతంలో 294 మంది శాసన సభ్యులు ఉండేవారు. ఇప్పుడు సంఖ్య తగ్గి 119 మంది ఉన్నారు. ఇప్పుడు మరింత విశాలం అయ్యింది. నిర్వహణ బాగున్నప్పుడు కొత్త భవనం నిర్మించాల్సిన అవసరం ఏముందని రాష్ట్ర ప్రభుత్వం పై హైకోర్టు ప్రశ్నలు ...
READ MORE
తెలంగాణలో మ‌రో 10 నామినేటెడ్‌ పోస్టులు భర్తీ
తెలంగాణ ప్రభుత్వం మరో 10 నామినేటెడ్ పోస్టుల‌కు చైర్మన్లను నియ‌మించింది. చాలా కాలంగా ఊరిస్తూ వచ్చిన నామినేటెడ్‌ పదవుల భర్తీ ఎట్టకేలకు పూర్తి చేసింది తెలంగాణ స‌ర్కార్. ఈ సారి ఎన్న‌డు లేని విధంగా కార్పోరేష‌న్ నియామకాల్లో మైనార్టీలకు టీఆర్ఎస్ ప్ర‌భుత్వం ...
READ MORE
ఆర్థిక తీవ్రవాది విజయ్ మాల్యాకు రోజులు దగ్గరపడుతున్నై..!!
వివిధ బ్యాంకులలో తొమ్మిది వేల కోట్ల రూపాయల రుణాలు తీసుకుని చేతులెత్తేసి దర్జాగ లండన్ పారిపోయిన మాజీ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు వ్యాపారవేత్త విజయ్ మాల్యా జైలుకు వెల్లే రోజులు దగ్గరపడుతున్నై. ఆయన అప్పులు ఎగ్గొట్టిన భారత బ్యాంకులు భారత ...
READ MORE
కామర్స్ సబ్జెక్ట్ లో రారాజు అనీష్ కాలేజ్.. యొక్క గొప్పతనం ఏంటి.?
అకాడమిక్ ఇయర్ మారబోతున్నది, త్వరలోనే పాఠశాలలు కాలేజీలు అని తెరుచుకునే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే పదవ తరగతి పాసైన విద్యార్థులు, ఇంటర్మీడియట్ పాసైన విద్యార్థులు. ఏ కోర్స్ చేస్తే.. ఏ కాలేజీలో చేరితే భవిష్యత్తు బాగుంటుందో అనే ఆలోచనలో ఉన్నారు విద్యార్థులు ...
READ MORE
సినీ ఇండస్ట్రీలో ఙరుగుతున్న వాస్తవాలను చెప్తే.. కేసులు పెడతారా.??
గత కొంత కాలంగ టాలీవుడ్ తెలుగు హీరోయిన్ శ్రీ రెడ్డి ఇండస్ట్రీలోని పెద్దలపై ఆరోపనలు చేస్తూ.. టాలీవుడ్ లో" క్యాస్ట్ కౌచింగ్" కల్చర్ చాలా ఉందనీ.. హీరోయిన్లని శారీరకంగ వాడుకోకుండా అవకాశాలు ఇవ్వరనీ అయినా.. తెగించి భరించినప్పటికీ అవకాశాలు ఇవ్వడం లేదనీ.. ...
READ MORE
సెల్ఫీ తీసుకుంటూ రాకాసి అలకు బలైన డాక్టర్.. విషాధం.!!
అమ్మాయిని చంపి..అవయవాలను మాంసాన్ని కత్తితో కోసి..??
నంద్యాల లో ఒక ఓటు ధర ఎంతో తెలుసా.?
నాకు సెంచరీలు రికార్డులు సంతృప్తి ఇవ్వవు.. – రోహిత్ శర్మ
మన తెలంగాణ పెద్దసారు పుట్టిన రోజు ఇయ్యాల. సారు యాదిలో…
అంగరంగ వైభ‌వంగా తెలంగాణ రాష్ట్ర బంగారు పండుగ‌ బతుక‌మ్మ సంబురాలు.
బ్రేకింగ్ :- వరల్డ్ కప్ టీం లో స్థానం సంపాదించిన
ఒగ్గు కథకు ఓనమాలు ఒద్దిన సత్తయ్య ఇక లేడు.!!
దేశ ద్రోహం కేసు ఎదుర్కుంటున్న అర్బన్ నక్సల్ కన్హయ కుమార్
సిఎం కూతురుపై రైతుల ఆగ్రహం.!!
కమ్ముకుంటున్న అనుమానాలు.. పాప ప్రాణాలతో క్షేమంగా బయటకి వస్తుందా..?
కర్నాటకలో నిత్యానంద వారసుడు.! సినీ హీరోయిన్ తో రాసలీలలు.!!
కక్కుర్తికి పరాకాష్ట.. విస్మయం కలిగిస్తున్న మాజీ ముఖ్యమంత్రి నిర్వాకం.!!
నిత్యం వాడే ఆ మందులు నకిలీవంటా.. నిర్ధారించిన సెంట్రల్ డ్రగ్స్
ఆర్బీఐలో కొలువుల జాత‌ర‌. ఈనెల 16 ఆన్‌ లైన్ రిజిస్ట్రేషన్‌కు
కాంగ్రెస్ పార్టీ చేసిన పనికి ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రముఖ
కరోనా వైరస్ దెబ్బకు విల విల్లాడుతున్న చైనా.!!
కర్నాటక ఎన్నికలు ముగిసాయి.! జస్టిస్ ఫర్ ఆసిఫా గ్యాంగ్ లు
జేబులో చిల్లిగవ్వ కూడా లేదు.. పారిస్ లో బిచ్చమెత్తుకున్నాం.
చైనా యాప్ టిక్ టాక్ పై నిషేధం విధించిన ప్రభుత్వం.!!
కొత్త అసెంబ్లీ ఎందుకు.. కేసిఆర్ సర్కార్ పై హైకోర్టు ప్రశ్నల
తెలంగాణలో మ‌రో 10 నామినేటెడ్‌ పోస్టులు భర్తీ
ఆర్థిక తీవ్రవాది విజయ్ మాల్యాకు రోజులు దగ్గరపడుతున్నై..!!
కామర్స్ సబ్జెక్ట్ లో రారాజు అనీష్ కాలేజ్.. యొక్క గొప్పతనం
సినీ ఇండస్ట్రీలో ఙరుగుతున్న వాస్తవాలను చెప్తే.. కేసులు పెడతారా.??
Facebook Comments
Top
error: Content is protected !!