You are here
Home > తాజా వార్త‌లు > వ‌డ్డెర‌బ‌స్తీ కూడా దాట‌ని వందేళ్ల ఉత్స‌వం..? భారీ నిధులు ఎక్క‌డ‌పోయిన‌య్..?

వ‌డ్డెర‌బ‌స్తీ కూడా దాట‌ని వందేళ్ల ఉత్స‌వం..? భారీ నిధులు ఎక్క‌డ‌పోయిన‌య్..?

తెలంగాణ రాష్ట్రానికి ఊపిరి.. ఉద్య‌మాల పోరుగ‌డ్డ‌.. మ‌లిద‌శ ఉద్య‌మంలో శ‌త్రువుకు చెమ‌ట‌లు పుట్టించి ఢిల్లీ నాయ‌కుల త‌ల‌లు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాదించి పెట్టి పోరాటాల గ‌డ్డ‌.. ఎంద‌రో అమ‌ర‌వీరుల‌కు అమ్మ‌.. మ‌హోన్న‌తుల‌కు పుట్టినిల్లు మ‌రి అంత‌టి ఘ‌న చరిత్ర క‌లిగిన ఉస్మానియా వందేళ్లు పూర్తి చేసుకుంటుంటే సంబ‌రాలేవి.. అంబ‌రాన్ని ఎక్క‌డ అంటుతున్నాయి. ఉస్మానియా విశ్వ‌విద్యాల‌యంతో బంధ‌మున్న వ‌డ్డెర బ‌స్తీ గ‌ల్లీ కూడా దాట‌డం లేదు ఓయూ సంబ‌రాల కేక‌లు. ఇంత అద్వానంగా నిర్వ‌హించాలా.. నా త‌ల్లి తెలంగాణ పురిటిగ‌డ్డ‌ను ఇంత‌లా అవ‌మానించాల అని ప్ర‌శ్నిస్తున్నాయి ఓయూ విద్యార్థి గొంతుక‌లు.

తెలంగాణ రాష్ట్రం సిద్దించిన‌నాడు అంబ‌రాన్నంటే సంబ‌రాలు చేసుకుంది ఓయూ.. ఆ త‌రువాత ఏడాది రాష్ట్రమంతా సంబ‌రాల్లో మునిగిపోతుంటే చీకట్ల‌ల్లో మ‌గ్గింది నా త‌ల్లి. తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మ సంబురాల్లో గ‌జ్జె క‌ట్టి ఆడింది నా ఓయూ.. మ‌రీ అమ్మ‌కు వందేళ్లు నిండితే ఇంత త‌క్కువ చేసి చూస్తుంది ఏంటి తెలంగాణ స‌ర్కార్. కోట్ల మందికి విద్యాబుద్దులు నేర్పిన విశ్వ‌విద్యాల‌యం వందేళ్ల పండుగ‌కు 4000 మందిని మాత్ర‌మే అనుమ‌తించి తొలి దీపం వెలిగించే స‌మ‌యాన్ని వందేళ్ల పండుగ‌కు దీపం పెట్టింది స‌ర్కార్. 200 కోట్ల భారీ నిధులు వెచ్చించి సంబురాల‌ని చెప్పిన తెలంగాణ స‌ర్కార్ 2 కోట్ల నిధులు కూడా వెచ్చించిన దాఖలాలు క‌నిపించ‌డం లేదు. వెలుగు జిలుగుల‌తో ఆట‌పాట‌ల‌తో.. రాష్ట్ర‌మంతా ఓయూ సంబురాల్లో మునిగితేలాల్సిన పండుగ సంధ‌ర్భాన ఇక్క‌డే చ‌దువుకున్న ప్ర‌భుత్వ నాయ‌కులు ఒక్క‌రంటే ఒక్క‌రు కూడా ఇది మా పండుగ కాద‌నట్టు వెళ్లిపోతున్నారు. ఇంత అధ్వాన్న‌మా..? ఇంత చిన్న చూపా అని ప్ర‌శ్నిస్తున్నారు ఓయూ బిడ్డ‌లు.

నా త‌ల్లి ఉస్మానియా యూనివ‌ర్సిటీ పేరు విన‌గానే ప్ర‌తి తెలంగాణ విద్యార్థి గుండె జ‌ల్లుమంటుంది. నా త‌ల్లి కేవ‌లం పాఠాలు నేర్పిన బ‌డి మాత్ర‌మే కాదు రాష్ట్రాన్ని సాధించి పెట్టిన క‌ల్ప‌వ‌ళ్లి క‌నుక‌.. ఇక్క‌డ చ‌దివిన బిడ్డ‌లు చ‌దువైపోగానే మ‌రిచిపోయే విద్యాల‌యం అంత‌కంటే కాదు. న‌ర‌న‌రాన అమ్మ నేర్పిన పాఠాల‌ను జీర్ణించుకు జీవిత పాఠాల‌ను ఇక్క‌డే చ‌దివేసి.. భ‌విష్య‌త్ కు బంగారు బాట‌లు వేసుకుంటే ఓయూ నీడ‌లోనే ఎదిగిన వృక్షాలెన్నో. ఓయూ గ‌డ్డ‌పై కాలు పెట్టిన అనామ‌కుడు కూడా తిరిగి వెళ్లే రోజు ఉక్కు సంక‌ల్పంతో స‌మాజంలోకి అడుగు పెట్ట‌డం క‌నిపిస్తుంది. సామాజిక స్పృహ‌, స‌మ‌స్య‌ల‌పై పోరాడే త‌త్వం, ఇలా ఒక్క‌టేమిటి.. స‌మాజ స్థితిగ‌తులెన్నింటినో నేర్పిస్తుంది ఓయూ. ఒక్క‌మాట‌లో చెప్పాలంటే ఉద్య‌మాల పురిటిగ‌డ్డ‌. మ‌రి అలాంటి యూనివ‌ర్సిటీ వందేళ్ల ఉత్స‌వాలు ఎలా జ‌ర‌గాలి. అదిరిపోవాలి. సొంత రాష్ట్రంలో జ‌రుగుతున్నాయి కాబట్టి అదిరిపోతాయ‌నుకున్నారు. రాష్ట్ర స‌ర్కార్‌…200 కోట్లు ఇస్తే ఎంత ఘ‌నంగా నిర్వ‌హిస్తారో అనుకున్నారు. బ‌తుక‌మ్మల పండ‌గ‌ల‌కే హంగామా చేసే ప్ర‌భుత్వం ఓయూ వందేళ్ల ఉత్స‌వాల‌ను ఇంకెంత గ్రాండ్ చేస్తుందో అనుకున్నారు. కానీ అనుకోవ‌డ‌మే మిగిలింది. ప్రారంభోత్స‌వం నాడే ఓయూ వందేళ్ల వేడుక‌ను ఊసురుమ‌నిపించారు. అతి జాగ్ర‌త్త‌తో ఓయూ ప‌రువు తీశారు. ప్ర‌భుత్వం ప‌రువు తీసుకున్నారు. కాదు కాదు రాష్ట్ర ప్ర‌జ‌ల ప‌రువు రాష్ట్ర‌ప‌తి ముందు అడ్డంగా తీసేశారు.

వందేళ్ల యూనివ‌ర్సిటీ.. రాష్ట్ర‌ప‌తిని తీసుకొచ్చారు. బాగుంది. కానీ ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మం మ‌రీ 40 నిమిషాల్లో ముగియ‌డమేంటి..? ప్ర‌ణ‌బ్ స్పీచ్ త‌ర్వాత క‌ట్టేశారెందుకు..! యూనివ‌ర్సిటీ ఛాన్స్‌ల‌ర్‌.. గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్‌.. ఆయ‌న క‌నీసం నోరు మెద‌ప‌లేదంటి..? అక్క‌డి వ‌ర‌కు ఎందుకు ఓయూ గురించి అంతా తెలిసిన సీఎం సారు ఒక్క మాట కూడా మాట్ల‌డ‌క‌పోవ‌డం మొత్తం ఉత్స‌వాలను నీరు గార్చాయి. ఉద్య‌మంలో ఓయూ పాత్ర‌పై ఎంత గొప్ప‌గా చెబుతారోన‌ని అంద‌రూ సీఎం వైపు చూశారు. కానీ ఆయ‌న ఇలా వ‌చ్చి అలా వెళ్లిపోవ‌డం అంద‌రిని ఆశ్చ‌ర్యానికే కాదు.. ఆగ్ర‌హానికి గురి చేసింది. అయితే వందేళ్ల పండుగ‌ను అటు మీడియా కూడా అంత ఘ‌నంగా ఏమి క‌వ‌రేజ్ ఇవ్వ‌లేదు.. ఇవ్వ‌డం లేదు కూడా. గులాభీ వ‌నం ప్ర‌జానివేద‌నం అని తెలంగాణ స‌ర్కార్ సొంత డ‌బ్బాకొట్టుకునే పార్టీ మీటింగ్ కు మాత్రం డీఎస్ఎన్జీలు లైవ్ కిట్ లు ప‌ట్టుకుని ప‌రుగులు పెట్టారు. భారీ జ‌న‌స‌మీక‌ర‌ణ‌తో అట్ట‌హ‌సంగా అదేదో సంబురంగా చేస్తున్నారు. మరీ అందులో దాదాపు ఇక్క‌డ చ‌దివి రాజ‌కీయ నాయ‌కులుగా మారి పెద్ద స్థానాల్లో కూర్చున్న ఎంపీలు, మంత్రులు కూడా లేక‌పోలేదు. మ‌రీ వాళ్ల‌కైనా క‌నీస సోయి లేదా.. నా త‌ల్లి ఓయూ సంబురాల్లో తేలిపోతున్నాయ‌ని స‌ర్కార్ కావాల‌నే ఇలా చేస్తుంద‌ని. ఇది ప్ర‌తి ఓయూ బిడ్డ ఆవేద‌న‌. నా త‌ల్లి వందేళ్ల వేడుక ఇంత అద్వాన్నంగా జ‌రుగుద్ద‌ని క‌ల‌లో కూడా ఊహించుకోలేద‌ని క‌న్నీరు మున్నీర‌వుతున్నారు. ఇందుకేనా తెలంగాణ కోసం కొట్లాడి చ‌దువులు ప‌క్క‌న పెట్టి… నా మిత్రుల‌ను అమ‌రులుగా మార్చుకున్న‌ద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. నా త‌ల్లినే ప‌ట్టించుకోని పాల‌కుడు ఉంతే ఎంతా ఊడితే ఎంత అని ఆవేశంతో ఊగిపోతున్నారు.

మ‌రీ ప్ర‌భుత్వం ఏడాది పొడుగునా నిర్వ‌హిస్తామ‌న్నా మాట ప‌క్క‌న పెడితే మూడు రోజుల‌కే ఎందుకు దిక్కు లేకుండా పోయింది. స‌ర్కార్ ఇచ్చిన
రెండొంద‌ల కోట్లు నిధులు ఎక్క‌డికి పోయాయి. దేశం గ‌ర్వించే ఉస్మానియా వందేళ్ల పండక్కి చిన్న స‌భా వేదిక ఏర్పాటు చేశారు.. ఎందుకు. అందులో అంద‌రు విద్యార్థులు కూర్చేనేందుకు సరైన ప్లేస్ లేదు. విద్యార్థులు గొడ‌వ చేస్తారంటూ వారికి అక్క‌డెక్క‌డో దూర సీట్లు కేటాయించారు. అటు కొంద‌రికి మాత్ర‌మే పాస్‌లు ఇవ్వ‌డ‌మేంటి..? అందులో కొన్ని సంఘాల విద్యార్థుల‌ను ముందస్తుగా అరెస్ట్ చేయ‌డ‌మేమిటి. సాంస్కృతిక కార్య‌క్ర‌మాల‌ను కూడా ముందుగానే ముగించాల‌ని ఆర్డ‌ర్లు పాస్ చేయ‌డం ఏమిటి. 4000 విద్యార్థులు వ‌స్తే 5000 మంది పోలీసు బ‌ల‌గాల‌ను దించ‌డం ఏమిటి. ఇదేనా వందేళ్ల వేడ‌కంటే.. ఇదేనా నా త‌ల్లి తెలంగాణకు ఊపిరి పోసిన ఓయూ గ‌డ్డ పండుగంటే. ఇదంతా అవ‌మానం కాదా..? విద్యార్థుల మీద కోపంతో ఓయూ ఉత్స‌వాల‌ను ఇలాగేనా నిర్వ‌హించేది..? ఇదేం ప‌ద్ధ‌తి. వందేళ్ల సంబ‌రాలు చేసేది ఇలాగేనా..? ప‌్ర‌భుత్వం పూర్తిగా విఫ‌ల‌మైంది. వ‌రంగ‌ల్ స‌భ మాయ‌లో ఉన్న‌సర్కార్ ఉస్మానియా సంబ‌రాల‌ను మ‌రిచిపోయింది. క‌నీసం బ‌తుక‌మ్మ సంబ‌రాలపై పెట్టినంత దృష్టి కూడా పెట్ట‌క‌పోవ‌డం దారుణం. ఇక ప్ర‌తి ఒక్క ఉస్మానియా బిడ్డ మేల్కోవాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. మ‌న‌ అమ్మ‌కు నిజ‌మైన పండుగ చేయ‌నోడు మ‌న‌కు ప‌ట్టెడ‌న్నం పెడుతాన‌డి ఎలా అనుకుంటాం. ఉస్మానియా అన్నత‌మ్ముల్లు అక్క చెల్లెల్లు ఓసారి ఆలోచించండి.

(ఇట్లు.. మీ ఓయూ విద్యార్థి )

Related Posts
ప్రభుత్వ ఆస్పత్రిలో కలెక్టర్ కూతురి ప్రసవం.. సామాన్యుడి కూతురిలా చికిత్స చేయించుకున్న ప్రగతి.
నిజమే ఆమె పేరుకు తగ్గట్టుగా ప్రగతే... ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేందుకు.. పేదోడి వైద్యశాల అంటే కార్పోరెట్ ఆస్పత్రి కంటే గొప్ప అని నిరూపించేందుకు కలెక్టర్ కూతురై ఉండి కూడా  సాదరణ మహిళగా సర్కార్ ఆస్పత్రిలో పురుడు పోసుకుంది. పెద్ద మనసుతో ఆలోచించి ...
READ MORE
కొడుకుకు క్రిస్మస్ గిఫ్ట్ కోసం ఈ తల్లి ఏం చేసిందో తెలిస్తే “ఛీ” అంటారు.!!
కాలిఫోర్నియా కు చెందిన మాగ్నమ్ క్లారా గత కొన్నేండ్లుగ భర్త నుండి విడిపోయి, దొరికిన ఉద్యోగం చేసుకుంటూ తన కొడుకుని చదివించుకుంటోంది. కాగా రాబోయే క్రిస్మస్ కి తన కొడుకుకి సర్ ప్రైజ్ గిఫ్ట్ కొనివ్వాలని నిర్ణయించుకుంది. కానీ చేతిలో డబ్బు ...
READ MORE
దేశం లో బడా నేతల రాజీనామా ల పర్వం.. ఇదంతా డ్రామాలంటున్న ప్రజలు.!!
పార్లమెంట్ ఎన్నికల్లో నరేంద్ర మోడి ఆధ్వర్యంలో మరోసారి భాజపా కేంద్రంలో అధికారంలోకి రావడంతో, ఎన్నికలకు ముందు నరేంద్ర మోడి ని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రధాన మంత్రి కానివ్వం అంటూ బీరాలు పలికిన ఏఐసీసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ...
READ MORE
డ్రాగన్ ను అతి జాగ్రత్తగా ఆడిస్తున్న టైగర్.!!
ఎవరితో ద్వైపాక్షిక చర్చలు ఉండవని భావించామో అనూహ్యంగ ఆ దేశంతోనే మన ప్రధాని నరేంద్ర మోడి ద్వైపాక్షిక చర్చలను విజయవంతం చేసారు. గత రెండేల్లుగా పాకిస్తాన్ కంటే కూడా సరిహద్దుల విషయంలో చైనా మనతో కయ్యానికి కాలు దువ్వింది. ఎప్పుడెప్పుడు మనతో ...
READ MORE
కట్టా – మీఠా సార్ కు అరుదైన గౌరవం.. జ‌స్టిస్ ఆవుల సాంబ‌శివ‌రావు పుర‌స్కారానికి ఎంపిక‌.
న‌మ‌స్తే తెలంగాణ దినప‌త్రిక ఎడిట‌ర్ క‌ట్టా శేఖ‌ర్ రెడ్డికి అరుదైన గౌర‌వం ద‌క్కింది. ఈ ఏడాది జ‌స్టిస్ ఆవుల సాంబ‌శివ‌రావు పుర‌స్కారానికి ఆయ‌న ఎంపిక‌య్యారు. తెలుగు విశ్వవిద్యాలయం ఈ పురస్కారాన్ని ఈనెల 24న ప్ర‌దానం చేయ‌నుంది. ఈ ఏడాది జ‌స్టిస్ ఆవుల ...
READ MORE
పూరీనీ పోలీసులు ఏమని అడిగారు.? విచారణ ఇంకా ఉందా.??
నిన్న ఉదయం 10:30 నుండి దాదాపు 11గంటలు టాలివుడ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ని డ్రగ్స్ కేసు విషయంలో సిట్ అధికారులు ప్రశ్నించారు. విచారణ అనంతరం ఎక్సైజ్ ఆఫీస్ నుండి బయటకి వచ్చిన పూరీ కొంత అసంతృప్తి గా కనిపించడం జరిగింది. మీడియా తో ...
READ MORE
ఆరోగ్య భారత నిర్మాణంలో నిమగ్నమైన ప్రధాని మోడీ.! హెల్త్ స్కీం విధివిధానాలు చదవండి.!!
ఒక పేద కుటుంబం లేదా మద్యతరగతి కుటుంబం అంటే.. ఎలా ఉంటదో మనందరికీ తెలిసిందే ఇంట్లో దాదాపు అంతా ఏదో కష్టం చేసుకోకతప్పదు. లేదంటే చాలా విషయాల్లో సర్థుకుపోయి జీవిస్తుంటారు. మరి అలాంటి కుటుంబంలో హఠాత్తుగా ఏదైనా జరగరానిది జరిగితే.. ఇంట్లో ...
READ MORE
ట్రంప్ తర్వాత వైట్ హౌస్ ఫాలో అవుతున్న ఏకైక లీడర్ నరేంద్ర మోడీ.!!
నరేంద్ర మోడీ.. ఈ పేరు ఎంత ప్రాచుర్యం పొందింది అంటే, నరేంద్ర మోడీ కి ముందు భారత దేశం నరేంద్ర మోడీ తర్వాత భారత దేశం అనేంత. ఇంట గెలిచిన నరేంద్ర మోడీ రచ్చ కూడా గెలిచాడు. రచ్చ గెలవడం అంటే.. ఏదో ...
READ MORE
శివుడు జపించే రామ మంత్రం..
అడ్డ నామాల వాడి నోట నిలువు నామల వాడి మాట. ముక్కంటి కనులలో విష్ణుతత్వం. పరమేశ్వరుడు సృష్టి లయకారకుడు శివుడు రామ మంత్రాన్ని మనసార జపించాడని శాస్త్రాలు చెబుతున్నాయి. అంతటి పర పవిత్ర మంత్ర జగత్తును సర్వ పాపల నుండి పునీతులను ...
READ MORE
అందుకే రాహుల్ గాంధీ రాజీనామా చేసారు.. కాంగ్రెస్ నేతలు భాజపా లోకి రావాలి.!!
తెలంగాణ రాష్ట్రం లో ఇక కాంగ్రెస్ పార్టీ కి భవిష్యత్ లేదని, కేసిఆర్ నియంతృత్వ పాలన నుండి రాష్ట్రాన్ని కాపాడాలంటే అది భాజపా తోనే సాధ్యమని అందుకోసం కాంగ్రెస్ పార్టీ లోని బలమైన నేతలంతా భాజపా లోకి రావాలని పిలుపునిచ్చారు భాజపా ...
READ MORE
సామాన్య కుటుంబం నుండి ఫిజిక్స్ లో డాక్టరేట్ సాధించిన శ్రావణ్ కుమార్ రెడ్డి
నల్గొండ నివాసి అయిన సోమిరెడ్డి శ్రావణ్ కుమార్ రెడ్డి అతి క్లిష్టమైన భౌతికశాస్త్రం(ఫిజిక్స్) లో డాక్టరేట్ సాధించాడు. బాల్యం నుండే చదువులో ముందుండే శ్రావణ్ కుమార్ రెడ్డి ఉస్మానియా యూనివర్శిటీ లో ఎంఎస్సీ ఫిజిక్స్ లో పీజీ పూర్తి చేసి, రాష్ట్ర ...
READ MORE
భార‌త్ పై దాడికి అణుబాంబులు సిద్దం చేసుకున్న పాకిస్తాన్.. ఢిల్లీకి 250 కి.మీ దూరంలో స్థావ‌రాలు.
భారత్‌పై దాడి చేసేందుకు పాకిస్తాన్‌ భారీగా అణు ఆయుధాలు సిద్ధం చేసినట్లు ఓ అంతర్జాతీయ వెబ్‌సైట్‌ తెలిపింది. దాదాపు 140 అణు ఆయుధాలను తయారు చేసుకొని పెట్టుకున్న పాక్‌, వాటిని దాచేందుకు పాకిస్తాన్‌లోని మియన్‌వాలీ పట్టణంలో సొరంగాన్ని నిర్మిస్తున్నట్లు ఆ వెబ్‌సైట్‌ ...
READ MORE
ప్రధాని మోడీ జీ కశ్మీర్ ను మాకు వదిలేయండి.. ఒడిసెల దెబ్బ చూపిస్తాం.
ప్రధాని నరేంద్రమోడీకి ఓ గిరిజన యువకుడు రాసిన లేఖ సంచలనం రేపుతోంది. కశ్మీర్ యువకులు జవాన్ల పై జరిపిన దాడిని వ్యతిరేకిస్తూ ఈ లేఖ రాసినట్టు సమాచారం. మోడీ జీ మాకు కశ్మీర్ వదిలేయండి మా ప్రతాపం చూపిస్తాం అంటూ రాసిన ...
READ MORE
సామాన్యుడి సంపాద‌న‌కి ఎస‌రు పెడుతున్న బ్యాంకులు.. స‌ర్ ఛార్జ్ తీరు చూస్తే దిమ్మ తిర‌గాల్సిందే.
బ్యాంకులు స‌ర్ ఛార్జ్ లు విధించేందుంకు సిద్ద‌ప‌డిన విష‌యం తెలిసిందే. ఈ బ్యాంకు ఆ బ్యాంకు అని తేడా లేకుండా అన్ని బ్యాంకులు త‌మకు న‌చ్చిన తీరుగా సేవా రుసుం విధించి సామాన్యుడి క‌ష్టార్జితానికి శ‌ఠ‌గోపం పెట్టేసాయి. మ‌రీ ఏ బ్యాంకు ...
READ MORE
పంజాబ్ కాంగ్రెస్ లో లుకలుకలు మంత్రి పదవికి సిద్దూ రాజీనామా.!!
పంజాబ్ రాష్ట్రం లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ లో లుకలుకలు బయటపడ్డాయి.ఈ పరిణామం కాంగ్రెస్ పార్టీ కి దెబ్బ మీద దెబ్బ తాకినట్టైంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా బలహీనపడ్డ కాంగ్రెస్ కి ఈ పరిస్థితి మరింత కుంగదీసినట్టైంది.అయితే మొన్నటి పార్లమెంట్ ...
READ MORE
చీర్యాల నరసింహుడి బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి ని ఆహ్వానించిన ఆలయ చైర్మణ్.!!
తెలంగాణ ప్రముఖ ఆలయం చీర్యాల శ్రీశ్రీశ్రీ లక్ష్మి నృసింహ స్వామి దేవాలయంలో ఈ నెల 09 తేదీ నుండి 14 వ తేదీ వరకు జరగనున్న స్వామి వారి బ్రహ్మోత్సవాలకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ని కలిసి ...
READ MORE
అమరావతిలో “వర్షం” వచ్చింది టీడీపీ సర్కార్ ఇజ్జత్ “గంగ”లో కలిసిపోయింది.
వర్షం వచ్చినప్పుడు లోతట్టు ప్రాంతాలో లేక మౌలిక వసతులు లేని గరీబోల్ల బస్తీలోనో వర్షం నీరు నిలిచి ఇళ్లన్నీ కురవడం సర్వసాధారణం. కానీ ఏకంగా రాష్ట్రానికే కిరీటం లాంటి సచివాలయం లోపలికే వర్షం నీరొస్తే.. ఆ నీటినంత బక్కెట్లతో ఎత్తుకుంటే.. అదే ఆంద్రప్రదేశ్ ...
READ MORE
సెంట్రల్ బోర్డ్ ఫిలిం సర్టిఫికేషన్ అడ్వైజరీ బోర్డు మెంబర్ గ కెంచె చంద్రశేఖర్.
హైద్రాబాద్ రీజినల్ కేంద్రం గ సెంట్రల్ బోర్డ్ ఫిలిం సర్టిఫికేషన్(CBFC) అడ్వైజరీ ప్యానెల్ కు మెంబర్ గ కెంచె చంద్రశేఖర్ ను నియమిస్తునట్టు కేంద్ర ప్రభుత్వం అధికారికంగ ప్రకటించింది. ఈ సంధర్భంగ హైద్రాబాద్ అంబర్ పేట్ నియోజకవర్గంకి చెందిన ఒక సామాన్య కుటుంబ ...
READ MORE
భైంసా దారుణ ఘటన గూర్చి ఒక్క బీజేపీ మాత్రమే ఎందుకు పోరాటం చేస్తున్నది.??
తెలంగాణ నిర్మల్ జిల్లా భైంసా లో జరిగిన దారుణ ఘటన గురించి దాదాపు ఏ మీడియా లో రాకున్నప్పటికి ఆ ఘటన లో వంద మందికి పైగా హిందువులు పదుల సంఖ్యలో హిందూ కుటుంబాలు రోడ్డున పడ్డాయి.సొంత ఊర్లో సొంత ఇంట్లో ...
READ MORE
అత్యాశ 120 మందిని సజీవ దహనం చేసింది.
ఆశ మనిషిని బ్రతికిస్తుంది.. అత్యాశ మనిషి ప్రాణాలను తీస్తుంది అనడానికి నిలువెత్తు సాక్ష్యం ఈ ఘటన. ఉగ్ర పాకిస్తాన్ లోని పంజాబ్ రాష్ట్రంలో ఉన్న బహవల్ పూర్ లో ఆదివారం ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకొంది. ఈ ప్రమాదంలో 120 మంది ...
READ MORE
పబ్జీ గేమ్ ఆడొద్దంటే.. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి.!!
పబ్జీ… ఇప్పుడీ పేరు ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్..ఎందుకంటే ఒక వీడియో గేమ్ గ వినోదం పంచడం కాకుండ, ఏకంగ ప్రజల ప్రాణాలనే హరిస్తుంది. ఇప్పటికే మన దేశం తో కలిపి ఆయా దేశాలలో చాలా మంది యువకులు విద్యార్ధులు ప్రాణాలు ...
READ MORE
వరంగల్ హన్మకొండ లో దారుణం.. 9 నెలల పసికందుపై రాక్షస చర్య.!!
వరంగల్ హన్మకొండ లో సభ్య సమాజం తల దించుకునే ఘటన చోటు చేసుకుంది. నిందుతుడిని నడిరోడ్డు పై ఉరి తీసి చంపినా వాడు చేసిన దారుణ చర్య కు పాపపరిహారం ఉండదు. హన్మకొండ టైలర్ స్ట్రీట్ లో నివాసముండే జగన్ రచన ...
READ MORE
అక్రెడిటేషన్ లేని జర్నలిస్టులకు శుభవార్త… అందరికి హెల్త్ కార్డులు.
అక్రెడిటేషన్ కార్డులతో సంబంధం లేకుండా వర్కింగ్ జర్నలిస్టులందరికీ హెల్త్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది,ఇవ్వాళ సమాచార శాఖ కమీషనరు కార్యాలయం లో అల్లం నారాయణ అధ్యక్షతన  జరిగిన సమావేశం లో   వర్కింగ్ జర్నలిస్టులందరికీ హెల్త్ కార్డులు అందించాలని కమిటీ నిర్ణయించింది. ...
READ MORE
బాబూ నిన్ను నమ్ముకుంటే సీమ ప్రజలకు చిప్ప కూడే.. ప్రాజెక్టులు చెబుతున్న నిజాలు..
ప్రాజెక్టులపై పెద్ద మనసు సర్కారు జిల్లాలకేనా- కరువు సీమపై కనికరం లేదా. ప్రాజెక్టులపై పెద్ద మనసు పేరుతో ఈనాడు దినపత్రిక లో పతాక శీర్షికతో పెద్ద కధనాన్ని ప్రచురించింది. వార్తను చూసిన వారు ఎవరైనా చాలా సంతోషిస్దారు. మొత్తం వార్తను జాగ్రత్తగా పరిశీలిస్దే ...
READ MORE
అర్థరాత్రి చిచ్చు రేపిన సోషల్ మీడియా మెసేజ్.. ఉట్నూర్ లో 144 సెక్షన్ అమలు.
అడవుల జిల్లా ఆదిలాబాద్ లో అర్థరాత్రి కలకలం రేగింది. జిల్లాలోని ఉట్నూర్ ఐటీడిఏ పరిదిలో ఓ వ్యక్తి చేసిన సోషల్ మీడియా మెసేజ్ తో జిల్లా అంతా ఒక్క సారిగా ఉలిక్కి పడింది. రాత్రికి రాత్రి పోలీస్ ఉన్నతాధికారులను ఉరుకులు పరుగులు ...
READ MORE
ప్రభుత్వ ఆస్పత్రిలో కలెక్టర్ కూతురి ప్రసవం.. సామాన్యుడి కూతురిలా చికిత్స
కొడుకుకు క్రిస్మస్ గిఫ్ట్ కోసం ఈ తల్లి ఏం చేసిందో
దేశం లో బడా నేతల రాజీనామా ల పర్వం.. ఇదంతా
డ్రాగన్ ను అతి జాగ్రత్తగా ఆడిస్తున్న టైగర్.!!
కట్టా – మీఠా సార్ కు అరుదైన గౌరవం.. జ‌స్టిస్
పూరీనీ పోలీసులు ఏమని అడిగారు.? విచారణ ఇంకా ఉందా.??
ఆరోగ్య భారత నిర్మాణంలో నిమగ్నమైన ప్రధాని మోడీ.! హెల్త్ స్కీం
ట్రంప్ తర్వాత వైట్ హౌస్ ఫాలో అవుతున్న ఏకైక లీడర్
శివుడు జపించే రామ మంత్రం..
అందుకే రాహుల్ గాంధీ రాజీనామా చేసారు.. కాంగ్రెస్ నేతలు భాజపా
సామాన్య కుటుంబం నుండి ఫిజిక్స్ లో డాక్టరేట్ సాధించిన శ్రావణ్
భార‌త్ పై దాడికి అణుబాంబులు సిద్దం చేసుకున్న పాకిస్తాన్.. ఢిల్లీకి
ప్రధాని మోడీ జీ కశ్మీర్ ను మాకు వదిలేయండి.. ఒడిసెల
సామాన్యుడి సంపాద‌న‌కి ఎస‌రు పెడుతున్న బ్యాంకులు.. స‌ర్ ఛార్జ్ తీరు
పంజాబ్ కాంగ్రెస్ లో లుకలుకలు మంత్రి పదవికి సిద్దూ రాజీనామా.!!
చీర్యాల నరసింహుడి బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి ని ఆహ్వానించిన ఆలయ చైర్మణ్.!!
అమరావతిలో “వర్షం” వచ్చింది టీడీపీ సర్కార్ ఇజ్జత్ “గంగ”లో కలిసిపోయింది.
సెంట్రల్ బోర్డ్ ఫిలిం సర్టిఫికేషన్ అడ్వైజరీ బోర్డు మెంబర్ గ
భైంసా దారుణ ఘటన గూర్చి ఒక్క బీజేపీ మాత్రమే ఎందుకు
అత్యాశ 120 మందిని సజీవ దహనం చేసింది.
పబ్జీ గేమ్ ఆడొద్దంటే.. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి.!!
వరంగల్ హన్మకొండ లో దారుణం.. 9 నెలల పసికందుపై రాక్షస
అక్రెడిటేషన్ లేని జర్నలిస్టులకు శుభవార్త… అందరికి హెల్త్ కార్డులు.
బాబూ నిన్ను నమ్ముకుంటే సీమ ప్రజలకు చిప్ప కూడే.. ప్రాజెక్టులు
అర్థరాత్రి చిచ్చు రేపిన సోషల్ మీడియా మెసేజ్.. ఉట్నూర్ లో
Facebook Comments
Top
error: Content is protected !!