You are here
Home > తాజా వార్త‌లు > అరెస్టుకు వెల్లిన కానిస్టేబుల్ పై ముద్దుల వర్షం కురిపించిన మహిళ

అరెస్టుకు వెల్లిన కానిస్టేబుల్ పై ముద్దుల వర్షం కురిపించిన మహిళ

కోల్‌కతా: మద్యం మత్తులో ప్రమాదానికి గురిచేసింది. అయితే ఆమెకు సహయం చేసేందుకు ప్రయత్నించిన డ్రైవర్‌ను కొట్టింది. అయితే చివరికి ఆమెను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించిన కానిస్టేబుల్‌ను ముద్దులతో ముంచెత్తింది. దీంతో ఆమెను పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. ఈ ఘటన కోల్‌కతాలో చోటుచేసుకొంది. 38 ఏళ్ళ వయస్సున్న ఓ మహిళ ఇద్దరు స్నేహితులతో కలిసి పార్టీ నుండి కారులో తిరిగి వస్తోంది. సాల్ట్‌లేక్ సమీపంలోని బైపాస్ రోడ్డు వద్దకు రాగానే కారుపై ఆమె నియంత్రణ కోల్పోయి ఎదురుగా వస్తోన్న మరో కారును ఢీకొట్టింది.

ఎదురుగా వస్తోన్న కారు డ్రైవర్ దిగి ఆమెనకు సహయం చేసేందుకు ప్రయత్నిస్తే అతడిని కొట్టింది. దీంతో అతడు పోలీసులకు సమాచారమిచ్చాడు. కారులో ఇరుకొన్నవారిని పోలీసులు బయటకు తీసుకువచ్చారు. అయితే ఈ ముగ్గురు కూడ మద్యం తాగి ఉన్నారని గుర్తించిన పోలీసులు వారిని స్టేషన్‌కు తీసుకెళ్ళేందుకు ప్రయత్నించారు. అయితే ఆ మహిళ కానిస్టేబుల్‌ను ముద్దులతో ముంచెత్తింది. ఈ హఠాత్పరిణామంతో బిత్తరపోయిన పోలీసులు పక్కనే ఉన్న ఆమె స్నేహితురాలి సహయంతో అదుపులోకి తీసుకొన్నారు. న్యూసెన్స్ కేసును నమోదుచేశారు. అంతేకాదు పోలీసులకు ముద్దులపేరుతో లంచం ఇవ్వజూపారని కూడ ఆమెపై కేసులు నమోదుచేసి విచారణ జరుపుతున్నట్టు పోలీసులు చెప్పారు.

Related Posts
పవన్ కాదంటే “నంద్యాల” లో టీడీపీ గల్లంతేనా..??
ఆంద్రప్రదేశ్ లో ఇప్పుడు నంద్యాల ఉప ఎన్నిక హాట్ టాపిక్ అయింది. అధికార తెలుగు దేశం పార్టీ ప్రతిపక్ష వైఎస్ఆర్సపీ లు హోరా హోరీగ తలపడుతున్నాయి. కాంగ్రెస్ లాంటి ఇతర పార్టీలున్నా అవి డమ్మీలుగానే మిగలనున్నాయి. 2014 లో భూమా నాగిరెడ్డి జగన్ ...
READ MORE
పవన్ కాదంటే “నంద్యాల” లో టీడీపీ గల్లంతేనా..??
Facebook Comments
Top
error: Content is protected !!