
స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్.. వేగం మజాగానే ఉంటుంది కానీ మత్తు కంటే వేగంగా ప్రాణాలు తీస్తుందని చెపుతున్న వాహనదారులు వినడం లేదు. వేగం వద్దురా మొర్రో అని మొత్తుకున్నా ఎవ్వరు వినడం లేదు. హైవేల పైనే రెట్టించిన ఉత్సాహంతో నడిపే కుర్రకారు నగరనడిబొడ్డున కూడా అదే వేగాన్ని కంటిన్యూ చేస్తున్నారు ఫలితంగా ప్రమాదాల భారీన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. భయకరమైన స్పీడ్ తో పల్టీలు కొట్టిన కారు పక్క వాహనాల పైకి దూసుకుపోక పోవడంతో పెణు ప్రమాదమే తప్పింది. అయినా ప్రాణాలు మాత్రం కోల్పోకుండా ఆపలేకపోయారు.
హైదరాబాద్ నగగరంలోని జారాహిల్స్ కారు బీభత్సం సృష్టించింది. అతి వేగంగా వచ్చి డివైడర్ ను ఢీకొని పల్టీలు కొట్టింది. ఈ సమయంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గరులో ఒకరు అక్కడిక్కడే మృతి చెందాడు. మిగిలిన ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. నిత్యం చాలా రద్దీగా ఉంటే పంజాగుట్ట – బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3 లో ఈ ఘోర ప్రమాదం జరిగింది. రెప్పపాటు కాలంలో జరిగిన ఈ ప్రమాదంలో డివైడర్ ఢీకొట్టిన కారు డివైడర్స్ ను తొలుచుకుంటూ దూసుకుపోయింది. అదే సమయంలో పదుల సంఖ్యలో వాహనాలు పక్క నుండే వెళుతున్నాయి. అదుపు తప్పి ప్రమాదానికి గురైన కారు నడి రోడ్డు మీదకు వచ్చుంటే మాత్రం ప్రమాద తీవ్రత పెరిగుండేదని స్థానికులు చెపుతున్నారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 3 మసీదు జంక్షన్ దగ్గర ఈ యాక్సిడెంట్ చోటు చేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం ఈ ప్రమాదం జరిగిన ప్రదేశానికి కొద్ది దూరంలోనే గతంలో రమ్య యాక్సిడెంట్ జరిగింది. ఈ ప్రమాదంతో ఒక్క సారిగా పట్టణ వాసులు మళ్లీ ఆ విషయాన్ని గుర్తు చేసుకున్నారు. వేగంగా నడుపుతు కుటుంబాల్లో విషాదాల మిగిలిస్తున్నా కుర్రకారులో మాత్రం మార్పు రావడం లేదు. చేతిలో ఖరైదైన వాహనాలు ఉండటం.. జల్సాలకు అలవాటు పడటంతో ఇలాంటి ప్రమాదాలకు కారణనవుతున్నారు.
ఇప్పటికైనా ప్రభుత్వ మరింత కఠిన చర్యలో తీసుకోకపోతే మరో రమ్య ఘటన ఇక్కడే జరిగినా జరగవచ్చు. డివైడర్ల పుణ్యామాని అక్కడే ఆగిపోయింది కానీ ఒక వేళ డివైడర్లు అడ్డుపడకపోతే ప్రమాద తీవ్రత పెరిగి చిన్నారి రమ్య ప్రమాద ఘంటిక మరో సారి పునారావృతం అయుండేది.