
60 గంటల కష్టం.. 6 బృందాల తీవ్ర శ్రమ 40 అడుగుల లోతులో ఉన్న పసి ప్రాణాన్ని 200 అడుగుల లోతులోకి పోగొట్టుకునే టెక్నాలజి. మీనా మరణం ఎన్నో గుణపాఠాలను నేర్పుతుంది. కేవలం ఒక్క తెలంగాణ రాష్ట్రానికే కాదు యావద్ భారతానికి.. శాస్త్ర సాంకేతిక రంగానికి సవాల్ విసురుతుంది. నింగిని ఏలేస్తున్నాం అని జబ్బలుచరుచుకుంటున్న మనం భూగర్భంలో ఎలా గెలవాలో తెలియక చతికిల పడిపోతున్నాం. మన కంటే చైనా వంద రెట్లు నయం. ప్రపంచ జనాభాలో నెంబర్ వన్ గా ఉన్న చైనా తన బిడ్డల ప్రాణాలను కాపాడుకోవడం లో కూడా నెంబర్ వన్ గానే నిలుస్తుంది. మనం మాత్రం బోరు బావి మింగేసిందని ఓ కన్నీటి చుక్కను వదిలి కామ్ గా ఉండిపోతున్నాం. శ్రమిస్తున్నాం కాదనడం లేదు.. మనకు గుండెలు తరుక్కుపోయే బాధపడుతున్నాం లేదనడం లేదు కానీ ఇంకా ఎన్నాళ్లీ వెతలు. మన ఇంకా ఇంకా నేల పొరల అంచుల్లోకి కూరుకుపోయి మీనా లాంటి చిట్టి తల్లులను ఇంకా ఎంత మందిని పొట్టన పెట్టుకుందాం..? ఇంకా ఎప్పుడు మన ప్రభుత్వాలు మొద్దు నిద్ర వీడుతాయి. మీనా గుణపాఠం ఎన్నాళ్లు గుర్తుంచుకుంటాం..? అసలు మనం ఎక్కడోడిపోతున్నాం..?
చైనాలో బోరు బావిలో పడిన రెండు గంటల్లోనే రేస్క్యూ ఆపరేషన్ నిర్వహించి 300 అడుగులోపల పడిన మూడేళ్ళ బాలుడిని కాపాడింది.. మరీ మనం..? 40 అడుగుల్లో మోటరుపైన ఆగిన చిన్నారి ఆర్థనాదాలు చేస్తుంటే 200 అడుగులోపలకి జారవిడుచుకుని భూతల్లికి బలి ఇచ్చుకున్నాం.
రెండు గంటల్లో చైనా 300 అడుగుల్లోని చిన్నారిని కాపాడితే.. మనం మాత్రం 60గంటలు రేస్క్యూ ఆపరేషన్ చేసి కనీసం పాప చివరి చూపును కూడా దక్కించుకోలేకపోయాం. కనీసం శరీరాన్ని కూడా చూడలేక పోయాం..? కుల్లిన దేహాన్నీ పీస్ పీస్ లుగా బయటికి తెచ్చి దౌర్బగ్యం మన టెక్నాలజిది..? అక్కడ వేగం ప్రాణం పోస్తే ఇక్కడ ఆలస్యం ఊపిరి తీసింది. బోరు బావిలో పడితే మన దగ్గర ప్రాణలపై ఆశలు వదిలేసు కోవాల్సిందేనా..? ఇలాంటి విషాదాలు ఇంకెన్నాళు చూడాలి…? ఏళ్ళతరబడి ఇదే నిర్లక్ష్యం..? ఇంకా ఇంకా పసి ప్రాణాలు బలి అవ్వాల్సిందేనా.? పుల్ స్టాప్ పడేదెన్నడు..? అత్యాదునిక టెక్నాలజీ ని ఉపయోగించి కాపాడలేరు…? సరే ముందస్తు చర్యలు చేపట్టి ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోగలరా..?
అది లేదు యుద్దప్రాతిపదికన బోరు బావికి సమాంతరంగా రోజుల తరబడి బొందలు తవ్వడం తప్ప ఇక్కడ మన వాళ్లు చేసేదేమి లేదు. ఇలాంటి ప్రమాదాలు జరగడమే ఆలస్యం తెరిచి ఉన్న బోర్ల మీద యుద్దం చేస్తారు. కొన్ని రోజులకు ఆ యుద్దంముగుస్తుంది. మళ్లీ ఇంకో నెల ఇంకో దగ్గర ఇంకొకడు అనుమతులు లేకుండా వందల అడుగుల లోతులోకి బోర్లు వేస్తూనే పోతాడు. నీళ్లు పడవు..మూత మూయడు.. మరో ప్రాణం ఇలాగే మీన తల్లిలా ఆడుకుంటూ అందులోకి జారిపోయిన ఊపిరి ఆగిపోయి.. ఇదిగో ఇలా రోజుల తరబడి మళ్లీమళ్లీ తవ్వేసి శవాల ముద్దను బయటకి తీసి కన్నవారి చేతిలో పెట్టేసి చేతులు దులుపుకుంటారు. అంయే ప్రభుత్వ యంత్రాంగం పని ముగుస్తుంది. తల్లిదండ్రుల గుండె బరువు మాత్రం అంతకంతకు పెరిగిపోతూనే ఉంటుంది.
ఇలాంటివి పునారావృతం కాకుండా ఉండాలంటే నోర్లు తెరిచిన బోర్లు కనిపిస్తే కొడుకుల మక్కిల్లు ఇరగదన్నాలి. రాష్ట్ర ప్రబుత్వం యుద్ద ప్రతిపాదికన తెరిచి వున్న బోర్లను మూసివేసి సంబందిత యాజమానులను జేల్లో వేసి బెయిల్ దొరకకుండా చుక్కలు చూపించాలి. ఆ చిన్నారులు పడే నరకం వాళ్ల జైలు గోడల మధ్య చూపించాలి. మరొకరు ఇలాంటి నిర్లక్ష్యం చేయాలంటే గుండెల్లో వణుకు పుట్టాలి. అమ్మో బోరు బావిని తెరిచి ఉంచామా చచ్చాం త్వరగా పూడ్చెయ్ అనేంత భయం పుట్టాలి. ఇది ముందు జాగ్రత్త.. ఒక వేళ పడిపోతే చైనాను మించిన ఆలోచనతో ప్రాణాలు కాపాడే టెక్నాలజి రావాలి. ఇదంతా ఒక్క రోజులో సాధ్యం కాదు నిరంతర ప్రయత్నం అవసరం. వేగమే ఎన్నటికైనా ప్రాణాలు కాపాడేది. వేగమే ఎప్పటికైనా ప్రాణాలు తీసేది. జాగ్రత్త నోర్లు తెరిచిన బోర్లున్నాయి మీ పిల్లలు జాగ్రత్త. తల్లులు కాస్త ఓ కన్నేసి ఉంచండి గుండె కోతలను కొని తెచ్చుకునే అలసత్వాన్ని వీడండి. పాప మీనా కి అశ్రునివాళి.
























