You are here
Home > తాజా వార్త‌లు > రికార్డ్ లు బ్రేక్ చేసిన బాలాపూర్ లడ్డూ.. రూ.15లక్షల 60వేలు.

రికార్డ్ లు బ్రేక్ చేసిన బాలాపూర్ లడ్డూ.. రూ.15లక్షల 60వేలు.

బాలాపూర్ లడ్డూ వేలంపాట ఈ ఏడాది కూడా ఘనంగా కొనసాగింది. ఏడాదికేడాది రికార్డులను బ్రేక్ చేస్తూ భక్తి భావంతో విఘ్నేశ్వరుని లడ్డూను దక్కించుకుంటున్నారు భక్తులు. ఈ ఏడాది ప్రఖ్యాత బాలాపూర్‌ లడ్డూ వేలం పాట ముగిసింది. గతేడాది రికార్డును బ్రేక్‌ చేస్తూ రూ.15లక్షల 60వేల రూపాయ లకు ఈ లడ్డూను సొంతం చేసుకున్నారు నాగం తిరుపతి రెడ్డి అనే వ్యక్తి. లడ్డూ వేలంలో 21మంది పాల్గొనగా, అందరిలో ఈ సారి అదృష్టం తిరుపతిరెడ్డిని వరించింది. దీంతో ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు. అయితే 1994లో మొదలైన బాలాపూర్‌ లడ్డూ వేలం ఎలాంటి ఆటంకాలు లేకుండా 23ఏళ్లుగా నడుస్తుంది.

 

Facebook Comments
Top
error: Content is protected !!