You are here
Home > తాజా వార్త‌లు > సావ‌ర్ ఖేడ్ అర‌ణ్య రోద‌న‌.. కేసీఆర్ సార్ ఒక్క‌సారి ఈ గ్రామం వైపు చూడండి. చ‌దువుకునేందుకు న‌ర‌క దారులను దాటుతున్న విద్యార్థులు.

సావ‌ర్ ఖేడ్ అర‌ణ్య రోద‌న‌.. కేసీఆర్ సార్ ఒక్క‌సారి ఈ గ్రామం వైపు చూడండి. చ‌దువుకునేందుకు న‌ర‌క దారులను దాటుతున్న విద్యార్థులు.

చ‌దువంటే న‌ర‌క‌మ‌ని అమ్మ కొట్టింద‌ని నాన్న తిట్టాడ‌ని ఇంట్లోకెళ్లి పారిపోయే వారికి ఈ ఊరిని చూయించండి. చ‌దువుకోవాలంటే బండెడు బుక్కులు మోయాలి.. బ‌స్ లో కిలో మీట‌ర్ల మేర కాలేజీకి వెళ్లాలి. సార్లు చెప్పే సొల్లంతా వినాలి అని చ‌దువును త‌క్కువ‌గా చూసే విద్యార్థుల‌కి ఒక్క‌సారి ఈ విద్యార్థుల క‌ష్టాల‌ను చూపించండి. అప్పుడు చెప్పండి అస‌లు చ‌దువ‌లంటే ఏంటో.. క‌ష్టాలంటే ఎలా ఉంటాయో… చ‌దువుకొవాల‌న్న త‌ప‌న, పిచ్చి, ప్రేమ అంటే తెలిసి వ‌స్తుంది.

రాష్ట్రం మారింది రాజ‌కీయం మారింది. తెలంగాణ బంగారు భ‌విష్య‌త్ వైపు పరుగులు పెడుతుంది. కానీ ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లా నుండి విడిపోయి కొమురంభీముని వార‌స‌త్వాన్ని పునికిపుచ్చుకుని జిల్లా గా ఏర్ప‌డిన ఆసిపాబాద్ జిల్లాలోని కెర‌మిరి మండ‌లం గోయిగాం గ్రామ‌పంచాయితి ప‌రిదిలోని సావ‌ర్ ఖేడ్ భ‌విష్య‌త్ మాత్రం మార‌లేదు. అప్ప‌టికి ఇప్ప‌టికి ఇంకా అడ‌వుల బ‌తుకులే. చ‌దువుకోవాల‌న్న క‌సి ఉన్న‌తంగా ఎద‌గాల‌న్నా ఆశ ఉన్నా ఇక్క‌డ అది అత్యంత ప్ర‌మాద క‌ర‌మైన మార్గంలో న‌డిస్తే త‌ప్ప సాద్య‌మ‌య్యేది కాదు. కార‌ణం ఈ ఊరికి క‌నీసం కాలిన‌డ‌క‌న వెళ్లేందుకు కూడా రోడ్డు మార్గం లేక‌పోవ‌డ‌మే. అయినా ఇక్క‌డి విద్యార్థులు త‌మ చ‌దువుల‌ను ఆప‌డం లేదు. క‌ష్ట‌మైన న‌ష్ట‌మైన.. ఎర్ర‌ని ఎండ‌లు మండినా.. ఓరున వ‌ర్షం కురిసిన చ‌దువుకునేందుకు ఆరు కిలో మీట‌ర్లు అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన అడ‌విని దాటి పాఠ‌శాల‌ల‌కు వెళుతున్నారు ఇక్కడి విద్యార్థులు. ఒక్క‌రు కాదు ఇద్ద‌రు కాదు ఏకంగా 150 మంది కి పైగా విద్యార్థులు 15 ఏళ్లుగా కాలిన‌డ‌క‌న అడ‌వుల‌ను దాటి గుట్ట‌లు , పుట్ట‌లు ప్ర‌మాద‌క‌ర‌మైన మార్గం గుండా న‌డుచుకుంటు త‌మ ఇష్టమైన చ‌దువును క‌ష్ట‌మైన ప‌ర్వాలేద‌ని చ‌దువుకునేందుకు వెళుతున్నారు.

సావ‌ర్ ఖేడ్ లో మొత్తం జ‌నాభా 1000 పైనే ఇందులో విద్యార్థుల సంఖ్య 310.. వీరిలో 125 మంది ప్రాథ‌మిక విద్య‌ను అభ్య‌సిస్తున్నారు. సావ‌ర్ ఖేడ్ లో ప్రాథ‌మిక పాఠ‌శాల స‌దుపాయం ఉంది. ఇక్క‌డ 5 వ త‌ర‌గ‌తి వ‌ర‌కు విద్యార్థులు చ‌దువుకుంటున్నారు. కానీ 5 వ త‌ర‌గ‌తి పూర్త‌యిదంటే చాలు వీళ్ల గుండెళ్లో గుబులు మొద‌ల‌వుతుంది. కార‌ణం అడ‌వి మార్గం గుండా 6 కిలో మీట‌ర్లు న‌డిచి వెళ్లాలి క‌నుక‌. అయినా వారు వెన‌క‌డ‌గు వేసింది లేదు. ఇక్క‌డి ప్రాథ‌మిక పాఠ‌శాల నుండి మొద‌టి బ్యాచ్ గా బ‌య‌ట‌కి వెళ్లిన విద్యార్థులు ఇప్ప‌డు డిగ్రీ ప‌ట్టాలు చేత‌ప‌ట్టుకుని హైద‌ర‌బాద్ లో ఉద్యోగాల వేట‌లో ఉన్నారు. మారు మూల గ్రామ‌మైన ఇక్క‌డి విద్యార్థులు నాలుగు బాష‌ల్లో ఇర‌గ‌దీస్తారు. వాళ్ల స‌త్తా అంతా వాళ్లు ప‌డ్డ చ‌దువు క‌ష్టాల్లోనే తెలిసిపోతుంది.

విద్యార్థులతో పాటు ఆరు కిలో మీటర్ల మేర దట్టమైన అడవి మార్గంలో కాలిబాటలో రాళ్లు రప్పలు దాటుతూ నడక‌సాగించింది జ‌ర్న‌లిజంప‌వ‌ర్. వర్షం దెబ్బకి బురద మయమై అడుగు తీసి అడుగు వెయ్యాలేని విద్యార్థుల కష్టాలను కెమరాలో బందించింది. వారితో పాటు నడుస్తుంటే ఇంత కష్టపడి ఇష్టంగా చదువుతున్న విద్యార్థులకు దండం పెట్టాలనిపించింది. 40 మంది విద్యార్థులు ప్రతి రోజు ఇలాగే ఇదే అడవి మార్గంలో పొలల మధ్య నుండి కొండలు, బండరాళ్లు దాటుతూ. బురదమయమైన అత్యంత బాధకరమైన దారి గుండా నడుస్తూ పాఠశాలకు చేరుకుంటున్నారు. వారి స్కూల్ డ్రెస్ ఆ బురద దెబ్బకి మాసిపోతున్నాయి. చెప్పులు చేత పట్టి నడిస్తే తప్ప నడక సాగని దుర్బర పరిస్థితులు వారివి. తిరుగు ప్రయాణంలోనూ అవే కష్టాలు. ఇలా ఒక్క రోజు కాదు దాదాపు 15 ఏళ్ల నుండి సావర్ ఖేడ్ విద్యార్థుల ఇదే దారిలో బడి బాట పడుతున్నారు.

ప్రభుత్వాలు మారుతున్నాయి పాలకులు మారుతున్నారు కానీ సావర్ ఖేడ్ ను పట్టించుకున్న నాధుడే కనిపించడం లేదు. తమ పిల్లల‌ భవిష్యత్ అడవి పాలవుతుంది సార్లు దయచేసి ఓ రోడ్డు మార్గం వేయండి అని కనిపించిన ప్రతి నాయకున్ని వేడుకున్నా ఫలితం శూన్యం. ఆసిపాబాద్ ఎమ్మెల్యే కోవ. లక్ష్మికి ఎన్ని సార్లు మెరపెట్టుకున్న పట్టించుకున్న పాపన పోలేదు. అదికారులను వేడుకున్నా మా చేతిలో ఏం లేదంటూ చేతులెత్తుస్తున్నారు. కొమురంభీం వారసత్వంతో మరింత బలాన్ని తెచ్చుకుని దారి కోసం నాయకులతో పోరాడుతూనే ఉన్నారు ఈ గ్రామస్తులు.

విద్యే కాదు ఇక్కడ వైద్యం కూడా అందని ద్రాక్షే.. విష జ్వరాలు సోకితే మంచంపై పడుకోపెట్టుకిని నలుగురు మోసుకుంటూ రావాల్సిందే..అత్యవసరం అయితే మాత్రం ప్రాణాలు పోవాల్సిందే. అంబులెన్స్ లు , 108 లు రావు.. వద్దమన్నా దారేది.. ఊరు చివర నుండి గ్రామాస్తులు అతి కష్టం మీద రోడ్టు మార్గం ఏర్పాటు చేసుకున్నారు. తీరా ప్రభుత్వం మిషన్ భగీరథ అంటూ మొత్తం తవ్వేయడంతో నాలుగు పీట్ల రోడ్డు కూడా బురదమయం అయి కనీసం ఎండ్ల బండి కూడా వెళ్లలేని పరిస్థితికి చేరింది. దీంతో విష జ్వరాలు అత్యవసర వైద్యం అవసరమైతే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బ్రతుకు జీవుడా అంటూ గడపాల్సి వస్తోంది. చదువు దూరమై వైద్యం గగనమై బ్రతుకు భారమవుతున్న సావర్ ఖేడ్ గ్రామాన్నితెలంగాణ‌ ప్రభుత్వం ఇప్ప‌టికైనా గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గ‌త‌పాల‌కుల లెక్క‌లు ప‌క్క‌కు పెట్టి తెలంగాణ బంగారు బాట‌లో సావ‌ర్ ఖేడ్ ను క‌లుపుకుపోవాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. అయినా ప్రభుత్వ ఎమ్మెల్యే ప‌ట్టించుకున్న పాపాన పోలేదని చెపుతున్న ఆ పిల్ల‌ల ధీన రోద‌న‌తో అయినా కేసీఆర్ స‌ర్కార్ క‌రిగితే అదే ప‌దివేలు. ఆ పిల్ల‌ల‌కు న‌డ‌క న‌ర‌కాన్ని దూరం చేస్తే మిమ్మ‌ల్ని నెత్తిన పెట్టుకుంటారు సార్.

జ‌ర్న‌లిజంప‌వ‌ర్ అందిస్తున్న ఈ కథ‌నంతో క‌నీసం వారికి ఒక దారి.. ఒక బ‌స్సు వ‌స్తే చాలు.. ఇలాంటి ప‌ల్లెలు ఇంకెన్ని ఉన్నాయో గుర్తించి వారికి కూడా స‌దుపాయాలు అందించాల‌ని సావ‌ర్ ఖేడ్ త‌రుపున జ‌ర్న‌లిజంప‌వ‌ర్ విజ్ఞప్తి చేస్తోంది. కేసీఆర్ సార్ కాస్త దృష్టి పెట్టండి కొమురంభీం న‌డ‌యాడిన నేల‌ను న‌మ్ముకున్న ఆ అడ‌వి బిడ్డ‌ల‌ను ఆగం చేయ‌కండి ఫ్లీజ్. 

Related Posts
నరేంద్ర మోడి ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథులు ఎవరో తెలిస్తే కన్నీల్లు ఆగవు..!!
పార్లమెంట్ ఎన్నికల్లో అఖండ విజయం సాధించి రెండో సారి ప్రధాన మంత్రి పీఠం అధిరోహిస్తున్న నరేంద్ర మోడి ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 30 వ తేదీ నాడు నరేంద్ర మోడి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి దేశ విదేశాల ...
READ MORE
ఈ అమ్మాయి ప్రేమికుడి కోసం ఇస్లాం మతంలోకి మారింది.
హైద్రాబాద్ కు చెందిన హర్ష శ్రీ(19) కడపకు చెందిన మహబూబ్ సుభాన్(22) లు గత ఏడాది కాలంగా సోషల్ మీడియా ద్వారా ప్రేమించుకున్నారు. ఈ క్రమంలో జులై 24న కడప జిల్లా శివాలయం లో హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహం కూడా ...
READ MORE
జీవితాల్ని నాశనం చేశారు: పూరీ
సంచలనం రేపిన డ్రగ్స్‌ కేసులో సిట్‌ విచారణపై దర్శకుడు పూరీ జగన్నాథ్‌ స్పందించారు. విచారణ అనంతరం ఎక్సైజ్‌ శాఖ కార్యాలయం నుంచి నేరుగా ఇంటికి వెళ్లిన ఆయన.. బుధవారం రాత్రి 11గంటల తర్వాత తన ట్విట్టర్‌ ఖాతాలో ఒక వీడియోను పోస్ట్‌ ...
READ MORE
జన చైతన్య యాత్రతో జనాల్లోకి దూసుకుపోతున్న కమళ దళపతి.. కారు జోరుకు ఇక బ్రేకులేనా.!!
మార్పు కోసం జన చైతన్య యాత్ర పేరుతో రాష్ట్ర పర్యటన చేస్తున్న తెలంగాణ భాజపా అధ్యక్షులు డా.కె.లక్ష్మణ్ కేసిఆర్ పాలన పై నిప్పులు కురిపించారు. నిన్నటి రోజు దుబ్బాక మరియు కామారెడ్డి నియోజకవర్గాల్లో జరిగిన భాజపా సభలలో పాల్గొన్న డా.కె.లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్రం ...
READ MORE
ఘనంగా ప్రముఖ విద్యావేత్త అనిల్ కుమార్ ఠాకూర్ జన్మధిన వేడుకలు.!!
ప్రముఖ విద్యావేత్త అనిష్ కాలేజ్ ఆఫ్ కామర్స్ విద్యాసంస్థల వ్యవస్థాపకులు అనిల్ కుమార్ ఠాకూర్ జన్మధినం సంధర్భంగ వందలాది విద్యార్ధుల సమక్షంలో లెక్చరర్లు పలువురు మేధావి సామాజిక వేత్తల ఆధ్వర్యంలో ఘనంగ వేడుకలు జరిగాయి. ఇక అనిల్ కుమార్ ఠాకూర్ ఈ ...
READ MORE
సొంత ఇలాకాలా సొంత పార్టీ నేతలే మంత్రి కేటిఆర్ ఇజ్జత్ తీసేస్తున్నరు..!!
సిరిసిల్ల అంటే ముఖ్యమంత్రి కేసిఆర్ తనయుడు కేటిఆర్ ఇలాకా అని అందరికీ తెలిసిందే.. కేటీఆర్ అంటేనే అనధికార ముఖ్యమంత్రి అనేంతగ కేటీఆర్ హవా నడుస్తోందని రాజకీయ వర్గాల వాదన. అలాంటి మంత్రి పరువును ఎవరైనా బజారున పెట్టే సాహసం చేయగలరా చెప్పండి. ప్రతి ...
READ MORE
దేశవ్యాప్తంగ వేడి పుట్టిస్తున్న రజినీ పొలిటికల్ ఎంట్రీ..!!
గత నాలుగైదు రోజులుగా తమిళనాడు లో అభిమానులతో వరుస భేటీలు నిర్వహిస్తున్నాడు సూపర్ స్టార్ రజినీకాంత్. ఇక రేపో మాపో పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చే సూచనలూ కనిపిస్తున్నై. కాకపోతే ఇప్పటికి కూడా.. దేవుడి ఆదేశిస్తేనే అనే వస్తానంటున్నాడు. కాలం పై ...
READ MORE
పూర్ణః సాహ‌సానికి ప‌రిమితులుండ‌వు… బాలీవుడ్ తెర‌పై రేపే విడుద‌ల‌.
తెలంగాణ గొప్ప త‌నాన్ని తెలంగాణ మారుమూల ప‌ల్లెల అపార శ‌క్తిని ప్ర‌పంచానికి చాటిన బాలిక పూర్ణ‌. తెలుగు స‌త్తాను తెలంగాణ ఖ్యాతిని తెలుగు వెండితెర మ‌ర‌చినా బాలీవుడ్ మాత్రం హ‌క్కున చేర్చుకుంది. ఎంతో క‌ష్టానికోర్చి ప్రాణాలు ప‌ణంగా పెట్టి ఎవ‌రెస్ట్ శిఖారాన్ని ...
READ MORE
జేసీబీలతో ప్రయత్నించినా ఇంచు కూడా కదుల్తలేని హనుమంతుడి విగ్రహం.! ఆఖరికి జేసీబీలే ధ్వంసం.!!
ఉత్తర్ ప్రదేశ్ లో షాజహాన్ పూర్ లో రోడ్డు వెడల్పు పనులు కొనసాగుతున్నై.. ఈ క్రమంలో అక్కడే దాదాపు 130 ఏండ్లకు పైగా పురాతన హనుమంతుడి నిలువెత్తు విగ్రహం ఒకటి అడ్డంగా మారిందని ఇక ఆ పురాతన విగ్రాహాన్ని తొలగించాలని భావించిన ...
READ MORE
బ్రేకింగ్:- వివరణ ఇవ్వండి లేదా చర్య తీసుకుంటాం.. కేసిఆర్ కు సీఈసీ నోటీసులు.!!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ కు తాజాగా కేంద్ర ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. పార్లమెంట్ ఎన్నికల సంధర్భంగ కరింనగర్ సభలో "హిందు గాల్లు బొందుగాల్లు, దిక్కుమాలిన దరిద్రపు గాల్లు, దేశంలో అగ్గిపెట్టాలే, గత్తర లేవాలే" అంటూ చేసిన వ్యాఖ్యలు మత ...
READ MORE
మానవ మృగం షకీల్ ను ఉరి తీయాలి.. సర్వత్రా వెల్లువెత్తుతున్న నిరసనలు.!!
హైదరాబాద్ చాదర్ ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధి కమలా నగర్ లో ఒక దళిత మైనర్ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన మానవ మృగం షకీల్ ను బహిరంగంగా ఉరి తీయాలని సర్వత్రా నిరసన వ్యక్తం అవుతున్నది. ఇప్పటికే ఘటనకు సంబంధించి బాధితురాలి పక్షాన ...
READ MORE
ఉద్యమ నాయకుడిపై వ్యతిరేకత.. అందుకే ఉన్నపళంగా ఉద్యోగాలకు నోటిఫికేషన్లా..?
తెలంగాణ ఉద్యమాల గడ్డ ఉస్మానియా శతాబ్ధి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరగాల్సింది. కానీ చప్పగా సాగి మూడు రోజులకే వందేళ్ల శోభను ముంగించుకోవాల్సి వచ్చిందని ఉస్మానియా విద్యార్థుల మాట. ఇక ఈ ఉత్సవాల్లో జరిగిన ఓ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ...
READ MORE
కేసిఆర్ కు పెద్ద ‘షాక్’..! టి సర్కార్ ను కడిగిపారేసిన “కాగ్” నివేదిక.!!
ఆర్ధిక నియంత్రణలో కేసిఆర్ సర్కార్ పూర్తిగా విఫలమైందని సృష్టం చేసింది "కాగ్" నివేదిక. 75% ప్రభుత్వ పాఠశాలల్లో కనీస మౌళిక వసతులు లేవనీ.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు మందులు కూడా ఇచ్చే పరిస్థితి లేదని వేలాది కోట్లలో అవకతవకలు జరిగాయనీ.. ఖర్చుల ...
READ MORE
ముస్లిం మహిళలకు సమాధానం చెప్పలేకపోతున్న టీఆర్ఎస్ పార్టీ..!!
ఇస్లాం మతం నిబంధనల పరంగ ఇప్పటిదాక ముస్లిం మహిళలు ఎందరో ట్రిపుల్ తలాక్ బారిన పడి జీవితాలను చిన్నాభిన్నం చేసుకున్నారు.మూడు సార్లు తలాక్ తలాక్ తలాక్ అంటే చాలు ఆ భర్త తన భార్యకు విడాకులు ఇచ్చినట్టే ఇందులో మరో ఉండదిక. ...
READ MORE
రాందేవ్ బాబాను చంపేసిన సోషల్ మీడియా..
సోషల్ మీడియా యోగ గురు.. పతంజలి సృష్టికర్త రాందేవ్ బాబాను ఉన్న పళంగా చంపేసింది. గతంలో ఓ సారి ఇలాగే చంపేసిన సోషల్ మీడియా ఈ సారి మాత్రం మహామహులనే నమ్మించేంత పని చేసింది. పూణే ముంబై హైవే లో రాందేవ్ ...
READ MORE
యాంకర్ అనసూయకు ఇంత అహంకారమా..??
టీవీ షోలలో యాంకరింగ్ చేస్తూ సినిమాలలో యాక్టింగ్ చేస్తూ సెలబ్రిటీగ మారిన అనసూయ తాజాగా తార్నాక ప్రాంతంలో ఓ బాలుడితో అనుచితంగ ప్రవర్తించి విమర్శలపాలైంది. తార్నాకలో అనసూయని చూసిన ఓ బాలుడు అభిమానంతో ఫోన్లో ఫోటో తీయడానికి ప్రయత్నించినందుకు తీవ్ర ఆగ్రహానికి ...
READ MORE
7 నుండి కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్, ఫైనల్ రిజల్ట్ ఆగస్ట్ 15 న ప్రకటన.!!
భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) మన దేశంలో కరోనా వైరస్ కు వ్యాక్సిన్ ను అందించే ప్రక్రియను మరింత వేగవంతం చేసింది. ఈ వ్యాక్సిన్ ఇప్పటికే పలు దశల్లో సక్సెస్ ను సాధించి ఇప్పుడు మానవ ప్రయోగాలకు అనుమతులు తీసుకుని రాబోయే ...
READ MORE
కరోనా వైరస్ ను చైనా కావాలనే పుట్టించిందనే వాదనకు పెరుగుతున్న బలం..!!
నోబెల్ అవార్డు గ్రహీత, ఫ్రాన్స్ వైరాలజిస్ట్ ల్యూక్ మోంటాగ్నియర్ చైనా దేశం పై సంచలన ఆరోపణలు చేశారు. కరోనా వైరస్ మహమ్మారి దాదాపు ప్రపంచం లోని అన్ని దేశాలను వనికించేస్తుంది. ఈ క్రమంలో అసలు ఈ వైరస్ స్రృష్ఠి ఎలా జరిగిందనే చర్చ ...
READ MORE
నీకు మా మర్యాద నచ్చకుంటే.. అవార్డులు రివార్డులు అన్నీ తిరిగిచ్చేయాలి అంటున్న నెటిజన్లు..!!
బ్యాట్మింటన్ క్రీడాకారిని పీవీ సింధు చేసిన వివాదస్పద వ్యాఖ్యలు చర్చలకు దారి తీస్తోంది. విదేశాల్లోనే మహిళలకు ఎక్కువ గౌరవ మర్యాదలు ఉంటాయని భారత్ లో లేవని అనడం తాజా వివాదానికి దారి తీసింది. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వార్తలు రావడంతో సోషల్ ...
READ MORE
శ్యాంప్రసాద్ ముఖర్జీ.. ఆయన ఇచ్చిన పోరాట స్పూర్తి మనకు ఆదర్శం కావాలి..
జిన్నా భారత దేశాన్ని విభజించి పాకిస్తాన్ ఏర్పాటు చేశాడు.. కానీ పాకిస్తాన్ ఏర్పడక ముందే దాన్ని చీల్చాడో నాయకుడు.. ఈనాడు పశ్చిమ బెంగాల్, పంజాబ్ (తూర్పు) రాష్ట్రాలు భారత దేశంలో భాగంగా ఉన్నాయంటే అది ఆ మహా నాయకుని పుణ్యమే.. భారత ...
READ MORE
పసిపిల్లలకు తల్లిపాల(బ్రెస్ట్ ఫీడింగ్) లోటును తీరుస్తున్న పాల దేవత.!
అవును నిజంగనే ఆమె తల్లిపాలకు నోచుకోని పసిపిల్లల పాలిట కన్న తల్లి స్థానంలో పాల తల్లిగా వెలసిన దేవతే అని చెప్పాలి, ఆవిడే.. అమెరికా దేశం ఓరెగాన్ రాష్ట్రం బేవర్టన్ నగరానికి చెందిన ఎలిజబెత్ అండర్సన్ సియార్రా.!! సీయారా కు అత్యంత అరుదుగా ...
READ MORE
న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన చిలుకూరి దేవాలయ ప్రధాన అర్చకులు.
ఆంగ్ల సంవత్సరం వేడుకలపై తీవ్రంగ స్పందించారు ప్రముఖ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం చిలుకూరి శ్రీ బాలాజి దేవాలయం ప్రధాన అర్చకులు సౌందర్ రంగరాజన్. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతోంది. మరో నాలుగు రోజుల్లో ...
READ MORE
హైదరబాద్ లోని టి-సాట్ కార్యాలయాన్ని సందర్శించిన అస్సాం ఐటి శాఖ మంత్రి కేశభ్ మహంత.
తెలంగాణ ప్రభుత్వం పేద, మారుమూల ప్రాంత విద్యార్థులు, యువజనుల కోసం అమోఘమైన కృషి చేస్తుందని అస్సాం ఐటి శాఖ మంత్రి కేశభ్ మహంత కొనియాడారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి విద్య, వైద్య, మహిళ, ఉపాధి, ఆరోగ్య రంగాలను అభివృద్ధి చేసేందుకు ...
READ MORE
హైదరాబాద్‌లో రెచ్చిపోయిన బైక్‌ రేసర్లు..
నగరంలోని శంషాబాద్‌లో గురువారం బైక్‌ రేసర్లు రెచ్చిపోయారు. బెంగుళూరు-హైదరాబాద్‌ జాతీయ రహదారిపై జరుగుతున్న రేస్‌ను ఆపేందుకు వెళ్లిన కానిస్టేబుల్‌ నరేందర్‌ను బైక్‌తో ఢీ కొట్టాడొ రేసర్‌. ఈ ఘటనలో కానిస్టేబుల్‌కు తీవ్రగాయాలయ్యాయి. దీంతో రంగంలోకి దిగిన ఎయిర్‌పోర్టు పోలీసులు 27 మంది రేసర్లను ...
READ MORE
ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలు చూసుకోవాలి, వైన్స్ ఓపెన్ చేయడం తప్పు.
కరోనా వైరస్ కేసుల విషయంలో తమిళనాడు ఇబ్బందుల్లో నే ఉంది, రోజు రోజుకు అక్కడ కరోనా మహమ్మారి కేసులు పెరుగుతున్నాయి. కాగా లాక్ డౌన్ సడలింపు పేరుతో మద్యం దుకాణాలు తెరవడం పై సూపర్ స్టార్ రజనీకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ...
READ MORE
నరేంద్ర మోడి ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథులు ఎవరో తెలిస్తే
ఈ అమ్మాయి ప్రేమికుడి కోసం ఇస్లాం మతంలోకి మారింది.
జీవితాల్ని నాశనం చేశారు: పూరీ
జన చైతన్య యాత్రతో జనాల్లోకి దూసుకుపోతున్న కమళ దళపతి.. కారు
ఘనంగా ప్రముఖ విద్యావేత్త అనిల్ కుమార్ ఠాకూర్ జన్మధిన వేడుకలు.!!
సొంత ఇలాకాలా సొంత పార్టీ నేతలే మంత్రి కేటిఆర్ ఇజ్జత్
దేశవ్యాప్తంగ వేడి పుట్టిస్తున్న రజినీ పొలిటికల్ ఎంట్రీ..!!
పూర్ణః సాహ‌సానికి ప‌రిమితులుండ‌వు… బాలీవుడ్ తెర‌పై రేపే విడుద‌ల‌.
జేసీబీలతో ప్రయత్నించినా ఇంచు కూడా కదుల్తలేని హనుమంతుడి విగ్రహం.! ఆఖరికి
బ్రేకింగ్:- వివరణ ఇవ్వండి లేదా చర్య తీసుకుంటాం.. కేసిఆర్ కు
మానవ మృగం షకీల్ ను ఉరి తీయాలి.. సర్వత్రా వెల్లువెత్తుతున్న
ఉద్యమ నాయకుడిపై వ్యతిరేకత.. అందుకే ఉన్నపళంగా ఉద్యోగాలకు నోటిఫికేషన్లా..?
కేసిఆర్ కు పెద్ద ‘షాక్’..! టి సర్కార్ ను కడిగిపారేసిన
ముస్లిం మహిళలకు సమాధానం చెప్పలేకపోతున్న టీఆర్ఎస్ పార్టీ..!!
రాందేవ్ బాబాను చంపేసిన సోషల్ మీడియా..
యాంకర్ అనసూయకు ఇంత అహంకారమా..??
7 నుండి కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్, ఫైనల్ రిజల్ట్
కరోనా వైరస్ ను చైనా కావాలనే పుట్టించిందనే వాదనకు పెరుగుతున్న
నీకు మా మర్యాద నచ్చకుంటే.. అవార్డులు రివార్డులు అన్నీ తిరిగిచ్చేయాలి
శ్యాంప్రసాద్ ముఖర్జీ.. ఆయన ఇచ్చిన పోరాట స్పూర్తి మనకు ఆదర్శం
పసిపిల్లలకు తల్లిపాల(బ్రెస్ట్ ఫీడింగ్) లోటును తీరుస్తున్న పాల దేవత.!
న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన చిలుకూరి
హైదరబాద్ లోని టి-సాట్ కార్యాలయాన్ని సందర్శించిన అస్సాం ఐటి శాఖ
హైదరాబాద్‌లో రెచ్చిపోయిన బైక్‌ రేసర్లు..
ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలు చూసుకోవాలి, వైన్స్ ఓపెన్ చేయడం తప్పు.
Facebook Comments
Top
error: Content is protected !!