You are here
Home > తాజా వార్త‌లు > ఎవరీ శ్రావణ్?: ప్రభాకర్ రెడ్డికి కాల్ గర్ల్స్ సరఫరా!, శిరీష కేసులో మరిన్ని షాకింగ్ నిజాలు

ఎవరీ శ్రావణ్?: ప్రభాకర్ రెడ్డికి కాల్ గర్ల్స్ సరఫరా!, శిరీష కేసులో మరిన్ని షాకింగ్ నిజాలు

హైదరాబాద్: బ్యుటీషియన్ శిరీష ఆత్మహత్య కేసులో కీలక నిందితుడిగా ఉన్న శ్రావణ్ గురించి విస్తుపోయ నిజాలు బయటపడుతున్నాయి. కేసులో తొలి నుంచి రాజీవ్ పేరు ప్రధానంగా వినిపించినా.. ఏ1గా శ్రావణ్ ను చేర్చడం పట్ల పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి.

ప్రభాకర్ మృతికి ఏసీపీనే కారణమా?: భార్య, తల్లి ఏమన్నారంటే?

మొత్తం వ్యవహారంలో శ్రావణ్ పాత్రే కీలకమని పోలీసులు నిర్దారించినందువల్లే కేసులో అతన్ని ఏ-1గా ఉంచినట్లు తెలుస్తోంది. పోలీసుల విచారణలో భాగంగా.. శ్రావణ్ అసలు నైజం ఎలాంటిదో.. అతని దురాలోచనకు శిరీష ఎలా బలైందో బయటపడింది. ఒకసారి శ్రావణ్ బ్యాక్ గ్రౌండ్‌ను పరిశీలిస్తే..

శిరీష కేసు: ఎవరీ రాజీవ్? సినిమాలతో లింకేంటి.. ముందు నుంచి ఇంతేనా!

అమ్మాయిల మోజు.. నిత్యం జల్సాలు:

నల్గొండ జిల్లా చింతపల్లి మండలం గోడుకొండ్ల గ్రామానికి శ్రావణ్ ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి. తండ్రి రమేశ్ సివిల్ కాంట్రాక్టర్. తొలి నుంచి శ్రావణ్ కు అమ్మాయిలంటే మోజు ఎక్కువ. నిత్యం పార్టీలు.. రాత్రయితే చాలు అమ్మాయిలతో జల్సాలు.. అతనికి నిత్యకృత్యం. తాను అనుకున్న పని జరగడానికి ఎంతకైనా తెగిస్తాడన్న పేరు కూడా శ్రావణ్ కు ఉంది.

ఎస్ఐ ప్రభాకర్ రెడ్డితో లింకు ఇలా!

తొలి నుంచి పోలీస్ సర్కిల్‌తో సాన్నిహిత్యాన్ని మెయింటైన్ చేస్తున్నాడు శ్రావణ్. కొత్తగా వచ్చే పోలీసులతో పరిచయాలు పెంచుకోవడం.. వారితో పనులు జరిపించుకోవడం అతనికి ముందు నుంచి అలవాటు. ఇందుక ప్రతిఫలంగా వారికి కానుకలు ఇచ్చేవాడు. చాలాసార్లు అమ్మాయిలను కూడా వారి వద్దకు పంపించేవాడని విచారణలో తేలింది.

నల్లగొండ జిల్లాకే చెందిన ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి ప్రొబేషనరీ పీరియడ్ లో డ్యూటీ నిమిత్తం మాల్ పోలీస్ స్టేషన్ కు వచ్చాడు. ఇక్కడే శ్రావణ్ కు ప్రభాకర్ రెడ్డికి మధ్య సాన్నిహిత్యం ఏర్పడింది. కొద్దిరోజులకే ఇద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది.

ప్రభాకర్ రెడ్డికి అమ్మాయిల సరఫరా:

ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి కుకునూర్ పల్లికి మారిన తర్వాత కూడా శ్రావణ్ తన స్నేహాన్ని కొనసాగించాడు. మధ్యలో రెండు మూడుసార్లు కొంతమంది కాల్ గర్ల్స్ ను శ్రావణ్ ప్రభాకర్ రెడ్డి వద్దకు పంపించాడు. ఇదే విషయాన్ని పోలీసుల వాంగ్మూలంలో శ్రావణ్ అంగీకరించాడు.

శిరీష-శ్రావణ్ మధ్య పరిచయం ఇలా:

బ్యుటీషియన్ గా పనిచేసే శిరీష.. శ్రావణ్ స్నేహితుడి వివాహానికి వచ్చింది. పెళ్లిలోనే శిరీషతో పరిచయం పెంచుకున్న శ్రావణ్.. తరుచూ ఆమెతో టచ్ లో ఉండేవాడు. ఆ తర్వాత చాలాసార్లు వారిద్దరు కలిశారు. ఈ క్రమంలో శిరీషకు తన సర్కిల్ లో పలుమార్లు మేకప్ పని ఇప్పించాడు.

రాజీవ్ కు పరిచయం చేసింది శిరీషే:

నాలుగేళ్ల క్రితం రాజీవ్ వల్లభనేని ఆర్జే స్టూడియోలో శిరీష జాయిన్ అయింది. ఆ తర్వాత రాజీవ్ శిరీషతో సాన్నిహిత్యం పెంచుకోవడం, అది కాస్త వివాహేతర సంబంధానికి దారి తీయడం తెలిసిందే. ఇదే క్రమంలో.. శ్రావణ్‌ను శిరీష రాజీవ్‌కు పరిచయం చేసింది. రాజీవ్‌కు ఫొటోగ్రఫీ పని ఉన్నప్పుడల్లా శ్రావణ్‌ కూడా అతనితో పాటే వెళ్లేవాడు. రోజులో ఎక్కువ సమయం రాజీవ్ ప్లాటులోనే గడిపేవాడు. శిరీష, రాజీవ్, శ్రావణ్ ముగ్గురు కలిసి పార్టీలు చేసుకునేవారు. శిరీషతో అతనికి వివాహేతర సంబంధం ఉన్నట్లు విచారణలో తేలింది.

పథకం ప్రకారమే:

కుకునూర్ పల్లికి వెళ్లడంలో శ్రావణ్ పాత్రే కీలకమని పోలీసులు నిర్దారించారు. ఎస్ఐ ప్రభాకర్ రెడ్డికి ముందు నుంచి కాల్ గర్ల్స్ ను సరఫరా చేసే శ్రావణ్.. ఉద్దేశపూర్వకంగానే శిరీషను అతని వద్దకు తీసుకెళ్లాలనుకున్నాడు. రాజీవ్ ప్రేమ వ్యవహారంలో తలెత్తిన వివాదాలను తనకు అనుకూలంగా మార్చుకోవాలనే ప్రయత్నంలో భాగంగానే ఈ ప్లాన్ వేశాడు.

కుకునూర్ పల్లికి చేరుకున్న తర్వాత.. శిరీష, ప్రభాకర్ రెడ్డి, శ్రావణ్ ముగ్గురు కలిసి పార్టీ చేసుకున్నారు. ఆ క్రమంలో శిరీషతో ప్రభాకర్ రెడ్డి ఏకాంతంగా గడపాలన్న ఉద్దేశంతోనే శ్రావణ్ పదేపదే సిగరెట్ పేరుతో రాజీవ్ ను బయటకు తీసుకెళ్లాడు.

శిరీష ప్రతిఘటించడంతో సీన్ రివర్స్:

ప్రభాకర్ రెడ్డి తన పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో శిరీష తట్టుకోలేకపోయింది. గట్టిగా ప్రతిఘటించింది. శిరీష ఎదురు తిరుగుతుందని ఊహించని శ్రావణ్ ఒక్కసారిగా కంగు తిన్నాడు. ఇదంతా తెలియని రాజీవ్ శిరీషపై చేయి చేసుకున్నాడు. అక్కడి నుంచి నగరానికి తిరిగి వచ్చిన తర్వాత.. తీవ్ర మనోవేదనతో శిరీష ఆత్మహత్యకు పాల్పడింది. కేసులో తన పేరు ఎక్కడ బయటపడుతుందోనన్న భయంతో ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. నిజానికి శ్రావణ్ అనే వ్యక్తి శిరీష జీవితంలోకి రాకుండా ఉంటే ఇదంతా జరిగి ఉండేది కాదని, అతనో క్యారెక్టర్ లెస్ అని సీపీ మహేందర్ రెడ్డి పేర్కొనడం గమనార్హం.

Related Posts
జేబులో చిల్లిగవ్వ కూడా లేదు.. పారిస్ లో బిచ్చమెత్తుకున్నాం.
ప్రముఖ డైరెక్టర్ రవిరాజా పినిశెట్టి కుమారుడు ఆది పినిశెట్టి విలక్షణమైన పాత్రలతో దక్షిణాది సినీ పరిశ్రమలో రాణిస్తున్నాడు. గుండెల్లో గోదారి, సరైనోడు.. ప్రస్తుతం నాని నటించిన చిత్రం నిన్నుకోరిలో విలన్ గా కనిపించబోతున్నాడు. అయితే దర్శకుడి కొడుకై ఉండి.. బాగా డబ్బున్న ...
READ MORE
CBN సర్కార్ ను వెంటాడి వేటాడుతున్న GVL.. ఎన్నికల వేల తలలు పట్టుకుంటున్న తమ్ముల్లు.!!
2019 ఎన్నికల సమరం ముంచుకొస్తున్న వేల ఎలాంటి చిక్కులో ఇకుక్కోవద్దో అలాంటి చిక్కుముడిలో చిక్కుకుపోయింది ఆంధ్రప్రదేశ్ టీడీపీ సర్కార్. 58 వేల పర్సనల్ ఖాతాల్లోకి 53 వేల కోట్ల ప్రభుత్వ సొమ్ము బదలాయించడాన్ని చాకచక్యంగ పట్టేసికున్న భాజపా జాతీయ నాయకులు రాజ్యసభ ...
READ MORE
మసీద్ నుండి చెప్పే ఆజాన్ కోసం లౌడ్ స్పీకర్లు వాడొద్దు – హైకోర్టు
రోజుకు ఐదు సార్లు ముస్లిం లు చెప్పే ఆజాన్ కోసం లౌడ్ స్పీకర్లు ఉపయోగించడం మనకందరికీ తెలిసిన విషయమే. అయితే చాలా రోజుల నుండే ఆజాన్ అనేది అందరికీ వినపడేలా అది కూడా ఐదు సార్లు లౌడ్ స్పీకర్లు ఉపయోగించడం అవసరమా ...
READ MORE
హిందూ దేవుళ్లను అవమానించిన బడా హేయిర్ కటింగ్ సెలూన్ సంస్థ.!
భారతదేశం హిందూ సనాతన దేశమే అయినప్పటికీ.. సర్వమతాల సారమే ఊపిరిగా అందరికీ సమాన హక్కులను ప్రసాదించింది భారత రాజ్యంగం. అందుకే భారత్ లో 365 రోజులూ మత ప్రచారం చేసుకోవడానికి అనుమతి ఉంటుంది. ఎవరు ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు అవసరమైతే ఓ ...
READ MORE
అరె యోగి.. ఒక్క నెలే.. తిట్టిన నోళ్లే పొగుడుతున్నాయి.
యోగి ఆదిత్యనాధ్ ఒక నెల ముందు కేవకం ఒక సాదువు.. అందరి దృష్టిలో సన్యాసి. ఇంకా కొందరి దృష్టిలో సన్నాసి. అతి పెద్ద రాష్ట్రాన్ని బీజేపీ చేజిక్కించుకున్నాక అనూహ్యంగా తెర మీదకి వచ్చిన పేరు యోగి. సరిగ్గా నెల తరువాత ఆయనో ...
READ MORE
అవసరం తీరగానే అసలు రంగును బయటపెట్టిన మాజీ ఉపరాష్ట్రపతి.
భారత ఉపరాష్ట్రపతి అంటే అత్యంత గౌరవప్రదమైన పదవి ఎటువంటి రాజకీయాలకు స్థానం లేని పదవి. అలాంటి పదవిలో రెండు పర్యాయాలు అనగా పదేల్లు ఉపరాష్ట్రపతిగా రాజ్యసభ ఛైర్మన్ గా పదవిని అనుభవించి పదవీ కాలం ముగియగానే దేశంలో ముస్లింలు అభద్రతతో ఉన్నారు.. ...
READ MORE
పేద ప్రజలను కాలుష్యానికి బలిచేసి కాటికి పంపుతున్న తెలంగాణ ప్రభుత్వం.!!
హైద్రాబాద్ ని విశ్వనగరం చేస్తున్నం అంటోంది ప్రభుత్వం.. కానీ అదే విశ్వనగరం గ్రేటర్ హైద్రాబాద్.. 40 గ్రామాల ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతోంది అంటే నమ్మగలరా.?? * ఇది నిజం దాదాపు మూడు లక్షల మంది ప్రజలు ఆ కాలుష్య కాలసర్పం విషానికి ...
READ MORE
నా తమ్ముడు దౌర్జన్యం చేయలేదు, అటవీ అధికారులే రాజకీయం చేస్తున్నారు.!!
సిర్పూర్ కాగజ్ నగర్ మహిళా పోలీస్ అధికారి అటవీ రేంజ్ ఆఫిసర్ పై దాడి కి పాల్పడిన జెడ్పీ వైస్ చైర్మన్ కోనేరు క్రిష్ణ ను వెనకేసుకొచ్చారు కోనేరు క్రిష్ణ అన్న తెరాస ఎంఎల్ఏ కోనేరు కోనప్ప. తన తమ్ముడు అధికారులపై ...
READ MORE
ఇమ్రాన్ ఖాన్ ను ఫుట్ బాల్ అడుకుంటున్న డైరెక్టర్ వర్మ..!!
సంచలనాల సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా పుల్వామా ఘటనపై తనదైన శైలిలోస్పందిస్తూ.. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను చెడుగుడు ఆడుకుంటున్నారు. తన సోషల్ మీడియా ఖాతా ద్వారా స్పందించిన ఆర్జీవీ ఇమ్రాన్ ఖాన్ పై విరుచుకుపడ్డారు.ఇమ్రాన్ ఖాన్ ను ...
READ MORE
వేదాలను, గురువుని, పాఠశాలను, విద్యార్ధులను దూషించిన వ్యక్తిపై ఫిర్యాదు.!
హైద్రాబాద్ నగర శివారు చెంగిచెర్లలోని ఓ కాలనీలో రెండేల్లుగా 32 మంది విద్యార్ధులతో అద్దె ఇంట్లో వేదపాఠశాల కొనసాగుతుంది. వేద పాఠశాల కు ట్రస్ట్ అధ్యక్షుడు బ్రహ్మ శ్రీ మాడుగుల శశిభూషణ శర్మ సోమయాజి. కాగా ఆ కాలనీకి నేను ప్రెసిడెంట్ ను ...
READ MORE
తెలంగాణలో ఉద్యోగాల జాతర..?
తెలంగాణలో ఉద్యోగాల జాతర టైటిల్ పెట్టి ప్రశ్నార్థకం ఎందుకు పెట్టారని అడుగాలనుకుంటున్నార..? అయితే ఇంకా ఓ పన్నెండు రోజుల తరువాత అడగండి చెపుతాం. పదిహేను రోజుల్లో డీఎస్సీ ప్రకటన చేస్తాం అని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఇప్పటికే ఓ ప్రకటన ...
READ MORE
లాక్ డౌన్ ని పొడిగించే విషయం లో క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం.!!
చైనా వైరస్ కరోనా వ్యాప్తి చెందుతున్న పరిస్తితుల్లో 21 రోజులు దేశమంతా లాక్ డౌన్ విధించింది కేంద్ర ప్రభుత్వం. ప్రస్తుతం లాక్ డౌన్ ని వీలైనంత వరకు కట్టు దిట్టంగా అమలు చేస్తోంది మోడీ సర్కార్. ఈ క్రమంలో ప్రజలకు అత్యవసరాల సరఫరా ...
READ MORE
పార్టీలో అప్పుడప్పుడు ఇలా జరగడం సహజం – CBN
రాజకీయ పార్టీ అన్నప్పుడు అప్పుడప్పుడు ఇలాంటివి జరగడం సహజమే అని స్పందించారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు. కాగా తాజాగా తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా చేసిన కొడంగల్ ఎంఎల్ఏ ఆ పార్టీ ...
READ MORE
కరోనా వ్యాప్తి కి తమవంతు కృషి చేస్తున్న రాజకీయ నేతలు..!!
తెలుగు రాష్ట్రాలలో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. రోజు రోజుకు వేళల్లో కేసులు నమోదు అవుతున్నాయి.. రోజు కు ఎన్ని పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి.. ఎంత మంది బాధితులు మరణిస్తున్నారు అనే లెక్కలు వేసుకునే పరిస్తితి కూడా దాటి ...
READ MORE
దేశంలో ప్రతీ ఒక్క పౌరుడికీ కరోనా వ్యాక్సిన్ అందించే ఏర్పాట్లు చేస్తున్నాం.!!
74 వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎర్ర కోట పై జెండా ఆవిష్కరణ కార్యక్రమం లో ప్రసంగించిన భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పలు ముఖ్యమైన విషయాలను ప్రస్తావించారు. ప్రధానంగా కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దేశంలో 3 రకాల ...
READ MORE
ట్రైలర్ రిలీజ్ చేసి రచ్చ రచ్చ చేస్తున్న వర్మ.!!
సంచలనాల దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి టాలీవుడ్ ని ఇటు తెలుగు రాజకీయాలను షేక్ చేస్తున్నాడు. తన నూతన చిత్రం లక్ష్మిస్ ఎన్టిఆర్ పేరుతో సీనియర్ ఎన్టిఆర్ బయోపిక్ తీస్తున్న విషయం అందరికీ తెలిసిందే.. అయితే లక్ష్మిస్ ఎన్టిఆర్ చిత్రం యొక్క ...
READ MORE
ఆ ఒక్క మాటతో కేసిఆర్ ని ఇరుకున పెట్టేసిన మోడి.!!
మెట్రో రైల్ ప్రారంభించడానికి మరియు గ్లోబల్ బిజినెస్ సదస్సులో పాల్గొనడానికి హైద్రాబాద్ నగరానికొచ్చిన ప్రధాని నరేంద్ర మోడి.. బేగంపేట్ ఏయిర్పోట్ లో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. సభలో ప్రసంగించిన మోడీ.. సోదర సోదరీమణులారా అంటూ తెలుగులో మొదలు పెట్టి ...
READ MORE
రాహుల్ రాక కాంగ్రెస్ కు కలిసొచ్చేనా..!
కాంగ్రెస్ పార్టీ కి పూర్వవైభవం తేవడం కోసం మొదటిసారి అధికారికంగ నేడు ఒకరోజు తెలంగాణ పర్యటనకు వస్తున్నాడు కాంగ్రెస్ పార్టీ జాతియ ఉపాద్యక్షులు రాహుల్ గాంధి. ఇందుకోసం సంగారెడ్డి జిల్లాను ఎంచుకుంది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. రాహుల్ పర్యటనతో మల్లీ కాంగ్రెస్ తెలంగాణలో ...
READ MORE
సామర్ధ్యం నాయకత్వం ధర్మం వైపే మొగ్గు చూపిన బండి సంజయ్, BJYM అధ్యక్షుడిగా భాను ప్రకాష్.!!
ఏదైనా రాజ్యం లో రాజుకు ఎంత బలం చాణక్యం తెలివి ఉన్నప్పటికీ.. ఆ రాజు సైన్యాధిపతి కి సత్తా లేకుంటే రాజ్యం నిలబడదు. దాదాపు ఇదే ఫార్ములా అన్ని విషయాల్లోనూ వర్తిస్తుంది. ముఖ్యంగా రాజకీయాల్లో ఖచ్చితంగా వర్తిస్తుంది. అందుకే ఈ ఫార్ములా బాగా ...
READ MORE
‘యోగ’మేరా జీవితం.. భోగభాగ్యాల ఆరోగ్యం.
మనిషికి ఎన్ని సిర సంపదలున్నా ఆరోగ్యం లేకపోతే అవన్నీ వృధాయే.. అందుకే మన పెద్దలు ‘ఆరోగ్యమే మహా భాగ్యం’ అన్నారు.. ఇందుకోసం ఎలాంటి మందులు అవసరం లేకుండా చక్కని పరిష్కారం చూపించారు పతంజలి మహర్షి.. యోగ సాధన ద్వారా ఆరోగ్యంతో పాటు ...
READ MORE
4548 మంది వైద్యులపై చర్యలు తీసుకున్న మహారాష్ట్ర ఫడ్నవిస్ సర్కార్.!
వైద్య విద్య పూర్తైన తర్వాత ఖచ్చితంగ సంవత్సరం పాటు గ్రామీన ప్రాంతాల్లో సర్విస్ చేయాలనే నిబంధనలను తుంగలో తొక్కి డాక్టర్ డిగ్రీ సర్టిఫికెట్ పొందిన 4548 మంది వైద్యుల రిజిస్ట్రేషన్ రద్దు చేసింది మహారాష్ట్ర సర్కార్. ఈ చర్య దేశ వైద్య ...
READ MORE
రేవంత్ రెడ్డి ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్న కాంగ్రెస్ నాయకులు.!
టీడీపీ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంఎల్ఏ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ లోకి వస్తున్నాడని ఊహాగాణాలు వచ్చాయో లేదో.. ఆ వార్తలకు బలం చేకూరేలా వరంగల్ కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి ఫోటోతో కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలను వేయిస్తున్నారు.. ఈ ...
READ MORE
అమ్మకు ప్రేమతో.. పదవ తరగతి ఫలితాల్లో టాప్ లో నిలిచిన దత్త పుత్రిక..
సత్తా ఉంటే  చదువులమ్మ ముందు పేదరికం ఓడిపోవాల్సిందే అని నిరూపించింది ఈ చిన్నారి. తల్లిదండ్రులు దూరమై చెల్లి తమ్ముడికి పెద్ద దిక్కుగా మారిన ఆ అక్క తన చదువును తన వారి కోసం త్యాగం చేయాలనుకుంది. కానీ అదే సమయంలో దేవతలా వచ్చిన ...
READ MORE
బ్రేకింగ్:- టిక్ టాక్ వాట్సాప్ ట్విట్టర్ పై క్రిమినల్ కేసు నమోదు.!!
దేశం లో ప్రస్తుతం ప్రధాన సోషల్ మీడియా అయిన టిక్ టాక్, వాట్సాప్, ట్విట్టర్ యాజమాన్యాల పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.CAA కు వ్యతిరేకంగ దేశం లో అశాంతి నెలకొల్పేలా ప్రచారం చేస్తున్నాయని ఈ వ్యతిరేక వార్తలు ...
READ MORE
కన్నడ హీరో ఉపేంద్ర సంచలన నిర్ణయం. సొంతపార్టీనా లేక భాజపానా..??
శాండల్ వుడ్ హీరో కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర తెలుగు వారికి కూడా పరిచయమున్న పేరు. తాజాగా రాజకీయ రంగప్రవేశం చేయనున్నటు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ప్రస్తుతం ఒక సినిమాలో నచిస్తున్నాను అది పూర్తవగానే రాజకీయంగ పూర్తి అడుగులేయనున్నటు తెలిపాడు. అయితే గత ...
READ MORE
జేబులో చిల్లిగవ్వ కూడా లేదు.. పారిస్ లో బిచ్చమెత్తుకున్నాం.
CBN సర్కార్ ను వెంటాడి వేటాడుతున్న GVL.. ఎన్నికల వేల
మసీద్ నుండి చెప్పే ఆజాన్ కోసం లౌడ్ స్పీకర్లు వాడొద్దు
హిందూ దేవుళ్లను అవమానించిన బడా హేయిర్ కటింగ్ సెలూన్ సంస్థ.!
అరె యోగి.. ఒక్క నెలే.. తిట్టిన నోళ్లే పొగుడుతున్నాయి.
అవసరం తీరగానే అసలు రంగును బయటపెట్టిన మాజీ ఉపరాష్ట్రపతి.
పేద ప్రజలను కాలుష్యానికి బలిచేసి కాటికి పంపుతున్న తెలంగాణ ప్రభుత్వం.!!
నా తమ్ముడు దౌర్జన్యం చేయలేదు, అటవీ అధికారులే రాజకీయం చేస్తున్నారు.!!
ఇమ్రాన్ ఖాన్ ను ఫుట్ బాల్ అడుకుంటున్న డైరెక్టర్ వర్మ..!!
వేదాలను, గురువుని, పాఠశాలను, విద్యార్ధులను దూషించిన వ్యక్తిపై ఫిర్యాదు.!
తెలంగాణలో ఉద్యోగాల జాతర..?
లాక్ డౌన్ ని పొడిగించే విషయం లో క్లారిటీ ఇచ్చిన
పార్టీలో అప్పుడప్పుడు ఇలా జరగడం సహజం – CBN
కరోనా వ్యాప్తి కి తమవంతు కృషి చేస్తున్న రాజకీయ నేతలు..!!
దేశంలో ప్రతీ ఒక్క పౌరుడికీ కరోనా వ్యాక్సిన్ అందించే ఏర్పాట్లు
ట్రైలర్ రిలీజ్ చేసి రచ్చ రచ్చ చేస్తున్న వర్మ.!!
ఆ ఒక్క మాటతో కేసిఆర్ ని ఇరుకున పెట్టేసిన మోడి.!!
రాహుల్ రాక కాంగ్రెస్ కు కలిసొచ్చేనా..!
సామర్ధ్యం నాయకత్వం ధర్మం వైపే మొగ్గు చూపిన బండి సంజయ్,
‘యోగ’మేరా జీవితం.. భోగభాగ్యాల ఆరోగ్యం.
4548 మంది వైద్యులపై చర్యలు తీసుకున్న మహారాష్ట్ర ఫడ్నవిస్ సర్కార్.!
రేవంత్ రెడ్డి ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్న కాంగ్రెస్ నాయకులు.!
అమ్మకు ప్రేమతో.. పదవ తరగతి ఫలితాల్లో టాప్ లో నిలిచిన
బ్రేకింగ్:- టిక్ టాక్ వాట్సాప్ ట్విట్టర్ పై క్రిమినల్ కేసు
కన్నడ హీరో ఉపేంద్ర సంచలన నిర్ణయం. సొంతపార్టీనా లేక భాజపానా..??
Facebook Comments
Top
error: Content is protected !!