You are here
Home > తాజా వార్త‌లు > బంగారు తెలంగాణలో గాల్లో దీపాలైతున్న భావి భారత పౌరుల ప్రాణాలు.!!

బంగారు తెలంగాణలో గాల్లో దీపాలైతున్న భావి భారత పౌరుల ప్రాణాలు.!!

ఎందరో ఉద్యమ వీరులు రక్తం పారిస్తే వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఇక అన్ని వర్గాల ప్రజలు సంక్షేమం తో అభివృద్ది చెందుతారనే అభిప్రాయం తో పూర్తిగా భిన్నంగా పరిస్థితులు మారుతున్నట్టు స్పష్టం చేస్తున్నారు పలువురు ఉద్యమకారులు సామాజిక వేత్తలు. అందులోనూ భవిష్యత్తులో దేశ అభివృద్ది కోసం పాటుపడాల్సిన భావి భారత పౌరుల ప్రాణాలకే రక్షణ కరువైందని ఈ పరిస్థితి అత్యంత బాధాకరం అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు ఉదాహరణగా ఈ మధ్య నే జరిగిన మల్కాజిగిరి లో నాలలో పడి మృత్యువాత పడిన చిన్నారి సుమేధ కావచ్చు అదే విధంగా సరూర్ నగర్ పరిధిలో అపార్ట్మెంట్ సెల్లార్ లో వర్షం నీటి లో మునిగిపోయి మరణించిన మూడేండ్ల బాలుడు అర్జిత్ సాయి కావచ్చు తాజాగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఏడేండ్ల బాలుడు నిఖిల్ ఎటువంటి రక్షణ కవచం లేని ట్రాన్స్ ఫారాం తాకి తీవ్రమైన కరెంట్ షాక్ వల్ల శరీరం అంతా కాలిపోయి వారం రోజులు ఉస్మానియా ఆస్పత్రి లో మృత్యువుతో పోరాడి పోరాడి చివరికి గెలవలేక ఓడిపోయి తన తల్లి కి కన్నీరు మిగిల్చి, అధికారులు పాలకుల అవినీతి నిర్లక్ష్యానికి సాక్ష్యంగా మిగిలిపోవడం స్థానికులను మరియు విషయం తెలుసుకున్న ప్రజలను సైతం కంట తడి పెట్టిస్తున్నది.

కాగా.. జవహర్ నగర్ లో బాలుడు నిఖిల్ కు ప్రమాదం జరగడానికి ముఖ్య కారణమైన ట్రాన్స్ ఫారానికి ఎటువంటి రక్షణ కవచం లేకపోవడమే కాదు, సరైన ఎత్తులో ఏర్పాటు చేయాల్సిన ట్రాన్స్ ఫారం ని కేవలం రెండు మూడు అడుగుల ఎత్తులో నే ఏర్పాటు చేసేసి పని ముగించేసి మమ అనిపించేయడమే అని అంటున్నారు స్థానికులు. సదరు ట్రాన్స్ ఫారం మూలంగా ప్రమాదం జరగడం ఇది కొత్త కాదని, ఇదివరకే రెండు మూడు సార్లు మేకలు ఆవులు చనిపోవడం జరిగినట్టు స్థానికుల ద్వారా తెలుస్తున్నది. అంటే అధికారులు పాలకుల నిర్లక్ష్యం అవినీతి ఖరీదు ఒక నిండు బాలుడు అని స్పష్టం అవుతున్నది.
ప్రమాదానికి గల కారణాలు గల కారణాలు ఇలా ఉంటే, ప్రమాదం జరిగి వారం రోజులైపోయినా భర్త చనిపోయినా రోజూ కూలి పని చేసుకుని బిడ్డల్ని సాకుతున్న బాలుడు నిఖిల్ తల్లి ని గాని ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్న బాలుడు నిఖిల్ ను గాని కనీసం పరామర్శించిన అధికారి గాని ప్రజా ప్రతినిధి గాని ఎవరూ లేడు అంటే బంగారు తెలంగాణ లో పేదోడి బతుకు పరిస్తితి ఏంటో అర్థం అవుతుందని అంటున్నారు పలువురు ప్రజా స్వామ్యవాదులు. కాగా చివరకు బాలుడు నిఖిల్ మరణించిన తర్వాత బాలుడి తల్లి మరియు బంధువులు స్థానికులు ఆగ్రహంతో ధర్నా చేసేందుకు సిద్దం అవగా అప్పుడు అధికార పార్టీ తెరాస నాయకులు కార్పొరేటర్లు కార్పొరేషన్ మేయర్ మరియు కరెంట్ డిపార్ట్మెంట్ అధికారులు పోలీసులు బాధిత ఇంటికి వెళ్లి సముదాయించే ప్రయత్నం చేయడం, కంటి తుడుపు చర్య గా ప్రభుత్వం నుండి ఓ అయిదు లక్షల నగదు పరిహారం వచ్చేలా ప్రయత్నం చేస్తామని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోవడం జరిగిందని, ఈ చర్య బాధిత పేద కుటుంబాన్ని ఏ విధంగ ఆదుకున్నట్టు అవుతుందో అధికార పార్టీ నాయకులు ప్రజా ప్రతినిధులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నది జవహర్ నగర్ అభివృద్ది సాధన సమితి (JASS).

ఓ వైపు రాష్ట్రం లో రోజు రోజుకు బయట పడుతున్న మహిళ ల పై మరియు అభం శుభం తెలియని బాలికల పై అత్యాచారాలు అఘాయిత్యాలు, మరో వైపు కేవలం పాలకుల తప్పుల కారణంగా నే ప్రజలు చిన్నారులు మృత్యవాత పడడం నిజంగా తెలంగాణ ప్రజల దౌర్భాగ్యమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు జవహర్ నగర్ అభివృద్ది సాధన సమితి అధ్యక్షుడు రాంబాబు దొంతమల్ల.

జవహర్ నగర్ ప్రజలంటే రాజకీయ నాయకుల కు కేవలం ఎన్నికల్లో ఒట్లు వేయడానికే ఉన్నారు అనే ధోరణి ఉందని, ఇది మరోసారి బాలుడు నిఖిల్ మరణం ఘటన రుజువు చేసిందని, వాస్తవానికి బాలుడు నిఖిల్ ప్రమాదంలో చనిపోయాడు అనడం కంటే ప్రభుత్వం చేసిన హత్య కు బలైయ్యాడు అనడం సరైందని ఆగ్రహం వ్యక్తం చేశారు జవహర్ నగర్ అభివృద్ది సాధన సమితి అధ్యక్షుడు రాంబాబు దొంతమల్ల. అంతే కాదు పేదవాడి చావు అంటే లెక్క లేదు కనుకే జవహర్ నగర్ అంటే నాకు గుండె కాయ అని స్పీచ్ లు ఇచ్చే మంత్రి మల్లారెడ్డి మరియు పక్క రాష్ట్రాలు పక్క దేశాల్లో జరిగే ఘటనల పై పోరాటాలు చేసే స్థానిక ఎంపీ రేవంత్ రెడ్డి లు గానీ ఒక్కరు కూడా బాధిత పేద కుటుంబం గురించి పట్టించుకోకపోవడం బాధాకరం అని కూడా అభిప్రాయం వ్యక్తం చేశారు రాంబాబు దొంతమల్ల. ఇప్పటికైనా బాలుడు నిఖిల్ మరణానికి భేషరతుగా బాధ్యత వహించి రాష్ట్ర ప్రభుత్వం రాజకీయాలు చేయకుండా తక్షణం తండ్రి లేని బాధిత బాలుడు నిఖిల్ కుటుంబానికి యాభై లక్షల రూపాయల నగదు పరిహారం చెల్లించి, బాధిత బాలుడు నిఖిల్ తల్లి కి ప్రభుత్వ పరంగా ఉద్యోగం కల్పించి ఆదుకోవాలని కూడా డిమాండ్ చేశారు జవహర్ నగర్ అభివృద్ది సాధన సమితి అధ్యక్షుడు రాంబాబు దొంతమల్ల. లేదంటే ప్రజా పోరాటం చేసి ప్రభుత్వం మేడలు వంచుతాం అని హెచ్చరించారు. అంతే కాదు దేశంలో ప్రజల బాగు కోసమే పాలకులు అధికారులు ఉన్నారని ప్రజల చేత జీతాలు తీసుకుంటున్నందుకైనా ధర్మంగా న్యాయంగా పని చేయాలని అధికారుల్లో పాలకులల్లో ఇప్పటికైనా సరైన మార్పు రావాలని అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఇప్పటికే డంపింగ్ యార్డ్ వల్ల ప్రమాదకర రోగాలతో సతమతమవుతున్న జవహర్ నగర్ ప్రజలకు ఎటువంటి కనీస మౌలిక వసతులకు కూడా నోచుకోని ప్రజలకు ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు కూడా ఎదురవడం ఆందోళనకరమని అవేదన వ్యక్తం చేశారు. 

Related Posts
నిజాం పేట్ లో గల్లంతై మహరాష్ట్ర దాదర్ లో తేలింది. పూర్ణిమ సాయి మిస్సింగ్ కథ సుఖాంతం.
హైదరాబాద్ కూకట్‌పల్లి నిజాంపేట్‌ నుంచి 40 రోజుల క్రితం అదృశ్యమైన పదోతరగతి బాలిక పూర్ణిమ ఆచూకి ముంబైలో దొరికింది. జూన్‌ ఏడున స్కూల్‌కు వెళ్తున్నానని చెప్పిన పూర్ణిమ తిరిగి రాలేదు. దీంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు 14 ...
READ MORE
బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్యతో వేడెక్కిన రాష్ట్ర రాజకీయాలు..!! రాజకీయ కోణం ఉంది.??
కోమటిరెడ్డి వెంకట రెడ్డి ప్రధాన అనుచరుడు నల్గొండ మున్సిపల్ చైర్మణ్ లక్ష్మి భర్త కాంగ్రెస్ నేత బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్యతో రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కినై.. కాగా బొడ్డుపల్లి శ్రీనివాస్ సంతాప సభ నిర్వహించిన కాంగ్రెస్ అధిష్టానం అధికార పార్టీ టీఆర్ఎస్ పై ...
READ MORE
అతనికి రెండు పెళ్లిల్లు అయ్యాయని తెలిసే.. మూడో పెళ్లి చేసుకున్న.!!
బోడుప్పల్ టీఆర్ఎస్ నేత శ్రీనివాస్ రెడ్డి మూడు పెళ్ళిల్ల వ్యవహారం.. రెండో భార్య సంగీత నిరసన దీక్ష వివాదం అందరికీ తెలిసిందే.. మొదటి భార్య స్వాతి కి విడాకులు ఇచ్చాడు శ్రీనివాస్ రెడ్డి, కానీ రెండో భార్య సంగీత కు విడాకులు ఇవ్నకుండానే ...
READ MORE
కేంద్ర రక్షణశాఖ పరిదిలోని ఆర్డ్ నెన్స్ ఫ్యాక్టరీ బోర్డులో 3,581 ఉద్యోగాలు
కేంద్ర రక్షణ శాఖ పరిధిలోని ఆర్డ్ నెన్స్ ఫ్యాక్టరీ బోర్డు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని ఆర్డ్ నెన్స్ ఫ్యాక్టరీల్టో 3,581 ఇండస్ట్రియల్ ఎంప్లాయిస్ (సెమీ స్కిల్డ్ వర్క్ మెన్), లేబర్ గ్రూప్ ‘సి’ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. వయస్సు ...
READ MORE
నన్నూరి నర్సిరెడ్డి కి పోసాని ఖతర్నాక్ కౌంటర్.!!
మహానాడు సభలో జగన్ పై పిట్టకథలతో కామెడీ చేసాడు తెతెదేపా నాయకుడు నన్నూరి నర్సిరెడ్డి. మహానాడు మీటింగ్ లో వైఠస్ఆర్సీపీ అధినేత జగన్ మోహన్ కేవలం సీఎం సీటు కోసమే ఆరాటపడుతున్నాడనీ.. అందుకు ఎద్దేవా చేసేలా వెంకటేశ్వర స్వామి అలివేలు మంగమ్మ ...
READ MORE
ఎవడైనా డాక్టర్లపై పోలీసులపై దాడులు చేస్తే కాల్చి పారేయండ్రి.. దేశ అధ్యక్షుడి ఆర్డర్.!!
కరోనా వైరస్ ఎలాంటిదో అందరికీ తెలిసిందే.. ఒకరి నుండి మరొకరికి తాకిన కూడా వ్యాపిస్తుంది. అలాంటి పరిస్తితుల్లో.. వైద్యులు మరియు పోలీసులు ప్రాణానికి తెగించి విధులు నిర్వహిస్తుంటే.. కొందరు వెధవలు ఇంకా ప్రత్యేకంగ చెప్పాలంటే డిల్లీ నిజాముద్దీన్ లో గల మసీదు ...
READ MORE
అవినీతి అనకొండ MRO నాగరాజు ఉదంతం.. రెవెన్యూ శాఖ ప్రక్షాళన డిమాండ్.!!
రెవెన్యూ శాఖ లో టైపిస్టు నుండి MRO స్థాయికి ఎదిగాడు అంటే ఎంత గొప్ప పనిమంతుడో అనుకుంటే పొరపాటే.. మొత్తం లంచాల బతుకే, ఇలా లంచాలు తింటూ తినిపిస్తూ ఉన్నత అధికారి స్థాయికి ఎదిగిన నాగరాజు తాజాగా కీసర మండలం MRO ...
READ MORE
జమ్ము కాశ్మీర్ లో గవర్నర్ పాలన.! ఏం జరగనుందోననే భయంలో పాకిస్తాన్.!!
దేశ రాజకీయాల్లో మరో అనూహ్య పరిస్థితి చోటు చేసుకుంది. జమ్ము కాశ్మీర్ రాష్ట్రం లో పీడీపీ భాజపా పొత్తు విడిపోవడంతో తప్పనిసరి పరిస్థితి లో ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తి రాజీనామా చేసారు. అంతకు ముందు భాజపా తన మంత్రులను ఉపసంహరించుకుంది. అయితే.. గత నెలంతా ...
READ MORE
ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య..
ఎంత కష్టమొచ్చిందో.. ఎన్ని బాధలను పంటి దిగువున బరించాల్సి వచ్చిందో.. ఓ వైపు పేదరికం మరో వైపు అవమానాలు.. అనుమానమే పెణుభూతమైతే.. మనసు మీద నిందపడితే ఎంతటి ఘోరం జరుగుతుందో తేల్చింది ఈ ఘటన. అవమాన భారంతో పిల్లలను సైతం చావులు ...
READ MORE
కొలువ కొట్లాట సాక్షిగా కేసీఆర్ పై ఫైర్ అయిన మేదావులు. దొర‌ల‌పాల‌నే న‌డుస్తుంద‌ని మండిపాటు.
తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్నామ‌ని.. విద్యార్థుల బ‌లిదానాల‌తో అమ‌ర‌త్వంతో తెలంగాణ సిద్దిస్తే నేడు మ‌ళ్లీ అవే బ‌లిదానాలు.. రైతుల ఆత్మ‌హ‌త్య‌లు.. నిరుద్యోగుల ఆర్థ‌నాదాలు క‌నిపిస్తున్నాయంటు కొలువుల కొట్లాట స‌భ సాక్షిగా మేదావులు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఆనాడు ఆంధ్ర స‌ర్కార్ నిరంకుశ దోర‌ణి ...
READ MORE
తెలంగాణ సచివాలయం ఎదుట నిర్మల్ వాసి దేవేందర్ ఆత్మహత్యయత్నం.
తెలంగాణ రాష్ట్ర సచివాలయం సి బ్లాక్ ఎదుట దేవేందర్ అనే వ్యక్తి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. భార్య పిల్లలతో కలిసి మధ్యాహ్నం సమయంలో సచివాలయానికి వచ్చిన దేవేందర్ సాయత్రం సమయంలో ఆత్మహత్య యత్నం చేశాడు. వెంట తెచ్చుకున్న పురుగుల మందును అధికారుల ముందే ...
READ MORE
యూపీలో సిఎం యోగి పైన కుట్రలు జరుగుతున్నయా..??
ఉత్తర్ ప్రదేశ్ లో భాజపా బంపర్ మెజారిటీతో గెలిచాక ఎవరిని ముఖ్యమంత్రి ని చేయాలో చర్చలు తర్వాత యోగీ ఆదిత్యానాద్ ని ఎంపిక చేసింది అధిష్టానం. కానీ ఈ నిర్ణయాన్ని తొలుత చాలామందే వ్యతిరేకించినా తర్వాత ఆయన పాలనలో తన మన ...
READ MORE
క్రికెట్ రారాజు యువరాజ్ సింగ్ రిటైర్మెంట్ ప్రకటించాడు..!!
ఎన్నో క్లిష్టమైన మ్యాచ్ లను ఓడిపోక తప్పదనుకున్న మ్యాచ్ లను తన మెరుపు వేగం బ్యాటింగ్ తో ఆల్ రౌండర్ సత్తా తో భారత్ ను గెలిపించి విజయతీరాలకు చేర్చి, నేడు భారత టీం ఈ స్థాయి లో ఉండడంలో తనదైన ...
READ MORE
తెలంగాణ లో అసలు శాంతి భద్రతలు ఎంతవరకు సేఫ్..??
ఎక్కడైనా ఎంతటి పటిష్టమైన భద్రతలు కలిగిన నగరమైనా హత్యలు కొట్లాటలు దోపిడీలు అప్పుడప్పుడైనా బయటపడుతుంటాయి. అదే నగరంలో పోలీసు శాఖ పటిష్టంగ ఉండి, పాలకులు సరైన రీతిలో పాలిస్తే శాంతి భద్రతలు కూడా భద్రంగానే ఉంటాయి. అయినా.. హైద్రాబాద్ లాంటి మహానగరంలో మారుమూల ...
READ MORE
పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ కు ఇచ్చిన నిధుల వివరాలు చెప్పిన మోడీ సర్కార్.!!
కేంద్రం లో బీజేపీ సర్కార్ మరియు తెలంగాణ రాష్ట్రం లో టీఆర్ఎస్ సర్కార్ ఏర్పాటు అయినప్పటి నుండి బీజేపీ కి టీఆర్ఎస్ కు మధ్య మాటల యుద్దం జరుగుతున్నది.రాష్ట్రానికి నిధులను ఇవ్వడం లేదని టీఆర్ఎస్ నేతలు అంటుంటే, మరో వైపు రాష్ట్రాన్ని ...
READ MORE
రాష్ట్రం లో మొదలైన ఎన్నికల వేడి.. ఈసారి ఎవరిది పై చేయి.!!
తెలంగాణ లో అసెంబ్లీ ఎన్నికల సమరం ముగిసిందో లేదో మరోసారి ఎన్నికల సమరం మొదలైంది. రాష్ట్రం లో పెండింగ్ లో ఉన్న పంచాయతి ఎన్నికలు జనవరి 10 లోపు ముగించాలని ఉన్నత న్యాయ స్థానం ఆదేశించిన నేపథ్యం లో గ్రామాల్లో ఇప్పటికే ...
READ MORE
పంథా మార్చుకోబోతున్న దూరదర్శన్…! ప్రైవేట్ ఛానళ్లకు దీటుగా ఛానల్ ప్రసారాలకు శ్రీకారం…?
దూరదర్శన్ అనగానే పాత చింతకాయ పచ్చడి అనే సమాధానం వినిపిస్తుంది. పాతపద్దతులతో బోర్ కొట్టించే ప్రోగ్రాం లు.. ఇంకా అదే మూస దోరణిలో సాగిపోయే కార్యక్రమాలు. ట్రెండ్ మారుతున్న దూరదర్శన్ మాత్రం మారడం లేదన్నది ప్రేక్షకుల టాక్. ఇంకా ఇంకా అదే ...
READ MORE
అంబేద్కర్ చూపిన మార్గం ఇదేనా…?
"డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భౌతికంగా దూరమై ఏడు దశాబ్దాలు గడచినా, ఆయన రగిలించిన స్పూర్తి ఇంకా కొనసాగుతోంది. బడుగు బలహీన వర్గాలు తమకు న్యాయంగా దక్కాల్సిన హక్కుల కోసం పోరాడి సాధించుకుంటున్నాయి. కానీ ఎక్కడో లోపం జరుగుతోంది. ఈ రోజున బాబాసాహెబ్ ...
READ MORE
పేదలంటే ఈ సృష్టికి చులకనే: దాయి.శ్రీశైలం
పేదలంటే పెద్దలకేకాదు ఈ భూతల్లికి.. ఆ ఆకాశానికి.. నడిమనే నడిచే సమాజానికి అందరికి లోకువనే. రోజు రోజుకు పెరిగిపోతున్న పేదరికాన్ని అడ్డుకునే సాహసం చేసినా విజయం కూడా పేదరికం వైపే నిలబడుతుంద ని సర్వేలు చెపుతున్న నిజాలు. ఆకలి కూడా పేదరికాన్ని ...
READ MORE
KCR తొత్తులూ చెంచా గాళ్ళు చేసిన దాడిని ఖండిస్తున్న – బండి సంజయ్ ప్రతి దాడులు చేస్తాం- డీకే అరుణ
నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ పై మరియు వరంగల్ అర్బన్ బిజెపి కార్యాలయంపై కొందరు దుండగులు దాడికి తెగబడడం రాజకీయ వర్గాల్లో సంచలనం కలిగిస్తోంది. కాగా ఈ విషయమై అధికార తెరాస కు బీజేపీ కార్యకర్తల నుండి సోషల్ మీడియా ...
READ MORE
సభలో సైకిల్ టైర్ కు పంక్చర్.. మోడీ ఎదురుదాడితో ఉత్సాహంలో కమలదళం..
అనుకున్నదొక్కటీ అయినదొక్కటీ అంటూ మనం అప్పుడప్పుడూ పాట పాడుతుంటాం.. ఇప్పుడు టీడీపీ తమ్ముల్లు మొత్తం ఈ పాట పాడుతూ కాలం గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎంతో పక్కా వ్యూహంతో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో మరికొన్ని చిన్నా చితకా పార్టీలతో కలిపి ఏకంగ ...
READ MORE
భర్త కోసం బాబా ను కలిస్తే వాడేం చేసాడో తెలుసా.??
భర్తతో తరచూ గొడవలైతున్నయని సమస్యను తీర్చమని సంసారం బాగుపడడం కోసం ఓ అభాగ్యురాలు ఓ దొంగ బాబాను నమ్ముకుని మోసపోయిన ఘటన హైద్రాబాద్ అమీర్ పేట్ లో జరిగింది. హైద్రాబాద్ లో ఏ లోకల్ ఛానెల్ పెట్టినా కనిపించే రెగ్యులర్ ప్రకటన "బాబా ...
READ MORE
ఇంటర్ ఫలితాల ర్యాంకుల్లో అనిష్ కాలేజ్ విధ్యార్థుల ప్రభంజనం..!!
నిన్న విడుదలైన తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల్లో ప్రముఖ విద్యా సంస్థ అనిష్ కాలేజ్ ఆఫ్ కామర్స్ విద్యార్థులు మార్కుల ప్రభంజనం సృష్టించారు. ఇంటర్ మొదటి సంవత్సరం మరియు ద్వీతీయ సంవత్సరానికి సంబంధించిన అన్ని సబ్జెక్టులలోనూ అనిష్ కాలేజ్ విద్యార్థులు సత్తా చాటారు. ...
READ MORE
కేంద్రం సీరియస్ అవడంతో నిజం ఒప్పుకున్న facebook సీఈవో జుక్కర్ బర్గ్.!
ప్రపంచం అంతా విమర్శలు తలెత్తిన సమయంలో ఫేస్ బుక్ CEO జూకర్ బర్గ్ కేంబ్రిడ్జ్ అనాలటికా కుంభకోణంపై ఫేస్ బుక్ వేదిక గా వివరణ ఇచ్చారు. తప్పు జరిగిందని ఒప్పుకున్నారు. దీనిని తమ రెండు సంస్థల ...
READ MORE
కాబోయే భారత రాష్ట్రపతి రాంనాధ్ కోవింద్ కు యావత్ తెలంగాణ ఘనస్వాగతం .!!
రాబోయే రాష్ట్రపతి ఎన్నికల్లో వివిధ పార్టీ నాయకుల మద్దతు కోరడం కొరకు తెలంగాణ పర్యటన చేస్తున్నరు రాంనాధ్ కోవింద్. ఎందుకంటే రాష్ట్రపతి ఎన్నికల కోసం విధిగా ఏ పార్టీకూడా విప్ జారీ చేయొద్దని ఇప్పటికే కేంద్ర ఎన్నికల కమిషన్ విదివిదానాలను పేర్కొనడం ...
READ MORE
నిజాం పేట్ లో గల్లంతై మహరాష్ట్ర దాదర్ లో తేలింది.
బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్యతో వేడెక్కిన రాష్ట్ర రాజకీయాలు..!! రాజకీయ కోణం
అతనికి రెండు పెళ్లిల్లు అయ్యాయని తెలిసే.. మూడో పెళ్లి చేసుకున్న.!!
కేంద్ర రక్షణశాఖ పరిదిలోని ఆర్డ్ నెన్స్ ఫ్యాక్టరీ బోర్డులో 3,581
నన్నూరి నర్సిరెడ్డి కి పోసాని ఖతర్నాక్ కౌంటర్.!!
ఎవడైనా డాక్టర్లపై పోలీసులపై దాడులు చేస్తే కాల్చి పారేయండ్రి.. దేశ
అవినీతి అనకొండ MRO నాగరాజు ఉదంతం.. రెవెన్యూ శాఖ ప్రక్షాళన
జమ్ము కాశ్మీర్ లో గవర్నర్ పాలన.! ఏం జరగనుందోననే భయంలో
ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య..
కొలువ కొట్లాట సాక్షిగా కేసీఆర్ పై ఫైర్ అయిన మేదావులు.
తెలంగాణ సచివాలయం ఎదుట నిర్మల్ వాసి దేవేందర్ ఆత్మహత్యయత్నం.
యూపీలో సిఎం యోగి పైన కుట్రలు జరుగుతున్నయా..??
క్రికెట్ రారాజు యువరాజ్ సింగ్ రిటైర్మెంట్ ప్రకటించాడు..!!
తెలంగాణ లో అసలు శాంతి భద్రతలు ఎంతవరకు సేఫ్..??
పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ కు ఇచ్చిన నిధుల వివరాలు చెప్పిన
రాష్ట్రం లో మొదలైన ఎన్నికల వేడి.. ఈసారి ఎవరిది పై
పంథా మార్చుకోబోతున్న దూరదర్శన్…! ప్రైవేట్ ఛానళ్లకు దీటుగా ఛానల్ ప్రసారాలకు
అంబేద్కర్ చూపిన మార్గం ఇదేనా…?
పేదలంటే ఈ సృష్టికి చులకనే: దాయి.శ్రీశైలం
KCR తొత్తులూ చెంచా గాళ్ళు చేసిన దాడిని ఖండిస్తున్న –
సభలో సైకిల్ టైర్ కు పంక్చర్.. మోడీ ఎదురుదాడితో ఉత్సాహంలో
భర్త కోసం బాబా ను కలిస్తే వాడేం చేసాడో తెలుసా.??
ఇంటర్ ఫలితాల ర్యాంకుల్లో అనిష్ కాలేజ్ విధ్యార్థుల ప్రభంజనం..!!
కేంద్రం సీరియస్ అవడంతో నిజం ఒప్పుకున్న facebook సీఈవో జుక్కర్
కాబోయే భారత రాష్ట్రపతి రాంనాధ్ కోవింద్ కు యావత్ తెలంగాణ
Facebook Comments
Top
error: Content is protected !!